అష్పాఖుల్లాఖాన్ అసమాన దేశభక్తుడు

యువతకు మార్గదర్శకుడు

93 వర్థంతిలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్.బాబా ఫక్రుద్దీన్


(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)

అష్పాఖుల్లాఖాన్ అసమాన దేశభక్తుడని, యువతకు ఆయన మార్గదర్శకుడు అని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్.బాబా ఫక్రుద్దీన్ అన్నారు.  ఇన్షాఫ్ జిల్లా నాయకులు రియాజ్ సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి షరీఫ్ బాష ఏ ఐ టి యు సి పట్టణ కార్యదర్శి బాల వెంకట్ ఇన్సాఫ్ నాయకులు మహమ్మద్. మాట్లాడుతూ మాతృభూమిని ఆంగ్లేయుల దాస్య శృంఖలాల నుంచి విముక్తి కై, హిందూస్థాన్ స్వేచ్ఛా వాయువులు పీలుస్తుందిని భారత్‌లోని ఏడు కోట్ల ముస్లింలలో దేశ స్వాతంత్య్రం కోసం ఉరికంబాన్ని ఎక్కబోతున్న మొట్ట మొదటి అదృష్టవంతుడిగా గర్వపడుతున్నా..’’ -అంటూ అష్ఫాఖుల్లా ఖాన్ ఉరితాడును ముద్డాడి తన మెడలో తానే వేసుకొన్న అసమాన దేశ భక్తుడని శనివారం స్థానిక సిపిఐ కార్యాలయంలో  ఇన్సాఫ్ ఆధ్వర్యంలో అష్పాఖుల్లాఖాన్ చిత్ర పటానికి పూల మాళ వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్రిటీష్ పాలనలో దాదాపు 200 ఏళ్లు అణగారిన దేశానికి స్వాతంత్య్రం తెచ్చేందుకు కొంతమంది నేతలు ముందుకు వచ్చారని, 1857లో ‘‘ది ఇండియన్ రెబిలియన్ గ్రూప్’’ పేరుతో పోరాటాన్ని ప్రారంభించారన్నారు. సమరయోధుల్లో ఇరవై ఏడేళ్ల పిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలర్పించిన భరతమాత ముద్దుబిడ్డ అష్ఫాఖుల్లా ఖాన్ చిరస్మరణీయుడుగా నిలిచిపోయాడన్నారు. స్వాతంత్య్ర పోరాటం చేసిన సర్దార్ భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్‌ల కంటే నాలుగు సంవత్సరాల ముందే భరతమాత ఒడిలో అష్ఫాఖుల్లా ఖాన్ ఒదిగిపోయాడని,

అష్ఫాఖుల్లా ఖాన్ ఉత్తర ప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో అక్టోబర్ 22, 1900న జన్మించాడాని, తండ్రి షఫీకుర్ రెహమాన్ పొలీసు శాఖలో పనిచేసేవాడని, తల్లి మజ్హరున్నీసా, ఈ దంపతుల ఆరుగురు సంతానంలో అష్ఫాకుల్లా చివరివాడని తెలిపారు.  మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమానికి పిలుపు నిచ్చినపుడు అష్ఫాఖుల్లా పాఠశాల విద్యార్థి. సహాయ నిరాకరణ ఉద్యమం అతనిపై గొప్ప ప్రభావాన్ని చూపి, సమరయోధుడుగా మారడానికి కారణమైందిని, మహాత్మాగాంధీ చౌరీచౌరా ఉదంతం తర్వాత సహాయ నిరాకరణోద్యమం నిలిపివేయడంతో నిరాశకు గురైన వేలాది మంది యువకులలో అష్ఫాఖ్ ఒకడన్నారు.  దేశాన్ని త్వరగా పరాయి పాలన నుంచి విముక్తం చేయాలన్న తపనతో అతివాద ఉద్యమకారులతో చేరాడని, ఈ సమయంలోనే ప్రముఖ ఉద్యమకారుడు రాంప్రసాద్ బిస్మిల్‌తో పరిచయమేర్పడింది. ఆర్యసమాజ్ సభ్యుడైన రాంప్రసాద్ బిస్మిల్‌తో ముస్లిం మతస్థుడైన అష్ఫాఖుల్లా ఖాన్ స్నేహం కొంత విభిన్నమైనదే. అయినా వారిద్దరి సమష్టి లక్ష్యం ఒకటే- భారత స్వాతంత్య్ర సముపార్జన. తమ సాయుధ పోరాటానికి కావలసిన ఆయుధాలు, మం దుగుండు సామగ్రి కొనుగోలు చేయడానికి ఉద్యమకారులు 1925, ఆగష్టు 8న షాజ హాన్‌పూర్‌లో ఒక సభను నిర్వహించారు. కాకోరి రైలు దోపిడీ , కాకోరి కుట్ర అనేది బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్య్ర ఉద్యమం సమయంలో ఆగష్టు 9న జరిగింది. లక్నో సమీపంలోని కాకోరిలో రైలు దోపిడీ.కి హిం దూస్తాన్ రిపబ్లికన్ అసోసియేషన్ (హెచ్‌ఆర్‌ఏ) వ్యూహరచన చేసింది. ఆగష్టు 9న అష్ఫాఖుల్లా ఖాన్, రాంప్రసాద్ బిస్మిల్, రాజేంద్ర లాహిరి, ఠాకూర్ రోషన్ సింగ్, సచీంద్ర బక్షీ, చంద్రశేఖర్ ఆజాద్, కేశవ్ చక్రవర్తి, బన్వారీ లాల్, ముకుంది లాల్, మన్మధనాథ్ గుప్తలు కలిసి కాకోరీ గ్రామం సమీపంలో ప్రభుత్వ ధనాన్ని తీసుకెళుతున్న రైలుని దోచుకున్నారు.  కాకోరీ దోపిడీ కేసులో రాంప్రసాద్ బిస్మిల్, అస్ఫాకుల్లా ఖాన్, రాజేంద్ర లాహిరి రోషన్ లకు మరణ శిక్ష విధించింది. అష్ఫాఖ్, బిస్మిల్ ఇద్దరూ ఒకే రోజు వేర్వేరు జైళ్లలో ఫ్రాణాలు అర్పించారు. అష్ఫాఖుల్లాను 1927 డిసెంబర్ 19 న ఉరితీశారు. ఉరితీతకు ముందు తన చివరి మాటలుగా - ‘‘నా దేశ సోదరులారా! మీరు మొదట భారతీయులు. మీరే మతం వారైనప్పటికీ పరస్పరం కలహించుకోకండి. ఐకమత్యంతో ఆంగ్లేయులను ఎదిరించండి. దేశ విముక్తే మన లక్ష్యం కావాలి’’ అన్నాడని గుర్తు చేశారు. అష్ఫాకుల్లా ఖాన్ రాజద్రోహ నేరంపై ఉరితీయబడినాడాని, ఆయన నేటి యువతరానికి ఆదర్శనీయుడున్నారు.  ఈ కార్యక్రమంలో ఇన్సాఫ్ సిపిఐ నాయకులు దాసు తదితరులు పాల్గొన్నారు

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: