ఈ నెల 28న పేరెంట్స్ మీటింగ్

అదే రోజు అమ్మఒడి పథకం అర్హుల ఎంపిక

ఏ ఒక్క అవకాశమొచ్చిన అర్హులందరికీ తప్పకుండా న్యాయం

పాఠశాల హెచ్ ఎం మునగాల చంద్రశేఖర్ రెడ్డి వెల్లడి

ప్రకాశం జిల్లా మార్కాపురం జిల్లాపరిషత్ (బాలురు) ఉన్నత పాఠశాల

(జానోజాగో వెబ్ న్యూస్-ప్రకాశం జిల్లా ప్రతినిధి)

ప్రకాశంజిల్లా మార్కాపురం జిల్లాపరిషత్ (బాలురు) ఉన్నత పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించనున్నట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు.  అదే రోజు అమ్మబడి పథకం కింద అర్హులైన లబ్ధిదారుల ఎంపిక చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఏదైనా సంకేతికంగా కారణంగా పథకం కింద అవకాశం దొరక్కపోతే అలాంటి వారికి ప్రభుత్వం ఏ ఒక్క అవకాశమిచ్చినా అర్హులందరికీ న్యాయం చేస్తానని ఆయన వెల్లడించారు.   ఈ కార్యక్రమములో విద్యార్ధులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గోనవలసిందిగా విజ్ఞప్తి చేశారు.

మార్కాపురం జిల్లా పరిషత్ (బాలురు) ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి

 చివరిగా ఈసమావేశంలో అర్హులైన వారి జాబితాకు ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుందని తెలిపారు. ఇదిలావుంటే ఆర్ధికంగా వెనుకబడిన దిగువ మధ్య తరగతి కుటుంబాలలోని తల్లిదండ్రులు అన్ని అర్హతలతో “ అమ్మఒడి “ పధకంపై ఆశతో తమ పాఠశాలలో చదివించుకొనే ఏ ఒక్క కుటుంబం కాని, ఏ ఒక్క విద్యార్ధికి  కాని గతంలో ఇచ్చివున్న సమాచారములో మార్పులకారణం గాను, ఆధార్ నెంబరులో తప్పులు దొర్లిన కారణంగాను ఈ పధకం ద్వారా వచ్చే లబ్దిని ఏ ఒక్కరు కోల్పోకూడదనే మంచి ఆశయంతో ప్రకాశంజిల్లా మార్కాపురం జిల్లాపరిషత్ (బాలురు) ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి తమ ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా తమ ఉపాధ్యాయ బృందంతో కలసి శ్రమిస్తున్న తీరును పలువురు అభినందిస్తున్నారు. 

రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానోజాగో వెబ్ న్యూస్ 

ప్రకాశం, గుంటూరు జిల్లాల బ్యూరో ఇన్ ఛార్జ్

 Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: