మీ పెద్దవాళ్లను ఓ కంట కనిపెట్టండి
వారికి రక్షణగా నిలవండి...?
వృద్ధులలో మానసిక గందరగోళానికి కారణాలు ఏమిటి...?
వారికి తరుచూ నీరందించాలిన ఇంట్లోని పెద్దవారిని ఓ కంటకనిపెడుతూ ఉండాలి. ఎందుకంటే వారి బతికుండగా ఏమీ చేయలేక పోయామన్న బాధను వారి చనిపోయాక వ్యక్తంచేస్తే లాభం ఉండదు. వయస్సు పై బడిన వారికి మరీ ముఖ్యంగా 60 ఏళ్లు దాటిన వారికి నీరు సమయానికి ఇచ్చి వారిని కాపాడుకోవాలి. ఎందుకంటే అది ఓ సారి తెలుసుకొందాం.

60 ఏళ్లు పైబడిన తరువాత పెద్దగా దాహం అనుభూతి పొందరు. సాధారణంగా ద్రవాలు తాగడం మానేస్తారు. ద్రవాలు తాగమని గుర్తు చేయడానికి ఎవరూ లేనప్పుడు వారు త్వరగా డీహైడ్రేట్ అవుతారు. నిర్జలీకరణం/డి హైడ్రేషన్  తీవ్రంగా ఉంటుంది. అది మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది ఆకస్మిక మానసిక గందరగోళం, రక్తపోటు తగ్గడం, పెరిగిన హృదయ స్పందన, ఆంజినా (ఛాతీ నొప్పి), కోమా మరియు మరణానికి కూడా కారణం కావచ్చు.

ద్రవాలు తాగడం మర్చిపోయే ఈ అలవాటు 60 ఏళ్ళ వయసులో మొదలవుతుంది. మన శరీరంలో 50% పైగా నీరు ఉంటుంది. 60 ఏళ్లు పైబడిన వారికి తక్కువ నీటి నిల్వ ఉంది. ఇది సహజ వృద్ధాప్య ప్రక్రియలో భాగం. వారు నిర్జలీకరణాని dehydrated కి గురైనప్పటికీ, నీరు తాగాలని అనిపించదు ఎందుకంటే వారి అంతర్గత సమతుల్య విధానాలు బాగా పనిచేయవు. 60 ఏళ్లు పైబడిన వారు సులభంగా డీహైడ్రేట్ అవుతారు ఎందుకంటే వారు చిన్న మొత్తం లో నీరు త్రాగటమే కాదు శరీరంలో నీటి కొరతను ఫీల్ అవ్వరు. 60 ఏళ్లు పైబడిన వారు ఆరోగ్యంగా కనిపించినప్పటికీ, ప్రతిచర్యలు మరియు రసాయన చర్యల పనితీరు వలన వారి శరీరమంతా దెబ్బతింటుంది.

నివారణ మార్గాలు::
  1) ద్రవాలు తాగే అలవాటును పొందండి. 
ద్రవాలలో నీరు, రసాలు, టీలు, కొబ్బరి నీరు, పాలు, సూప్‌లు, పుచ్చకాయ, పీచెస్, పైనాపిల్ వంటి నీరు అధికంగా ఉండే పండ్లు తీసుకోవాలి. ఆరెంజ్, టాన్జేరిన్ tangerine కూడా పనిచేస్తాయి. ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రతి రెండు గంటలకు, 60పై బడినవారు తప్పనిసరిగా కొంత ద్రవాన్ని తాగాలి. ఇది గుర్తుంచుకోవాలి.

2) కుటుంబ సభ్యులు 60 ఏళ్లు పైబడిన వారికి నిరంతరం ద్రవాలను అందిoచాలి. వారిని గమనించాలి. వారు ద్రవాలను తిరస్కరిస్తుంటే, తరచుగా చిరాకు, ఊపిరి ఆడకపోవటం లేదా శ్రద్ధ లేకపోవడాన్ని ప్రదర్శిస్తుంటే (lack of attention) ఇవి నిర్జలీకరణం/డి హైడ్రేషన్  యొక్క పునరావృత recurrent లక్షణాలు అని గ్రహించాలి మరియు వారికీ తగినంతగా నీరు అందించండి.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: