నవంబర్ 2020

 మట్టి పాత్ర నిండ ఆరోగ్య ప్రయోజనాలు

షుగర్ కు విరుగుడా గా పనిచేస్తుందటా...?

బడాయి కోసం మట్టి పాత్ర విస్మరణ...?

మట్టి పాత్రలో  అంత టెక్నాలజీ  ఉందా! షుగర్ కు దీనికి లింకేమిటి #నమ్మలేని నిజమిది! మట్టి పాత్రలో ఎప్పుడో మన  #అమ్మమ్మలు ఇంకా చెప్పాలంటే  వాళ్ల అమ్మల కాలంలో వంటచేశావారంట అని చెప్పుకొనే రోజులు వచ్చేశాయి. మట్టి పాత్రలో వండుకోవలసిన కర్మ మాకేమిటి అనే రోజులు గతంలోనే వచ్చేశాయి. అయితే అదంతా మట్టి పాత్రలు గొప్పతనం తెలియకే...? నాన్ స్టిక్ స్టైయన్ లెస్ స్టీలు అల్యూమినియం పాత్రలు  వాడటం ద్వారా ఆరోగ్యసమస్యలు తప్పవు.. క కొంతమంది పెద్దలు మట్టి పాత్రలు ద్వారా ఆహారాన్ని తీసుకోవటం ద్వారా ఆరోగ్యంగా ఉంటున్నారని ఆరోగ్యనిపుణులు చెపుతున్నారు!.. కాబట్టి మనం మట్టి పాత్రలు ద్వారా వంటచేయటం ఎంతో మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు.          

నిజానికి మట్టి పాత్రలో వంటచేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఎక్కవ కాలం చెడిపోకుండా నిలువ వుంటాయి. కావాలంటే మీ అమ్మమ్మనో నాయనమ్మనో అడగండి. అసలు మట్టి పాత్రలో ఏముందో చూద్దాం. మన ఆరోగ్యానికి కావలసి18 రకాల ""మైక్రోన్యూక్లియన్స్"" ఈ మట్టిలో వున్నాయి. మట్టి పాత్రలో ఆహారాన్ని వండటం వలన వచ్చిన రిపోర్టు ఏమిటంటే ఈ పధార్ధములో ఒక్క మైక్రో న్యూట్రియన్స్ కూడా తగ్గలేదు. మామూలు పాత్రలో వండిన పదార్థాలలో 7%,13% మాత్రమే మైక్రో న్యూట్రియన్స్ వున్నాయి. మట్టి పాత్రలో మాత్రము 100%మైక్రో న్యూట్రియన్స్ వున్నాయి. ఈ పదార్థాలకి రుచి కూడా అద్బుతంగా వుంటుంది. అలాగే మట్టి పాత్రలను తయారు  చేసే  బురద మట్టిని  సిరామిక్ అంటారు. ఈ సిరామిక్ కు వేడి తగలగానే ఇన్ప్రారెడ్ కంటికి కనిపించని కిరణాలు అంటే ఇన్విజబుల్ రేస్ ఉత్పత్తి అవుతాయి. ఈ కిరణాలు వెదజల్లిన ప్రాంతమంతా పూర్తిగా శుద్ధి చేయబడుతుంది. 


 

                               మీకు గుర్తుండే వుంటుంది ఎవరైనా పిల్లలు బలహీనంగా తక్కువ బరువుతో పుట్టిన పుట్టుకతోనే పసిరికలు లేక ఏదైనా అనారోగ్యంతో పుడితే ఇంక్యుబేటర్ అనే పరికరంలో కొన్ని గంటలు పాటు వుంచుతారు. ఆ పరికరంలో వుండే లైట్ ద్వారా  ఇన్ప్రారెడ్ కిరణాలు ద్వారా ప్రసరింపచేసి పుట్టిన పిల్లల శరీరాన్ని పూర్తిగా శుద్ధి చేస్తారు. కేవలం కొద్దిగంటల్లోనే పాపకు పూర్తి స్థాయి ఆరోగ్యాన్నిచ్చే శక్తి ఈ కిరణాలకే వుంది.  కాబట్టి మట్టి పాత్రలకి అంత శక్తి టెక్నాలజీ వుందన్నమాట. జీవితాంతం మనకు కావాల్సిన న్యూట్రియన్స్ అందుతుంటే మన పనులు మనమే చేసుకుంటూ ఎవరిమీద ఆదారపడకుండా జీవించగలం. ఇది కూడా మట్టి పాత్రలో వంటచేసి తినడం ద్వారా నే..

చక్కెర వ్యాధి వున్న వారికి ఈ మట్టి పాత్రలు ద్వారా వండిపెడితే కొన్ని నెలలు లోపే #డయాబిటీస్ నుండి విముక్తులను చేయండి ఆనందంగా జీవంచనీయండి............  


 

మ‌ట్టికుండ‌లోని_నీళ్లు

నీరు చల్లగా ఉండడం..

ఫ్రిజ్‌లో కాకుండా రంజన్‌లో చల్లబడే నీరు శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. మట్టితో తయారు చేసిన కుండల్లో కొన్ని పోషకాలు నీటితో జతకలిసి ఆరోగ్యానికి ఉపకరిస్తాయి. పూర్వకాలం నుంచి ప్రజలు అన్ని కాలాల్లో మట్టితో చేసిన పాత్రలతోనే నీటిని చల్లబరుచుకునే వారు. దీని ద్వారా ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగదు.

సూక్ష్మరంధ్రాలతో నీటిని చల్లబరిచే విధానం..

సాధారణంగా ఫ్రిజ్‌లో గ్యాస్, విద్యుత్‌లను ఉపయోగించి నీటిని చల్లబరుస్తారు. కానీ, మట్టి పాత్రల్లో వాతావరణంలో ఉండే గాలితో #బాష్పోత్సేకం ప్రక్రియతో నీటిని చల్లబర్చుకోవడానికి మట్టిలోని సూక్ష్మరంధ్రాలు ఉపయోగపడుతాయి.

మట్టిలో ఉండే క్షారగుణం ఆరోగ్యానికి లాభం..

మట్టి పాత్రలను తయారు చేసే మట్టిలో ఉండే క్షారగుణం వల్ల మానవ శరీరానికి అసిడిటీ సమస్య లేకుండా శరీరంలోని #పీహెచ్(pH) నిల్వలను సమతుల్యంగా ఉంచుతుంది. మట్టి నీళ్ల వల్ల #గ్యాస్ట్రిక్ నొప్పులు రాకుండా కాపాడుతుంది.

జీవక్రియ మెరుగుపడుతుంది..

సాధారణంగా ప్లాస్టిక్ పాత్రల్లో నిల్వ ఉంచిన నీటిని తాగ డం ద్వారా అందులో ఉండే రసాయనాల వల్ల మానవ శరీరానికి సమస్యలు తలెత్తుతాయి. జీవక్రియ సమతూల్యంగా ఉండదు. దీని మూలంగా అనారోగ్య సమస్యలు చోటు చేసుకుంటాయి. కానీ, మట్టి పాత్రల్లోని నీటిని తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడి #టెస్టోస్టిరాన్ అధికంగా ఉత్పత్తవుతుంది.

వడదెబ్బను అరికడుతుంది..

ఎండలో తిరిగి ఇంటికి రాగానే ఫ్రిజ్‌లోని చల్లని నీటిని తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రతలో #బేధాలు ఏర్పడి వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. కానీ మట్టి పాత్రల్లోని నీటిని తాగడం వల్ల శరీరంపై ఎలాంటి వడదెబ్బ ప్రభావం ఉండదు.

 ఓటు హక్కు పల్లకి మోసేందుకేనా...?

ప్రభుత్వంలో భాగస్వామ్యంపై మౌనం నష్టమే

కేంద్ర, రాష్ట్ర కేబినేట్ లలో ముస్లింల ప్రాతినిధ్యం నామ మాత్రం

Muslim ministers: numbers lag far behind share in population

మన రాజ్యాంగ ద్వారా లభించిన ఓటు హక్కును ఒకరి పల్లకి మోసేందుకేనా...ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రతినిధ్యం కోసం ఎందుకు ఉపయోగించడంలేదు. ఇది ప్రస్తుతం ముస్లిం సమాజం ఆలోచించాల్సిన అంశాలు. ఎందుకంటే ఓటర్లుగా భారతదేశంలో గణనీయ ప్రభావం చూపే స్థాయిలో ముస్లిం ఓటర్లు ఉన్నా ప్రభుత్వాలలో భాగస్వామ్యం అంటే కేంద్ర, రాష్ట్ర కేబినేట్ లలో ప్రతినిధ్యం నామ మాత్రంగా ఉంది. కేబినేట్ అంటే మంత్రలుతో కూడినది. అది కేంద్ర ప్రభుత్వ స్థాయిలో కావచ్చు...రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో కావచ్చు ముస్లిం మంత్రుల సంఖ్య మాత్రం నామ మాత్రమే. మంత్రి పదవుల్లో జనాభా దామాషా ప్రకారం మంత్రి పదవుల్లో ప్రతినిధ్యం అవసరమే. ఎందుకంటే ఏ ప్రభుత్వమైన తమ వర్గ ప్రయోజనాలను భంగం కలిగించినపుడు వాస్తవ పరిస్థితి తెలియజేసి వాటిని సరిచేసేందుకు మంత్రులుగా తమ వర్గ ప్రయోజనాలను కాపాడుకొనే అవకాశముంటుంది. మంత్రివర్గంలో అసలే ప్రాతినిధ్యం లేనపుడు తమ వర్గ ప్రయోజనాలను ఏ వర్గమైన కోల్పోవాల్సి వస్తుంది. ఇక ముస్లిం మంత్రులు ఉండి తమ సొంత సమాజానికి ఒరగబెట్టింది ఏమీ లేదు అన్న విమర్శ కూడా ఉంది. ఈ విమర్శలో వాస్తవం లేకపోలేదు. కాకపోతే హక్కుగా లభించాల్సిన మంత్రి పదవుల సంఖ్యపై నొరువిప్పకపోతే అసలుకే ప్రమాదం. ముందు హక్కు దక్కితే ఆ తరువాత వాటిని సరైన రీతిలో ఉపయోగించుకొనేందుకు ముస్లిం సమాజం మరో ఉద్యమం ద్వారా మంత్రులపై ఒత్తిడి పెంచవచ్చు. దానికి మరోమార్గముంది. మంత్రుల సంఖ్య ఏ వర్గానికైనా జనాభా నిష్పత్తి ప్రకారం దక్కితేనే ఆ వర్గ ప్రయోజనాలు దక్కుతాయి. కానీ ముస్లిం మంత్రుల సంఖ్య ఆయా ప్రభుత్వాల్లో ఎంత వుంది...ఎంత ఉండాలి అన్నది ఇపుడు మనం ఆలోచించాలి.

గత వారం 15 మంది సభ్యుల ఎన్డీఏ క్యాబినెట్ బీహార్లో బాధ్యతలు చేపట్టింది, బిజెపి కూటమిలో అతిపెద్ద పార్టీగా ఉన్న విషయం తెలిసిందే. ఆ పార్టీ తరుపున ఒక ముస్లిం ప్రతినిధి కూడా  లేడు. దశాబ్దాలలో బీహార్ ప్రభుత్వంలో ఒక్క  ముస్లిం మంత్రి లేకపోవడం ఇదే మొదటిసారి. ప్రభుత్వంలో ముస్లింల ప్రాతినిధ్యం లేకపోవడం ఒక్క బీహార్‌కు మాత్రమే పరిమితం కాదు.

పార్టీల  వారీగా ముస్లిం ఎమ్మెల్యేలు

వాస్తవానికి చాలా రాష్ట్రాల్లో అక్కడి రాష్ట్ర ప్రభుత్వంలోని క్యాబినెట్లలో ముస్లింల విషయానికి వస్తే వారి వాటా జనాభాలో వారి వాటా కంటే చాలా తక్కువగా ఉంది. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో మెజార్టీగా బీజేపీ, వాటి భాగస్వామ్యంలోని ప్రభుత్వాలు ఉన్నాయి. ఆ ప్రభుత్వాలలోని కేబినేట్ లలో ముస్లిం ప్రాతినిధ్యం చాలా వరకు లేదు. ఇక కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో కూడా కేబినేట్ లో  ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. భారతదేశము లోని  ముస్లింలలో 80 శాతం మంది నివసిస్తున్న టాప్ 10 రాష్ట్రాల్లో, ఆ రాష్ట్రల మంత్రి  మండలులలోని మంత్రుల   మొత్తం సంఖ్య 281, అందులో 16 మంది మాత్రమే ముస్లింలు ఉన్నారు. పైనవివరించిన మంత్రి మండలిలలో ముస్లిం సమాజానికి ప్రాతినిధ్యం కేవలం 5.7 శాతం మాత్రమే – ఇది ఆ రాష్ట్రాల జనాభాలో వారి వాటాలో మూడోవంతు కంటే తక్కువ. ఈ 10 రాష్ట్రాల్లో నాలుగు, అస్సాం, కర్ణాటక, గుజరాత్, బీహార్ - బిజెపి అధికారంలో ఉన్నది – కాని ప్రభుత్వంలో ఒక్క ముస్లిం ప్రతినిధి కూడా లేరు. ముస్లిం మంత్రి ఉన్న ఏకైక బిజెపి పాలిత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్ - ఇక్కడ మొహ్సిన్ రాజా మైనారిటీ సంక్షేమానికి బాధ్యత వహిస్తున్నారు. ఈ 10 రాష్ట్రాల్లో 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు, ముస్లిం మంత్రి లేని రాష్ట్రం  కేవలం గుజరాత్   మాత్రమే. ఈ 10 రాష్ట్రాల్లో ముస్లిం మంత్రుల సంఖ్య 2014 కి ముందు 34గా ఉంది . 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో ముస్లింలు 14.2 శాతం ఉన్నారు. అయితే మంత్రులుగా వారి ప్రాతినిధ్యం 3.93 శాతం మాత్రమే.

అత్యధిక ముస్లిం జనాభా కలిగిన 10 రాష్ట్రాలు 

కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగమైన 10 రాష్ట్రాల్లో - రాజస్థాన్, మహారాష్ట్ర, జార్ఖండ్ - మొత్తం 38 మంది మంత్రులలో ముగ్గురు మాత్రమే ముస్లింలు. ముస్లిం జనాభా తక్కువగా ఉన్న పంజాబ్, ఛత్తీస్‌ఘడ్, కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాలు మంత్రులలో ఒక్కరి చొపున ముస్లింలు ఉన్నారు. బిజెపి పాలనలో లేని ప్రతి ప్రధాన రాష్ట్రానికి ముస్లిం మంత్రి ఉన్నారు, పశ్చిమ బెంగాల్ (7) లో అత్యధిక ప్రాతినిధ్యం ఉంది, తరువాత మహారాష్ట్ర (4), కేరళ (2) ఉన్నాయి. బీజేపీ వాదన ప్రకారం ముస్లిం మంత్రులు తమ ప్రభుత్వాలలో లేకపోవడానికి కారణం ముస్లిం సమాజం  నుండి మద్దతు లేకపోవడం, పార్టీలో చేరడానికి వారు వెనుకాడటం

“ “ఏదైనా సంబంధం పనిచేయడానికి పరస్పర అవగాహన  అవసరం. బిజెపి కంటే, (ముస్లిం) సమాజం ఈ అంశంపై ఆత్మపరిశీలన చేసుకోవాలి. సమాజం. బీజేపీపార్టీతో చేతులు కలిపిన తర్వాత, అధికారం కోసం బేరం కుదుర్చుకోవడంలో  మంచి స్థితిలో ఉంటుంది ”అని బిజెపి మైనారిటీ సెల్ జాతీయ అధ్యక్షుడు జమాల్ సిద్దిఖీ అన్నారు. భారతదేశం అంతటా బిజెపికి నుండి ఎన్నుకోబడిన ముస్లిం ఎమ్మెల్యే ఒక్కరు మాత్రమే ఉన్నారు. అస్సాంలోని సోనాయ్ నుండి ఎన్నికైన అమీనుల్ హక్ లాస్కర్.ఆయన ఇటీవల అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికయ్యారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఏకైక ముస్లిం మంత్రి మొహ్సిన్ రాజా ఎమ్మెల్యే కాదు - ఆయన ఆ రాష్ట్ర శాసన మండలి సబ్యులు ఎమ్మెల్సీ. లోక్‌సభలో కూడా బిజెపికి ముస్లిం ప్రతినిధి లేరు.

✍️ రచయిత-మహమ్మద్ అజ్గర్ అలీ 

రాజనీతి తత్వ శాస్త్ర విశ్రాంత అధ్యాపకులు

సెల్ నెం-94915-01910


 నోముల నర్సింహయ్య మృతి

(జానోజాగో వెబ్ న్యూస్-నాగార్జునసాగర్)

నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణించారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న నర్సింహయ్య అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. 1999, 2004 లో సీపీఎం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నోముల ఆ తరువాత 2009 భువనగిరి ఎంపీగా సీపీఎం తరఫున పోటీచేసి ఓటమిచెందారు. ఆ తరువాత 2013 లో టీఆర్ఎస్ లో చేరిన నోముల నర్సింహయ్య 2014లో నాగార్జున సాగర్ నియోజకవర్గంలో జానారెడ్డిపై పోటీ చేసి ఓటమి చెందారు. మళ్లీ 2018 ఎన్నికల్లో జానారెడ్డిపై పోటీచేసి ఘన విజయం సాధించారు. నోముల నర్సింహయ్య.

 నోముల మృతి పట్ల టీయూడబ్ల్యూజే సంతాపం

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

కమ్యూనిస్టు పార్టీ మాజీ నాయకులు, నాగార్జున సాగర్ శాసన సభ్యులు, పేద, కార్మిక వర్గాల పక్షపాతి నోముల నర్సింహయ్య ఆకస్మిక మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) పక్షానా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తుశారు. గతంలో సిపిఎం పార్టీలో సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన నర్సింహయ్య ఎన్నో ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించారు. ఆయన మృతి పేద వర్గాలకు తీరని లోటుగా భావిస్తున్నామని వారు పేర్కొన్నారు.

సమానత్వంలో అసమానత్వం..

ఇంకెన్నాళ్లు ఈ దుస్థితి.....!! 

రాజ్యాంగం అమలులో లోపాలు కోకోల్లలు!!

రాష్ట్ర ప్రభుత్వ గవర్నమెంట్ ప్లీడర్లు, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్లు, స్టాండింగ్ కౌన్సెల్ ల నియామకం గురించి నియమావళి చాలా స్పష్టంగా ఉంటే, ఇక కేంద్ర ప్రభుత్వ న్యాయవాదుల నియామకాల్లో అయితే అసలు నియమావళి అనేది లేదు. ఎవరికీ రాజకీయంగా పలుకుబడి ఉంటే వారే కేంద్ర ప్రభుత్వ న్యాయవాదులుగా నియమింపబడతారంటే ఆశ్చర్యపరచక మానదు.  కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ప్రతి హై కోర్టులో వుంటారు. ఈయన క్రింద ఒక 30 నుంచి 70 వరకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి స్టాండింగ్ కౌన్సెల్ ల ఉంటాయి. వాటిలో పోస్టల్ డిపార్ట్మెంట్, టొబాకో బోర్డు, కాఫీ బోర్డు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి, నేవీ, ఆర్మీ, మిలిటరీ, సి ఆర్ పి ఎఫ్, పాసుపోర్టు డిపార్ట్మెంట్, విదేశాంగ శాఖ, జాతీయ రహదారులు, విమానయాన శాఖ ఇలా మొత్తం ఎన్ని కేంద్ర ప్రభుత్వ డిపార్టుమెంటులు ఉన్నాయో, వాటన్నిటికి ఒక అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ప్రతి హై కోర్టులో వుంటారు. అయితే వీరి నియామకానికి సంబంధించి ఎటువంటి నియమావళి కానీ చట్టాలు కానీ లేవు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆఫీస్ మెమొరాండంలో వీరి పదవి కాలపరిమితి 3 సంవత్సరాలు అని రాసి ఉంటుంది. అలా 2015 లో నియమింపబడ్డవారు ఇప్పటికి కొనసాగుతున్నారు. 

ఇక ఇదంతా ఒక విషయం అయితే చాలా మంది తెలంగాణా న్యాయవాదులు, హైద్రాబాదులో వుంటూ ఇక్కడ కేంద్ర ప్రభుత్వ న్యాయవాదులుగా చెలామణి అవుతున్నారు. వారిలో కేంద్ర ఎన్నికల కమిషన్ స్టాండింగ్ కౌన్సెల్, AICTE, NCTE, IOCL, HPCL, DRI,  NIA,  CBI , రైల్వే ఇలా చాలా డిపార్ట్మెంట్లలో చాలా మంది తెలంగాణ వారే ఉండటం విడ్డూరం. రాష్ట్రము విడిపోయినా తెలంగాణ వారిదే పైచేయి లాగా ఉంది. ఇక కేంద్ర ప్రభుత్వం వీరిని ఎందుకు ఇంకా కొనసాగిస్తుందో వివరించాలి. ఎవరైతే ఆంధ్ర తెలంగాణ ఉదయమాలలో పాల్గొని, తెలంగాణ తరపున తెలంగాణ కోసం పని చేసారో, తెలంగాణాలో మాత్రమే కేంద్రం తరపున న్యాయవాదులుగా కొనసాగాలి. అంతేగాని, తెలంగాణాలోని హైద్రాబాదులో అన్ని రకాలుగా స్థిరపడిన న్యాయవాది, అమరావతిలో ప్రతి రోజు కోర్టుకి హాజరు కావడం ఎంత కష్టమో అర్థం చేసుకొని, ఆంధ్రలోని న్యాయవాదులకు వారు వట న్యాయంగా ఇవ్వాలి. అంతే కాకుండా, CAT (కేంద్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్) ను కూడా ఆంధ్ర ప్రదేశ్ కు తరలించాలి, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ని కూడా ఆంధ్ర ప్రదేశ్ కు తరలించాలి. రాష్ట్రము విడిపోయి 2 సంవత్సరాలు అవుతున్న, ఇంకా హైద్రాబాదులో వీటిని కొనసాగించాల్సిన అవసరం లేదు.   

రైల్వేలో స్టాండింగ్ కౌన్సెల్ నోటిఫికేషన్ 2017 లో ఇచ్చారు, అప్పట్లో అందరు సికింద్రాబాద్ రైల్ నిలయం వెళ్లి ఇచ్చి వచ్చారు. కానీ ఇంత వరకు ఫైనల్ చెయ్యలేదు. అలాగే, వేరే వేరే డిపార్ట్మెంట్స్ వారు అసలు నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తున్నారు, ఎప్పుడు ఫైనల్ చేస్తున్నారు అనే సమాచారం ఇవ్వకుండా, వారికీ నచ్చిన అభ్యర్థులకు ఇచ్చేస్తున్నారు. ఇది సమానత్వానికి వ్యతిరేకం.

ఇదే కాకుండా, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒకటికన్నా మించి స్టాండింగ్ కౌన్సెల్ ను నియమించాల్సివస్తే కచ్చితంగా రిజర్వేషన్ పద్దతిని అమలు పరచాలి. నియమావళి లేకుంటే నియామకాలను ఎలా ప్రశ్నించాలి. ఎక్కడ అన్యాయం జరిగినా కోర్టులకు వెళ్తే న్యాయం జరుగుతుంది అనే నమ్మకం ఒక సామాన్య మానవుడికి ఉన్నప్పుడు. అదే న్యాయస్థానంలో, న్యాయవాద నియామకాల్లో కేంద్ర ప్రభుత్వం అవలంభించే తీరు చాలా విచిత్రంగా, వివాదాస్పదంగా ఉంటుంది. ఈ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఒక తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబెర్ ను తీసుకు వచ్చి, ఆంధ్ర  హై కోర్టులో అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ గా నియమించింది. ఈ నియామకం జరగడానికి ముఖ్యకారణం కులం, అదే ఏ చిన్న కులాలవారినో నియమించితే పెద్ద న్యాయపరమైన యుద్ధం కోర్టులో జరిగేది. కానీ, ఈ న్యాయవాది పెద్ద కులం వారు కావడం వలన, చాలా మంది మాకెందుకులే అనే పద్దతిని అవలంబించారు. ఇలా మాకెందుకులే అనుకుంటూ రావడం వలన, ఇప్పటివరకు జరిగినా అన్ని నియామకాల్లో చాలా అవకతవకలు జరుగుతున్నాయి అనేది నిజం. ఎందుకంటే, ఒక తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబెర్, ఇక్కడ ఆంధ్రాలో ఎలా నియమిస్తారో కేంద్రం వివరించాల్సి ఉంది. ఇలా, ఒకటి, రెండు కాదు, దరిదాపుగా ఒక 50 -70 మంది న్యాయవాదులు కేంద్ర ప్రభుత్వ న్యాయవాదులుగా 2015 నియమింపబడినప్పిటికి ఇప్పటికి చాలా మంది కొనసాగుతూనే ఉన్నారు. అందరు సమానమే అయితే, ఇదెలా సాధ్యం అనే ప్రశ్న రాక మానదు. మరి ఇక్కడే సమానత్వంలో అసమానత్వం కనపడేది. ఈ అసమానత అందరికి కనపడదు, ఎందుకంటే, కనపడిన, వారి ప్రశ్నించరు, మనకెందుకులే, మనం ప్రశ్నిస్తే మనకు ఇవ్వరు, వేరే ఎవరికో ఇస్తారు అనే ధోరణి. 

న్యాయవాదులు నియామకాల్లో కేంద్ర ప్రభుత్వం సరైన నియమావళి తాయారు చెయ్యాలి. అంతే కాకుండా, ఒక నిర్ణీత కాల పరిమితికి మించి న్యాయవాదులు పని చెయ్యడానికి వీలు లేకుండా చెయ్యాలి, తద్వారా, వేరే వ్యక్తికి కూడా ప్రభుత్వం తరపున పని చేసే అవకాశం రావడానికి వీలు పడుతుంది. అంతే కానీ, ఒక వ్యక్తే ఇక శాశ్వతకాలం ప్రభుత్వ న్యాయవాదిగా ఉండటమనేది సమానత్వానికి, రాజ్యాంగంలో వివరించిన అధికరణ 14 మరియు 16 కు పూర్తి విరుద్ధం. కాబట్టి, కేంద్ర ప్రభుత్వం న్యాయవాద నియమావళిని తీసుకు వచ్చి అందరికి అవకాశం వచ్చే విధంగా తాయారు చేయాలి. లేకపోతే, ప్రభుత్వానికి మరియు న్యాయవాదులకు చాలా నష్టాలు జరిగే ప్రమాదం ఉంది. కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు ఒక ప్రత్యేక సర్కులర్ ఇచ్చి, ఆయా సంస్థలు వారికీ సంబందించిన న్యాయవాదులను ఎంపిక చేసుకునేటప్పుడు, కచ్చితంగా రిజర్వేషన్ పాటించాలి అనే నిబంధనలను సూచించాలి. లేకపోతే, చాలా న్యాయవాదులు మరి ముఖ్యంగా 10 సంవత్సరాలనుండి వాళ్లే, వాళ్ళు మాత్రమే కేంద్ర ప్రభుత్వ న్యాయవాదులుగా కొనసాగుతున్నారు. దీని అర్థం ఈ నియమితులైన వాళ్ళు మాత్రమే తెలివైన వారా, లేకపోతే వాళ్ళు పుట్టుకతోనే తెలివైనవారా, ఇంక ఎవరు తెలివైన వారి లేరా, మరి వాళ్ళు మాత్రమే పదవిలో ఎన్నాళ్లయినా కొనసాగ వచ్చా, ఇక ఇలా ఎన్నాళ్లయినా వాళ్ళు పదవిలో ఉంటే, అది రాజ్యాంగ స్ఫూర్తికి, సమానత్వానికి విరుద్ధం కదా అనే విషయాన్నీ గుర్తించాలి. ఇక పోతే కేంద్ర ప్రభుత్వ న్యాయవాదులకు వయసు పరిమితి కూడా నిర్ణయించాలి, ఎందుకంటే జూనియర్ స్టాండింగ్ కౌన్సెల్ గా కొంత మంది 55  సంవత్సరాలలో వస్తున్నారు. ఇక సీనియర్ స్టాండింగ్ కౌన్సెల్ అయితే 60  పై మాటే. ఇందుకు సంబంధించి సరైన నియమావళి తాయారు చేయకుంటే, రాబోయే తరాలు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.  

ఉన్నత న్యాయస్థానాలలో న్యాయమూర్తులుగా ఎన్నుకోబడటానికి ముఖ్యంగా గవర్నమెంట్ ప్లీడర్లను, స్టాండింగ్ కౌన్సెల్ లను, సెంట్రల్ గవర్నమెంట్ స్టాండింగ్ కౌన్సెల్ పేర్లను ప్రతిపాదిస్తారు. వారికి రాజ్యాంగం మరియు ఇతర చట్టాల అవగాహనా పరిజ్ఞానం, మిగిలిన అర్హతలు అన్ని చుసిన తరువాత వారి పేరును ప్రతిపాదిస్తారు. అయితే, ఇక్క ఎస్.సి, ఎస్.టి, బి.సి న్యాయవాదులను వారికీ రావాల్సిన గవర్నమెంట్ ప్లీడర్లను, స్టాండింగ్ కౌన్సెల్ లను, సెంట్రల్ గవర్నమెంట్ స్టాండింగ్ కౌన్సెల్ పదవులు ఇవ్వకపోవడంవలన, వారిని మొదటి రౌండ్ లోనే ఆపేస్తున్నారు.  ఒకే వ్యక్తి ఒకే పదివికి దశాబ్దాల తరబడి అలంకరించి ఉండటం వలన, వేరే న్యాయవాదులు అవకాశాలను కోల్పోతున్నారు. ఎస్.సి, ఎస్.టి, బి.సి.న్యాయవాదులు నామినేటెడ్ పదవులలో వారిని తీసుకోకపోవటంవలన, వారికి ఇంకా ఉన్నత పదవులలోకి వెళ్లే అవకాశం కోల్పోతున్నారు. ఇక ఒకే పదవిలో దశాబ్దాల తరబడి ఉన్న, ఈ బంక వీరులు (పదవికి బంక రాసుకుని దశాబ్దాలుగా ఉండటం వలన వాడిన పదం)  ఉన్నత పదవులలోకి వెళ్తున్నారు. న్యాయవాద జనాభా నిష్పత్తిలో చూసుకుంటే, ఎస్.సి, ఎస్.టి, బి.సి. జనాభా దరిదాపుగా 80 %  కానీ వీరికి ఇంత వరకు దక్కిన పదవులు 20 % మాత్రమే. ఇక వీరికి ఇచ్చే పదవులు కూడా యే కేసులు లేని డిపార్ట్మెంట్ మాత్రమే ఇస్తారు. ఆ డిపార్ట్మెంట్ వారు వీరికి ఇచ్చే ఫీజులు కూడా చాలా తక్కువే. గత 75  సంవత్సరాలలో ఎంత మందికి సరైన పదవులు ఇచ్చారు అనే ప్రశ్నకు కూడా మనకు సరైన జవాబు రాదు. ఇక ఇలాగే కొనసాగితే ఇంకో 100  సంవత్సరాలైనా ఎస్.సి, ఎస్.టి, బి.సి న్యాయవాదుల పరిస్థితులు మారతాయని ఊహించలేము.

కేంద్ర లా మినిస్టర్ శ్రీ రవి శంకర్ ప్రసాద్ ఈ మధ్య ఒక ప్రకటన చేసారు, అది ఏమని అంటే, ఉన్నత న్యాయవ్యవస్థలో సరియైన నిష్పత్తిలో ఎస్.సి, ఎస్.టి, బి.సి. న్యాయమూర్తులను ఎన్నుకోవాలని చెప్పారు. ఒక కేంద్ర మంత్రి ఈ ప్రకటన చెయ్యాల్సి వచ్చిందంటే, ఇక పరిస్థితి ఎంత వరకు వెళ్ళింది అనేది అర్థం చేసుకోవాలి. 2020 నాటికి మొత్తం భారత దేశంలో హై కోర్టులలో ఉన్న ఉన్నత న్యాయమూర్తుల సంఖ్య 1079, వీరు కాకుండా 30  మంది సుప్రీమ్ కోర్ట్ న్యాయమూర్తులు ఉన్నారు. ఇక వీరిలో 771 శాశ్వత న్యాయమూర్తులు మరియు 308 మంది అదనపు న్యాయమూర్తులు. అయితే దరిదాపుగా 37% ఉన్నత న్యాయమూర్తుల పదవులు ఖాళీగా ఉన్నాయి, అంటే దరిదాపుట 400 ఉన్నత న్యాయమూర్తుల పదవులు ఖాళీగా ఉన్నాయి. ఇక ఈ 400 ఖాళీలను పూరించితే ఎంత మంది ఎస్.సి, ఎస్.టి, బి.సి లకు అవకాశాలు వస్తాయో వేచి చూడాలి. న్యాయమూర్తుల ఎంపికలో సామజిక న్యాయం జరగకపోయినా అసమానత్వం ఉన్నట్టే లెక్క. ఇక మహిళా న్యాయమూర్తులు కూడా తక్కువగా ఉన్నారు. ఇలా ఉంటే సామాన్య మానవుడికి న్యాయం జరగడానికి ఖచ్చితంగా చాలా ఆలస్యం అయ్యే ప్రమాదం ఉంది. ఆలస్యమైనా న్యాయం, అన్యాయంతో సమానం.  అందరు సమానమే అనే రాజ్యాంగాన్ని న్యాయవాదిగా ప్రతి రోజు చేత పట్టి, ఇక వేరే వారికీ తావు లేకుండా ఒకరే పదివిని అలంకరించి కుర్చున్నారంటే, సమానత్వంలో అసమానత్వం ఉన్నట్టే లెక్క. ఈ తప్పులను ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం సరి చేస్తుందని ఆశిద్దాం.   

✍️ రచయిత-సోల్మన్ రాజు మంచాల

హైకోర్టు న్యాయవాది

ఫోన్:  8897960016 

no image

 శివ నామస్మరణ తో కనువిందుగా

(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)

ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల్ తర్లుపాడు గ్రామంలో సోమవారంనాడు నీలకంటేస్వరస్వామి దేవాలయం లో శివ నామస్మరణ తో భక్తులతో కనువిందుగా మారింది. ఈరోజు కార్తీకసోమవారం పైగా కార్తీకపౌర్ణమి కావడంతో చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు వేకువజామున వచ్చి కార్తీకదీపాలు వెలిగించి దేవుడిని దర్శనం చేసుకొన్నారు. ఆలయ అర్చకులు థిస్. పవన్ కుమార్ శర్మ గారు దీప ధూప అభిషేకాలతో ప్రత్యేక అలంకరణ చేసి భక్తులకు అభిషేకాలు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయ ఇఓ ఈడ్గుల చెన్నకేశవ రెడ్డి గారు ఆలయ ధర్మ కర్త నేరెళ్ల శంకర్ గారి పర్యవేక్షణ లో ఘనంగా పూజలు నిర్వహించారు.

 మా హయాంలో పార్టీలకు అతీతంగా పంట నష్టం

కందుల నారాయణ రెడ్డి

(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)

తర్లుపాడు మండలంలోని తర్లుపాడు గ్రామంలో 'నివర్' తుఫాన్ వల్ల నష్టపోయిన రైతుల యెక్కదాదాపు 300  ఎకరాలలోని  శనగ  పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్లు మార్కాపురం మాజీ శాసనసభ్యులు, టీడీపీ ఇంచార్జి కందుల నారాయణ రెడ్డి గారు తెలిపారు.. అంతకు ముందు మార్కాపురం మండలం లోని చింతగుంట మరియు తిప్పాయపాలెంలలో పర్యటించిన అయన విలేకరులతో మాట్లాడుతూ.... గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పార్టీలకు అతీతంగా నియోజకవర్గంలో దాదాపు 90 కోట్ల రూపాయలు పంట నష్ట పరిహారంగా చెల్లించామని కానీ ఈ' నివర్ 'తుఫాన్ ప్రభావంతో రైతులు మిరపకు దాదాపు లక్ష రూపాయలు, పత్తి పంటకు 50వేలు, మినుము పంటకు 40వేల రూపాయలు పెట్టుబడి పెట్టారని తెలిపారు.  కానీ ఇప్పటివరకు పంట నష్ట పరిహార అంచనాకు ఏ అధికారులు గ్రామాలలో క్షేత్ర స్థాయిలో పర్యటించలేదు అని వెంటనే అధికారులు స్పందించి వివిధ పంటల నష్ట పరిహార అంచనాలు తయారు చేసి మిరప పంటకు ఎకరాకు  50వేలు, పత్తి, మినుము మరియు శనగపంటలకు 30 వేలు తక్షణమే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసారు. లేనిచో  సంబంధిత ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లను రైతుల ఆధ్వర్యంలో ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం  మండల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..

 పంట నష్టాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

రైతులకు బాసటగా ఉంటానని హామీ

(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)

    నివర్  తుఫాన్ కారణంగా   ఆ కాలంలో కురిసిన వర్షాలకు నష్టపోయిన  పంటపొలాలను మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే   కుందూరు నాగార్జున రెడ్డి,  మండలంలోని  సీత నాగులవరం గ్రామంలో  పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పంట నష్టపోయిన   రైతులను ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన రైతులు అందరూ వి ఏ ఏ ల   ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. నీవర్ తుఫాన్ కారణంగా ప్రకాశం జిల్లాలో అధికంగా పంటలు నష్టపోయామని, రాష్ట్ర ప్రభుత్వం వారిని రైతులను అన్ని విధాల చర్యలు తీసుకుంటుందన్నారు.
అనంతరం వ్యవసాయ అధికారి కె. చంద్రశేఖర రావును   మండలంలోని అన్ని గ్రామాలలో దెబ్బతిన్న పంట పొలాలను అంచనా వేయాలని సూచించారు. అంచనా వేసిన నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తే, పంట నష్ట పరిహారం వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం     కల్లా లలో  ఆరబోసిన మిరప కాయలను పరిశీలించారు. అకాల వర్షం కారణంగా తడిసిన మిరపకాయల వల్ల చాలా నష్టం వాటిల్లిందని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని, ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఈయన వెంట వ్యవసాయ అధికారి కె. చంద్రశేఖర రావు తర్లుపాడు మాజీ సర్పంచ్ సూరెడ్డి. సుబ్బారెడ్డి, వి ఏ ఏ లు, పార్టీ నాయకులు ఉన్నారు.

 

 గురు నానక్ జయంతిసంధర్బంగా...

వేలాది మందికి అన్నదానం

(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)

అనంతపురం జిల్లా హిందూపురం సేవామందిర్  లింగన్న పాఠశాల దగ్గర ఈ రోజు సిక్కు సోదరులు సత్ సంగతె ఆధ్వర్యంలో   మోహిందర్ జీత్ సింగ్.పల్వీందర్ సింగ్ సంయుక్త అధ్యక్షతన గురునానక్ జయంతి ని సిక్కు సోదరులు నిర్వహించారు. కుల మత వర్గ వర్ణాలకు అతీతంగా సిక్కు సోదరులు అన్ని మతాల సామాజిక వర్గాల నాయకులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.


 

  వారి సాంప్రదాయ పండుగను అన్ని మతాల సామాజిక వర్గాల సోదరులు సహకరించి విజయవంతం చేశారు. సోదరభావాన్ని ఆచరణాత్మక రూపంలో అమలు చేస్తూ దాదాపు వేలాది మంది ప్రజలకు అన్నదానం చేశారు సేవామందిరం ప్రశాంతి మందిరo వృద్ధాశ్రమంలో కూడా అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్లుశ్రీ రాములు .ధరణీ కిషోర్ ఒకటవ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ బాల మద్దిలేటి విశిష్ట అతిథులుగా ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షులు ఉమర్ ఫారూఖ్ ఖాన్. దండోరా నాయకులు సతీష్ కుమార్. దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతు బహుజన సమాజ్ పార్టీ నాయకులు శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. 

 వేధింపులకు గురిచేస్తున్న కాలేజీ ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోండి

ప్రజా సంఘాల డిమాండ్

(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)

ఎస్డీజీఎస్ డిగ్రీ కళాశాల నందు ఫిజిక్స్ లెక్చరర్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్  పి సరస్వతి పై వేధింపులకు గురిచేస్తున్న  ఆ కళాశాల ప్రిన్సిపాల్  శ్రీనివాసులు పై చర్యలు తీసుకోవాలని కోరుతూ విద్యాశాఖ ఆర్జేడీకి ప్రజా సంఘాలు వినతి పత్రం సమర్పించాయి.  ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ ఈమె గత 20సంవత్సరాలుగా ఫిజిక్స్ లెక్చరర్ గా విధులు నిర్వహిస్తోందనీ మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నదున   ఈమెపై  ప్రిన్సిపల్ శ్రీనివాసులు గారు ఇబ్బందులకు గురి చేస్తున్నాడనీ,పలుమార్లు కులం పేరుతో దూషిస్తున్నాడని ఈమె మా దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు.
ఇది వరకే ఈ మీకు రావాల్సిన 2 ఇంక్రిమెంట్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తూ ప్రమోషన్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే విశాఖపట్నం ఉన్నతాధికారులకు సమర్పించాల్సిన పత్రాలు సకాలంలో పూర్తి చేసి ని విధించకుండా ఇబ్బందులకు గురి చేయడం భావ్యం కాదని ఇతని మీద ఎస్సీ ఎస్స్తి అట్రాసిటీ కేసు నమోదుచేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ హిందూపురం తాలూకా అధ్యక్షులు సతీష్ కుమార్,బహుజన సమాజ్ పార్టీ నాయకులు ఎం శ్రీరాములు, దళిత హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు  ఎం ఆర్ హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

వరి రైతులకు ఎకరాకురూ.30వేలు..

అరటి పంటకు ఎకరాకు50వేలు ఇవ్వాలి

సిపిఐ డిమాండ్ 

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

 మహానంది మండలం లో నివర్ తుఫాన్ వల్ల వరి. అరటిపంట. ఇతర పంటలుతో   రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వారికి ఎకరాకు వరికి 30000 అరటిపంటకు 50 వేల రూపాయలు వెంటనే ఇవ్వాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు. ఎస్. బాబా ఫక్రుద్దీన్. సిపిఐ మహానంది మండల కార్యదర్శి. ఆర్. సామేలు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి. జి. సోమన్న. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఏ. సుబ్బరాయుడు. తెలిపారు.  మహానంది మండలం లో గాజులపల్లె. తిమ్మాపురం. గ్రామాలలో నష్టపోయిన పంటలను పరిశీలించడం జరిగింది.  ఈ సందర్భంగా పై నాయకులు మాట్లాడుతూ నంద్యాల డివిజన్ పరిధిలో పలు మండలాలలో రైతులు అప్పులు చేసుకొని పంటలు వేసుకోవడం జరిగిందని తీరా పంటలు కోసుకునే సమయంలో నీ వర్ తుఫాను ఏర్పడి భారీ వర్షాల కారణంగా వేల ఎకరాలు వరి. జొన్న. మినుము. మిరప. అరటి. తీవ్రంగా నష్ట పోవడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

 పంటపొలాలు వేసుకున్న లో వేల మంది రైతులు కౌలు రైతులు ఉన్నారని వారు ఒక వైపు ముందు గుత్తా  వారు ముందే ఇచ్చి మరోవైపు పంటలు కోసం తెచ్చుకున్న అప్పుల తో తీవ్రంగా నష్టపోవడం జరిగిందని అన్నారు. ప్రభుత్వం వెంటనే ఆర్బీఐ కేంద్రాలలోనివర్ తుఫానులు వల్ల తడిసిన అన్ని రకాల పంటలను రైతుల వద్దకు వెళ్లి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో కొనుగోలు చేయాలని తెలిపారు కావున వెంటనే రాష్ట్ర ప్రభుత్వము రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని పై నాయకులు డిమాండ్ చేశారు. 

 అబ్దుల్  సలాం ఆత్మహత్యపై సిబిఐ విచారణ జరపాలంటూ... 

అబ్దుల్ సలాం న్యాయపోరాట కమిటీ ఆధ్వర్యంలో నంద్యాలలో రాస్తారోకో

రాస్తారోకోలో పాల్గొన్న నాయకులు 

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

నంద్యాల పట్టణంలో అబ్దుల్ సలాం న్యాయపోరాట కమిటీ ఆధ్వర్యంలో సోమవారం సంజీవనగర్ గేట్లో 30 నిమిషాలు రాస్తారోకో చేయడం జరిగింది. ఈ రాస్తారోకోలో అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీ రాష్ట్ర కన్వీనర్ మౌలానా ముస్తాక్ అహ్మద్, సిపిఎం పట్టణ కార్యదర్శి తోట మద్దులు, మత పెద్దలు అబ్దుల్ హాజీ, ఐయుఎంఎల్ జిల్లా కార్యదర్శి సలామ్ మౌలానా,ఇదృష్ మౌలానా, సిపిఐ జిల్లా నాయకులు బాబా ఫక్రుద్దీన్, జానో జాగో(ముస్లింల అభివృద్ది వేదిక) సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా, పిడిఎస్ యూ జిల్లా సహాయ కార్యదర్శి రఫీ, ఆవాజ్ కమిటీ నాయకులు మస్తాన్ వలి, ఎంహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు యూనిస్, ఎంఆర్ఎఫ్ డివిజన్ అధ్యక్షులు మహబూబ్ బాషా, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అబ్దుల్లా, ఎంఐఎం నియోజకవర్గ అధ్యక్షులు అక్బర్ హుస్సేన్ లు పాల్గొని మాట్లాడుతూ 

 

అబ్దుల్ సలాంకు న్యాయం జరగాలంటే సిబిఐ విచారణ జరిపించాలని,  అసెంబ్లీలో సిబిఐ విచారణ జరిపిస్తామని హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిఐ, క్రైమ్ పార్టీ పోలీసులు గంగాధర్ అండ్ క్రైమ్ టీం ను అరెస్టు చేయాలని, అలాగే వారిని ఉద్యోగాల్లో నుండి తొలగించి వారు అక్రమంగా సంపాదించిన ఆస్తులపై ఏసీబీ అధికారులతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ వేగవంతంగా జరిపించి బాధ్యులపై వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టిన అబ్దుల్ సలాం పోరాట సమితి, అనంతపురం సాజిదాబి  బాలికపై అత్యాచారం చేసి చంపిన దోషులను యావజ్జీవ శిక్ష విధించాలని పై నాయకులు డిమాండ్ చేశారు . ఈ రాస్తారోకో కార్యక్రమంలో లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక నంద్యాల నాయకులు జకీర్, ఫారీద్, సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు గౌస్, లక్ష్మణ్, సిపిఎం మండల కార్యదర్శి సద్దాం హుస్సేన్, రైతు సంఘం నాయకులు సోమన్న, ఇఫ్టూ అధ్యక్షులు ఇర్ఫాన్,  డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి హుస్సేన్ బాషా శివ, ఆవాజ్ యూత్ సద్దాం హుస్సేన్, ముస్లిం మత పెద్దలు, ఇతర ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 వినతిదారుల వినతుల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తా 

సబ్ కలెక్టర్ కల్పనా కుమారి

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

 వినతిదారుల వినతుల సమస్యలను సత్వరమే పరిష్కరించుతామని నంద్యాల సబ్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి అన్నారు. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతిదారుల నుండి  సబ్ కలెక్టర్ కల్పనా కుమారి,  సబ్ కలెక్టర్ కార్యాలయం పరిపాలనాధికారి హరినాథ్ రావు తో కలిసి వినతులను స్వీకరించారు. అనంతరం సబ్ కలెక్టర్ కల్పనా కుమారి మాట్లాడుతూ మన రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందని,  ఆ పథకాలను గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నంద్యాల డివిజన్లోని గిరిజన ప్రాంతాల సందర్శనలో భాగంగా మహానంది మండలం గాజులపల్లె ఆర్ఎస్ చేంచు కాలనీని సందర్శించడం జరిగిందని, అక్కడి గిరిజనుల యొక్క సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నామని,  వారి సమస్యలను కూడా సత్వరమే పరిష్కారం చేస్తున్నామన్నారు, ఈరోజు అందిన వినతులలో భూసమస్యలను గురించి భూములను అక్రమించుకుంటున్నారని, మాకు పాస్బుక్కులు లేవని, పాస్బుక్కులు ఇప్పించాలని, మేము దళితులము మాభూములను అగ్రకులాల వారు ఆక్రమించుకున్నారని మాకు న్యాయం చేయాలని కోరుతూ సామూహికంగా అర్జీలను సమర్పించారన్నారు. ఇండ్ల స్థలాలు కావాలని కోరుతూ కుటుంబ తగాధలకు సంబంధించి వినతులు అందాయన్నారు. ఈ రోజు దాదాపుగా 11 అర్జీలు అందినాయని ఆమె అన్నారు.

 "స్ట్రీట్ లైట్" సినిమా షూటింగ్ పూర్తి

(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో) 

మూవీ మాక్స్ బ్యానర్ సమర్పణ లో మామిడాల శ్రీనివాస్  నిర్మాణ సారథ్యంలో, విశ్వ దర్శకుడిగా, తెలుగు మరియు హిందీ భాషలలో ఒకేసారి తెరకెక్కుతున్న చిత్రం "స్ట్రీట్ లైట్". ఈ మూవీలో ప్రముఖ హిందీ నటి తాన్యా దేశాయ్ ప్రధాన పాత్ర పోషించగా మరో ఇంపార్టెంట్ రోల్ లో హీరో వినోద్ కుమార్ నటించారు. అయితే ఈ సినిమా షూటింగ్ పార్ట్ అంతా కంప్లిట్ అయినట్టు మేకర్స్ తెలిపారు.

ఈ సంధర్భంగా సినిమా నిర్మాత మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ..., కరోనా ప్రికాషన్స్ అన్ని తీసుకోని రాష్ట్ర ఆరోగ్య శాఖ నిబంధనలకు లోబడి, ఎంతో కష్టపడి ఒక భారీ స్ట్రీట్ లైట్ సెట్ వేసి, ఈ ప్యాండమిక్ టైమ్ లో కూడా కేవలం రెండు షెడ్యూల్స్ లలో 45 వర్కింగ్ రోజులలో ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేశాం అని తెలిపారు. అందుకు మాకు ఎంతగానో సహకరించిన మా యూనిట్ సభ్యులందరికి నా ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతూ, ఇటువంటి క్లిష్ట పరిస్థుతులలో వారి సహాయ సాకారాలు మరువలేనిది అని తెలిపారు. అంతేకాక డాక్టర్ పరమహంస  గారు  మా  చిత్ర నిర్మాణంలో, మరియు కథాగమనంలో తనవంతు  సహాయ సహకారాలు అందించి, మాకు అన్ని రకాలుగా అండగా నిలిచి, ఈ చిత్ర విలువల్ని మరింత పెంచడం జరిగింది అని అన్నారు.

చిత్ర దర్శకుడు విశ్వ మాట్లాడుతూ, చిత్ర నిర్మాణంలో ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించిన  మా నిర్మాత మామిడాల శ్రీనివాస్ గారికి, డాక్టర్ పరమహంస గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ..., హ్యూమన్ బిహేవియర్ ఇన్ డార్క్ నెస్... చీకటి పడ్డ తర్వాత మనుషుల  ప్రవర్తనలు ఎలా మారిపోతాయి  అన్న కోణంలో,  స్ట్రీట్ లైట్  క్రింద ఒక రాత్రి జరిగిన సంఘటనల ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది, సినిమా టాకీ పార్ట్ అంతా పూర్తి అయింది,  చాలా నేచురల్ గా చూపిస్తూనే, ప్రతి ప్రేక్షకుడిని థ్రిల్ కి గుర్తిస్తూనే, కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ ని కూడా జోడించాం మా స్ట్రీట్ లైట్ సినిమాలో అని డైరెక్టర్ విశ్వ తెలిపారు. 

 

 స్ట్రీట్ లైట్ లో నటీనటులు గా షకలక శంకర్, చిత్రం శ్రీను, ధనరాజ్, డాక్టర్ పరమహంస,  అంకిత రాజ్, వైభవ్, కావ్య రెడ్డి, బాలాజీ నాగలింగం వంటి నటీనటులు నటించగా ఈ చిత్రానికి సంగీతం యు ఎల్ వి  ప్రద్యోధన్,  డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ రవి కుమార్  నీర్ల,  మాటలు - పాటలు విష్ణుశర్మ,  ఎడిటింగ్  శివ వై ప్రసాద్. అయితే ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకి రానుంది.

 "కార్పొరేటర్"పై కన్నేసిన...

స్టార్ కమెడియన్ !!!

(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

     స్టార్ కమెడియన్ షకలక శంకర్ టైటిల్ పాత్ర పోషిస్తున్న చిత్రం 'కార్పొరేటర్'. 'సంజయ్ పూనూరి'ని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. సమీప మూవీస్-ఎయు అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఎ.పద్మనాభరెడ్డి నిర్మాతగా, డాక్టర్ ఎస్.వి.మాధురి సహ నిర్మాతగా.. రూపొందుతున్న ఈ చిత్రం రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. 

     కార్పొరేషన్ ఎలక్షన్స్ బ్యాక్ డ్రాప్ లో.. 5 పాటలు - 4 ఫైట్స్ కలిగిన రెగ్యులర్ ఫార్మట్ లోనే వినోదానికి పెద్ద పీట వేస్తూ తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అంతర్లీనంగా ఒక మంచి సందేశం ఉంటుందని, శంకర్ పెర్ఫార్మెన్స్ 'కార్పొరేటర్' చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని దర్శకుడు డాక్టర్ సంజయ్ చెబుతున్నారు.     శంకర్ సరసన సునీత పాండే-లావణ్య శర్మ- కస్తూరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ అప్పాజీ, యాక్షన్: వింగ్ చున్ అంజి, డాన్స్: సూర్యకిరణ్- వెంకట్ దీప్, ఎడిటింగ్: శివ శర్వాణి, కెమెరా: జగదీష్ కొమరి, సంగీతం: ఎం.ఎల్.పి.రాజా, సహ నిర్మాత: డాక్టర్ ఎస్.వి.మాధురి, 

నిర్మాత: ఎ.పద్మనాభరెడ్డి

కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: 

సంజయ్ పూనూరి!!!

 అందుకే గ్రీన్ టీ తీసుకోవడం ఉత్తమం

డయాబెటిస్‌కు ఇదే మేలు చేస్తుంది

People suffering from diabetes have green tea

మారుతున్న జీవన శైలీలో మనం రోగాల భారిన పడటం సహజంగా మారింది. మీ రోగాన్ని బట్టి మీ ఆహార నియమాలు, పద్దతులు మార్చుకోవాల్సివుంది. అలాంటి వారి జాబితాలో మధుమేహ గ్రస్థులు కూడా వస్తారు. డయాబెటిక్ రోగి కి వారి రక్తంలో చక్కెర స్థాయిని నిర్వహించడం, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి వారు తినే, త్రాగే వాటిని పరిగణనలోనికి తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. వారు తినే ఆహారాలు సాధారణంగా కేలరీలు తక్కువగా ఉండాలి. తక్కువ కార్బ్ ఉండాలి, కానీ పానీయాల విషయానికి వస్తే అది సున్నా లేదా చాలా తక్కువ కేలరీలను కలిగి ఉండాలి. ఈ ప్రమాణాలకు సరిగ్గా సరిపోయే పానీయం గ్రీన్ టీ. తక్కువ కేలరీలు, యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్లతో నిండిన గ్రీన్ టీ ఖచ్చితంగా ఆరోగ్యకరమైన పానీయం. డయాబెటిస్ లక్షణాలను నిర్వహించడంలో మద్దతు కుడా ఇస్తుంది. అందుకే డయాబెటిస్ రోగికి గ్రీన్ టీ ఒక అద్భుతమైన పానీయం

డయాబెటిస్ గ్రీన్ టీకి ఎందుకు మారాలి?

టైప్-2 డయాబెటిస్తో బాధపడుతున్న వ్యక్తులపై గ్రీన్ టీ ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి అనేక అధ్యయనాలు జరిగాయి. సానుకూల ఫలితాన్ని చూపించాయి. గ్రీన్ టీ, డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించగలదని, రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో కూడా సహాయపడుతుందని ఒక అద్యయనం పేర్కొంది. జపాన్ జనాభాపై జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, గ్రీన్ టీ రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. లక్షణాలను తీవ్రతరం చేయకుండా నిరోధిస్తుంది

ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని ఎలా నియంత్రిస్తుంది?

గ్రీన్ టీ ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఉపవాసం fasting గ్లూకోజ్ స్థాయిలు, ఉపవాసం ఇన్సులిన్ స్థాయిలు తగ్గుతాయి, ఇవి డయాబెటిక్ ఆరోగ్యాన్ని కొలవడానికి ఉపయోగించే రెండు ప్రాథమిక పారామితులు. గ్రీన్ టీ యొక్క ప్రయోజనాలు ప్రధానంగా పాలీఫెనాల్స్, పాలిసాకరైడ్ల యొక్క యాంటీఆక్సిడెంట్ చర్య. ఈ రెండు యాంటీఆక్సిడెంట్లు రక్తపోటు స్థాయిని నిర్వహించడానికి, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో కూడా ప్రభావవంతంగా ఉంటాయి.

ఒక రోజులో మీరు ఎంత గ్రీన్ టీ తీసుకోవచ్చు

గ్రీన్ టీ లో తక్కువ మొత్తంలో కెఫిన్ ఉంటుంది. రోజుకు 2-3 సార్లు గ్రీన్ టీ తీసుకోవచ్చు. గరిష్ట ప్రయోజనాలను పొందటానికి గ్రీన్ టీ ఎలా ఉండాలి. గరిష్ట ఆరోగ్య ప్రయోజనాల కోసం గ్రీన్ టీ లో చక్కెరను జోడించవద్దు. కొంత  నిమ్మరసం లేదా  కొన్ని పుదీనా ఆకులను జోడించవచ్చు. గరిష్ట ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి టీ సంచులకు బదులు లూజ్ గా ఉండే గ్రీన్ టీ ఆకులను ఎంచుకోండి.

✍️ రచయిత-మహమ్మద్ అజ్గర్ అలీ

రాజనీతి తత్వ శాస్త్ర విశ్రాంత అధ్యాపకులు

సెల్ నెం-94915-01910

అవకాశమొచ్చిన ప్రతిసారి దేశానికి ఎంతో చేశారు...

స్వాతంత్రానంతర భారత దేశంలో ముస్లింల పాత్ర

Role of Indian Muslims in the Post-Independence Era

భిన్నత్వంలో ఏకత్వ స్పూర్తిని ఇచ్చింది మన భారత భూమి. అందుకే ప్రతి భారతీయుడు ప్రపంచం గర్వించేలా ఎదిగారు. భారతీయులుగా ఈ దేశంలోని ముస్లింలు కూడా ఈ దేశం కోసం ఎంతో ఇచ్చారో. ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చారు. దేశానికి సేవ చేయడమే నిజమైన దేశభక్తి. తోటి భారతీయుల దేశభక్తిని ప్రశ్నించడం కాదు దేశభక్తి. ఇదే ఆచరణలో చూపారు ముస్లిం ప్రముఖులు. ముస్లింలే కాదు ప్రతి భారతీయుడు ఇలాంటి సేవల ద్వారానే తమ దేశభక్తిని చాటుకొన్నారు. ఈ దేశంలో భారతగడ్డపై పుట్టిన ముస్లింల పాత్రపై లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు భారతీయ ముస్లిం సమాజం సిద్దంగా ఉంది. ఈ దేశానికి భారతదేశ ముస్లింలు ఏం ఇచ్చారో...ఎలాంటి సేవ చేశారు...ఎలాంటి త్యాగం చేశారో..ఎలాంటి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టారో ఓ సారి స్మరించుకొందాం.

ముస్లింలు ఈ దేశాన్ని  సుమారు 4౦౦ సంవత్సరాలు పరిపాలించారు. ఈ దేశంలో వారు అనేక సామాజిక, రాజకీయ, ఆర్ధిక సంస్కరణలను ప్రవేశ పెట్టారు. రూపాయి, పైసా, గ్రాండ్ ట్రంక్ రోడ్ నిర్మాణం చేసిన షేర్ షా సూరిని, ఆర్ధిక, పన్ను సంస్కరణలను ప్రవేశపెట్టి భారత దేశ అర్దికాభివృద్ది కి తోడ్పడిన ఢిల్లీ సల్తానత్, తొలిసారిగా యుద్దంలో రాకెట్లను ప్రవేశపెట్టిన టిప్పు సుల్తాన్ ను భారతీయులు ఎన్నడు మరువలేరు. కళా రంగంలో తాజ్ మహల్ , కుతుబ్ మినార్, మక్కా మస్జిద్ వంటి నిర్మాణాలు చేసిన  వీరి  సేవలు  చిరస్మరణియాలు.

టిపుల్ సుల్లాన్

స్వాతంత్య్రానికి పూర్వం జమీందారులు, నవాబులు,పాలకులుగా ఉన్న వీరు నేడు కడు దమనీయ పరిస్థితిలలో తమ జీవనం వెలుబుచ్చు చున్నారు. భారత జనాభాలో ముస్లింలు 15% ఉన్నారు. కాని ముస్లింలు  ఆర్ధిక, సామాజిక విద్యా రంగాలలో ఎస్.సి. కన్నా వెనుకబడి ఉన్నారు. సచార్ కమిటి తన నివేదికలో ఈ విషయాన్ని స్పష్టం చేసినది.

స్వాతంత్య్రానంతర భారత దేశం లో ముస్లింలు అనేక రంగాలో తమదైన ముద్రను వేశారు. దేశ రాజకీయ, కళా, క్రీడల, విజ్ఞాన శాస్త్ర, సైనిక, న్యాయ, పరిశ్రమల రంగాలలో రాణించి ఈ దేశ కీర్తి ప్రతిష్టలను పెంపొందించినారు.

మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్

రాజకీయాలు

ఇప్పటి వరకు ముగ్గురు ముస్లింలు భారత రాష్ట్రపతులుగా పనిచేశారు: జాకీర్ హుస్సేన్, ముహమ్మద్ హిదయతుల్లా(తాత్కాలిక రాష్ట్రపతి), ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, ఏపీజే అబ్దుల్ కలాం, ముగ్గురు వైస్ ప్రెసిడెంట్లుగా పనిచేశారు. వారు జాకీర్ హుస్సేన్, ముహమ్మద్ హిదయతుల్లా, హమీద్ అన్సారీ.

జస్టిస్ మహమ్మద్ హిందాయతుల్లా

భారత దేశ మొదటి విద్యా శాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్, కమ్యూనికేషన్ల శాఖ  మొదటి మంత్రిగా  రఫీ అహ్మద్ కిద్వాయ్  పనిచేసారు.

కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో అనేకమంది ముఖ్యమంత్రులు, గవర్నర్లుగా,  కేబినెట్ మంత్రులుగా ఉన్నారు. 

న్యాయవ్యవస్థ

ముహమ్మద్ హిదయతుల్లాహ్, మీర్జా హమీదుల్లాహ్ బేగ్, అజీజ్ ముసాబిర్ అహ్మాది, ఆల్తామాస్ కబీర్ భారత ప్రధాన న్యాయమూర్తులుగా  పనిచేశారు. అనేకమంది ముస్లింలు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినారు.

అనేకమంది ముస్లింలు దిగువ కోర్టులలో న్యాయమూర్తులుగా, వివిధ స్థాయిలలో ప్రముఖ న్యాయవాదులుగా ఉన్నారు.

 శాస్త్రీయ...సాంకేతిక విజ్ఞానాలు:

డాక్టర్ సయ్యద్ జహూర్ ఖాసిమ్(DR.Z.A.Khasim, ఒక సముద్ర జీవశాస్త్రవేత్త, ఆయన 1982 లో అంటార్కిటికాకు మొదటి భారతీయ యాత్రకు నాయకత్వం వహించాడు. అతని సేవలకు మెచ్చి ప్రభుత్వం పద్మశ్రీ,, పద్మభూషణ్ బిరుదులతో సత్కరించినది.  

బర్డ్ మాన్ అఫ్ ఇండియా గా పిలువబడే సలీం  మోజుద్దీన్ అబ్దుల్ అలీ, బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ వెనుక కీలకమైన వ్యక్తి, ప్రముఖ పక్షి శాస్త్రజ్ఞుడు. ప్రకృతివేత్త  (ornithologist and naturist). అతను భరత్పూర్ బర్డ్ సంరక్షాలయమును   సృష్టించాడు. సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్కు స్థాపనలో ప్రముఖ పాత్ర వహించాడు. పద్మభూషణ్ మరియు పద్మ విభూషణ్ పురస్కారాల గ్రహీత.

భారత్ రత్నా డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం, భారతదేశం యొక్క క్షిపణి మనిషిగా (MISSILE MAN)పేరుగాంచాడు. ఇస్రో అధ్యక్షుడిగా పనిచేసాడు. భారతదేశం యొక్క బాలిస్టిక్ క్షిపణి. అణు కార్యక్రమాల నిర్వహణ వెనుక ప్రముఖ పాత్ర వహించాడు.   

డాక్టర్ రఫిఉద్దిన్ అహ్మద్  'ఫాదర్ అఫ్ ఇండియన్  డెంటిస్ట్రీ ' గా పేరుగాంచాడు 

సైన్యంMILITARY:

భారత సైనిక దళంలో ముస్లింలు అంత్యంత పరాక్రంను, శౌర్యమును ప్రదర్శించారు. 

డోగ్రా రెజిమెంట్కు చెందిన 35 సంవత్సరాల బ్రిగేడియర్ మొహమ్మద్ ఉస్మాన్ భారతదేశపు-పాకిస్తాన్ యుద్ధం 1947-48లో యుద్ధం లో మరణానంతరం రెండవ గొప్ప అత్యున్నత పురస్కారం మహా వీర చక్ర పొందాడు. అతను జీవించి ఉంటె భారతదేశానికి  మొట్టమొదటి ముస్లిం చీఫ్ ఆర్మీ స్టాఫ్ అయి ఉండేవాడు. 

1965 భారతదేశం-పాకిస్తాన్ యుద్ధంలో గ్రెనెడియర్ రెజిమెంట్ యొక్క హవాల్దార్ అబ్దుల్ హమీద్ ఒంటి చేతితో ఆరు పాకిస్తానీ ట్యాంకులు ద్వంసం చేసినాడు. అబ్దుల్ హమీద్ మరణానంతరం భారతదేశం యొక్క అత్యున్నత సైనిక గౌరవం, పరం వీర చక్ర పొందినాడు. 

రాజపుత్రా రైఫిల్స్ కు చెందిన కెప్టెన్ హనీఫుద్దిన్ 1999 లో కార్గిల్ వివాదంలో మరణానంతరం భారతదేశం యొక్క మూడవ అత్యున్నత సైనిక గౌరవం వీర్ చక్ర, పొందినాడు మరియు అతను చనిపోయిన ప్రాంతాన్ని సబ్ సెక్టార్ హనీఫ్ గా పిలవటం జరుగుతుంది. మార్చారు.

ప్రముఖ పారిశ్రామికవేత అజీమ్ ప్రేంజీ

పరిశ్రములు INDUSTRY:

భారతీయ ముస్లింలు పెద్ద వ్యాపార సంస్థలను కలిగి ఉన్నారు. విప్రో, సిప్లా,  రెడ్ టేప్, వక్హార్డ్ట్, అజ్మల్, హమ్దార్డ్, హిమాలయ, మోంకిని వంటి సంస్థలను స్థాపించారు. అసంఘటిత రంగం అయిన వస్త్రాలు, తాళాలు, తోలు,వ్యవసాయ  రంగాలలో ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. జెట్ ఏవియేషన్ రంగం నుండి  సాధారణ కార్మికులు పనిచేసే వివిధ పరిశ్రమలలో  లెక్కలేనన్ని ముస్లిం ఉద్యోగులు ఉన్నారు.  

ప్రముఖ గాయకుడు మహమ్మద్ రఫీ

కళ...సంస్కృతి ART AND CULTURE:

ఆధునిక భారతదేశం యొక్క అత్యంత గుర్తింపు పొందిన చిత్ర కళాకారుడు ఎం.ఎఫ్.హుస్సేన్. భారతీయ సంగీతం, వాణిజ్య కళలకు ముస్లింల సహకారం మరువలేనిది. రఫీ, శంషాద్ బేగం వంటి గాయకులు, జాకీర్ హుస్సేన్ మరియు ఉస్తాద్ అంజాద్ అలీ ఖాన్ వంటి కళాకారులు, సహీర్ లుధియాన్వి, కైఫీ అజ్మి వంటి కవులు, దిలీప్ కుమార్, నసీరుద్దిన్ షా వంటి నటులు సరోజ్ ఖాన్, ఫరా ఖాన్ వంటి నృత్య దర్శకులు, ఎంతో పేరుగాంచారు.  ముస్లిం కళాకారులు లేని భారతదేశం ఊహించలేము. భారతదేశ సాహిత్యంలో  ఉర్దూ భాష స్థానంను విస్మరించ లేము.

క్రీడలు SPORTS:

సయ్యద్ కిర్మాణి, ముహమ్మద్ అజారుద్దీన్, పఠాన్ సోదరులు. జహీర్ ఖాన్ వంటి క్రికెటర్లు, సానియా మీర్జా వంటి టెన్నిస్ క్రీడాకారిణి, జాఫర్ ఇక్బాల్ వంటి హాకీ క్రీడాకారుడు, ముహమ్మద్ అనాస్ వంటి అదేలటిక్ వివిధ జాతీయ, అంతర్జాతీయ పోటీలలో భారత దేశానికి బంగారు, వెండి మరియు కాంస్య పతకాలు సాధించిన ముస్లిం క్రీడాకారులందరూ ఎందరో కలరు. 

భారతదేశంలో నిజమైన ఆధ్యాత్మిక అభివృద్ధికి దోహదం చేసినవారు  ముస్లింలు. వాస్తవానికి, అజ్ఞానం మరియు ఉదాసీనత అగాధం నుండి సమాజాన్ని వెలుగులోనికి తేవడంలో సూఫీ గురువుల పాత్ర ను మరువలేము. సామాజికం వెనుకబడిన వర్గాల వారిలో చైతన్యం కల్పించినవారు సూఫీలు. భారత సామాజిక వ్యవస్థపై పై సూఫీల ప్రభావం ఎంతైనా ఉంది.

జమాత్-ఎ-ఇస్లామి హింద్, జామిత్-ఉలేమా హింద్ వంటి సంస్థలు  సాంఘిక న్యాయం మరియు సామరస్యాన్ని సాధించటానికి నిరంతరం కృషి చేస్తున్నాయి. ముస్లింలు వారి దాతృత్వంలో, అవసరాలకు సహాయపడే వారి నిస్వార్థమైన నిబద్ధతకు పేరుగాంచారు. వందలాది లక్షల మంది ముస్లింలు ప్రతి సంవత్సరం జకాత్ రూపంలో ఆర్దిక న్యాయం తో తోటి భారతీయులను పేదరికం నుండి తొలగించి, మంచి జీవితాన్ని గడపడానికి అవకాశం కల్పించారు.

ఇటీవలి కేరళ వరదలు నేపథ్యంలో ముస్లింలు భారి ఎతున్న విరాళాలు  ప్రకటించారు. వడ్డీ రహిత ఆర్థిక సంస్థల/ ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు ఆర్థిక దోపిడీ బాధితులకు ఒక వరంగా మారింది. మద్యపానం, నగ్నత్వం, వ్యభిచారం, స్వలింగసంపర్కం, ఆడ భ్రూణహత్య, కట్నం మరియు మతతత్వం వంటి సాంఘిక దుష్క్రియలకు వ్యతిరేకంగా ముస్లింలు పోరాడారు. ఈ దేశం యొక్క ప్రఖ్యాత మిశ్రమ సంస్కృతిని(గంగా జమునా తెహ్జీబ్)ను కాపాడారు. లక్షలాది ముస్లింలకు భారతదేశం నిలయం. జాతీయ కవి ఇక్బాల్ “సారే జాహా సే అచ్చా హిందూస్తా హామారా”  అని భారత దేశంను కొనియాడాడు. 

✍️ రచయిత-సల్మాన్ హైదర్

జనని మెడికల్ ఆధ్వర్యంలో..

ఉచిత వైద్య శిబిరం

(జానోజాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

జనని మెడికల్ ఆధ్వర్యంలో కెడం ప్రసాద్ హాస్పిటల్ వారి సహకారంతో ఆదివారంనాడు గడివేముల గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరంను గడివేయుల సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ టి.సుబ్బరామిరెడ్డి, పి హెచ్ సి డాక్టర్ శ్రీమతి ప్రారంభించారు. ఈ శిబిరం నందు సేవలు అందించుటకు వచ్చినా వైద్య బృందంలో  ప్రముఖ స్త్రీ సంబంధిత వ్యాధి నిపుణులు డాక్టర్ హిందుమతి,  షుగర్ వ్యాధి నిపుణులు దుర్గాప్రసాద్ ను శాలువాతో సత్కరించారు,
ఈ సందర్భంగా ఎస్సై టి.సుబ్బరామిరెడ్డి  మాట్లాడుతూ ఈ శిబిరం వైద్య సేవలను గడివేముల, పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పి. హెచ్. సి డాక్టర్ సృజన మాట్లాడుతూ పరిసర ప్రాంతాల్లో గర్భిణీలు స్త్రీ సంబంధిత వ్యాధి గలవారు అలాగే ఆడవారికి రక్తహీనత లోపం గలవారు మొదలగు వాటికి ఉచితంగా చూస్తున్నారు కాబట్టి అందరూ ఈ క్యాంపు ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే ఇంకా ఎవరైనా ఉంటె పి. హెచ్. సి లో నన్ను సంప్రదించాలని సలహా ఇచ్చారు. దీనికి పి. హెచ్. సి లో మందులు ఉన్నాయని తెలిపారు, అలాగే డాక్టర్ హిందుమతీ, డాక్టర్ దుర్గా గారు మాట్లాడుతూ నంద్యాల లో గల మా హాస్పిటల్ నందు మీ సమస్యలకు సంపాదిస్తే మేము అతి తక్కువ ఖర్చుతో నార్మల్ డెలివరీ సిజరింగ్ లాపరోస్కోపీ మరియు సంతానలేమి సమస్యలకు అలాగే షుగర్ వ్యాధి విష జ్వరాలకు వైద్యం అందిస్తామని తెలిపారు.
జనని మెడికల్ నిర్వాహకులు రాధాకృష్ణ గారు మాట్లాడుతూ ఈ క్యాంపు నందు ఉచితంగా సుమారు గా 150 ప్రజలకు షుగర్ టెస్ట్, మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరిగిందని తెలిపారు అలాగే  విచ్చేసిన డాక్టర్లకు అతిథులకు తదితరులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెసర వాయి శ్రీకాంత్ రెడ్డి, గడివేముల కృష్ణయ్య ఇంద్రహయగ్రీవాచారిలు, శ్రీధర్ చైతన్య కుమార్, హెల్త్ అడ్వైజర్ రెహ్మాన్, శ్రీరామ్ ల్యాబ్ ఐశ్వర్య తదితరులు పాల్గొన్నారు.