రినౌన్డ్ కాంపిటీటివ్ 2020 (RCE )పరీక్ష టాపర్స్ కు...

 బహుమతులు ప్రధానం

(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)

అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో ని స్థానిక ముక్కడి పేట ప్రాంతంలో రినౌన్డ్ ఆంగ్ల మాధ్యమ ఉన్నత పాఠశాలలో ప్రతిసంవత్సరంలా జరిగే రినౌన్డ్ కాంపిటీటివ్ పరీక్ష  (RCE)2020 రినౌన్డ్ కాంపిటీటివ్ పరీక్షా పోటీలు జరిగాయి. ఇందులో పాల్గొని విజేతలుగా పాల్గొని పోటీ పరీక్షలో విజేతలుగా నిలిచిన విద్యార్థినీ విద్యార్థుల కు ప్రత్యేక అతిథి ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్ చేతుల మీద బహుమతులు మెడల్స్ మెమెంటోలు అందజేశారు. 8.9.10.తరగతుల విద్యార్థినీ విద్యార్థులను ఉద్దేశించి ఉమర్ ఫారూఖ్ ఖాన్ మాట్లాడుతూ
తల్లి తండ్రులు తమ శ్రమను వెచ్చించి పిల్లల భవిష్యత్తు కోసం అనునిత్యం పరితపిస్తూ పిల్లల ఉజ్వల భవిష్యత్తు తీర్చిదిద్దే ప్రయత్నంలో సమిధులౌతారని పిల్లలు వారి ఆశలు ఆడియాశలు చెయ్యకుండా కసితో పోటీ తత్వంతో ఐఏఎస్ .ఐపీఎస్.ఐఆర్ఎస్. ఐఎఫ్ ఎస్ .లుగా జీవితంలో దూసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. పాఠశాల వ్యవస్థాపకులు ముస్తఫా ఖాన్ గారు మాట్లాడుతూ కష్టపడి మహనీయుల ను అదర్శoగా తీసుకొని భవిష్యత్తును నిర్మించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ బీబీ హాజిరా ఖాన్.సర్ఫరాజ్ ఖాన్.సాఖిబ్ ఖాన్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు జాతీయ గీతాలాపన తో కార్యక్రమము ముగించారు.
 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: