ఆర్ఏఆర్ఎస్ భూములను కాపాడాలని...

30వ రోజు తల కిందకు కాళ్లు పైకి పెట్టుకుని నిరసన

సిఐటియు ఆధ్వర్యంలో నిరసన

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

సుధీర్ఘ 114 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆర్ ఏ ఆర్ ఎస్ భూములను వైద్య కళాశాలకు కేటాయించడం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి బీడు భూముల ని చెప్పడం అదే హైకోర్టుకు తెలియజేయడం ఎంపీ, ఎమ్మెల్యేల కుట్రలో భాగమని, వీరి స్వార్ధపూరిత విధానాలకు వ్యతిరేకంగా రాబోయే కాలంలో కుట్రలను గమనించి బుద్ధి చెప్తారని సిఐటియు ఆధ్వర్యంలో తల కిందకు కాళ్లు పైకి పెట్టుకుని   నిరసన చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఏవీ రమణ, ఖాదర్ వలీ, నాగ ప్రసాద్, సుజాత, ఎల్లమ్మ, ఖాజాబీ, నాగేశ్వరమ్మలతో పాటు 300 మంది కార్మికులు, ఉద్యోగులు పాల్గోన్నారు.
అనంతరం ఆర్ఏఆర్ఎస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు, సిఐటియు పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్ మాట్లాడుతూ గత 30 రోజులుగా కార్మికులు ఉద్యోగులు నిరసన తెలియజేస్తున్నారని, అందులో భాగంగా తల క్రిందకు కాళ్లు పైకి  పెట్టుకుని భూములను వైద్య కళాశాలకు కేటాయిస్తే మా కడుపు ఖాళీ అవుతాయని,  మా కుటుంబాలు రోడ్డున పడతాయని నిరసన తెలుపుతున్నామని, వైసీపీ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని చెప్పుకుంటూ రైతుల నడ్డి విరుస్తోందని కార్మికుల సంక్షేమమే ధ్యేయమని కార్మికులను రోడ్డుపాలు చేసే విధానాలు అవలంబిస్తున్నదని, ఈ ప్రభుత్వ హాయంలో ఎంపీ, ఎమ్మెల్యేలకు లాభాలు చేకూర్చడమే ద్యేయంగా అధికారులు సైతం పనిచేస్తున్నారని ఎక్కడో బీడు భూములను చూపెట్టి  కోర్టులను సైతం మోసం చేస్తున్నారని, ఈ అబద్ధాల వెనక ఎంపీ ,ఎమ్మెల్యేల  స్వార్థం ఉందని అన్నారు. నిజనిజాలను కార్మికులు, ప్రజలు గమనిస్తూ ఉన్నారని, వీళ్ళ పన్నాగాలకు వ్యతిరేకంగా ఆర్ఏఆర్ఎస్ కార్మికుల, ఉద్యోగుల పోరాటాలకు రైతులు కలిసి వస్తున్నారని మీ పార్టీకి, మీ పదవులకు స్వస్తి చెప్పే రోజు తొందరలోనే ఉందని, రైతులు, కార్మికులు కలిసి పోరాటం లోకి వస్తే ఎంతటి ప్రభుత్వం అయిన దిగి రాక తప్పదని అన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: