సీపీఎం..సీఐటీయూ నాయకుల అక్రమ అరెస్టులకు...

కాంగ్రెస్ పార్టీ ఖండన

(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)

నంద్యాల పట్టణంలో రైతులకు జీవనాడి అయిన ఆర్ ఏ ఆర్ ఎస్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని మెడికల్ కాలేజీ ప్రతిపాదించి జీవో నెంబర్ 341 నీ రద్దు చేయాలని వివిధ రూపాలతో నిరసనలు తెలియజేస్తూ ఏడు రోజులుగా నిరాహార దీక్షల్లో పాల్గొని ఎమ్మెల్యే ఎంపీ ఇళ్ల ముట్టడించే టందుకు వెళుతున్న సిపిఎం సి ఐ టి యు నాయకులను కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేయడం అమానుషమని  కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఊకొట్టు  వాసు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి అబ్దుల్ రెహమాన్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చింతలయ్య  విలేకర్ల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా పై నాయకులు మాట్లాడుతూ నంద్యాల లో 114 సంవత్సరాల చరిత్ర కలిగిన భూములను మెడికల్ కాలేజీ రూపంలో వెయ్యిమంది కుటుంబాలను రోడ్డుపాలు చేసే పద్ధతిని విరమించుకోవాలి మెడికల్ కాలేజీకి వ్యతిరేకం కాదు కానీ నంద్యాల పట్టణంలో శివారు న ప్రభుత్వ భూములు వేల ఎకరాలు ఉన్నాయి వాటిని ఉపయోగించాలని అన్నారు  రాష్ట్ర ప్రభుత్వం అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని గ్రహించాలి  వెంటనే ఎంపీ ఎమ్మెల్యే గారు ఈ సమస్యలు వెంటనే పరిష్కరించాలని లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమాన్ని తీవ్ర ఉదృతం చేస్తామని తెలిపారు  ఎంపీ ఎమ్మెల్యే గారు.గత నెల కాలం నుండి  సి ఐ టి యు ఆధ్వర్యంలో  ఆర్ ఏ ఆర్ ఎస్ భూములలో మెడికల్ కాలేజీ పెట్టి 1000 మంది కుటుంబాలకు ద్రోహం చేయవద్దని మెడికల్ కాలేజీని వేరే చోట నిర్మించాలని ఉద్యమాలు నిర్వహిస్తున్న ఈ ఎంపీ ఎమ్మెల్యే లు ఏ మాత్రం వచ్చి సమాధానం చెప్పలేదు అందుకు ఈరోజు శాంతియుతంగా ఇంటి వద్దకు వెళుతుంటే అరెస్టులు చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు  వెంటనే అరెస్టు చేసిన నాయకులను కార్యకర్తలను బేషరతుగా విడిచిపెట్టాలని కాంగ్రెస్ పార్టీ  గా డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు టీచరు ప్రసాదు ట ఫరూక్ ఆర్టీసీ ప్రసాద్

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: