బంద్ ను జయప్రదం చేద్దాం రైతన్నకు అండగా నిలబడదాం 

 కాంగ్రెస్ పార్టీ నంద్యాల పట్టణ అధ్యక్షుడు దాసరి చింతలయ్య

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్ళు తప్ప అని  కాంగ్రెస్ పార్టీ నంద్యాల పట్టణ అధ్యక్షుడు దాసరి చింతలయ్య పేర్కొన్నారు. భారత్ బంద్ ను జయప్రదం చేద్దాం రైతన్నకు అండగా నిలబడదాంమని ఆయన పిలుపునిచ్చారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ఈ మోడీ ప్రభుత్వం నుండి విముక్తి పొందుదాం నల్ల చట్టాలు రద్దు చేసేంతవరకు పోరాడుదాం.రైతు వ్యతిరేక బిల్లులను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీలో ఉదృతంగా జరుగుతున్న రైతుల పోరాటానికి మద్దతుగా రేపు రేపు జరగబోయే దేశవ్యాప్త బందుకు నంద్యాల కాంగ్రెస్ కమిటీ తరఫున పిలుపునిచ్చారు అన్ని విద్యా సంస్థలు వ్యాపార సంస్థలు కిరాణం అంగళ్ళు రైతు బజార్లు బంగారు షాపులు హోల్సేల్ వ్యాపారులు, ప్రతిపక్షాలు మిత్రపక్షాలు అన్ని ప్రజా సంఘాలు స్వచ్ఛందంగా పాల్గొని జయప్రదం చేయాలి. అని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఉక్కోట్టు వాసు అధికార ప్రతినిధి ట్రెజరీ టీచర్ ప్రసాద్ జిల్లా సెక్రెటరీ అబ్దుల్ రెహమాన్ సీనియర్ నాయకులు నంద్యాల అసెంబ్లీ సీనియర్ నాయకులు ఫారూఖ్ మహమ్మద్ హుస్సేన్ ఆర్ టి సి ప్రసాద్ యువ నాయకులు శ్రీనివాస్ లక్ష్మి రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: