పేద. బడుగు. బలహీన వర్గాలకు అండ సిపిఐ జెండా

ఘనంగా సిపిఐ 95వ వ్యవస్థాపక దినోత్సవం 

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)

పేద. బడుగు. బలహీన వర్గాలకు అండ సిపిఐ జెండా అని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. సిపిఐ 95వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురష్కరించుకొని నంద్యాల పట్టణం లోని పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ అధ్యక్షతన జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా పతాకావిష్కరణ చేసిన సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ బాబా ఫక్రుద్దీన్, సిపిఐ సీనియర్ నాయకులు ఎస్ సలాం ఖాన్ మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 95వ  సంవత్సరం నుండి  96వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది అని అన్నారు భూమికోసం భూ క్తి కోసం నిరంతరం పేద ప్రజల కోసం  పోరాటాలు చేసే ఏకైక పార్టీ సిపిఐ అని అన్నారు నాటి  బ్రిటిష్ కాలం లో  స్వాతంత్ర కోసం తమ ప్రాణాలను అర్పించిన ఘన చరిత్ర ఉంది అని అన్నారు. పేద ప్రజల కోసం వారి జీవితాలను త్యాగం చేయడం జరిగింది అనేక సంవత్సరాలు జైలు జీవితాలు అజ్ఞాత జీవితాలు గడపడం జరిగింది. అటువంటి నాయకులను ఈ 95వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మననం చేసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి సుబ్బరాయుడు, రైతు సంఘం కార్యదర్శి సోమన్న, ఏ ఐ టి యు సి కార్యదర్శి బాల వెంకట్, ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి సురేష్, భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు మహమ్మద్, సిపిఐ నాయకులు భూమిని శ్రీనివాసులు, హబీబ్ బేగ్, మౌళి సా, మద్దయ్య, హుస్సేన్ సా, మా బాషా, దాస్, ఎస్ లింగన్న తదితరులు పాల్గొన్నారు

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: