నిరంకుశ ప్రభుత్వాలు లేని నాడే ఏ దేశమైనా ప్రగతి

ఇది కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం

కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా భీమ్ రావు అంబేద్కర్ 64వ వర్ధంతి

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎస్ యమ్ డి  ఫారుక్ ఆధ్వర్యంలో జిల్లా ఉపాధ్యక్షులు షేక్ అబ్దుల్లా, పట్టణ అధ్యక్షులు దాసరి చింతలయ్య అంబేద్కర్ పటానికి  పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చింతలయ్య మాట్లాడుతూ కొందరు విద్రోహ శక్తులు దుష్ప్రచారం చేస్తున్నారని, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఆనాడు అన్ని వర్గాలకు న్యాయం చేకూరేలా రూపొందిస్తే ఈనాడు ఆయనను కూడా కించపరిచే విధంగా ఆయనకు కులాన్ని అంటగడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఇలాంటి నీచ రాజకీయాలు చేయవద్దని హెచ్చరించారు. సీనియర్ నాయకులు ఫారుక్ మాట్లాడుతూ ఎలక్షన్లు పెడదామంటే ఈనాడు మన జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారు, ఎందుకంటే ఓట్లు పడవని ఎక్కడ ఓడిపోతాను భయంతో వెనకడుగు వేస్తున్నారని విమర్శించారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీ బడుగు బలహీన వర్గాలను అణగదొక్కే విధంగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఎలక్షన్ లను రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించడం విడ్డూరంగా ఉందన్నారు.
ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని, దీన్ని తిప్పి కొట్టే రోజులు త్వరలో వస్తాయని ఆయన పేర్కొన్నారు. జిల్లా సెక్రెటరీ అబ్దుల్ రెహమాన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్యాంగం కూని చేయబడుతోంది ప్రజాస్వామ్య హక్కులను తుంగలో దోసి  ఆనాడు దేశ సంఘ విద్రోహక శక్తులు బాబ్రీ మసీదు కూల్చివేత చేస్తే ఈనాడు దేశానికి అన్నం పెట్టే రైతన్న కు మోడీ ప్రభుత్వం నల్ల చట్టాలు అంటగడుతున్నారు ఎటు పోతుంది మన దేశం 60 శాతం పైగా యువత గలిగిన నవభారతం కోసం యువతా మేలుకో నిజాన్ని గ్రహించు లేకపోతే నీ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది ఈ నిరంకుశ ప్రభుత్వాలను ప్రశ్నించే హక్కు రాజ్యాంగం మనకు కల్పించింది అని గుర్తు చేశారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ నుండి ముక్కు సూటిగా అడుగుతున్నాం ఆనాడు ప్రచారంలో మతం చూడం కులం చూడం పార్టీ చూడం అన్నవారు ఈనాడు పార్టీపరంగా జాతీయ స్థాయిలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మీరు సమస్యల పట్ల మాట్లాడదాం అనుకుంటే మీరు మాట్లాడడానికి మాకు సమయం సమయం ఇవ్వండి అని అడుగుతుంటే మీరు అక్రమ అరెస్టు చేస్తారా అని నిలదీశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ట్రెజరీ టీచర్ ప్రసాద్ సీనియర్ నాయకులు అహ్మద్ హుసేన్, ఆసిఫ్, శేఖర్, జనార్ధన్ కట్టర్, మస్తాన్ వెల్డర్, సర్దార్ టంగుటూరు, రసూల్, శ్రీనివాస్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: