8న జరిగే బంద్ ను జయప్రదం చేయండి

అఖిలపక్ష పార్టీల పిలుపు

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

గత తొమ్మిది రోజులుగా ఢిల్లీలో కోటి మంది పైగా రైతులు మూడు వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని పోరాటం చేస్తున్నారని,కానీ కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ రైతు సంఘాల ,వామపక్ష పార్టీల పిలుపుమేరకు నంద్యాల లో 8న జరిగే బంద్   జయప్రదం చేయాలని  సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతలయ్య, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బాబా ఫక్రుద్దీన్,సిపిఐ పట్టణ కార్యదర్శి. కె. ప్రసాద్.  సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు చౌడప్ప, ఎస్ మహమ్మద్ రఫీ లు కోరారు.  ఈ సందర్భంగా నంద్యాల నరసింహయ్య భవన్లో జరిగిన అఖిలపక్ష పార్టీల రౌండ్టేబుల్ సమావేశానికి సిపిఎం పట్టణ కార్యదర్శి తోట మద్దులు అధ్యక్షత వహించగా ఈ సమావేశంలో సిఐటియు జిల్లా నాయకులు నాగరాజు, కె మహమ్మద్ గౌస్, లక్ష్మణ్, శ్రీనివాస మూర్తి, వెంకట లింగం,  రైతు సంఘం నాయకులు పుల్ల నరసింహ, సోమన్న, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు సద్దాం హుస్సేన్, సుబ్బరాయుడు, ఐద్వా జిల్లా కార్యదర్శి ఈ. ఎల్. ఎస్. రత్నమ్మ, కెవిపిఎస్ జిల్లా నాయకులు అల్ఫోన్స్, డివైఎఫ్ఐ జిల్లా నాయకులు హుస్సేన్ బాషా, శివ, శివారెడ్డి, ఎస్ఎఫ్ఐ నాయకులు లక్ష్మణ్, జెవివి నాయకులు రామరాజు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో దేశంలో రైతుల పోరాటానికి కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాల పై వెనక్కు తగ్గి రద్దు చేసుకునేలా బంద్ లో పాల్గొనేందుకు ప్రతి ఒక్క రైతు, మేధావులు, వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులు, ఉద్యోగులు, కార్మికులు, మహిళలు, విద్యార్థులు, యువకులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: