వక్ఫ్ పరిరక్షణ కోసం...
ప్రజా భాగస్వామ్య పోరాటాలు జరగాలి
అపుడే వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ
ఇపుడు జరుగుతన్నవి వ్యక్తిగత పోరాటాలే
ఆ పంథా మారాలి
ఇదే మా సంఘం ఆలోచన
జానోజాగో సంఘం జాతీయ అధ్యక్షులు సయ్యద్ నిసార్ అహ్మద్


సయ్యద్ నిసార్ అహ్మద్

సెల్ నెం-780 101 9343

వక్ఫ్ ఆస్తులు పరిరక్షణ మనం తరుచూ వినేమాట. వక్ఫ్ పరిరక్షణ చేస్తామని అన్ని పార్టీలు ఎన్నికలకు ముందు ప్రమాణం చేయడం పరిపాటిగా మారింది. వక్ఫ్ ఆస్తుల అన్యాక్రాంతం యథావిధిగా సాగుతుంది. ఈ తరుణంలో వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ సాధ్యమా...? ఒకవేళ సాధ్యమే అయితే వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ ఇంతవరకు ఎందుకు జరగలేదు...? ఇది అందరిలో కలిగే ప్రశ్న. ఈ పరిస్థితుల్లో వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ సాధ్యమా అంటే ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమిస్తే అది ముమ్మాటికి సాధ్యమేనని చెబుతున్నారు జానోజాగో(ముస్లింల అభివృద్ది వేదిక) సంఘం జాతీయ అధ్యక్షులు సయ్యద్ నిసార్ అహ్మద్. ఇపుడు వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒకేసారి, ఒక పిలుపుతో ఒకే సందర్భంలో ఉద్యమాలు జరగడంలేదు. ఇదే వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ చేయలేకపోవడానికి ప్రధాన మైతే, ఎక్కడైతే సమస్య ఉత్పన్నమవుతుంతో అక్కడ మాత్రమే ఆ ఆస్తుల కోసం వ్యక్తిగతంగా కొందరి పోరాటం సాగుతుంది. ఇలా పోరాడుతున్న వారిని కూడా ప్రశంసించాల్సిందే. కానీ వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ అని ఒక్కచోట పోరాడితే సరిపోదు. వక్ఫ్ ఆస్తులను కాపాడాలి అని మొరపెట్టుకొనే కంటే ఆ ఆస్తుల పరిరక్షణ కోసం పట్టిష్టమైన ఓ అధికార వ్యవస్థ రూపొందాలని, వాటిని వెంటనే అమలు చేయాలని కేంద్ర, రాష్ట్రాలపై ‎ఒత్తిడి పెంచే పోరాటాలు అవసరమని సయ్యద్ నిసార్ అహ్మద్ పేర్కొంటున్నారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం ఎలాంటి ఉద్యమాలు అవసరమో ‘‘జానోజాగో వెబ్ న్యూస్’’ తో ఆయన తన అభిప్రాయాలను పంచుకొన్నారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రశ్న: వక్ఫ్ ఆస్తులు యథేచ్చగా అన్యాక్రాంతమవుతున్న తరుణంలో ఎలా వాటిని కాపాడగలమని మీరు భావిస్తున్నారు...?
జ:ముస్లింల సమాజ ఉన్నతి కోసం ఉద్యమిద్దాం అంటనే నలుగురు కూర్చొని మనం వక్ఫ్ ఆస్తులపై పోరాడుదాం అన్న మాటలు నేనే తరుచుగా వింటూ వస్తున్నాను. కానీ నేను ఇక్కడ చెప్పేది ఒక్కటే. మనం పోరాడుదాం అనే కంటే మన ముస్లిం సోదరులందరినీ కూడగట్టి పోరాడుదాం అనే వారు ముందుకు రావాలి. అందుకోసం ప్రయత్నించేవారు ముందుకు రావాలి. అలాంటి వారి అన్వేషణ మా జానోజాగో సంఘం చేస్తోంది. నేను స్పష్టంగా చెప్పేది ఒక్కటే. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం నేను, ఇంకోకరో కలసి పోరాడితే ప్రతి ఫలం రాదు. యావత్తు ముస్లిం సమాజాన్ని చైతన్యం చేసి వారి భాగస్వామ్యంతో పోరాడాలి. అలాంటి పోరాటంతోనే వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం ఓ ప్రభుత్వ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ ప్రజా భాగస్వామ్య పోరాటం కోసమే జానోజాగో సంఘం బాటలు వేస్తోంది.

ప్రశ్న:వక్ప్ ఆస్తుల  పరిరక్షణ ఉద్యమంలో ముస్లిం ప్రజానికం ఎందుకు భాగస్వామ్యం కావడంలేదంటారు....?
జ: వక్ఫ్ ఆస్తుల పరిరక్షణలో ముస్లిం ప్రజానికం భాగస్వామ్యం అవ్వడంలేదు అనడం సరికాదు. కాకపోతే ముస్లిం ప్రజల భాగస్వామ్యమున్న ఉద్యమం రావాలని మాత్రం కచ్చితంగా చెబుతాను. ఇక్కడ నాయకత్వం వహించే వారిలో కూడా లోపముంది. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ తమ వల్లే, తమ సంఘం వల్లే అన్న భావనకు వెళ్లి కొందరు సంఘం సభ్యులతో కలిసి వినతి పత్రాలు, అపుడపుడు ధర్నాలు చేయడంతో ఇది మీకు సంబంధంలేని ఉద్యమం అన్న భావన ముస్లిం ప్రజానికంలో కలిగేందుకు కొందరి చర్యలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక్కటి ప్రజలకు స్పష్టంగా చెప్పాలి. వక్ప్ కింద నాటి మన పూర్వీకులు తమ ఆస్తులను పెట్టారంటే దేనికోసమే అన్నది కూడా నేటి ముస్లిం సమాజానికి తెలియదు. పేద ముస్లింల కోసం, వితంతువులు, నిరాశ్రయులు, అనాథలు, ఆర్థికంగా లేని పేద ముస్లింల కోసం నాటి మన ముస్లిం ధనవంతులు తమ ఆస్తులను అల్లాహ్ పేరుతో వక్ఫ్ చేశారు. అంటే వక్ప్ ఆస్తుల పరిరక్షణ బాధ్యత ముమ్మాటికి యావత్తు ముస్లిం ప్రజానికంపై ఉంది. అదే వాస్తవం ముస్లిం సమాజంలోకి తీసుకెళ్లాలి. ఇది మీ ఆస్తి, దీని సంపాదన మీ హక్కు అన్న భావన యావత్తు ముస్లిం ప్రజానికంలో కలిగించాలి. అపుడు వక్ప్ ఆస్తుల పరిరక్షణ ఉద్యమంలో ముస్లిం సమాజం మొత్తం ఎందుకు భాగస్వామ్యం కాదో చెప్పండి. ఆ పనియే జానోజాగో సంఘం చేస్తోంది. ఇలా వక్ప్ పరిరక్షణ కోసం ముస్లింల భాగస్వామ్యంతో కూడిన ఉద్యమం వచ్చేందుకు కొంత ఆలస్యం కావచ్చు. కానీ జానోజాగో ఈ తరహా ఉద్యమం పక్కా తీసుకొస్తుంది. ఈ ఆలస్యమయ్యే క్రమంలో వక్ప్ ఆస్తులు ఇంకా అన్యాక్రాంతమవుతాయి కదా అన్నది వాస్తవమే. అందుకోసమే వక్ప్ ఆస్తుల పరిరక్షణ కోసం పోరాడుతూనే వాటి రక్షణ కోసం పకడ్భందీ అధికార వ్యవస్థ ప్రభుత్వాలు రూపొందించేలా ప్రజా భాగస్వామ్య ఉద్యమాలకు ప్రయత్నం సాగాలి. అదే జానోజాగో సంఘం చేస్తోంది.ప్రశ్న:ఇంటి దొంగల వల్లే వక్ఫ్ ఆస్తులు అన్యాకాంత్రమవుతున్నాయన్న విమర్శకు మీ సమాధానం...?
జ: ఇది ముమ్మాటికి నిజం. అయితే అన్ని ఆస్తుల అన్యాక్రాంతంలో వారి పాత్రే ఉందని కూడా పూర్తిగా చెప్పలేం. ప్రభుత్వాలు కూడా అడిగే వారు లేరని వక్ప్ ఆస్తులను తెరచాటు కార్పోరేట్ కంపెనీలకు, తమకు కావాల్సిన వారికి కట్టబెట్టిన ధాఖలాలు అనేకం ఉన్నాయి. ఎన్నిలకు ముందు వక్ప్ ఆస్తులను పరిరక్షిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు నేరుగా ఆస్తుల దోపిడికి ప్రేరేపిస్తున్నాయి అన్నది నా అభిప్రాయం. అదేలా అంటే వక్ప్ బోర్డు కు పాలకమండలి నియమించడంతో తెరచాటు దోపిడికి తెరలేపుతున్నారు. ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ పార్టీకి చెందిన కొందరు మైనార్టీ నాయకులకు వక్ప్ భోర్డు పాలకమండలి లో చోటు కల్పిస్తున్నారు. వాస్తవానికి వక్ప్ ఆస్తుల పరిరక్షణ కోసం ఈ పాలకమండలి పనిచేయాలి. కానీ రాజకీయ పునరావసంగా దీనిని మార్చడంతో లాభాపేక్షతో వక్ప్ బోర్డు పాలక మండలి చూస్తోందన్న విమర్శ చాలా మంది చేస్తున్నారు. అంటే ప్రభుత్వాలు మారి పాలకమండలి మారిన ప్రతి సందర్భంలో ఏదో ఒక చోట వక్ప్ ఆస్తి అన్యాక్రాంతమైందని, అది కోట్లు విలువ చేస్తుందన్న విమర్శలు మనం వింటూనే ఉన్నాం.

ప్రశ్న:మరీ వక్ప్ ఆస్తుల పరిరక్షణకు మార్గముందా...?
జ: ఎందుకు లేదు. ప్రభుత్వాలు వక్ప్ ఆస్తుల పరిరక్షణ విషయంలో చిత్తశుద్దితో వ్యవహరిస్తే అది సాధ్యమే. ఫలాన ప్రభుత్వం వక్ప్ ఆస్తులను పరిరక్షించలేదు అని ఒక పార్టీ ప్రభుత్వంపై నింద సరికాదు. తిలాపాపం తలాపిడికెడు అన్నట్లు మన దేశాన్ని, మన రాష్ట్రాలను ఏలిన ప్రతి ప్రభుత్వం ఇందులో పాలుపంచుకొంది. ఇప్పటికైనా ప్రభుత్వాలకు వక్ప్ ఆస్తుల పరిరక్షణ విషయంలో చిత్తశుద్దివుంటే ముందు తమ తమ రాష్ట్రాల్లోని వక్ప్ ఆస్తుల సర్వే ఒక ఆరు నెలల, లేద సంవత్సర కాల పరిమితిలో గుర్తించి వాటి వివరాలు అన్ లైన్ లో నమోదు చేయాలి. ఆపై ఇది వక్ప్ ఆస్తి అని ప్రభుత్వం తరఫున బోర్డులు ఏర్పాటు చేసి ఆపై వాటిని అన్యాక్రాంతం చేస్తే కఠిన చర్యలు అని ప్రకటించాలి. కఠిన చర్యలు తీసుకొనే చట్టం తీసుకురావాలి. ఇక వక్ప్ బోర్డు పాలక మండలి మారిన ప్రతి సారి ఈ ఆస్తుల యథాతథంగా ఉన్నాయని కొత్తగా వచ్చే పాలకమండలికి నివేదిక ఇచ్చే బాధ్యత రూపొందించాలి. ఒక అంగుళం వక్ప్ భూమి అన్యాక్రాంతమైన వక్ప్ అధికార్ల, ఒకవేళ పాలక మండలి వుంటే వాటి బాధ్యత అనే చట్టం తీసుకురావాలి. ఒక అంగుళం కబ్జాకు గురైన వారినే బాధ్యులగా చేసి చట్టపరమైన చర్యలకు దిగాలి. ఇది ప్రభుత్వాలు చేస్తే చాలు ఒక అంగుళం వక్ప్ భూమి ఎలా కబ్జాకు గురవుతుందో చూద్దాం. ఇదే సందర్బంలో ఇప్పటికే కబ్జాకు గురైన భూమి కోసం సర్వే కమిషన్లు తమ పనిని వేగవతం చేయాలి. ఇక వక్ప్ ఆస్తుల జోలికి వెళ్లాలంటే భయంపెట్టేలా చట్టాలు తేవడం, వీటి జోలికి వెళ్లడం అసాధ్యం అన్న రీతిలో వక్ప్ కమిషనరేట్ ఏర్పాటు చేసి పర్యవేక్షించడం చేయాలి. ఇలా చేస్తే ఒక్క అంగుళం భూమి కబ్జాకు గురికాదు. ఇది నా ఛాలెంజ్.

ప్రశ్న: వక్ప్ ఆస్తులు మీవి అన్న భావన ముస్లిం ప్రజానికంలో ఎలా కలిగిస్తారు...?
జ: మనస్సుంటే మార్గముంటుంది. వక్ప్ ఆస్తుల పరిరక్షణకు కంకణం కట్టుకొంటే మార్గాలు అనేకమున్నాయి. ముఖ్యంగా వక్ప్ ఆస్తుల పరిరక్షణలో ముస్లిం ప్రజానికం భాగస్వామ్యం పెంపొందకపోవడానికి ప్రధాన కారణం ఒక్కటి. సహజంగా చాలా చోట్ల వక్ప్ ఆస్తులు మసీదుల కిందనో, ఈద్గా, దర్గాలు, వాటి ట్రస్టుల కిందనో ఉన్నాయి. వాటి ఆధాయం ఈ సంస్థల కింద పనిచేసే కమిటీలు, బాధ్యులతోపాటు సామన్య ముస్లింలకు అందాలి. కానీ ఇక్కడ బాధ్యులు, కమిటీల పేరుతో ఆ వక్ప్ ఆస్తుల పర్యవేక్షణకు ఉన్నవారు ఇది తమ ఆస్తి అన్నట్లుగా వ్యవహరించడం మొదలెట్టారు. దీంతో ముస్లిం ప్రజానికంలో ఇది తమకు సబంధించిన వ్యవహారం కాదు దర్గాల ముత్తవలీలకు, మసీదుల ఇమాం, పర్యవేక్షణ కమిటీకి, ఈద్దా నిర్వామణ కమిటీకి చెందిన అంశంగా ముస్లిం ప్రజానికంలో బలమైన ముద్రపడింది. దీనివల్ల తమకు వచ్చింది లేదు పోయింది లేదు అన్న భావన ముస్లిం ప్రజానికంలో బలపడిపోయింది. ఇదే అతి పెద్ద తప్పిదం. వీటిని సరిచేసి వక్ప్ ఆస్తుల కింద ఆధాయం మార్కెట్ రేటు ప్రకారం వచ్చేలా చేస్తే ఒక ప్రాంతినికి చెందిన పరిమిత ఆస్తిపైనే కోట్ల ఆదాయం వస్తుంది. ఈ ఆదాయంతో ముస్లిం సమాజ సంక్షేమం అన్న భావన ప్రజానికంలో బలంగా కలిగిస్తే సహజంగా వక్ప్ ఆస్తుల పరిరక్షణ ఉద్యమంలో ముస్లిం ప్రజానీకం భాగస్వామ్య పెరుగుతుంది. వాస్తవానికి జరగాల్సింది ఇదే. వక్ప్ ఆస్తుల నుంచి మార్కెట్ రేటు ప్రకారం అద్దెలు తదితర ఆదాయాలను సేకరించి యావత్తు ముస్లిం సమాజం బాగుపడేలా కార్పోరేట్ తరహా విద్యా వ్యవస్థ, హాస్పిటల్స్, నేరుగా పేద ముస్లింలకు వారి వ్యాపర ఉన్నతి కోసం రుణాలు అందిస్తే ముస్లిం ప్రజానికం భాగస్వామ్యం వక్ప్ ఆస్తుల పరిరక్షణలో ఎలా పెరగదో చూద్దాం.
Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: