అవి కొన్నాలంటే ఇక మోతే...

జనవరి1 నుంచి పెరగనున్న టీవీలు, ఫ్రిజ్‌ల ధరలు

(జానోజాగో వెబ్ న్యూస్-బిజినెస్ డెస్క్)

నూతన సంవత్సరం ఆరంభం నుంచే ఎలక్ట్రానిక్‌ గృహోపకరణాల ధరలు పెరగనున్నాయి. ఎల్‌ఈడీ టీవీలు, రిఫ్రిజరేటర్లు (ఫ్రిజ్‌లు), వాషింగ్‌మెషీన్లు, ఎయిర్‌ కండీషనర్లు, మైక్రోవేవ్‌ ఓవెన్లు.. ఇలా అన్ని పరికరాల ధరలు పెంచేందుకు కంపెనీలన్నీ సిద్ధమవుతున్నాయి. రాగి, అల్యూమినియం, స్టీల్‌, ప్లాస్టిక్‌ వంటి ముడి పదార్థాల ధరలు పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని ఎల్‌జీ, పానసోనిక్‌, దైకిన్‌, ఐఎఫ్‌బీ, బోష్‌, థామ్సన్‌ వంటి సంస్థలు పేర్కొంటున్నాయి. టీవీ ప్యానెళ్లకు వాడే ఓపెన్‌ సెల్‌ ధరలు రెట్టింపు కావడం, ముడిచమురు ధర -రవాణా ఛార్జీలు, ఇతర వ్యయాలు కూడా పెరిగాయని గుర్తు చేస్తున్నారు. ధరల పెంపునకు సంబంధించి డీలర్లకు కంపెనీలు సమాచారం ఇచ్చాయి కూడా.  గత పదేళ్లలో ఈ స్థాయిలో ధరలు పెంచలేదని ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ (హోమ్‌ అప్లయన్సెన్స్‌) విజయ్‌ బాబు  చెప్పారు. సహజంగా టీవీల ధరలు ఎప్పుడూ తగ్గుతూ ఉంటాయని, ఈసారి మాత్రం ప్యానెల్‌, ఇతర ముడిపదార్థాల ధరల వల్ల పరిశ్రమ అంతా పెంచుతున్నట్లు వివరించారు. ధరలు పెరిగినా కూడా, విడిభాగాల సరఫరా సక్రమంగా లేక, కొన్ని మోడళ్లు ఇప్పటికీ అందుబాటులో లేవని తెలిపారు. ఓపెన్‌సెల్‌ ధరలు గణనీయంగా పెరిగినా కూడా, గిరాకీకి కావాల్సిన మేర అందుబాటులో లేవని థామ్సన్‌, కొడాక్‌ బ్రాండ్‌ టీవీల లైసెన్స్‌దారు, సూపర్‌ ప్లాస్ట్రానిక్స్‌ ఎండీ అవ్‌నీత్‌సింగ్‌ మార్వా వివరించారు.

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: