మంత్రి బాలినేని జన్మదినం సందర్భంగా...

ఎస్ఆర్సీ లబొరేటరీ ఆధ్వర్యంలో...

 శానిటైజర్లు పంపిణీ చేసిన డాక్టర్ ఏలూరి

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

ప్రజానేత, ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి జన్మాదిన వేడుకలు వెన్ లైఫ్ సైన్సెస్, ఎస్ఆర్సీ లబొరేటరీ చైర్మన్, రాష్ట్ర వైసీపీ నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో శనివారంనాడు హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి కేక్ కట్ చేసి స్థానికంగా ఉన్న వారికి స్వీట్స్ ను పంచారు. అనంతరం రాజ రాజేశ్వరి వృద్దాశ్రమంలో వృద్దులకు  వివిధ రకాల మెడిసిన్స్, బోజనాలను పంపిణీ, హ్యాండ్ శానిటైజర్లను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా డాక్టర్ ఏలూరి మాట్లాడుతూ బాల్యం నుంచి సేవా కార్యక్రమాల్లో నిమిగ్నమవుతూ అంచెలంచెలుగా రాజకీయంగా ఎదుగుతూ సీనియర్ మంత్రిగా రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న ఆదర్శ నాయకులు బాలినేని శ్రీనివాస రెడ్డి అని కొనియాడారు. తన నిస్వార్థ రాజకీయాల వల్ల  ఆంద్ర ప్రదేశ్ లో గాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా బాలినేని ప్రజల్లో మంచి ఉన్నతమైన స్థానాన్ని  పొందారని, అందువల్లనే నేడు తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్ లో పలుచోట్ల జన్మదిన వేడుకలు ఘనంగా ప్రజలు నిర్వహిస్తున్నారని అన్నారు.  ప్రజా ఆశాకిరణం బాలినేనికి మరొకసారి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: