కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో...

మాజీ ప్రధాని పీవీ నరసింహ రావు 16వ వర్ధంతి

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

 మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 16 వ వర్ధంతిని  నంద్యాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి నంద్యాల పట్టణ అధ్యక్షులు దాసరి చింతలయ్య,  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉకొట్టు వాసులు  పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయన నంద్యాల లోకసభకు ప్రాతినిధ్యం వహించుటకు ఆనాటి ముఖ్య మంత్రి కోట్ల విజయ భాస్కర రెడ్డి, ఆనాటి నంద్యాలఎంపీ  పెద్దాయన బొజ్జా వెంకటరెడ్డి ముఖ్యలని, పీవీ నరసింహారావు ప్రధానిగా నంద్యాలకు రైల్వే లైన్ బ్రాడ్జ్ గేజి గుంతకల్ నుండి గుంటూరు వరకు ఏర్పాటు చేశారని, తాగునీటికి వెలుగోడు రిజర్వాయర్ నుండి సమ్మర్ స్టోరేజ్,  సాగునీటికి గోరుకలు  రిజర్వాయర్, మహానంది దగ్గర అగ్రికల్చర్ యూనివర్సిటి కాలేజీ, నేషనల్ సీడ్స్  ఏర్పాటు చేసారని, పీవీ నరసింహరావు ప్రధాని కాక ముందు జనతాదళ్ ప్రధాని ఐకే గుజ్రాల్ ప్రధానిగా ఉండి మన దేశంలోని బంగారంను బ్యాంకులో తాకట్టు పెట్టడం జరిగిందని, ఆ బంగారాన్ని పీవీ విడిపించడం జరిగిదని చింతలయ్య తెలిపారు. రాష్ట్ర అధికార ప్రతినిధి ఉకోటు వాసు మాట్లాడుతూ పీవీ నరసింహారావు 16 భాషలు అనర్గళంగా మాట్లాడగలరని, ప్రధాని నంద్యాలకు ఆయన చేసిన సేవలు గురించి మాట్లాడారు. ఈకార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎస్.ఎం.డీ. ఫరూక్, అహ్మద్,  కరాటే బాలకృష్ణ, తిమ్మయ్య యాదవ్, వలి తదితర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: