2020వ సంవత్సరంలో అతిపెద్ద షోగా నిలిచిన...
బిగ్‌బాస్ తెలుగు గ్రాండ్ ఫైనల్
భారతదేశంలో ఎక్కువ మంది వీక్షించిన రియాల్టీ షో
21.7 టీవీఆర్‌తో అతిపెద్ద సీజన్ ఫైనల్
వీక్షకులకు ధన్యవాదములు తెలుపుతూ...ట్విట్ చేసిన నాగార్జున
(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)
స్టార్‌మా యొక్క ప్రతిష్టాత్మక రియాల్టీ షో, బిగ్‌బాస్ అత్యద్భుతమైన ఫైనల్‌తో వైభవంగా ముగిసింది. డిసెంబర్20,2020వ తేదీన అభిజీత్ దుడ్డాలను తమ నాల్గవ సీజన్ విజేతగా బిగ్‌బాస్ ప్రకటించాడు. ఈ కార్యక్రమం టెలివిజన్ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచింది. రికార్డు స్థాయిలో 21.7 టీవీఆర్ రేటింగ్స్‌ను సాధించింది. అర్బన్ 15+ వీక్షకుల నడుమ హెచ్‌డీ వీక్షకులతో కూడా కలిపి ఈ రేటింగ్ సాధించింది. జంట నగరాలలో రికార్డు స్థాయిలో 12.3 మిలియన్‌ల ఇంప్రెషన్స్ ఈ షోకు నమోదయ్యాయి. తద్వారా ఈ షో సాటిలేని వీక్షణ అనుభవాలను నమోదు చేసింది. సోషల్ మీడియాలో ఇప్పటికే 2021 లో తరువాత సీజన్‌ను త్వరగా ప్రారంభించాల్సిందిగా కోరుతూ ట్రెండింగ్ కూడా చేస్తున్నారు. తమ వైవిధ్యమైన, సంపూర్ణమైన నాయకత్వంతో స్టార్ మా, 2021లో అత్యున్నత శిఖరాలను పలు ఫిక్షన్ మరియు నాన్ ఫిక్షన్ షోలతో అధిరోహించింది.
Post A Comment:
0 comments: