కుప్పకూలిన మార్కెట్లు
కరోనా కేసుల ప్రభావంతోనే


(జానోజాగో వెబ్ న్యూస్-బిజినెస్ ప్రతినిధి)
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో పాటు అంతర్జాతీయంగా ఎలాంటి సానుకూలతలు లేకపోవడం దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గుచూపడంతో... సూచీలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 660 పాయింట్లు కోల్పోయి 36,033కి పడిపోయింది. నిఫ్టీ 195 పాయింట్లు నష్టపోయి 10,607కు దిగజారింది. ఈరోజు అన్ని సూచీలు నష్టాల్లోనే ముగిశాయి.  

బీఎస్ఈ సెన్సెక్స్ లో కేవలం టైటాన్ కంపెనీ (0.93%), భారతి ఎయిల్ టెల్ (0.21%), బజాజ్ ఆటో (0.02%) మాత్రమే లాభాల్లో ముగిశాయి.

ఇండస్ ఇండ్ బ్యాంక్ (-5.49%), యాక్సిస్ బ్యాంక్ (-4.88%), మారుతి సుజుకి (-3.59%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-3.37%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-3.17%) టాప్ గెయినర్లుగా ఉన్నాయి.

కొత్త కొత్త విషయాలను తెలుసుకోవాలని ఉందా..అయితే  www.jaanojaago.com లోకి విజిట్ చేయండి...కొత్త కొత్త విషయాలను తెలుసుకోండి. 1, 2, 3, 4,...ఇలా పేజీలు తిరగేయండి. కొత్త కొత్త కథనాలు చదవండి
Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: