బంద్ ను విజయవంతం చేయండి 

 పి డి ఎస్ యు జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.ఎం.డీ.రఫీ పిలుపు

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

నంద్యాల పట్టణంలో స్థానిక సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కార్యాలయంలో పి డి ఎస్ యు  సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పి డి ఎస్ యు జిల్లా సహాయ కార్యదర్శి రఫీ , ప్రగతిశీల యువజన సంఘం (పీవైఎల్) జిల్లా నాయకులు నవీన్ మాట్లాడదు  రైతులకు నష్టం చేకూర్చే వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని రైతు సంఘాల ఆధ్వర్యంలో డిసెంబర్ 8న జరిగే  భారత్ బంద్  కు దేశానికి అన్నం పెట్టే రైతన్నకు అండగా  పీడీఎస్ యూ, పీవైఎల్ విద్యార్ధి సంఘంగా మద్దతు తెలియజేశారు.కావున 8 వ తేదీన విద్యాసంస్థల బంద్ కు అఖిలపక్ష విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా పిలుపునిచ్చారని తెలిపారు.కావున రైతుల పోరాటానికి మద్దతుగా జరిగే బంద్ కు నంద్యాల పట్టణంలో ఉన్న ప్రభుత్వ , ప్రైవేట్ స్కూళ్లు, ప్రైవేట్ జూనియర్,  డిగ్రీ ,పీజీ, కళాశాలలో యాజమాన్యం వారు ఈ బందుకు అందరూ సహకరించాలని పీడిఎస్ యూ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.ఎం.డీ. రఫీ, ప్రగతిశీల యువజన సంఘం (పీవైఎల్)  జిల్లా నాయకులు నవీన్  కోరారు.ఈ సమావేశంలో పిడిఎస్యు డివిజన్ అధ్యక్షులు దస్తగిరి మహీంద్రా బాలు మొదలైన వారు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: