రక్త శిక్తమైన రహదారి

 ప్రార్థన చేస్తున్న చిన్నారులపై దూసుకెళ్లిన ఐసర్ లారీ 

 5 మంది చిన్నారుల మృతి...12 మందికి తీవ్ర గాయాలు

మృతి చెందిన చిన్నారులు

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

నిత్యం వాహనాల రద్దీతో ఉండే రహదారి రక్త సిక్టం అయ్యింది. రెప్పపాటులో జరిగిన ప్రమాదంలో ఇసర్ వాహనం క్రిస్మస్ క్వారోస్ ప్రార్థన చేస్తున్న చిన్నారులపై మంగళవారం తెల్లవారుజామున దూసుకెళ్లింది. ఒక చేత బైబిల్ మరో చేత క్యాండిల్ చేత పట్టి  క్రిస్మస్ సందేశాత్మక పాటలు పాడుతూ కాలనీ ప్రజలను మెల్కొల్పుతున్న చిన్నారుల జీవితాలు తెల్లవారక ముందే తెల్లారిపోయిన విషాద సంఘటన మంగళవారం వేకువ జామున చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళ్ళితే కర్నూలు జిల్లా శిరివెళ్ల మండలం యర్రగుంట్ల గ్రామంలోని విమలా స్కూల్ ఎదురుగా 40 వ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు చిన్నారులు మృతి చెందగా మరో 8 మందికి తీవ్రగాయాలయ్యయి. మృతి చెందిన చిన్నారులు దాసరి సురేఖ (15), ఉప్పల పాటి ఝాన్సీ(15), సైగాళ్ళ వంశీ (12), హర్షవర్ధన్ (8) ల మృత దేహాలను మార్చురీ కేంద్రానికి తరలించి క్షత గాత్రులను మూడు 108 అంబులెన్స్ ల ద్వారా నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్సఅందిస్తున్నారు.

 ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్న జిల్లా ఎస్పీ

ప్రమాద సమాచారం అందుకున్న కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ పక్కిరప్ప కాగినేపల్లి, నంద్యల సబ్ కలెక్టర్ కల్పన కుమారి, జేసీ ఖాజా మొద్దిన్, అళ్లగడ్డ డీఎస్పీ రాజేంద్ర,  శిరివెళ్ళ సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రబాబు నాయుడు, ఎస్సై సూర్య మౌళి సంఘటనాస్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. హైదరాబాద్ నుండి మైదుకూరుకు అరటికాయల లోడ్ నిమిత్తం వెళుతున్న డీసీఎం ఐసర్ లారీ ప్రమాదానికి కారణమైనట్లు పోలీస్ అధికారులు తెలిపారు. మృతుల బంధువుల రోదనలు,  క్షతగాత్రుల ఆర్తనాదాలు పలువురి హృదయాలను కలచివేశాయి, ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వేగంగా వెళుతుండగా గ్రామస్తులు వెంట పడి పట్టుకొని పోలీసులకు అప్పగించారు. శిరివెళ్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు తెలిపారు.

 ప్రమాదానికి కారణమైన లారీ

సర్వీస్ రోడ్డు నిర్మాణం చేపట్టాలి:

శిరివెళ్ళ మండలం ఎర్రగుంట్ల గ్రామంలో గల ఎస్సీ కాలనీలో ఒక ప్రముఖ హైస్కూల్ చర్చి, ఎస్సీ ఎస్టీ కాలనీ ఉండటం వలన విద్యార్థులు,  ప్రజలు ప్రయాణికులతో 40వ జాతీయ రహదారి నిత్యం రద్దీగా ఉంటుందని తక్షణమే అధికారులు స్పందించి మిగిలి ఉన్న 6 వరుసల రహదారి స్థలంలో సర్వీస్ రోడ్డు నిర్మాణం చేపట్టాలనీ సీపీఐ నాయకులు బాబా ఫక్రుద్దిన్, గ్రామస్తులు డిమాండ్ చేశారు.

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: