రోడ్డెక్కిన బడ్జెట్ పాఠశాలల యజమానులు 

 తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి 

 9 కిలోమీటర్ల పాదయాత్ర 

(జానోజాగో వెబ్ న్యూస్-కుత్భుల్లాపూర్ ప్రతినిధి)

కరోనా లాక్డౌన్ సమయంలో పాఠశాలలు మూసివేయడంతో బడ్జెట్ పాఠశాలల యాజమాన్యాలు ఆర్థికంగా అనేక ఇబ్బందులు  పడుతున్నారు. కాబట్టి తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి  తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతో ఈరోజు కుత్బుల్లాపూర్ మండల్, షాపూర్ నగర్ లోని ఉషోదయ టవర్స్ నుండి గండి మైసమ్మ మండల విద్యాశాఖ కార్యాలయం వరకు సుమారు 9 కిలోమీటర్లు కుత్బుల్లాపూర్ మండల గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాల సంఘం  పిలుపుమేరకు,  కరస్పాండెంట్స్ తమ సమస్యల మీద శాంతియుత పాదయాత్ర చేయడం జరిగింది .ఈ పాదయాత్రలో వందల మంది బడ్జెట్ పాఠశాలల యాజమాన్యాలు అధిక సంఖ్యలో  పాల్గొన్నారు. (1)విద్యార్థులందరికీ విద్యాహక్కుచట్టం కల్పించడం

(2) కరోనా కాలంలో ప్రైవేట్ బడ్జెట్ పాఠశాలల్లో పనిచేసే సిబ్బందికి నిరుద్యోగ భృతి క్రింద పది వేల రూపాయలు చెల్లించాలి

(3) బడ్జెట్ పాఠశాలలు లాక్ డౌన్ కారణంగా మూసివేయడం వల్ల విద్యుత్ బకాయిలు, నీటి బిల్లులు, బిల్డింగ్ ప్రాపర్టీ టాక్స్ అన్ని కూడా రద్దు చేయాలి.

(4) ప్రైవేట్ పాఠశాలలను కేటగిరీలుగా విభజించి బడ్జెట్ పాఠశాలలకు విద్యుత్ బిల్లులు వాటర్ బిల్లులు ప్రాపర్టీ టాక్స్ మరియు ఇతర ప్రభుత్వ సర్వీసులపై ప్రత్యేక మినహాయింపు ఇవ్వాలి.

 ఇట్టి న్యాయపరమైన డిమాండ్లతో ఈ రోజు శాంతియుత పాదయాత్ర చేస్తూ మండల విద్యాధికారి గారికి, మెమోరాండం ఇవ్వడం, ఆ తర్వాత ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారికి మరియు స్థానిక కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా కుత్బుల్లాపూర్ మండల గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాల సంఘం చైర్మన్ పి శివయ్య,

అధ్యక్షులు రావుల వరప్రసాద్, ప్రధాన కార్యదర్శి చింతల మహేష్ కుమార్, కోశాధికారి దయాకర్, ముఖ్య సలహాదారులు మండవ శ్రీనివాస్ గౌడ్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బడ్జెట్ పాఠశాలల సంఘం అధ్యక్షులు రామేశ్వర్ రెడ్డి నర్సిరెడ్డి  కిషన్ రావు,సంఘ ఉపాధ్యక్షులు, కె శ్యామలరావు, సిహెచ్ గోవర్ధన్ రెడ్డి,జి రాజులు,సయ్యద్ ముంతాజ్ అలీ,ఆర్ మధు కుమార్,ఎం.డి.ముబషీర్, మరియు వివిధ పాఠశాలల యాజమాన్యాలు ఇందులో పాల్గొనడం జరిగింది.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: