ఎమ్మెల్యే ధర్మశ్రీలో మరో కోణం.. 

సినిమాలో నటిస్తున్న వైనం!
చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ స్వతహాగా కళాకారుడు
చిన్నప్పటి నుంచి నాటికల్లో నటించిన చరిత్ర
తాజాగా 'మోదకొండమ్మ' సినిమాలో వేషం 

విశాఖ జిల్లా చోడవరం వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ స్వతహాగా కళాకారుడు కూడా. చిన్న వయసు నుంచి నటనపై ఆయనకు ఆసక్తి ఉంది. తన స్వగ్రామం కేజే పురంలో పలు నాటకాల్లో నటించి జనాల మన్ననలను పొందారు. 2004లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు హైదరాబాదులో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో అన్నమయ్య పాత్రను పోషించి... అప్పటి సీఎం రాజశేఖరరెడ్డి ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత కూడా ఎమ్మెల్యేగా ప్రజా కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నప్పటికీ... తనలోని కళాపోషణను ఆయన రుజువుచేసుకుంటున్నారు. తాజాగా 'మోదకొండమ్మ' అనే సినిమాలో ధర్మశ్రీ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గాజువాకలో జరుగుతోంది. గిరిజనులు ఆరాధించే దైవం మోదకొండమ్మ. ఈ చిత్రంలో పరమశివుడికి, ఆయన తపస్సును భంగం చేయడానికి వచ్చిన మాంత్రికునికి మధ్య సన్నివేశాలను తాజాగా చిత్రీకరించారు. ఈ చిత్రంలో శివుడి పాత్రను ధర్మశ్రీ పోషిస్తున్నారు.
ఇస్లాంలో తహజ్జుద్ ప్రార్ధన ...పవిత్ర ఖురాన్...హదీసుల వెలుగులో దాని ప్రాముఖ్యత https://www.jaanojaago.com/2020/07/blog-post_655.html
ధమ్...మారే...ధమ్...ఫ్యాషన్ గా మారి యువతను కబలిస్తున్న ధూమపానం https://www.jaanojaago.com/2020/07/blog-post_230.html
పవిత్రమైన పది రోజులు ప్రారంభం...ఈ రోజుల్లో మంచి పని అల్లాహ్ కు ఎంతో ప్రీతి-ఆగస్టు 1న బక్రీదు పండుగ https://www.jaanojaago.com/2020/07/1_22.html
శుభారంభమేనా...కరోనాపై ఆ వ్యాక్సిన్ విజయంసాధిస్తోందా....? నిమ్స్ నుంచి వాలంటీర్ల డిశ్చార్జ్ https://www.jaanojaago.com/2020/07/blog-post_370.html
కొత్త కొత్త విషయాలను తెలుసుకోవాలని ఉందా..అయితే  www.jaanojaago.com లోకి విజిట్ చేయండి...కొత్త కొత్త విషయాలను తెలుసుకోండి. 1, 2, 3, 4,...ఇలా పేజీలు తిరగేయండి. కొత్త కొత్త కథనాలు చదవండి.......................
Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: