ఆర్ఎఆర్ఎస్ భూముల పరిరక్షణకై ఛలో నంద్యాల

వైద్యకళాశాలకు కేటాయించడానికి వ్యతిరేకంగా ఉద్యమం

మార్చి 1 నంద్యాల జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి

రేపటి నుంచి మండల స్థాయిలో ఉద్యమ సన్నాహక సమావేశాలు

కరపత్రాలు విడుదల చేసిన రాయలసీమ సాగునీటి సాధన సమితి ప్రతినిధులు

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

రైతు సంక్షేమానికి, దేశ ఆహార భద్రతకు దోహదపడుతున్న నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం భూములను వైద్యకళాశాలకు కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. నంద్యాలలోని రాయలసీమ సాగునీటి  సాధన సమితి కార్యాలయంలో బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ 1000 కోట్ల మూలధనంతో విరాజిల్లుతూ రైతుల అభివృద్ధికి, వేలాదిమంది ఉద్యోగుల, వ్యవసాయ కార్మికులకు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను దోహదపడుతున్న నంద్యాల ఆర్ఎఆర్ఎస్ ను నిర్వీర్యం చేసే ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. వైద్య కళాశాలకు ఆర్ఎఆర్ఎస్ భూములను కేటాయించకూడదని, జీ.వో.నెంబరు 341ని తక్షణమే రద్దు చేసి ఆర్ఎఆర్ఎస్ ను రక్షించాలని తాము ముఖ్యమంత్రికి, స్థానిక ప్రజా ప్రతినిధులకు వివరించినప్పటికీ ప్రభుత్వం మొండిగా ఆర్ఎఆర్ఎస్ భూములనే వైద్య కళాశాలకు కేటాయిస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మార్చి1న నంద్యాలలో జరిగే కార్యక్రమంలో వేలాదిగా పాల్గొని విజయవంతం చేయాలని దశరథరామిరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. 115 ఏళ్ళ క్రిందట బ్రిటిష్ హయాంలో వెలిసిన ఆధునిక దేవాలయం మన ఆర్ఎఆర్ఎస్  అనీ దీనిని కాపాడుకునేందుకు రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ కలిసికట్టుగా ఉద్యమించాలని రాయలసీమ ప్రజలకు దశరథరామిరెడ్డి పిలుపునిచ్చారు. దేశంలోనే అత్యున్నత పరిశోధన స్థానాలలో మన నంద్యాల ఆర్ఎఆర్ఎస్  అగ్రగామిగా వుండి, నంద్యాల ప్రాంతంలో విత్తన పరిశ్రమ అభివృద్ధి చెందడానికి, రాయలసీమ ప్రాంత రైతుల ఆర్థిక అభివృద్ధికి, దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతున్న మన ఆర్ఎఆర్ఎస్  ను కాపాడుకోవాల్సిన బాద్యత మనందరిమీద వుందని ఆయన అన్నారు..రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు, కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ పరిశోధన సంస్థ ఐసీఎఆర్ నిధులతో 6 పంటలను పరిశోధనలు మన ఆర్ఎఆర్ఎస్ విజయవంతంగా నిర్వహిస్తోందని ,అంతేకాక పత్తిలో నరశింహ వరిలో నంద్యాల సోనా,  వివిధ పంట రకాల అభివృధ్దిలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని పొందిన నంద్యాల ఆర్ఎఆర్ఎస్ ను  నిర్వీర్యం చేయాలన్న చూస్తున్నారని  ఆరోపించారు. ఆర్ఎఆర్ఎస్ ను కాపాడుకునే కార్యక్రమంలో భాగంగా 28-12-2020 న వెలుగోడు మండల సమావేశం వెలుగోడులోని సాయిబాబా దేవాలయంలోను, నంద్యాల  మండల స్థాయి సమావేశం  29-12-2020 మంగళవారం నంద్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల నందు, గోస్పాడు మండల స్థాయి సమావేశం గోసుపాడు సాయిబాబా ఆలయం నందు మండల స్థాయి ఉద్యమ సన్నాహక సమావేశాలను నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమాలలో ప్రజలందరూ పాల్గొని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి మన ఆర్ఎఆర్ఎస్ ను కాపాడుకుందామని దశరథరామిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా రాయలసీమ సాగునీటి సాధన సమితి ప్రతినిధులు కరపత్రాలను విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో వై.ఎన్.రెడ్డి, వెంకటేశ్వర నాయుడు, సౌదాగర్ ఖాసీంమియా,ఏర్వ రామచంద్రారెడ్డి, పట్నం రాముడు, మహేశ్వరరెడ్డి, వెంకటసుబ్బయ్య, భాస్కర్ రెడ్డి, రాఘవేంద్ర గౌడ్  పాల్గొన్నారు.

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: