ఆ కుటుంబాలను ఆదుకోవాలి
సీపీఐ డిమాండ్
(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)
కర్నూలు, చిత్తూర్ జాతీయ రహదారిలె శిరివెళ్ల మండలం ఎర్రగుంట్ల గ్రామంలో క్రిస్మస్ సందర్భంగా కొవ్వొత్తుల ర్యాలీ తో వెళ్తున్న చిన్నపిల్లలు మహిళలు ప్రజలపై మినీ లారీ దూసుకుపోవడంతో నలుగురు చిన్న పిల్లలు మరణించడం విచారకరమని సీపీఐ పేర్కొంది. ఇంకా నలుగురు సీరియస్ గా ఉందని కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించిన, మిగిలిన క్షతగాత్రులను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలోసిపి ఐ. జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎస్. బాబా ఫక్రుద్దీన్. సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్. ఏఐటియుసి. అధ్యక్షులు. డి. శ్రీనివాసులు. సిపిఐ పట్టణ సహయ. కార్యదర్శి. యస్. షరీఫ్ భాష.పరామర్శించారు. ఈ ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ ను కఠినంగా శిక్షించాలి రాష్ట్ర ప్రభుత్వం మరణించిన కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి గాయపడ్డ వారికి 50 వేలు ప్రకటించి ప్రమాద బాధితులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు మరణించిన కుటుంబ సభ్యులకు సిపిఐ పార్టీ తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము
Post A Comment:
0 comments: