పేదలకు  గ్రామాల్లో 3సెంట్లు,పట్టణాల్లో2సెంట్లు...

ఇంటి స్థలం ఇవ్వాలి

పోస్టు కార్డుల ఉద్యమం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి కి ప్రజా సంఘాల డిమాండ్ విజ్ఞప్తి

(జానోజాగో వెబ్ న్యూస్-నందికొట్కూర్ ప్రతినిధి)

సుదీర్ఘ కాలం తర్వాత రాష్ట్రంలో పేదలకు ఇళ్ళ స్థలాల పంపిణీ,పక్కా గృహాల నిర్మాణాన్ని డిసెంబర్25  నాటికి ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం పట్ల ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. కానీ పేదలకు సౌకర్యంగా ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో ప్రస్తుతం ఇస్తున్న ఇంటి స్థలాన్ని 1.50 సెంటు నుండి 3సెంట్లు, పట్టణాల్లో1సెంటు నుండి 2సెంట్లకు పెంచి పంపిణీ చేయాలని కోరాయి. సింగిల్ బెడ్ రూమ్ స్థానంలో డబుల్ బెడ్ రూముకు నిర్మాణానికి మార్పు చేయాలని ఏపీ చేతి వృత్తి సంఘాల సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ కె.రామాంజనేయులు, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్,అఖిల భారతీయ ఆదివాసీ మహాసభ జాతీయ కార్యదర్శి పి.గోవింద్, ఏపీ దళిత హక్కుల పోరాట సమితి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సి.మహేష్ లు సంఘాల తరపున పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని ఆదివారంనాడు కర్నూలు లో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలకు ఇచ్చే ఇంటి స్థలాలు తమ ఉపాధి చేసుకోవడానికి అనుగుణంగా గ్రామాల్లో, పట్టణాల్లో సమీపంలో నివాసయోగ్యంగా వుండే విధంగా చర్యలు తీసుకోవాలని, పేదలు పాడి గేదెలు, గొర్రెలు, మేకలు,కోళ్లు,చేనేత మగ్గాలు,చేతి వృత్తులు,ఇండ్ల లోనే నడుపుకునే కుటీర పరిశ్రమల ద్వారా జీవనోపాధి పొందేందుకు సౌకర్యం గా ఉండాలని,ఇరుకు గదులు నిర్మాణం వల్ల ఆ స్థలాలు ఏమాత్రం చాలవని పట్టణాల్లో ఒక కుటుంబం నివాసం ఉండేందుకు కనీసం డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. టిడ్కో ఇళ్ళను పూర్తి చేసి పేదలకు అప్పగించిన ప్రాంతాల్లో త్రాగు నీరు,రోడ్లు, లైట్లు,మురుగునీరు పారుదల, విద్య, వైద్యం, రవాణా సౌకర్యాలు  కల్పించి పేదలు నివాసం ఉండే విధంగా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘం, దళిత, గిరిజన, చేతి వృత్తి సంఘాల సమాఖ్య ల ఆధ్వర్యంలో పేదలు ముఖ్యమంత్రి కి తమ సంతకాలతో పోస్ట్ కార్డులు పంపి ఈ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొని వస్తున్నట్లు వారు తెలిపారు. 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: