మార్చి 2020

తమకావాల్సింది అభివృద్ధి, ప్రగతి భారత్...తమ తీర్పుతో స్పష్టంచేసిన ఓటర్లు
బీజేపీ వరుస ఓటములు...ప్రజా తీర్పు ఉద్దేశం ఇదే.....?

కాంగ్రెస్ రహిత భారత్ అని బీజేపీ చెబుతుంటే దేశ ప్రజలు మాత్రం విద్వేషరహిత భారత్ అని తమ తీర్పు ద్వారా స్పష్టంచేస్తున్నారు. గుళ్లు, విగ్రహాలు తమకు ప్రధానం కాదని, అభివృద్ధి, దేశ ప్రగతే తమకు ముఖ్యమని తమ వైఖరి ద్వారా స్పష్టంచేస్తున్నారు. దేశ ప్రజలు ప్రస్తుతం ఇస్తున్న తీర్పునుంచి అన్ని పార్టీలు గుణంపాఠం నేర్చుకోవాల్సింది ఇదే. మరీ ముఖ్యంగా బీజేపీ నాయకత్వం ఈ గుణపాఠం నేర్చుకోవాలి. దేశాన్ని ఏలుతున్న బీజేపీ భిన్నత్వంలో ఏకత్వం నిలిపే ప్రయత్నం చేయకున్నా దేశ పౌరులుగా ఈ దేశ ప్రజలు మాత్రం ఆ పాత్రను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు అని ఇటీవల చోటుచేసుకొన్న ఉద్దంతాలు స్పష్టంచేస్తున్నాయి. ఇటీవల జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీకి షాకిచ్చాయి. అయితే ఏడాది కాలంలో ఐదో రాష్ట్రాన్ని కోల్పోవడంతో బీజేపీ అధిష్టానంలో కలవరం మొదలైంది. ఐదేళ్లుగా కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటూ నినదిస్తూనే ఏడాది కాలంలో కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ కూటములకు ఐదు రాష్ట్రాలను అర్పించుకున్నారు కమలనాథులు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల్లో ఇప్పటికే అధికారం కోల్పోయిన బీజేపీ తాజాగా జార్ఖండ్‌లోనూ అధికారానికి దూరమైంది.కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చినా కీలకమైన రాష్ట్రాలను బీజేపీ వదులుకోవాల్సి వచ్చింది. ఏడాదిలో ఐదు కీలక రాష్ట్రాలు చేజారిపోవడంతో కమలనాథుల్లో కలవరం మొదలైందని తెలుస్తోంది. అతి త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, పశ్చిమబెంగాల్ ఎన్నికలు బీజేపీకి సవాలుగా మారనున్నాయి. ఒక రాష్ట్రంలో గానీ ఒక సీటులో గాని గెలిస్తే చాలు ప్రజలు మోడీ పాలనను కోరుకొంటున్నారని, హిందూ అజెండాను ఆదరిస్తున్నారని బీజేపీ నాయకత్వం ఢంకాకొట్టి మరీ చెప్పడం ఆనవాయితీగా మారింది. అయితే ప్రజలు ఇటీవల ఐదు రాష్ట్రాల్లో ఇచ్చిన తీర్పుపై మాత్రం బీజేపీ ఆత్మపరిశీలన చేసుకోని మాట్లాడటంలేదు. కానీ ప్రజలు ఇచ్చిన షాకింగ్ తో మాత్రం ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు తేరుకొని వాస్తవాలు మాట్లాడుతున్నారు. వాస్తవం ఏమిటో గ్రహించిన బీజేపీ నాయకత్వం మత అజెండాను ప్రజలు తిరస్కరించారు అని తెలిసినా బయట చెపుకోలేని పరిస్థితి. కారణం ఆ అజెండాతో బతికే బీజేపీకి మరో అభివృద్ధి, ప్రగతిశీల అజెండా లేకపోవడమే. కానీ ఇటీవల ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఒక మాట మాత్రం స్పష్టంచేశారు. గుళ్లు, విగ్రహాల పేరుతో రాజకీయాలు, తమ సోదరుల మధ్య ఆగదం పెంచే విద్వేషపూరిత అజెండాకు తాము వ్యతిరేకమని ఈ దేశ ప్రజలు స్పష్టంగా తమ తీర్పు ద్వారా వెల్లడించారు. ఇక మారాల్సింది బీజేపీయే. వాస్తవం తెలుసుకొని నడుచుకోవాల్సింది లౌకికత్వం పేరుతో రాజకీయాలు నడిపే పార్టీలు.
ఇదిలావంటే జార్ఖండ్ ఎన్నికల్లో తమ పార్టీ ఓటమి గురించి బీజేపీకి చెందిన ఓ ఎంపీ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రధాని నరేంద్ర మోడీ పూర్తిగా విస్మరించి విగ్రహాల ఏర్పాటు, ఆలయాల నిర్మాణంపైనే దృష్టిసారించారనీ అందుకే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడినట్టు బీజేపీ ఎంపీ సంజయ్ కేకడే అభిప్రాయపడ్డారు. ఈయన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి తప్పదనే విషయం తమ పార్టీ నేతలందరికీ తెలుసన్నారు. కానీ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించడమే తమను ఆశ్యర్యానికిలోను చేసిందన్నారు. ముఖ్యంగా, గత 2014 ఎన్నికల్లో దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానని ప్రధాని నరేంద్ర మోడీ హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చారనీ, కానీ, అధికారంలోకి వచ్చాక ఆ మాట మరచిపోయారనీ ఆయన సొంత పార్టీపైనే విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా రామ మందిర నిర్మాణం, విగ్రహాల నిర్మాణం, నగరాల పేర్ల మార్పుపైనే పార్టీ దృష్టి సారించిందని, ఈ ఎన్నికల్లో అదే కొంప ముంచిందన్నారు.
ప్రజలు కోరుకొన్నది అభివృద్ధి...హిందుత్వ అజెండా కాదు...?

పరమత సహనం ఈ దేశ ప్రజల గొప్పతనం. ఈ గొప్ప స్పూర్తిని రగిల్చే గొప్పతనం మన భారతదేశం మట్టిలోనేవుంది. అందుకే 2014 ఎన్నికలకు అభివృద్ధి అజెండా పేరుతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్ ఆ తరువాత వరుస మత విద్వేష ప్రకటనలతో మెజార్టీగా ఉన్న హిందూ సోదరుల మనస్సు మార్చి తనకు బలమైన మెజార్టీ ఓటర్లను అనుకూలంగా మల్చుకొనే ప్రయత్నం చేస్తూ వస్తోంది. దేశంలో హిందూత్వ పార్టీ అనగానే మనకు గుర్తుకు వచ్చేది బీజేపీనే, శివసేన లాంటి పార్టీలు అక్కడా ఇక్కడా వున్నా ప్రధానమైన హిందూత్వ ఎజెండాతో నడిచే కాషాయ పార్టీ కమలదళమే. అయితే ఆరెస్సెస్ అండతో ముందుకు పోయే బీజేపీ రెండు రకాల మాటలతో రాజకీయం చేస్తూ వుంటుంది. ఒకవైపు అభివృద్ధి, సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అంటూనే మరో వైపు అవసరమైనప్పుడల్లా రామ మందిరం, హిందూత్వా అంటుంది, ఎప్పుడు ఏది వర్కవుట్ అవుతుందో బీజేపీ పెద్దలకు బాగా తెలుసు. అలాగే ఎప్పుడు ఎవరు మాట్లాడాలో కూడా వారికి బాగా తెలుసు, అభివృద్ధి , అవినీతి నిర్మూలన, నల్లధనం, నిరుద్యోగం లాంటి మాటలు మాట్లాడే వారు గోవధ నిషేధం, ముస్లిమ్ లలో జనాభ పెరుగుదల, అయోధ్య రామ మందిరం ఇలాంటి అంశాల జోలికి వెళ్లరు. తాజాగా కాషాయ నేతల వరుస కామెంట్లు చూస్తే మనకు రానున్న ఎన్నికల ఎజెండా ఏంటో తెలిసిపోతుంది. 2014లో కాంగ్రెస్ పదేళ్ల పాలనలోని అవినీతి, స్కామ్ లు మోదీకి బాగా కలిసొచ్చాయి. అందుకే ఎక్కువగా హిందూత్వ ఎజెండా నెత్తికెత్తుకోలేదు. కాంగ్రెస్ హఠావ్ నినాదంతో అబ్ కీ బార్ మోదీ సర్కార్ అంటూ హోరెత్తించారు. కానీ నాలుగేళ్ల తరువాత సీన్ మొత్తం రివర్సైంది. మోదీ వచ్చాక చేపట్టిన నోట్ల రద్దు, జీఎస్టీ వంటి ప్రయోగాలు పేద, మధ్యతరగతి వారికి అసతంతృప్తి కలిగించాయి. అంతేకాదు ప్రజా వ్యతిరేకత తీవ్రంగా పెరిగింది. తాజాగా ఈ హామీలను అమలు చేయాల్సిన కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇపుడు రామమందిరం, విగ్రహాలు, ఎన్నార్సీ, సీఏఏ వంటి చట్టాలతో ప్రజలకు దగ్గరవ్వాలని చూసినా ఈ సమయంలో జరిగిన జార్ఖండ్ రాష్ట్ర ఎన్నికలు మాత్రం బీజేపీని తగిన గుణ పాఠం మాత్రం నేర్పాయి.
ఇటీవల జార్ఖండ్ ఎన్నికలకు ముందు నాలుగు రాష్ట్రాలను బీజేపీ కోల్పోయింది. దీంతో ఉత్తరాది హిందూ ఓటర్లని కదిలించే పనిలో పడింది కాషాయ దళం. అందుకు తగ్గట్టే అతివాదులుగా ముద్రపడ్డ బీజేపీ నేతలు నోటికికి వచ్చినట్లు మాట్లాడి మత విద్వేషాలు రగిల్చే పనిలో పడ్డారు. ఇటీవల కొన్ని రోజుల వ్యవధిలో వారు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే మాత్రం వారి భవిష్యత్ వ్యూహం ఏంటో అర్థమైపోతుంది. ఉత్తర్ ప్రదేశ్ నుంచీ పార్లమెంట్ కు ఎంపికైన ఎంపీ హరి ఓం పాండే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఓసారి పరిశీలిద్దాం. దేశ స్వాతంత్ర్యం తరువాత ముస్లిం జనాభ క్రమంగా పెరుగుతూ వస్తోంది. అందువల్లే ఉగ్రవాదం, అత్యాచారాలు పెరుగుతున్నాయి. మనం తక్షణం పార్లమెంట్ లో జనాభ పెరుగుదల నియత్రణ కోసం బిల్లు తీసుకురాకపోతే మరోసారి పాకిస్తాన్ లాగా భూభాగం కోల్పోవాల్సి వస్తుంది. ఉత్తర్ ప్రదేశ్ కే చెందిన మరో బీజేపీ నేత సురేంద్ర సింగ్ కూడా ముస్లిమ్ లలో జనాభా పెరుగుదల ఎక్కువగా వుందని అన్నారు. అందుకు విరుగుడుగా హిందువులు కూడా అయిదుగురు పిల్లల్ని కనమని పిలుపునిచ్చారు. ఇద్దరు మగ పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు, మరొకరు ఎవరైనా ఫర్వాలేదని ఆయన అన్నారు. బీజేపీ ఉత్తరాది నాయకులు మైనార్టీ వర్గాల్ని టార్గెట్ చేస్తే దక్షిణాది నేతలు మేధావుల్ని, అభ్యుదయవాదుల్ని విమర్శిస్తున్నారు. కర్ణాటకలో ఈ మద్యే ఎన్నికల్లో గెలిచిన ఓ ఎమ్మెల్యే మేధావుల్ని, అభ్యుదయవాదుల్ని ఏకంగా కాల్చిపారేయాలని అభిప్రాయపడ్డాడు. తానే దేశ హోంమంత్రి అయితే పోలీసులకి కాల్చిపారేయమని ఆదేశాలు ఇస్తానన్నాడు బసన గౌడ. కర్ణాటకలో ఈ మధ్యే గౌరీ లంకేష్ లాంటి రచయిత్రి మీద దాడి జరగటం మనందరికీ తెలిసిందే. తాజాగా సీఏఏ చట్టం అమలు, ఎన్నార్సీని దేశ వ్యాప్తంగా అమలు చేస్తానని కేంద్రంలోని బీజేపీ ప్రకటించింది. అమీత్ షా ఏకంగా ఈ విషయంలో రాజీలేదని తమ మత అజెండాను మరింత పదునుగా అమలు చేసే ప్రయత్నం చేశారు. ఇలా తమ మత అజెండాను పట్టిష్టంచేసుకొవడంలో అన్ని అనుకూలతలు స`ష్టించుకొన్న ఈ పరిస్థితుల్లోనే జార్ఖండ్ ఎన్నికల్లో మాత్రం బీజేపీకి చేదు ఫలితాలొచ్చాయి. ఈ తీర్పు ద్వారా ప్రజలు మరోమారు తమకు కావాల్సింది అభివృద్ధి ఫలాలు గానీ గుళ్లు, గోపురాలు కాదని తేల్చిచెప్పారు. 
బీజేపీయేతర పక్షాలు తమ ఒంటెద్దు పోకడలు మానుకోవాలి....?
గత 2019 ఎన్నికల్లో మోడీ సర్కార్ ఓటమి ఖాయం అన్నంతా ప్రచారం సాగింది. ఎన్నికలకు ముందు వివిధ మీడియా సంస్థలు చేసిన సర్వేలు అవే స్పష్టంచేశాయి. కానీ నాడు బీజేపీని ఎదుర్కొనేందుకు పెద్దన్న పాత్రలోనున్న కాంగ్రెస్ ఇతర బీజేపీయేతర పక్షాలను కలుపుకోవడంలో విఫలమైంది. ప్రాంతీయ పార్టీలు సైతం తమ ప్రభావాన్ని అధికంగా అంచనావేసుకొని హస్తం పార్టీని విస్మరించాయి. ఈ పరిణామాలే నాడు బీజేపీకి బాగా కలిసొచ్చి 2019 ఎన్నికల్లో మోడీ సర్కార్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టేందుకు దోహదపడ్డాయి. కానీ ప్రస్తుతం దేశంలో ప్రజలు బీజేపీని తిరస్కరించే వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. లౌకికత్వ పరిరక్షణ అనే పార్టీలు ఇపుడైనా తమ పంథాను మార్చుకొని మత అజెండా బీజాలు వేస్తున్న బీజేపీని నిలువరించే ప్రయత్నం చేయాలి. బీజేపీ తన మత రాజకీయాలు పదునుపెట్టడంతో ఇతర బీజేపీయేతర పార్టీలు సైతం మౌనం స్థితికి వచ్చాయి. కారణం బీజేపీ మత రాజకీయాలను నిలువరించే ప్రయత్నం చేస్తే బలంగా ఉన్న హిందూ సమాజం ఎక్కడ దూరమైపోతుందోనన్న ఆందోళన లౌకిక పార్టీల్లో సైతం ఎక్కైవైంది. కానీ ఇక్కడ లౌకికత్వం పేరు చెపుకొనే పార్టీలు ఓ వాస్తవాన్ని గ్రహించాలి. బీజేపీ మత అజెండాను ఈ దేశంలోని మెజార్టీ ఓటర్ల అయిన హిందూ సోదరులే అంగీకరించడంలేదు. తమకు కావాల్సింది దేశ ప్రగతి, అభివ`ద్ది అని గుళ్లు, గోపురాలు, విగ్రహాలు తమ కడుపు నింపవని వారు ఇటీవల జరిగిన వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో స్పష్టమైన తీర్పును ఇచ్చాయి. ఈ నేపథ్యంలో బీజేపీయేతర పార్టీలన్నీ మేలుకొని బీజేపీ మత రాజకీయాలు హిందూ సోదరులకు ఏ మాత్రం ఉపయోగం కాదని ప్రజల్లోకి విస్త్రుతంగా తీసుకెళ్లాలి. తద్వారా ప్రజల మద్దతుతో బీజేపీ మత అజెండాను నిలువరించడం, ఆ పార్టీని అధికారానికి దూరంగా ఉంచడం లౌకిక పార్టీలకు పెద్దపనేం కాదు. బీజేపీకి వ్యతిరేక తీర్పు ఇచ్చి ఈ దేశ ప్రజలే లౌకిక అజెండా, ఈ దేశంలోని భిన్నత్వంలో ఏకత్వం కాపాడేందుకు సిద్దంగావుంటే ప్రజా క్షేత్రంలో ఉండాల్సిన లౌకికపార్టీలు ఇంకా మౌనం దాల్చితే మాత్రం అది క్షమించరానిది అవుతుంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దె దించాలంటే బీజేపీయేతర పార్టీలన్నీ ఇప్పటినుంచే ఏకమై తమ ఒంటెద్దు పోకడలను పక్కనెట్టాలి.
లౌకిక అజెండా పక్కనెట్టిన పార్టీలను నిలదీయండి...?

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో లౌకిక పల్లవిని ఎత్తుకొని అధికారంలోకి వచ్చాక కేంద్రంలోని బీజేపీకి దాసోహమవుతున్నాయి. ఇటీవల బీజేపీ తీసుకొంటున్న ప్రతి నిర్ణయానికి ఏపీలోని వైసీపీ సర్కార్ జై కొడుతోంది. కానీ తనను నమ్మి ఓట్లు వేసిన మైనార్టీ వర్గాలను వైసీపీ ప్రభుత్వం విస్మరిస్తోంది. గతంలో టీడీపీ సైతం ఇదే పనిచేసింది. కానీ దేశంలో పౌరత్వ సవరణ బిల్లుకు, ఎన్నార్సీ అమలుకు వ్యతిరేకంగా పోరాటాలు ఉధ`తం కావడంతో ఈ విషయంలో వెనక్కి తగ్గాలని కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై ఎన్టీయే భాగస్వామ్య పక్షాలు సైతం తీవ్ర ఒత్తిడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పోరాటాల స్పూర్తితో కేంద్రంలోని బీజేపీ సర్కార్ కు జై కొట్టే వైసీపీ ప్రభుత్వంపైనా, గతంలో జై కొట్టిన టీడీపీపైనా ఇదే తరహా ఒత్తిడి తీసుకురావాలి. లేకపోతే తెలుగు రాష్ట్రాల ముస్లింలు సైతం మళ్లీ తమ ఉనికి కోసం పోరాటాలు చేయాల్సి వస్తుంది. 
............................


దేశాన్ని ఏకం చేసిన దిశా ఘటన...అందరి విషయంలో ఇదే జరిగితే...?
నైతికతలో ప్రపంచానికే భారత్ ఆదర్శం...?

మన తోటి వారికి గాయమైతే ఆ బాధను పంచుకొనే మనస్థత్వం మన తోటి భారతీయులది. అదే మన భారతదేశం గొప్పతనం. ఇటీవల దేశాన్ని దిశా ఘటన కుదిపేసిన విషయం తెలిసిందే. మన సోదరి దిశకు యావత్తు భారతదేశం అండగా నిలవడం ఎంతో గర్వంగా చెపుకొనే అంశం. దిశా ఘటనకు కారణమైన నిందితులు ఇటీవల ఎన్ కౌంటర్ చేయబడారు. దీనిపై ప్రజలు హర్షిస్తుంటే ప్రజా సంఘాలు శిక్ష పడాలి గానీ అది న్యాయ స్థానాల చేతనే అని వాదిస్తున్నాయి. ఈ విషయంలో ఎవరి అభిప్రాయం వారికి ఉండొచ్చు. అయితే దిశా ఘటన నేపథ్యంలో దేశ ప్రజల్లో అత్యాచారాలకు వ్యతిరేకంగా వచ్చిన స్పందన సందర్భంలో మరో వాదన ప్రజా సంఘాల నుంచి వస్తుంది. ఈ అభిప్రాయంపై యావత్తు దేశం ఓ సారి దృష్టి సారిస్తే మాత్రం మన దేశం నైతిక విలువల్లో యావత్తు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పవచ్చు. దిశా ఘటన నేపథ్యంలో మన సోదరికి యావత్తు దేశం అండగా నిలుస్తూ ముందుకు కదిలింది. అయితే ఇక్కడ ఇదే స్పందన, ఇదే ఐక్యత అత్యాచారాలకు ఇతర ఘటనల విషయంలో వస్తే మాత్రం అత్యాచార రహిత దేశంగా భారత దేశం ప్రపంచ పుట్టల్లో స్థానం సాధించవచ్చు. దిశా ఘటన నేపథ్యంలో మన సోదరికి యావత్తు దేశం ఏ తరహాలో అండగా నిలిచిందో, దళిత, ఆదివాసి, మైనార్టీ వర్గాలపై సాగే అత్యాచారాల విషయంలోనూ స్పందించాల్సిన అవసరం యావత్తు దేశానికి ఉంది. ఇదే తరహా అత్యాచారాలకు గురైన బిడ్డల తల్లుల సైతం దిశా కు జరిగిన న్యాయమే తమకు జరగాలని వారి కోరుతున్నారు. ఏ బాధితుడైనా ఇది సహజంగా కోరుకొనే న్యాయం. ఒకే తరహా ఘటనలో ఒకరికి న్యాయం జరిగి మరోకరికి అన్యాయం జరిగితే మాత్రం నిజంగా బాధ పడాల్సిన అంశం. వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో ఆయేషా మీరా పై జరిగిన ధారుణం కూడా సోదరి దిశా లాంటి ఘటనయే. కానీ నేటికీ ఆ ఘటనకు కారణమైన నిందితులే పట్టుబడని వైనం. వరంగల్ లో ఇంకో సోదరి విషయంలోనూ ఇదే జరిగింది. ఈ బిడ్డల తల్లులు సైతం దిశా తరహా న్యాయం కోరుతున్నారు. అయితే అత్యాచారాలకు పాల్పడే మానవ మ`గాలకు దిశా తరహా న్యాయమే జరగాలా లేక న్యాయపరంగా ఉరిశిక్ష పడాలా అన్నది అటుంచితే ప్రతి బాధిత కుటుంబానికి న్యాయం మాత్రం తప్పకుండా జరగాలన్న దానిపై మరో అభిప్రాయం అక్కర్లేదు. ఇక్కడే యావత్తు భారత దేశం ఓ సారి ఆలోచించాలి. కులం, ప్రాంతం, మతం పేరుతో జరిగే అత్యాచారాలు, హత్యలు మాత్రం ఎందుకు యావత్తు ప్రపంచాన్ని కదిలించడంలేదు. దిశా ఘటనపై ఈ దేశంలోని సెలబ్రెటీలందరూ ఎంతో సిన్సీయర్ గా స్పందించారు. న్యాయం కోసం నినాదించారు. ఇది శుభపరిణామం. దిశా ఘటనపై స్పందించిన తరహాలో ఈ సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలు దేశంలో మతం, కులం పేరుతో సాగుతున్న అత్యాచారాలపై ఎందుకు స్పందించడంలేదన్నది ఇపుడు యావత్తు దేశాన్ని ప్రశ్నించేలా చేస్తుంది. కులం, మతం పేరుతో విభజించి మహిళాలపై అత్యాచారాలు సాగిస్తే అది న్యాయమై పోతుందా...? ఈ ప్రశ్నకు బదులివ్వాల్సింది మాత్రం యావత్తు దేశమే. తోటి వారికి కష్టాల్లొస్తే స్పందించే దయాగుణం మన భారతదేశ మట్టిది. అలాంటి గొప్ప మట్టిపంచుకొని పుట్టిన మన పొరుగింటి సోదరి అత్యాచారానికి గురైతే వారు తమ కులం, మతం కాకపోతే స్పందించకపోవడం ఎలా న్యాయమవుతుంది.
 వారి విషయంలో ఎందుకు స్పందన రాదు...?

కులం, ప్రాంతం, మతం ఏదైనా స్త్రీ జన్మ ఒకటే. వారికు ఉండే ఆత్మాభిమానం కూడా ఒక్కటే. అందరు స్త్రీల మాన, ప్రాణ విలువలు ఒక్కటే. సోదరి దిశకు అండగా నిలిచిన యావత్తు దేశం ఈ విషయాన్ని కాదనలేదు. కారణం మానవ పుట్టుకే ఒకే తరహా అయినపుడు మరి మానవుల మధ్య వివక్ష ఎందుకు అన్న ప్రశ్నను లేవనెత్తాల్సిన అవసరమొచ్చింది. దిశా ఘటన నేపథ్యంలో యావత్తు దేశ ఏకమై తక్షణ న్యాయం కోరడంతో తదనంత పరిణామాలు మనందరికీ తెలిసినవే. అయితే గుజరాత్ అల్లర్లలో, ముజఫర్ నగర్ అల్లర్లలో అత్యాచారానికి గురైన ముస్లిం మహిళల మాన, ప్రాణాలకు ఎందుకు మానవత్వం కింద పరిగణనలోనికి రావడంలేదు, ఉన్నావోలో అత్యాచారానికి గురై హత్యగావించబడ్డ దళిత సోదరికి  న్యాయం కోసం సోదరి దిశ కోసం నినాదించిన గళాలు ఎందుకు గళం విప్పడంలేదు. ముమ్మాటికి సోదరి దిశకు అండగా నిలవాల్సిందే, అల్లరి మూకల దాడుల్లో అత్యాచారాలకు గురైన మైనార్టీ వర్గ మహిళలకు అండగా నిలవాల్సిందే, కులం పేరుతో దళిత సోదరిలపై సాగే ఆగడాలకు వ్యతిరేకంగా యావత్తు దేశం ఏకం కావాల్సిందే. కానీ ఇంత పెద్ద స్థాయిలో అత్యాచారాలు జరుగుతుంటే మౌనం దాల్చి ఇంకో చోట ఇలాంటి ఘటనలు జరగకూడదని భావిస్తే అది సాధ్యమా. ఇక చోట జరిగే అత్యాచారానికి బాధ్యులైన నిందితులకు శిక్ష పడకపోతే మరోచోట అలాంటి ఘటన జరిగేందుకు నిందితులకు ప్రేరణగా మారుతుంది. ఇలాంటి మౌనం కారణంగానే నేడు సోదరి దిశా కొందరు మానవ మ`గాలకు బలికావాల్సి వచ్చింది. కులం, మతం, ప్రాంతం పేరుతో ఏ స్త్రీపై అత్యాచార ఆగడాలు జరిగినా వాటిపై మౌనం దాల్చకుండా నిందితులను కఠినంగా శిక్షిస్తే మానవ మ`గాలకు భయం ఏర్పడి ఈ రోజు మన సోదరి దిశకు ఇలాంటి ఘోర అన్యాయం జరిగేది కాదు. కాబట్టి అత్యాచార ఘటనలపై మీడియా ముందుకు వచ్చి ఖండిస్తున్న మన నాయకులు, ప్రజా సంఘాలు, సెలబ్రెటీలు ఈ దేశంలోని మైనార్టీ వర్గాలపైనా, దళిత, ఆదివాసి సోదరీమణులపైన సాగే అత్యాచారాలపై అదే తరహాలో స్పందించాలి. అపుడే వీరంతా నిజమైన మానవత్వం ఉన్నవారుగా గుర్తించబడతారు. లేకపోతే అపుడపుడు మీడియా ముందుకు వచ్చి స్పందించే వారి మానవ విలువలపై సందేహాలు కలుగుతాయి. ఇప్పటికైనా యావత్తు భారత దేశంలో ఒక సోదరిపై జరిగినా లేక మూకదాడుల్లో ఇలాంటి ఘటనలు జరిగినా యావత్తు దేశం ఒకటై ముక్తకంఠంతో బాధితుల పక్షాన పోరాడాలి. అత్యాచారాలకు ఒడిగట్టే మానవ మ`గాలకు కఠిన శిక్షలు పడి మళ్లీ అత్యాచారా ఆలోచన వస్తే వణుకు పుట్టేలా చేయాలి. దిశా ఘటన నేపథ్యంలో ఇప్పటి వరకు నిందితులకు వ్యతిరేకంగా ఏకమైన వారంతా అయేషా మీరా, ఉన్నావ్ లో దళిత సోదరికి జరిగిన అన్యాయాలపై ప్రశ్నించేందుకు సిద్దమవుద్దాం. మరో పోరాటానికి ఏకమవుద్దాం.
నేరం ఏదైనా...మౌనంతో భారీ మూల్యమే...?
ఈ రోజు కులం, మతం, ప్రాంతం పేరుతో సాగుతున్న దాడులతో జరిగే అన్యాయాలపై ప్రజలు విభజించబడి మౌనం దాల్చితే మాత్రం దానికి దేశం యావత్తు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కారణం ఇక చట్టాలు తమకు ఏమీ చేయవు, మతం మనకు కవచ్చంగా మారుతుందని ధీమా పెరిగి అల్లరి మూకల దాడులు రోజురోజుకు పెట్రేగే అవకాశముంది. ఈ పరిణామాలు ఒక మైనార్టీ, దళిత, ఆదివాసీలపైనే పరిమితం అవుతాయని భావిస్తే పొరపాటే. అల్లరి మూకల్లో చట్టం ఏమీ చేయదు అన్న ధీమా శాశ్వతంగా మారితే వారు ఏ వర్గ ప్రజల స్త్రీలపైనైనా ఇదే తరహా అఘాయిత్యాలకు పాల్పడవచ్చు. ఈ రోజు కామంతో అల్లరి మూకలు ప్రాంతం, కులం, మతం ఆదారంగా అత్యాచారాలకు ఒడిగట్టినా రేపు అదే కామ వాంచ ఇతర వర్గాల స్త్రీలపై తీర్చుకొనేలా చేయవచ్చు. అందుకే మానవ మ`గాలకు ఆదిలోనే భయం పుట్టాలి. ఈ రోజు మతం, కులం, ప్రాంతం పేరుతో సాగే మూకదాడల్లో తీవ్ర అన్యాయానికి గురవుతున్న స్త్రీల పక్షాన మాట్లాడేందుకు దూరం కావడం ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. ఏ విషయంలోనైనా చట్టాన్ని అమలుచేసే వారి ఉదాసీన వైఖరి వల్ల మన దేశంలో జరిగే ఘటన మన రాష్ట్రంలో, మన రాష్ట్రంలో జరిగే దుర్మార్గం మన జిల్లాలో, మన జిల్లాలో జరిగే అఘాయిత్యాలు మన నియోజకవర్గం, మన నివాస ప్రాంతాల్లో, మన పక్క నివాసంలో ఏదో ఒక రోజు మన నివాసంలోనూ కొనసాగుతుంది. కావున మూక దాడుల్లో స్త్రీలపై జరిగే అ‍ఘాయిత్యాలను నిర్లక్ష్యం చేస్తే మాత్రం అది కూడా ఏదో ఒక రోజు మనమూ అనుభవించాల్సి వస్తుందని యావత్తు భారత దేశం ఆలోచించాల్సిన అవసరముంది. ఆకలిలో అదమర్చి పాము తన పిల్లలను తానే తినేస్తుందటా. ఇదే తరహాలో కులం, ప్రాంతం, మతం పేరుతో మైనార్టీ, దళిత వర్గాలపై అత్యాచారాలకు పాల్పడుతూ కామం రుచిమరిగిన అల్లరి మూకలు తమ ఆకలి తీర్చుకొనేందుకు తమ వర్గం, తమ మెజార్టీ వర్గానికి చెందిన వారు అన్నది మరిచి ఇదే తరహా ఘోరాలకు ఒడిగట్టే ప్రమాదంలేకపోలేదు. 


ఇక మోడీ సర్కార్ ను ప్రశ్నించేదెవ్వరూ
చేసింది గోరంతా...లబ్ధిపొందుతోంది కొండంతా

రాజకీయాలలో రాణించాలంటే ప్రజానాడి పట్టడం తెలిసుండాలి. ఇది ఏ రాజకీయ ఉద్దండుడిని కదిపిన వారి నోట వచ్చే మాట. ప్రజలను ఆకర్షించేందుకు ఎవరైతే వారి నాడిపట్టి అందుకు అనుగుణంగా ఎవరైతే నడుచుకొంటారో వారే రాజకీయాలలో విజేత. కానీ 2014 నుంచి జాతీయ రాజకీయాలలో మాత్రం నయా ట్రెండ్ మొదలైంది. అదేమిటంటే ప్రజానడిని పట్టి వాటికి అనుగుణంగా నడవడం కాదు ప్రజలనే తన నినాదాలతో ఎమరపాటుకు గురిచేయడం నేడు జాతీయ రాజకీయాలలో నరేంద్ర మోడీ పుణ్యమా అని కొనసాగుతున్న నయా ట్రెండ్. అదేమిటీ అంటే 2014, 2019 ఎన్నికల సమయంలో నరేంద్ర మోడీ చేసిన హామీలు, అనంతరం వాటి అమలు తీరును ఓ సారి పరిశీలిస్తే వాస్తవంలో ప్రజలు మోసపోయిందేమిటో ఇట్టే అర్థమవుతుంది.  అందుకే ఇక్కడ నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న నయా ట్రెండ్ రాజకీయాలను ఓ సారి అర్థంచేసుకోవాల్సివుంది. వాటిలోకి వెళ్లాలంటే మనం కాస్త లోతైన ఆలోచన, మనం గమనించాల్సిన అంశాలేమిటీ అన్నది పరిగణనలోనికి తీసుకోవాలి. ఇక్కడ మన దేశ ప్రజలు దైనందిన జీవితంలో సతమతమవుతూ తమ ఆలోచన పరిధిని మాత్రం పెంచుకోవడంలేదు.
ఓటరు చైతన్యంతోనే ప్రజాస్వామ్యం విజయవంతం...

ప్రజాస్వామ్యం ఎంతో గొప్పదైనా ప్రజలు చైతన్యవంతం కానంతవరకు వాటి ఫలాలు మాత్రం అందవు. అందుకే ప్రపంచంలోని అగ్రదేశాలను తలదన్నే సత్తావున్నా భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలోవుంది. అయితే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో భారత్ తొలి రెండు, మూడు స్థానల్లోవుంది. మన దేశ ప్రజలు ఎంత సేపు నా నుంచి నేరుగా ఎంత సొమ్ము పోయి నేను నష్టపోయాను, లేక నాకు ఎంత సొమ్ము చేరి ఎంత లాభపడ్డాను అన్న దృక్పథానికే అలవాటు పడ్డారు. వాస్తవానికి తనకు తెలియని రూపంలో జరుగుతున్న పరిణామాలు తాను నేరుగా కాకుండా పరోక్షంగా నష్టపోతున్నదెంతా...? అసలు తాను ఎలా నష్టపోతున్నాను అన్నది తెలుసుకోవడం లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలను అన్ని విధాలా చైతన్యం చేయడం రాజకీయ పార్టీల బాధ్యత. ప్రభుత్వం లోపాలను ఎత్తిచూపుతూ ప్రభుత్వం పైకి కనిపించకుండా చేసే అనాలోచిత నిర్ణయాలను సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో జనంలోకి తీసుకెళ్లడం ప్రజల బాధ్యత. ఆ బాధ్యతను నిర్వర్తించినపుడే ప్రజలు చైతన్యవంతమవుతారు, ప్రజాస్వామ్యం కూడా విజయవంతమవుతుంది. ఆ పాత్రను మన దేశంలోని ప్రతిపక్షలు విస్మరించడంవల్లే మన దేశం ఎంతో నష్టపోతోంది. మన దేశ ప్రజలు నష్టపోతున్నారు. జీడీపీ అంటే ఏమిటీ, మన దేశ పారిశ్రామిక పురోగతని ఎలా అంచనా వేయాలి. మన దేశంలో ఏ రంగంలో ఎలా ముందుకెళ్తోంది. ఏ రంగాలలో వెనకబడివుందన్న లోతైన పరిశీలన మన దేశంలోని ప్రతి ఓటరుకు ఉండాలి. అపుడే మనదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ పూర్తిస్థాయిలో విజయవంతమవుతోంది. ఇక మనం 2014 నుంచి మన నరేంద్రమోడీ ప్రభుత్వం చేసిన ప్రధాన హామీలలో అమలు చేసిందేమిటీ, ఒకవేళ చేయపోయినా ఈ దేశంలో ఆయన జనాకర్షణ నేతగా ఎలా నిలుస్తున్నారు అన్నది మనం ఓ సారి తెలుసుకోవాలి.
ప్రధాన హామీలు తుంగలోకి...ఆయన జనంచేత జేజేలు...?

యూపీఏ సర్కార్ పై విమర్శల వర్షం కురిపిస్తూ తమ ప్రభుత్వం వస్తే అది చేస్తా, ఇది చేస్తా అని 2014 ఎన్నికలకు ముందు నరేంద్రమోడీ అనేక హామీలు ఇచ్చారు. ఆయన నాయకత్వంలో గుజరాత్ ఎంతో ప్రగతి సాథించిందన్న కార్పోరేట్ మీడియా ప్రచారంతో ఒక ఛాన్స్ ఇచ్చిచూద్దామన్న ఆలోచనలో మన దేశ ఓటర్లు పడ్డారు. అందులో భాగంగానే మోడీ నాయకత్వంలో బీజేపీ ఏకపక్ష మెజార్టీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. అయితే ప్రధాన హామీలు వేటినీ అమలు చేయని మోడీ ప్రభుత్వానికి నిజంగా ప్రజల మద్దతు మనస్పూర్తిగా అందుతోందా అన్నది మనం గమనించాలి. అదే సందర్బంలో ఏమీ చేయని హామీల గురించి ఓ సారి ఆలోచిస్తే అసలు ఇలాంటి ప్రభుత్వాన్ని ప్రజలు ఎందుకు కోరుకొంటున్నారు అన్న వాస్తవం వెలుగులోకి వస్తుంది. ప్రజలు నిజంగానే మోడీ ప్రభుత్వాన్ని కోరుకొంటున్నారు. లేక ఏమరపాటుకు గురై దేనికో ప్రభావితమై తమ ఓటును సరైన రీతిలో ఉపయోగించుకోలేకపోతున్నారా అన్న వాస్తవం మనకు బోధపడుతుంది. మోడీ సర్కార్ చేసిన హామీల్లో ఏడాదికి యువతకు 2 కోట్ల మందికి ఉపాధి అవకాశాలు. నల్లధనం వెలకితీత, ప్రతి పేదోడి బ్యాంకు ఖాతాలో రూ.15లక్షలు, భారీ స్థాయిలో పరిశ్రమల ఏర్పాటు, గ్రామీణ వ్యవస్థను గాడిలో పెట్టడం, అవినీతి రహిత దేశంగా మల్చడం ఇలా చెపుకొంటూపోతే వందలకుపైగా హామీలున్నాయి. వాటిలో ఏడాదికి 2 కోట్ల మందికి ఉపాధి అటుంచితే పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడి అనేక మంది ఉపాధి కోల్పోయారు. నల్లధనం మాట అటుంచితే మోడీ సర్కార్ లో బాడా వ్యాపారులు బ్యాంకులకు టోకరపెట్టి విదేశాలకు పరిపోయారు. పైగా మోడీ సర్కార్ తీసుకొంటున్న ప్రతి నిర్ణయం సామాన్య ప్రజలపైనే తీవ్ర ప్రభావం చూపుతోంది. పెద్ద నోట్ల రద్దు అంశం కావచ్చు. తాజాగా బంగారు నిల్వలపై మోడీ వేస్తున్న అడుగులు కావచ్చు. మహిళ బంగారు నిల్వలపై కూడా మోడీ ప్రభుత్వం కొన్ని పరిమితులు పెట్టే అవకాశముందని తెలుస్తోంది. పెద్ద తిమింగళాలను పట్టుకోలేక చిన్న చిన్న చేపలపై పడ్డటుగా మోడీ సర్కార్ చర్యలున్నాయి. అయినా మోడీ ప్రభుత్వంపై జనాకర్షణ పెరుగుతోందని మీడియాలో తరచురావడం ఏమిటీ  అన్న మనకు సందేహం కలగవచ్చు. అదేలాగో మనం కూడా తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.
సెంటిమెంటు నినాదాలు...సున్నితంగా కట్టిపడేస్తున్న వైనం...?
జనం నాడి పట్టినోడు రాజకీయనేత అయితే ప్రజలను ఎమరపాటుకు గురిచేసి తన పంథాలో నడిచేలా చేసుకోవడం తెలివైన రాజకీయ నేత లక్షణం. అలాంటి తెలివైన రాజకీయ నేతగా మన ప్రధాని నరేంద్రమోడీని కొనియాడక తప్పదు. జనంను ఆకట్టుకొనే నినాదాలతో దూసుకొచ్చి మనం ప్రశ్నించాల్సిన సమస్యలపై ముసుగేసేస్తున్నారు. ఇందుకు మంచి ఉదాహరణ స్వచ్ఛ్ భారత్. ఇది విన్న ఎవరికైనా ఎలాంటి తపులేదు అని అనిపిస్తోంది. వాస్తవానికి స్వచ్చ్ భారత్ నినాదం మంచిదే. కానీ ఈ నినాదంతో స్వయంగా ప్రధాని రోడ్డెక్కడం ఆయన చేత తొలగిస్తున్నట్లు మీడియాలో ప్రసారం కావడం వంటి వాటితో జనంలో మోడీ బలమైన ముద్ర వేసుకొనే ప్రయత్నం సాగుతోంది. వాస్తవానికి దేశాన్ని మురికి రహితం చేయడంతోనే స్వచ్చ్ భారత్ నినాదం సంపూర్ణమవుతుంది. నేటికీ మన దేశంలో లక్షలాది మురికి వాడలున్న నివాస ప్రాంతాలున్నాయి. మురికి తొలగింపునకు ప్రత్యేక పరిశుద్ధ్య కార్మిక వ్యవస్థ ఉండాలి. అది నేటికీ అందుబాటులో లేదు. వీటిని ప్రజలు గుర్తించాలి. ఎక్కడో ఒక చోట స్వయంగా ప్రధాని మోడీ మురికివాడలు పరిశుభ్రం చేయడం ద్వారా యావత్తు భారత్ సుభ్రంగా మారిపోదు. ఒక వేళ మోడీ స్పూర్తితో వీఐపీలు చీపురు పట్టినా అది నిత్యం జరిగే పనికాదు. అందుకే స్వచ్చ్ భారత్ కు పట్టిష్టమైన పారిశుద్ధ్య వ్యవస్థ ఉండాలి. మోడీ ప్రభుత్వం స్వచ్చ్ భారత్ పేరుతో చీపురు పట్టి చేస్తున్న షో ప్రభావంలో ప్రజలు పడుతున్నారు. ఆ ప్రభావానికి లోనవ్వకుంా ప్రజలను చైతన్యం చేయాల్సిన బాధ్యత ప్రతిపక్షాలపై ఉంది. ఇక వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్న నినాదం కూడా అటువంటిదే. ఎన్నికల్లో దుబారా నివారణ అంటున్నారు. ఒక రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాలను ఒకే సారి ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితి. కారణం ఒకేసారి కేవలం ఒక్కరాష్ట్రంలోనే ఎన్నికలకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించలేని పరిస్థితి. భద్రత ఉంటేనే ప్రజాస్వామ్య రీతిలో ఎన్నికలు జరిగే పరిస్థితి మనదేశంలో ఉంది కాబట్టి. అందుకే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్నది సాధ్యం కాదు. నినాదం వినేందుకు మాత్రమే ఇంపుగా ఉంటుంది. పైగా ఈ తరహా ఎన్నికలు ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదం. అదేలాగో తెలుసుకొందా. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన పార్టీ పాలన చూశాక అది నచ్చితే ఆపై రాష్ట్రంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరిగి అధికార పార్టీకి పట్టంకడతాం. లేకపోతే ప్రతిపక్ష పార్టీలను గెలిపిస్తాం. ఈ భయంతోనే అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు అన్ని విషయాలలో కాకపోయినా కొన్ని విషయాలలోనైనా ఒళ్లు దగ్గరపెట్టుకొని ప్రభుత్వాలు పనిచేస్తాయి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ తో ప్రజలకు ప్రభుత్వాన్ని హెచ్చరించే అవకాశమే ఉండదు. ఒకసారి ఓటేస్తే తిరిగి ఐదేళ్ల వరకు మౌనంగా భరించడం తప్పా తమ ఆగ్రహాన్ని ఓటు రూపంలో ప్రదర్శించే అవకాశం ఉండదు. ఇక మోడీ ప్రభుత్వం ఎత్తుకొంటున్న మరో నినాదం ఉమ్మడి పౌరస్మ`తి. దీంతోనే భారత్ కు భవిష్యత్తు అన్నట్లుగా బీజేపీ ప్రచారం చేస్తోంది. వాస్తవానికి దేశంలో భిన్న పౌరస్మ`తి ఏమీ అమలులో లేదు. కాని కొన్ని ఆచార, సంప్రదాయాల విషయంలో మన దేశంలోని భిన్న వర్గాల ప్రజలు తమ విశ్వాసాలకు అనుగుణంగా నడుచుకొనే అవకాశం దొరికింది. అంతేకాని ఉమ్మడి పౌరస్మ`తి లేకపోవడం వల్ల ఈ దేశంలో ఇప్పటి వరకు జరిగిన నష్టంఏమీలేదు. వాటిని కూడా మనం నిశితంగా పరిశీలిస్తే బీజేపీ చేస్తున్న ఈ ఉమ్మడి పౌరస్మ`తి విదానం మన దేశంలోని భిన్నత్వంలో ఏకత్వ స్పూర్తికి వ్యతిరేకం అని బోధపడుతుంది. మన దేశంలో వివిధ మతాలు, కలాల ప్రజలు ఉన్నారు. వారికి వారి విశ్వాల ఆదారంగా పలు ఆచార, సంప్రదాయాలు వారు పాటిస్తున్నారు. హిందూవులుగా చలామణి అయ్యే వారిలోనూ కులాల వారీగా వారి వారి ఆచార, సంప్రదాయాలలో ఎన్నో తేడాలున్నాయి. వాటికి అనుగుణంగానే ఎవరికి వారు తమ జీవన శైలీని అనుసరిస్తున్నారు. ఇక ఉమ్మడి పౌరస్మతి వల్ల కొత్తగా వచ్చే ప్రయోజనాలు ఏమీ లేకపోగా మన దేశంలోని వివిధ మతాలు, కులాల ప్రజల విశ్వాసాలను దూరం చేయడమే అవుతుంది.  ఎవరి విశ్వాసాలు వారికి గొప్పవి. ఆ కోణంలో చూస్తేనే మన దేశంలోని భిన్నత్వంలో ఏకత్వానికి ఎలాంటి భంగం వాటిల్లదు. ఎవరి విశ్వాసాలు వారికి గొప్పవి అని చెప్పడానికి ఇక్కడ తాజాగా సాగుతున్నఓ వివాదాన్ని మనం ప్రస్తావించుకొందాం. ఇటీవల మందిరాలు, దర్గాలలో పలు చోట్ల తమన సైతం లోపలికి అనుమతించాల్సిందేనని కొన్ని మహిళా సంఘాలు ఆందోళనకు దిగుతున్నాయి. శబరిమళ్ల యాత్రకు అనుమతించాలని, దర్గాలలో ప్రవేశం కల్పించాలని కోరుతున్నారు. దీనిని దర్గా పీఠాధిపతులతోపాటు హిందూ సంప్రదాయ వాదులు సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది తమ విశ్వాసాలకు విరుద్దమని కొన్ని చోట్ల ఆలయాలలో మహిళలకు ప్రవేశం ఉండదని హిందూ ధార్మిక ప్రతినిధులు పేర్కొంటున్నారు. వీరిని సమర్థిస్తూ బీజేపీ నేతలు సైతం కథన రంగంలోకి దిగుతున్నారు. ఉమ్మడి పౌరస్మ`తి అమలు చేయాలని కోరే బీజేపీ నేతలు ప్రవేశంలోని ఆలయాలలో మహిళలను అనుమతించేందుకు అంగీకరిస్తారా...? దీనిపై మాత్రం ఎవరి విశ్వాసాలు వారివి అని చెప్పే బీజేపీ నేతలు ఉమ్మడి పౌరస్మతి పేరుతో వివిధ వర్గాలు, మతాల వారి విశ్వాసాలను కాలరాయడం కూడా సరికాదు. ఇపుడున్న పద్దతి వల్ల భారతదేశ సమగ్రతకు, ఐక్యతకు ఎలాంటి ముపులేదు. కానీ ఈ దేశంలోని వివిధ వర్గాల, మతాల వారు తమ తమ విశ్వాసాలకు అనుగుణంగా జీవించే హక్కు పొందుతున్నారో తప్పా దేశానికి జరిగే నష్టమేమీలేదు. ఇలా సున్నిత అంశాల నినాదాలతో బీజేపీ ప్రజలను ఎమరపాటుకు గురిచేసి తాను సాధించిందేమీటో ఎవరూ ప్రశ్నించకుండా వ్యవహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఓ రకంగా చెప్పాలంటే ప్రధాన సమస్యలను ప్రశ్నించకుండా ప్రజలను ఎమరపాటుకు గురిచేసి సున్నితమైన నినాదాలతో జనం మెపుపొంది జేజేలు కొట్టించుకోవడంలో మోడీ సఫలీక`తమవుతున్నారు. ఈ మాయలోనుంచి ప్రజలను భయటపడేసే బాధ్యత ఈ దేశంలోని ప్రతిపక్షపార్టీలదే. దేశంలో ఎలాంటి పురోగతి సాధించకుండా మోడీ ప్రజలు మెప్పుపొందడానికి ప్రధాన కారణం సున్నిత నినాదాలే. ఈ నినాదాలతో దేశ ప్రగతి సాధ్యంకాదని ఈ దేశ ఓటర్లు అర్థంచేసుకోవాల్సివుంది.
.

రిజర్వేషన్ల అమలుకు కేసీఆర్ ముందు అనేక మార్గాలు
కేంద్రంపై నెపం నెట్టేస్తే అది కుంటిషాకే అవుతుంది

నోటి మాట నోసటిని దాటలేదు అన్న సామెత్తలు వినేటపుడు కొంత ఆశ్చర్యానికి లోనైనా ఈ వ్యాఖ్యలు ఊరికే పుట్టుకు రాలేదు అన్న భావన కొన్ని సంఘటనలు చూశాక కలగక మానదు. దేశ వ్యవస్థలను మార్చేస్తాం, సమసమాజ నిర్మాణం చేపడతాం అని పాలకుల నోట మాట వినిపిస్తే మాత్రం మనం ఇప్పటి దాక చెపుకొన్న సామెత్త పరమార్థం అర్థంకాకపోదు. 2003లో కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసిన నాటి నుంచి ఆయన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టాక కూడా పేద ముస్లింలకు విద్యా, ఉద్యోగాల్లో 12శాతం రిజర్వేషన్ల ఇచ్చితీరుతాం అన్న మాట విషయంలో ఆయన వైఖరి మాత్రం మారడంలేదు. కచ్చితంగా ఇస్తాం అంటున్నారో తప్పా అది ఆచరణలో అమలు కావడంలేదు. కారణాలు చెపేందుకు ఆయనకు అనేకముంటే మీ మాటల్లో చిత్తశుద్ది ఏదీ అని ప్రశ్నించేందుకు ముస్లిం సమాజంలో పెద్ద ఆసక్తి వ్యక్తంకావడంలేదు. ఈ రెండు కారణాలు కలసి పేద ముస్లింలకు 12శాతం రిజర్వేషన్ల డిమాండ్ డిమాండ్ గానే శాశ్వతంగా ఉండేట్లుు ఉన్న పరిస్థితులు దురదృష్టకరం. ఏ వర్గ ప్రజలకైనా సరే డిమాండ్ శాశ్వతంగా ఉండకూడదు. అది అమలుకావాలి. వెనకబడిన వర్గాల అభివృద్ధి శాశ్వతను నోచుకోవాలి. ఈ వ్యాఖ్యల ప్రస్తావన ఇపుడు ఎందుకు అన్నది మనకు సందేహం కలగవచ్చు. కానీ సందర్భం వచ్చింది కాబట్టి ఈ చర్చ అవసరంగా మారింది. తమ హక్కుల సాధన కోసం అన్ని వర్గాలు పోరాటానికి సిద్దమవుతున్నాయి. ఇటీవల ఓటాన్ అకౌంట‌్ బడ్జెట్ ను కేసీఆర్ సర్కార్ తీసుకొచ్చింది. ఈ సమావేశాల ముగింపు సందర్భంగా వచ్చిన పలు ప్రశ్నలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానమిస్తూ పేద ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, కేంద్ర సర్కార్ దీన్ని అడ్డుకొంటోందని చెప్పారు. కావాలంటే ముస్లిం రిజర్వేషన్ల కోసం మరోసారి అసెంబ్లీలో తీర్మానం చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. కానీ ఇక్కడ ఓ అంశాన్ని మనం గమనించాలి. అసెంబ్లీలో ఏ అంశపైనైనా తీర్మానం చేయడం ఆహ్వానించదగ్గ అంశమే. కానీ కేవలం అసెంబ్లీలో తీర్మానం చేయడం ద్వారా ముస్లింల రిజర్వేషన్ల సమస్య తీరదని అందరికీ తెలిసు. అందుకే ఇటీవల అసెంబ్లీ సమావేశాలలో సీఎం కేసీఆర్ ముస్లింల రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలు కూడా నోటి మాట నోసటిని దాటడంలేదు అన్న సామెతను గుర్తుతెస్తోంది. 
చిత్తశుద్ది ముఖ్యం...?
కేంద్రంలో బీజేపీ సర్కార్ ఏర్పాటు చేయకముందు నుంచి కూడా ముస్లిం రిజర్వేషన్లను మత పరమైన అంశంగా చూపి అడ్డుకొనే ప్రయత్నం చేసింది. ఇక ఆ పార్టీ కేంద్రంలో అధికార పాగా వేశాక ఎట్టి పరిస్థితుల్లోనూ ముస్లిం రిజర్వేషన్లకు అనుమతి ఇవ్వద్దని జగమెరిగిన సత్యం. కాకపోతే కేసీఆర్ ప్రభుత్వమే ముస్లింలకు ఎలాగైనా రిజర్వేషన్లను ఇవ్వాలని భావిస్తోంది కాబట్టి వాటిని ఎలా అమలు చేసుకోవచ్చో కూడా ఆయన ప్రభుత్వమే ఆలోచించాలి.  రిజర్వేషన్ల అమలు అంశం కేంద్రంపై నెట్టేస్తే మాత్రం వాటినుంచి కేసీఆర్ ప్రభుత్వం చేతులు దులుపుకొన్నట్లే భావించాల్సి వస్తుంది. 12% ముస్లిం రిజర్వేషన్లను అమలు చేసే మార్గలు కేసీఆర్ సర్కారు ముందు కూడా ఉన్నాయి. కావాల్సిందంతా చిత్తశుద్ది మాత్రమే. అది లోపించడం వల్లే ముస్లిం రిజర్వేషన్ల డిమాండ‌ శాశ్వతంగా మారి సమస్య కూడా పరిష్కారం కాకుండా జఠిలంగా మారుతోంది. ముస్లిం రిజర్వేషన్ల అమలు విషయంలో బీజేపీ పార్టీ లేవనెత్తిన సందేహాలు మత పరమైన రిజర్వేషన్లు అమలు చేయడం రాజ్యాంగ విరుద్దమని పేర్కొన్నగా, సుప్రీం కోర్టు రిజర్వేషన్ల పరిమితి 50% దాటకూడదని చెప్పిందని కమల నాథుల వాదన. ఈ రెండు వాదనలకు పరిష్కార మార్గాలున్నాయి. రాజ్యాంగంలోని పలు నిబంధనలు కుల, మత, ప్రాంతీయ, లింగభేదం చూపకుండా వెనకబడిన సమూహంకు రిజర్వేషన్లు కల్పించవచ్చని స్పష్టంగా చెబుతున్నాయి. ఈ క్రమంలోనే క్రైస్తవ మతం పేరుతోనే క్రైస్తవ సోదరులకు 1% రిజర్వేషన్లు అమలులోనున్నాయి. ఇక్కడ లేని అడ్డంకి ముస్లిం రిజర్వేషన్ల విషయంలోనే మతం ఎలా అడ్డంకిగా మారుతుందనే ఎదురు ప్రశ్న కేంద్రానికి సవాల్ గా మారుతుంది. ఇక 50% రిజర్వేషన్ల పరిమితి పెరగకూడదన్నది బీజేపీ ప్రధాన డిమాండ్. అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే 50% మేర రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఇదే సందర్భంలో కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం అగ్రవర్ణాలలోని పేదల కోసం 10% రిజర్వేషన్లను ఈబీసీ కోటా కింద అమలు చేసేందుకు నిర్ణయం తీసుకొంది. ఈ కోటా కింద రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రంలోని అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లను అమలు చేసుకోవచ్చని పేర్కొంది. దీని ప్రకారం ఈబీసీ కోటాలోకి ఎవరిని తీసుకురావాలో నిర్ణయించుకొనే స్వేచ్ఛ  రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. అంటే రిజర్వేషన్ల కోటా 50% పరిమితిని దాటకూడదన్న బీజేపీయే ‎ఈబీసీ కోటా తీసుకురావడం ద్వారా రిజర్వేషన్ల పరిమితిని దాటింది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల పరిమితి 50% దాట కూడదన్న వాదనను వినిపించే అర్హతను బీజేపీ కోల్పోయింది. ఇక కేసీఆర్ ప్రభుత్వం ముస్లిం రిజర్వేషన్లను అమలు చేస్తే కేంద్రం అడ్డుకొనే ప్రయత్నం చేసినా వాటిని తిప్పికొట్టే బలమైన అస్త్రాలు కేసీఆర్ సర్కార్ ముందున్నాయి. వాటిని ఉపయోగించుకొని పేద ముస్లింలకు 12% రిజర్వేషన్లు ఇచ్చే ఆస్కారం కేసీఆర్ ప్రభుత్వానికుంది. 
ఇస్తినమ్మ వాయినం పుచ్చుకొంటిన్నమ్మ వాయినం తరహా చిత్తశుద్ది వద్దు...?

ఇస్తినమ్మ వాయినం...పుచ్చుకొంటినమ్మ వాయినం అన్న తరహాలో ముస్లిం సమాజం విషయంలో మన పాలకుల వైఖరి, మైనార్టీ కోటా కింద పదవులు పొందే వారి మధ్య సాగుతోంది. ముస్లింలకు 12% రిజర్వేషన్లు కల్పించి తీరుతాను అని కేసీఆర్ వ్యాఖ్యానిస్తే చాలు ఆయనపై తమకు నమ్మకముందని చెప్పే పరిస్థితిలో టీఆర్ఎస్ లోని మైనార్టీ నేతల తీరువుంది. కేంద్రం ఈబీసీ కింద 10% రిజర్వేషన్లను అమలు చేసుకొనే అధికారం రాష్ట్రాలకు ఇచ్చింది. ప్రస్తుతం కేసు కోర్టులోనున్నా ముస్లింలకు ఏపీలో గానీ తెలంగాణ రాష్ట్రంలో గానీ 4% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. కేసీఆర్ హామీ ఇచ్చిన ప్రకారం ముస్లింలకు అదనంగా 8% రిజర్వేషన్లు అమలు చేయాల్సివుంది. ఈ రిజర్వేషన్లను కేసీఆర్ సర్కార్ నేరుగా అమలు చేసి న్యాయ స్థానంలో సమస్య తలెత్తితే మాత్రం అపుడు వాదనల ద్వారా వాటిని నిలబెట్టుకోవచ్చు. తమిళనాడు ప్రభుత్వం కూడా రిజర్వేషన్ల పరిధి 50% మించి ఇచ్చాక అక్కడ న్యాయ పరమైన చిక్కులేర్పడినపుడు అక్కడి సర్కార్ సమర్థవంతమైన వాదనలు న్యాయ స్థానంలో వినిపించడం ద్వారా తాను పెంచి ఇచ్చిన రిజర్వేషన్లను నేటికి కాపాడుకొంటూ వస్తోంది. ఇదే ప్రయత్నం ముస్లిం రిజర్వేషన్ల విషయంలోనూ కేసీఆర్ ప్రభుత్వం చేసే వీలుంది. అంటే మోడీ ప్రభుత్వాన్ని కాదని రిజర్వేషన్లు ఇచ్చేందుకు కేసీఆర్ ప్రభుత్వానికి కూడా మార్గముంది. కానీ కావాల్సిందంతా చిత్తశుద్ది మాత్రమే. ఇక కేంద్రం ప్రకటించిన ఈబీసీ కోటా 10% అమలుకు కేసీఆర్ ప్రభుత్వం నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంటే ఈ కోట కింద కూడా ముస్లిం రిజర్వేషన్లను మిగిలిన 8%లో మొత్తంగా కాకపోయినా కొంత భాగమైనా అమలు చేసే పరిస్థితివుంది. ఈ మార్గాన్ని కేసీఆర్ ఎందుకు ఉపయోగించుకోవడంలేదు అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
............................................

ఇతర వెనకబడిన వర్గాలను కలుపుకొని బీసీలు ఉద్యమించాలి
సామాజిక సమతుల్యత అని చెప్పే బీజేపీపై ఒత్తిడి తేవాలి...?

మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచినా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనార్టీ వర్గాల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదు. దేశాన్ని పాలించిన ప్రతి పార్టీ తాము ఈ వర్గాలకు ఎంతోచేశామని గొప్పలు చెపుకొంటున్నాయి. కానీ ఇటీవల దేశాన్ని పాలిస్తున్న నరేంద్ర మోడీ సర్కార్ మాత్రం సభ్ కా సాథ్ సబ‌్ కా వికాస్ అన్న నినాదం  ఎత్తుకొంది. సందర్భం వచ్చినపుడల్లా ఏ ఎండకు ఆ గొడుగు ఎత్తుకొంటోంది. ఇందులో ప్రధానమైంది బీసీ కార్డ్. బీసీ కార్డును బీజేపీ వాడుకొంటున్నట్లుగా నేడు మరే పార్టీ వాడుకోలేదని చెప్పాలి. ఓ బీసీ వ్యక్తి ప్రధాని అయితే ప్రతిపక్షాలకు, మరీ ముఖ్యంగా కాంగ్రెస‌్ పార్టీకి ఇష్టంలేదని స్వయంగా నరేంద్ర మోడీ 2014 ఎన్నికల సమయంలో ఆ తరువాత పలు ఎన్నికల సందర్భంగా వ్యాఖ్యానించారు. కానీ ఆచరణలో బీసీలకు మేలు జరిగే ఏ నిర్ణయం అమలులోకి వచ్చిందన్నది ఇక్కడ ఉత్పన్నమవుతున్న ప్రశ్న. బీసీల చిరుకాల కోరిక తమ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల పెంపు జరగాలని. కానీ కేంద్రంలో ఏ సర్కార‌్ వచ్చిన ఇది అమలు చేయకుండా ద్రోహం చేశాయి. ఎన్నిపార్టీలు కేంద్రంలో అధికారంలోకి వచ్చినా చేస్తాం...చూస్తాం అన్నదిశగా హామీలు ఇవ్వగా బీజేపీ మాత్రం ఒకటే పల్లవి చెబుతూ వస్తోంది. రిజర్వేషన్లు 50శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు ఓ సందర్భంలో చేసిన వ్యాఖ్యలనే తరచూ ముందుకు తెచ్చేది. అలా చెబుతూనే అసలు రిజర్వేషన్లపై అధ్యయనం సాగాలని, పున:సమీక్ష అవసరమని బీజేపీ మాత` సంస్థ ఆర్ఎస్ఎస్ పలు సందర్భాలలో చెప్పింది. బీసీల నుంచి పెద్ద ఎత్తున తిరుగుబాటు రావడంతో దానిపై కొంత మౌనం దాల్చింది. కానీ అంతర్లీనంగా బీసీ రిజర్వేషన్ల కొరలు పీకేలా చర్యలను బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మోడీ సర్కార‌్ అమలు చేసింది. ఇందుకు ఉదాహరణ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ డెంటల‌్ మెడికల‌్ కాలేజీల్లో రిజర్వేషన్ల అమలు ప్రక్రియను అక్కడి యోగి సర్కార‌్ నిలిపివేసింది. ఇలాంటి బీజేపీ నాయకత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముస్లింలకు వై.ఎస్.ప్రభుత్వం నాలుగుశాతం రిజర్వేషన్లు కల్పిస్తే బీసీలకు అన్యాయం జరిగిపోతోంది అని గగ్గోలు మొదలెట్టింది. మనం ఓ విషయాన్ని పరిశీలిద్దాం. 
బీసీలకు వారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వకూడదు అని గానీ అసలు బీసీలకు రిజర్వేషన్లు ఎందుకు అని గానీ ఏ సందర్భలోనూ, ఏలాంటి చర్చలోనూ ముస్లిం సమాజం గానీ ముస్లిం ప్రజాప్రతినిధులు గానీ ఎక్కడా చెప్పలేదు. అంటే బీసీల పట్ల ముస్లింలకు ఉన్నది సానుకూల థ`క్పథమే. కేంద్ర, రాష్ట్రలలో బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కాలంటే ముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనార్టీ వర్గాల మధ్య ఐక్యత పెరగాలి. సమస్యల పరంగా గానీ ఒకరినొకరు సహకరించుకొనే విషయంలో గానీ వెనకబడిన వర్గాలలో ఈ ఐక్యత రావాలి. అంటే రిజర్వేషన్లు గానీ ఇతర సమస్యల పరిష్కారంలో గానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనార్టీ వర్గాల మధ్య ఒకరికి వ్యతిరేకంగా ఒకరు పోరాటం చేసుకొన్న ధాఖలాలు లేవు. కావున ఈ వర్గాలు ముందుగా తమ తమ మధ్య ఐక్యతకు నడుంకట్టాలి.
ఇటీవల జరిగిన 2019 దేశ సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అగ్రవర్ణ పేదలకు పదిశాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.  ఎప్పడో తీసుకొన్న నిర్ణయంపై ఇపుడు చర్చ అనవసరమనిపిచవచ్చు. కానీ దేశంలోని మెజార్టీ ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే బీజేపీ అగ్రనాయకత్వం లోపాయికారి తన అజెండాను మాత్రం దిగ్విజయంగా పూర్తిచేస్తోంది. ఇది గుర్తించకపోతే బడుగులకు రాజ్యాధికారం అన్నది ఎన్నటికి నెరవేరదు. ఈ నేపథ్యంలోనే ఈబీసీ రిజర్వేషన్ల ప్రస్తావన మరోసారి అవసరం. ఈ ఈబీసీ రిజర్వేషన్లతో బడుగు వర్గాలకు రిజర్వేషన్లు అనేవి లేకుండా చేసే కుట్ర. అందుకే ఏకంగా రిటైయిడ‌్ న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య ఈబీసీ రిజర్వేషన్లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. న్యాయ వ్యవస్థలో, న్యాయమూర్తుల ఎంపికలో బీసీలకు జరిగే అన్యాయాన్ని ఆయన నిర్భయంగా పేర్కొన్నారు. అగ్రకుల పేద పేరుతో అగ్రకుల ధనికులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారని, చాతుర్వర్ణ వ్యవస్థలను శాశ్వతంగా ఉంచేందుకే ఆర్‌ఎస్‌ఎస్‌ ఆలోచనలకు అనుగుణంగా ఈ రిజర్వేషన్ల తెరపైకి తెచ్చారని జస్టిస్ ఈశ్వరయ్య దుయ్యబట్టారు. రాజ్యాంగ మూ లస్వభావానికి విరుద్ధంగా ఈబీసీ రిజర్వేషన్లు ఇస్తున్నారని అన్నారు. సమానత్వానికి విరుద్ధంగా అగ్రకు ల రిజర్వేషన్లు బిల్లు తెచ్చారని విమర్శించారు. ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. 
ఈబీసీ రిజర్వేషన్ల అమలుకు కేంద్రం చూపిన కుంటిషాకు ఏమిటీ...?

సమాజ సమతుల్యత దెబ్బతినకుండా ఉండాలన్న ఉద్దేశంతో అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార‌్ పేర్కొంది. ఇందుకోసం రాజ్యాంగంలోని 16, 17 అధికరణలను పార్లమెంటులో సవరించింది. ప్రస్తుతం అమలవుతున్న వెనకబడిన వర్గాల రిజర్వేషన్ల ద్వారా అగ్రవర్ణలోని వారిలో సామాజిక సమతుల్యత దెబ్బతింటుందా లేక మరో కోణంలో ఈబీసీ రిజర్వేషన్లు పెట్టిందా అన్నది మోడీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వని పరిస్థితి. కానీ రిజర్వేషన్లు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 50శాతానికి మించడానికి వీలులేదు అని ఢంకా కొట్టి మీరీ బీసీ సోదరుల రిజర్వేషన్ల  పెంపు వ్యవహారాన్ని పక్కదోవపట్టిస్తూ వచ్చిన బీజేపీ నాయకత్వంలోని ప్రభుత్వం ఇప్పుడు కోర్టు విధించిన పరిమితిని దాటి అగ్రవర్ణాల కోసం 10శాతం ఈబీసీ రిజర్వేషన్లను ఎలా తీసుకొచ్చింది. దీనికి బీజేపీ సమాధానం చెప్పాలి. బీజేపీ బీసీల పక్షపాతి అని నమ్మే నేతలను, కమలం నేతలను నిలదీయాలి. వాస్తవానికి సామాజిక సమతల్యత దెబ్బతింటోంది అని బీజేపీ నమ్మితే ఏ వర్గానికి, ఏ కులానికి, ఏ మతానికి అన్యాయం జరగకుండా దేశంలోని జనాభా ప్రాతిపదికాన అన్ని వర్గాలు, కులాలు, మతాల వారికి వారి వారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల ప్రక్రీయ అమలుచేయాలి. ఈ నేపథ్యంలో సబ‌్ కా సాథ్ సబ‌్ కా వికాస్ అని చెప్పే నరేంద్రమోడీ ప్రభుత్వం అన్ని వర్గాలకు, కులాలకు, మతాలకు చెందిన వారి జనాభ ప్రకారం రిజర్వేషన్లు అమలు చేస్తే సామాజిక సమతుల్యత దెబ్బతిన్నదు, బీసీ సోదరులు కావాలన్నట్లుగా రిజర్వేషన్ల పెంపు డిమాండ‌్ నెరవేరుతుంది, రిజర్వేషన్ల అవసరమున్న అన్ని వర్గాలకు న్యాయం జరగుతుంది.
ఆ సాహసం మోడీ ప్రభుత్వం చేస్తుందా...?
బీసీ రిజర్వేషన్లను పెంచడానికి 50శాతానికి రిజర్వేషన్లు మించరాదన్న సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావించే బీజేపీ అగ్రవర్ణ పేదలకు 10శాతం ఈబీసీ రిజర్వేషన్లు కల్పిస్తూ ఎలా సాహసం చేయగలిగిందో బీసీ సోదరులు ప్రశ్నించాలి. అదే సందర్భంలో బీసీ రిజర్వేషన్ల పెంపుకోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి. ఇందుకోసం ఇతర ఎస్సీ, ఎస్టీ, ముస్లిం వర్గాలను కలుపుకొని పోవాలి. లేనిపక్షంలో బడుగు, బలహీన వర్గాల రాజ్యాధికారం అటుంచి బీసీలు ఇంతవరకు పొందుతున్న రిజర్వేషన్లు, ఇతర హక్కులు కోల్పోయే ప్రమాదముంటుంది. 


చట్టసభల్లో మెరుగైన బహుజన ప్రాతినిధ్యం అనివార్యం
లోక్ సభలో ప్రమాదకర స్థాయిలో పడిపోతున్న ముస్లింల ప్రాతినిధ్యం

భారత దేశం భిన్నత్వంలో ఏకత్వం అన్న మాట ఇపుడు చెపుకొనేందుకే పరిమితమవుతోంది. ఏ సందర్భంలో ఈ దేశంలో కొన్ని శక్తులు బలపడ్డాయో ఎక్కడ చూసిన మతం చుట్టే రాజకీయాలు సాగుతున్నాయి. ఇది మీకు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అన్ని వర్గాల ప్రజల సమానత, సోదరభావంతో కూడిన అజెండా ప్రస్తుతం తెరపైకి రావాలి. ఇదే ఇస్లాం సూచిస్తోంది. అందుకే ముస్లిం సమాజం ఏ డిమాండ్ చేసినా అందులో సమాజహితం ఉంటుందన్నది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇతర మతాల్లో అది లేదు అన్నది ఇక్కడ ఉద్దేశం కాదు. కానీ మతం పేరుతో సొంత అజెండా తెరపైకి రావడం పైనే ఆందోళన. ఇందుకు తాజా ఉదాహరణ మనువాద అజెండా. హిందూ మతంలోనూ సమాజ హితం ఉంది. కానీ మతం పేరుతో నేడు చెలరేగుతున్న కాషాయికరణ శక్తులు తమ సొంత అజెండా మనువాద సిద్దాంతాన్ని మళ్లీ తెరపైకి తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. తొలినుంచి ముస్లింలపై విషయం కక్కే ఈ మనువాదులు ఇక దేశంలోని దళిత, బహుజన వర్గాల అణిచివేత చర్యలకు పాల్పడుతున్నాయి. కులం పేరుతో దళిత, బహుజనులపై దాడి, వారి రిజర్వేషన్లను, హక్కులను కాలరాయడం వంటి పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అందుకే నేడు దేశంలో కొనసాగుతున్న మతం చుట్టు రాజకీయాలను తెరదించి బహుజనవాద రాజకీయాలు తెరపైకి తేవాలి. సమాజహితం కోసం ఆలోచించే ముస్లింలు ఇందుకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తారు. ఇందుకోసం ముస్లిం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర మైనార్టీ వర్గాలు ఏకమై ఒకరి కోసం ఒకరు అన్న భావనతో ప్రతి రంగంలో కలసిముందుకెళ్లాలి. ఆ ఐక్యత రాజకీయ రంగంలోనూ రావాలి. అపుడే బహుజన అజెండా దేశాన్ని ఏలుతుంది. ఇటీవల మతం చుట్టు తిరిగే రాజకీయాల వల్ల చట్టసభల్లో ఉద్దేశపూర్వకంగా ముస్లింల రాజకీయ ప్రాతినిధ్యం తగ్గించే ప్రయత్నం సాగుతోందని ఓ విశ్లేషణ తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో మన పార్లమెంటులో ముస్లింల ప్రాతినిధ్యం పెరగాల్సిన ఆవశ్యతవుంది. ఇందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీల తోడ్పాటు అవసరం. ఎందుకంటే ముస్లింలే ఎస్సీ, ఎస్టీ, బీసీల అభ్యున్నతి కోసం ఆలోచిస్తారే తప్పా మనువాద అజెండా కలిగిన శక్తులు ఏ మాత్రం చేయవు. ఇందుకు తాజా ఉదాహరణ 2014 అనంతరం ఈ దేశంలోని ముస్లింలతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ సోదరులపై కొనసాగుతున్న పీడననే.
ప్రమాదకర స్థాయిలో ముస్లింల ప్రాతినిద్యం...?

ఈ దేశంలోని చట్టసభల్లో ముస్లింల ప్రాతినిద్యం ప్రమాదకర స్థాయిలో పడిపోతోంది. ఇది ముస్లిం సమాజంతోపాటు బహుజనవాదం కోరుకొనే ఎస్సీ, ఎస్టీ, బీసీ లకు కూడా ఆందోళన కలిగించే అంశం. ఎందుకంటే తొలినుంచి ముస్లిం వర్గం సమాజహితం కోసం బహుజనవాదం పక్షాన్ననిలబడింది. నాడు బీ.ఆర్.అంబేద్కర్ ను ఓడించి చట్టసభలకు పోకుండా చేయాలని మనువాదులు ప్రయత్నిస్తే సమాజహితం కోసం ఆ మహాశయుడిని ఎన్నికల్లో గెలిపించి చట్టసభలకు వెళ్లేలా చేసింది ముస్లిం సమాజమే. ఇది చరిత్ర చెప్పేవాస్తవం. ఏ వర్గ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ముస్లింలు పోరాడిన ఘటనలు లేవు. ఇది భారతదేశ చరిత్రను తిరగేస్తే మనం అర్థంచేసుకోవచ్చు. అందుకే దేశంలో సమాజహితం కోసం చట్టసభల్లో ముస్లింల ప్రాతినిధ్యం పెరగాలి. అందుకోసం దేశంలో మత చర్చకు చెక్ పెట్టేలా బహుజనవాదం చర్చ తెరపైకి రావాల్సివుంది. అన్ని పార్టీలు బీజేపీ ఉచ్చులోపడి బహుజనవాదం చర్చను విస్మరిస్తున్నాయి. ఆఖరికి బహుజనవాదం పేరుతో ఏర్పడ్డ పార్టీలు కూడా.
2011 గణాంకాల ప్రకారం భారతదేశ జనాభాలో ముస్లింలు 14.2 శాతం మంది ఉన్నారు. జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యం ఉండాలని వాదించేవారి ప్రకారం 545 మంది ఉండే లోక్‌సభలో ముస్లింలు 77 మంది ఉండాలి. కాని ఏ ఎన్నికల్లోనూ ముస్లింలు ఆ సంఖ్యను చేరుకోలేదు. 449 మంది సభ్యులుండే మొదటి లోక్‌సభలో ముస్లిం సభ్యుల సంఖ్య 21. అంటే 4.29 శాతం. ఇటీవల రద్దయిన 16వ లోక్‌సభలో ఈ సంఖ్య 23. కాని 545 మంది సభ్యుల్లో 23 అంటే 4.24 శాతం. స్వాతంత్ర్యం అనంతరం ముస్లింల ప్రాతినిధ్యం అతి తక్కువ ఉన్న లోక్‌సభ ఇదే.
లోక్ సభలో ముస్లింల ప్రాతినిధ్యం

స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి లోక్‌సభకు ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. అన్ని లోక్‌సభల్లోనూ ముస్లింల ప్రాతినిధ్యం ఎంత శాతం ఉంటూ వచ్చిందో పరిశీలిస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. మొదటి లోక్‌సభ నుంచి ఆరో లోక్‌సభ వరకు ముస్లింల ప్రాతినిధ్యం క్రమేణా పెరుగుతూ వచ్చింది. మొదటి లోక్‌సభకు 21 మంది ముస్లింలు ఎన్నికైతే ఆరో లోక్‌సభ నాటికి వారి సంఖ్య 34 కి పెరిగింది. అంటే ముస్లింల ప్రాతినిధ్యం 4.29 నుంచి 6.2 శాతానికి పెరిగింది. ఏడో లోక్‌సభలో ముస్లింల ప్రాతినిధ్యం ఒక్కసారి అమాంతంగా పెరిగింది. 49 మంది గెలవడంతో ముస్లింల శాతం 9.26 అయింది. 1984 లో జరిగిన 8 వ లోక్‌సభ ఎన్నికలలో ఈ సంఖ్య కొద్దిగా తగ్గి 46 మంది ఎన్నికయ్యారు. 2014లో ముస్లిం ఎంపీల సంఖ్య 22 కి తగ్గింది. అయితే తర్వాత 2018లో యూపీలోని కైరానా స్థానానికి ఉపఎన్నిక జరిగినప్పుడు రాష్ట్రీయ జనతా దళ్ అభ్యర్ధి తబస్సుమ్ హసన్ గెలుపొందడంతో ఈ సంఖ్య 23కి పెరిగింది. ఆమె గెలవకపోతే ఉత్తర్ ప్రదేశ్ నుంచి ఒక్క ముస్లిం ఎంపీ కూడా లోక్ సభలో ఉండేవారు కాదు. ఆ రాష్ట్రంలో 80 లోక్‌సభ నియోజకవర్గాలున్నా 2014 ఎన్నికల్లో ఒక్క ముస్లిం అభ్యర్ధి కూడా గెలవలేకపోయారు. ముస్లింల ప్రాతినిద్యం ఇలా తగ్గుతూ వస్తోంది. 1991 లో ముస్లిం ఎంపీల సంఖ్య 28. 1996 లో ఆ సంఖ్య 28గానే ఉంది. 1998 లో ఆ సంఖ్య 29 చేరుకోగా 1999 లో 32 కి ముస్లింల ప్రాతినిద్యం పెరిగింది. 2004 లో ఆ సంఖ్య 36 కి పెరిగింది. మళ్లీ ఆపై తగ్గుదల కనిపించింది. 2009 లో జరిగిన 15 వ లోక్ సభ ఎన్నికలలో ముస్లిం ఎంపీల సంఖ్య 30 కి తగ్గింది. దీనిని బట్టి ముస్లింలకు ఆదరణ లేక ఈ సంఖ్య తగ్గలేదు. ముస్లిం నాయకత్వానికి అవకాశం లేకుండా చేయడం ద్వారానే ముస్లింల ప్రాతినిధ్యం లేకుండా పోయింది. దేశంలోని మొత్తం ముస్లిం జనాభాలో 46 శాతం మంది 179 నియోజకవర్గాలు గల ఈ 8 రాష్ట్రాలలో (ఒక కేంద్ర పాలిత ప్రాంతంతో సహా) నివసిస్తున్నారు. అంటే 28 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి లోక్‌సభకు ఒక్క ముస్లిం కూడా ఎన్నికవ్వలేదు. దేశ ముస్లిం జనాభాలో 54 శాతం మంది నివసించే ఈ 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 364 నియోజకవర్గాల నుంచి ఒక్క ముస్లిం అభ్యర్ధి కూడా లోక్‌సభకు ఎన్నిక అవలేదు. ఈ పరిస్థితులు ఉత్పన్నమవవ్వడానికి ప్రధాన కారణం దేశంలో మతపరంగా చీలికరావడమేనని ఇటీవల ఓ వ్యాస కర్త తన విశ్లేషణలో పేర్కొన్నారు. ఇది వాస్తవమే. దేశంలో మతం పేరుతో అంతర్గతంగా బీజం వేసుకొంటున్న మనువాద అజెండాతో యావత్తు దేశానికే ప్రమాదం. కావున దేశంలో మత అజెండాకు చెక్ పెట్టేందుకు వీలుగా బహుజనవాదం తెరపైకి రావాలి. అందుకోసం ముస్లింలతో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఏకం కావాలి. అపుడే బడుగు రాజ్యాధికారం కూడా సాకారమవుతుంది.
బడుగుల ఐక్యతతో చట్టాలని ప్రభావితం చేసే శక్తి....? 

భారత సమాజంలోని అట్టడుగు వర్గాలైన దళిత, ఆదివాసీ సమూహాలకు లోక్‌సభలో వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించారనేది అందరికీ తెలిసిందే. దాని ప్రకారం దళితులకు 84 సీట్లు, ఆదివాసీలకు 47 సీట్లు రిజర్వ్ అయి ఉన్నాయి. ఇవి కాక రెండు సీట్లకు ఆంగ్లో ఇండియన్లను నామినేట్ చేస్తారు. ఇక ముస్లింలు స్వతహాగా గెలిచేందుకు వీలున్న లోక్ సభ స్థానాలు దాదాపు 50 వరకు ఉన్నాయి. జనాభా దామాషా ప్రకారం ముస్లింలు ఇతర వెనకబడిన వర్గాల సహకారం లభిస్తే మరో 30 స్థానాలు అదనంగా అంటే మొత్తంగా 80 స్థానాలు సాధించుకొనే అవకాశముంది. ఇక బీసీల విషయానికి వస్తే లోక్ సభ స్థానాలు వారు 200కు పైగా గెలిచుకొనే అవకాశముంది. ఇలా ముస్లిం, ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఏకమైతే లోక్ సభలో ప్రాతినిధ్యమంతా ఈ వర్గాలదే అవుతుంది. అపుడు తమకు వ్యతిరేకంగా వచ్చే చట్టాలను ఒంటిచేత్తో అడ్డుకొనే అవకాశముంటుంది. ఈ వాస్తవమే ఎస్సీ, ఎస్టీ, బీసీలు గ్రహించి ముస్లింలతో కలసి బహుజనవాదం అజెండాను తెరపైకి తీసుకురావాలి. అదే సందర్భంలో ముస్లిం సమాజంలోని నాయకత్వం వివిధ పార్టీలలో మైనార్టీ విభాగాలకే పరిమితం కాకుండా సువిశాల నాయకత్వం కోసం ప్రయత్నం సాగించాలి. అపుడు ముస్లింలు లోక్ సభలో 80 సంఖ్య మేర ప్రాతినిధ్యం సాధించవచ్చు. ఆ దిశగా ముస్లిం సమాజం అడుగేయాలి.


రాష్ట్రంలో నై...అక్కడ మాత్రం జై
రాజ్యసభ ఎన్నికల్లో ఇందుకు నిదర్శనం
పరిమల్‌ నత్వాని రాజ్యసభ టిక్కెట్టు ఎవరి ఖాతాలోది
బీజేపీతో జతకట్టిన జనసేనతో టీడీపీ కలసి పనిచేస్తుందా...?

రాజకీయాలలో జరిగే చమత్కారాలన గుర్తించాలంటే మారే సమీకరణలను కూడా మనం నిశితంగా గమనించాలి. ఎన్పీఆర్ ను అమలు చేసే ప్రసక్తే లేదని, ఒకవేళ చేసినా అది 2010 నాటి చట్టం ప్రకారమేనని ఏపీలోని వైసీపీ సర్కార్ ప్రకటించింది. ఇక తెలంగాణలోని టీఆర్ఎస్ సర్కార్ కూడా ఎన్పీఆర్ అమలును తాత్కాలికంగా నిలిపివేసింది. ఇక్కడ ఎన్పీఆర్ కు నై అంటూనే కేంద్రంలో వీటిని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి ఏదో ఒక రూపంలో ప్రాంతీయ పార్టీలు జై కొడుతున్నాయి. ఇపుడు రాజ్యసభ ఖాళీలకు ఎన్నికలు ఉన్నాయి. నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలైంది. గతంలో కీలక బిల్లులను కేంద్రంలోని మోడీ సర్కార్ లోక్ సభలో తన మంద బలంతో  గట్టెక్కించుకొన్నా రాజ్యసభలో మాత్రం ఆమోదించుకోనేందుకు చాలా శ్రమించాల్సి వస్తోంది. అందుకే రాజ్యసభలో బలం పెంచుకోవడమే లక్ష్యంగా నరేంద్రమోడీ, అమీత్ షా ప్రయత్నాలు మమ్మురం చేసినట్లు సమాచారం. ఇందుకు ప్రాంతీయ పార్టీలు బీజేపీకి పరోక్షంగా సహకరిస్తున్నాయా అంటే అవుననే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే లోక్ సభ...రాజ్యసభల గురించి మనం మున్ముందు క్లుప్తంగా చెపుకొందాం. 

ఏపీలో నాలుగు సీట్లు, తెలంగాణలో రెండు రాజ్యసభ సీట్లు ఇపుడు జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో భర్తీకానున్నాయి. రెండు పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించేశాయి. కానీ ఏపీలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపికను ఓ సారి పరిశీలిస్తే రాష్ట్రానికి చెందని పరిమల్ నత్వాని ఎంపిక కాస్త ఆశ్చర్యంగా ఉంది. ఆయన్ను పారిశ్రామిక వేతల కోటా కింద ఎంపిక చేశామని, రాష్ట్రానికి రిలియన్స్ భారీ పెట్టుబడుల కోసమే తమ పార్టీ నాయకత్వం ఎంపిక చేసిందని వైసీపీ పేర్కొంటోంది. కానీ పరిమల్ నత్వాన్ని ఎంపిక బీజేపీ అధినాయకత్వం ఆదేశం మేరకే వైసీపీ చేపట్టిందని మీడియాలో కథనాలు వచ్చాయి. ఇది కాదనలేని వాస్తవం. ఎందుకంటే పరిమల్ నత్వాన్ని తనను రాజ్యసభకు ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ చేసిన ట్విట్ లో ప్రదాని నరేంద్రమోడీ, అమీత్ షా ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ ఆ తరువాత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి ఆయన తన ట్విట్ లో ధన్యవాదాలు తెలిపారు. దీనిని బట్టే పరిమల్ నత్వాన్ని రాజ్యసభకు ఎంపిక చేసింది ఎవరి కోటాలో ఏవరి ఖాతాలోనన్నది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. బీజేపీకి చెందిన ఒక్క సభ్యుడిని రాజ్యసభకు ఇతర ప్రాంతీయ పార్టీలు పంపితే వచ్చే నష్టమేమిటీ అన్నది మీకు సందేహం కలగవచ్చు. పెద్ద నోట్ల రద్దుతోపాటు అనేక ప్రజావ్యతిరేక నిర్ణయాలు, అనేక విరుద్ద చట్టాలను బీజేపీ తీసుకొస్తోందన్న విమర్శవుంది. ఈ కోవలోనిదే సీఏఏ, ఎన్సార్సీ, ఎన్పీఆర్ అన్నది కూడా మనం మరవలేం. ఇక్కడ రాజ్యసభ ఖాళీలలో బలంలేని చోట కూడా బీజేపీకి రాజ్యసభకు ప్రాంతీయ పార్టీలు అవకాశం కల్పించడం అంటే యావత్తు దేశ ప్రజలకు వ్యతిరేకంగా పోతున్నట్లేనని భావించాలి. తాను తీసుకొచ్చిన చట్టాలు ఎలా ఉన్నా సరే వాటిని ఉభయసభల్లో ఆమోదింపజేసుకొని ముందుకెళ్లడమే మోడీ ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తోంది. ఇపుడు లోక్ సభ, రాజ్యసభలో సంఖ్యా బలం యోక్క ప్రధాన్యతను ముందుగా తెలుసుకొందాం. ఏ బిల్లు అయినా పార్లమెంటులో ఆమోదం పొందాలంటే లోక్ సభ, రాజ్యసభలో తమ పార్టీలకు తగినంత సంఖ్యాబలం అధికార పార్టీకి అవసరం. లోక్ సభలో బీజేపీకి సంపూర్ణ మెజార్టీ ఉంది. కానీ రాజ్యసభలో ఆ పరిస్థితి లేదు.
ఈ ఏడాది ఏప్రిల్ లో ఖాళీ అయ్యే 55 రాజ్యసభ స్థానాలకు మార్చి 26న పోలింగ్ జరగనుంది. నామినేషన్ల స్వీకరణకు  తుదిగడువు మార్చి 13 , నామినేషన్ల పరిశీలన 16న, ఉపసంహరణకు తుదిగడువు 18వ తేదీగా ఈసీ పేర్కొంది. మార్చి 26 ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. . అదే రోజు సాయంత్రం 5 గంటలకు లెక్కింపు చేపడతారు. ఇదిలావుంటే మొత్తం 17 రాష్ట్రాల నుంచి 55 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఏపీ నుంచి నాలుగు, తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. పెద్దల సభగా గుర్తింపు పొందిన రాజ్యసభలో ప్రతి రెండేళ్లకు ఒకసారి మూడో వంతు సభ్యులు పదవీవిరమణ చేస్తారు. వీరిని వివిధ రాష్ట్రాలకు చెందిన శాసనసభ్యులు ఎన్నుకుంటారు. 
ఉత్తరాధిలో ఎన్డీయే కూటమిదే హవా..?
త్వరలో జగరనున్న 55 రాజ్యసభ స్థానాల ఎన్నికల్లో ఉత్తారాధిన మాత్రం ఎన్డీయేకు కొంత మెరుగైన స్థానాలు వచ్చే అవకాశముంది. కానీ బీజేపీకి ఒంటరిగా రాజ్యసభ సీట్లు ధక్కే ఛాన్స్ చాలా తక్కువేనని చెప్పాలి. ఇదే సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి ఖాళీలు దాదాపు 10 స్థానాలు ఉండొచ్చు. అవి మొత్తంగా బీజేపీ ఖాతాలో పడే అవకాశముంది. అపుడు మాత్రమే బీజేపీకి కాస్త కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. మరోవైపు ఈ సారికి మాత్రం బీజేపీ, ఎన్డీయేలోని భాగస్వామ్య పక్షాలు కలసి కాస్త ఈ ఎన్నికల్లో పుంజుకొనే అవకాశముంది. ఇదిలావుంటే రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 240 మంది ఉండగా బీజేపీకి 83 మంది ఉన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014 నుంచి ఎగువ సభలో బీజేపీకి తగిన సంఖ్యా బలం లేదు. దీంతో బిల్లులను ఆమోదించుకోవడం వంటి సందర్భాల్లో ఇబ్బంది ఎదుర్కొంటోంది. ఇకపై విపక్షాల బలం తగ్గనుండడంతో ఎన్డీయేకు ఈ సారి బలం పెరుగుతుంది. కాంగ్రెస్‌కు 46 మంది సభ్యులున్నారు. ఇదిలావుంటే త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో కొన్ని సీట్లు కాంగ్రెస్ కోల్పోయినా తిరిగి కొన్ని పొందే అవకాశముంది. కాకపోతే మునుపటి సంఖ్యాబలం ఉండకపోవచ్చు. త్వరలో జరిగే మరిన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకొంటే మాత్రం మళ్లీ కాంగ్రెస్ రాజ్యసభలో బలపడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.
క్షిణాధిలో ప్రాంతీయ అధికార పార్టీలదే హవా...?
త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో దక్షిణాధికి చెందిన మూడు రాష్ట్రాలు ఉన్నాయి. వాటిలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి. తమిళనాడులో అధికార అన్నాడిఎంకేకు అవకాశాలు మొరుగ్గా ఉన్నాయి. ఇక ఏపీలో నాలుగు స్థానాలను అధికార వైసీపీ ఖాతాలోకే, తెలంగాణ రాష్ట్రంలోని రెండు స్థానాలు టీఆర్ఎస్ ఖాతాలోకి సునాయాసంగా వెళ్తున్నాయి.  ప్రస్తుతం ఖాళీ అయ్యే స్థానాల్లో దక్షిణాది నుంచి బీజేపీకి ఒంటరిగా దక్కే రాజ్యసభ స్థానాలు లేవు.
బీజేపీ బలం పెరిగినా స్వల్పమే...కానీ ఎన్డీయేకు మాత్రం మెజార్టీ...?

ఇదిలావుంటే రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 240 మంది ఉండగా బీజేపీకి 83 మంది ఉన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014 నుంచి ఎగువ సభలో బీజేపీకి తగిన సంఖ్యా బలం లేదు. దీంతో బిల్లులను ఆమోదించుకోవడం వంటి సందర్భాల్లో ఇబ్బంది ఎదుర్కొంటోంది. ఇకపై విపక్షాల బలం తగ్గనుండడంతో ఎన్డీయేకు ఈ సారి బలం పెరుగుతుంది. కాంగ్రెస్‌కు 46 మంది సభ్యులున్నారు. ముఖ్యంగా బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్‌లో 1, ఉత్తర్‌ప్రదేశ్‌లో 10 స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకోనుంది. వీటితో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో సైతం అభ్యర్థులను గెలిపించుకుని బలం పెంచుకోనుంది. అయితే రాజ్యసభలో తన బలం పెంచుకొనే దిశగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వ్యూహాలను పదునుపెడుతోంది. వివిధ రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ, తెలంగాణలోని ప్రభుత్వాలకు మోడీ సర్కార్ దగ్గరకు తీసుకొంటోంది అన్న ప్రచారం సాగుతోంది. ఆయా రాష్ట్రాలలో ఆయా ప్రభుత్వాలతో తమ పార్టీ రాష్ట్రశాఖ పోరాటం చేస్తున్నా జాతీయ రాజకీయలకు వచ్చే సారికి ఆ ప్రాంతీయ పార్టీలతో ఇచ్చుపుచ్చుకొనే ధోరణీని అనుసరించాలని భావిస్తున్నట్లు సమాచారం. అందుకే ఇటీవల వైసీపీతో బీజేపీ దోస్తీ అన్న కథనాలు తెరపైకి వచ్చాయి. వైసీపీ కూడా రాజ్యసభలో తమకు పెరిగే సంఖ్యాబలంతో కేంద్రానికి సహకరిస్తామన్న హామీ సైతం ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఐదు రాష్ట్రాల్లో సొంతంగా, రెండు రాష్ట్రాల్లో పొత్తులతో ప్రభుత్వం..
రాజస్థాన్, పంజాబ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పుదుచ్చేరిలో బలమైన కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. వీటిలో మధ్యప్రదేశ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వంలో  కాస్త ప్రమాదంలో పడే అకాశం కనిపిస్తోంది. పొత్తులతో ఏర్పడిన మహారాష్ట్ర, జార్ఖాండ్‌లలో ప్రభుత్వాలలో కాంగ్రెస్ కూడా భాగస్వామిగా ఉంది. ఇక్కడ కూడా కాంగ్రెస్ కు బలం పేరిగే అవకాశముంది.
ఏ బిల్లునైనా సునాయాసంగా...?
విపక్షాల ప్రమేయం లేకుండా  పెద్దల సభలో  బిల్లులు పాస్‌ కావాలంటే ఎన్డీయేకి 124 మంది ఎంపీలు కావాలి.  2020 నవంబర్‌ నాటికి ఎన్డీయే ప్రభుత్వానికి మరో 19 సీట్లు అదనంగా వచ్చి 125కి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, బిహార్, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల సహకారంతో  ఎన్డీయే కూటమి ప్రభుత్వం మేజిక్‌ ఫిగర్‌ దాటుతుంది. పదిహేనేళ్ల తర్వాత కేంద్రంలో అధికార పార్టీ రాజ్యసభలో కూడా మెజార్టీ సాధించిన పార్టీగా బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి రికార్డు సృష్టించనుంది. వాటిలో అత్యధిక సీట్లు యూపీ నుంచే వస్తాయి. తమిళనాడులో ఏఐఏడీఎంకే మిత్రపక్షం కావడంతో మరో ఆరు సీట్లు వస్తాయి. దీంతో మొన్నటి వరకు ట్రిపుల్ తలాక్, సీఏఏ వంటి బిల్లుల ఆమోదం విషయంలో ఇతర చట్టాలకు సంబంధించిన బిల్లుల విషయంలో విపక్షల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ఎన్డీయే సర్కార్ కు ఇకపై ఆ ఇబ్బందులు ఉండకపోవచ్చని చెప్పవచ్చు.
రాష్ట్రాలు కోల్పోతూపోతే మాత్రం బీజేపీకి గడుకాలమే...?
ఈ ఏడాదిలో జరిగే రాజ్యసభ సీట్ల ఖాళీ ఎన్నికల్లో బీజేపీకి పెద్దగా కలిసొచ్చింది ఏమీ లేకపోయినా పరిస్థితి కాస్త మెరుగుపడినట్లే. అదే సందర్భంలో ఎన్డీయే కూటమికి బలం పెరుగుతుంది. అయితే ప్రస్తుతం వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దాని మిత్రపక్షాలు ఓడిపోతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ఈ ఓటముల పరంపరం కొనసాగితే మాత్రం బీజేపీకి మళ్లీ గడుకాలమేనని చెప్పవచ్చు. రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఆరేళ్లు. అయితే పెద్దల సభలోని 250స్థానాలకు ఒకేసారి జరగవు. రెండేళ్లకోసారి విడతలవారీగా ఎన్నికలు నిర్వహిస్తారు. రాష్ట్రాల ఎమ్మెల్యేలు వీరిని ఎన్నుకుంటారు. అందుకే రాజ్యసభలో బలం పెరగాలంటే ముందుగా బీజేపీ వివిధ రాష్ట్రాల్లో పట్టు బిగించాల్సి ఉంటుంది. 250 మంది సభ్యులున్న రాజ్యసభలో ఏ బిల్లైనా ఆమోదం పొందాలంటే 124 మంది బలం అవసరం.  
రాజ్యసభ సీట్లపై కమలం కన్ను...?
రాజ్యసభలో బీజేపీకి తక్కువ సీట్లున్నాయి. బిల్లులు ఆమోదం పొందాలంటే ఆ పార్టీ ప్రభుత్వానికి మరింత బలం అవసరం. కొన్ని బిల్లులు ఆమోదం కోసం ఇతరుల పై ఆధారపడాల్సి వస్తోంది. రానున్న రోజుల్లో బీజేపీ సీట్లు మరింతగా తగ్గనున్నాయి. అందుకే ముందస్తు కసరత్తులు చేస్తోంది కమలం పార్టీ. ఇందులో భాగంగా తమకు కలిసొచ్చే ఏ అంశాన్ని వదలడం లేదు. తాజాగా 55 ఖాళీ రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే ఎక్కువ సీట్లు కోల్పోనున్నాయి. బీజేపీ నుంచి 18 సీట్లు ఖాళీ అవుతుండగా, ఆ పార్టీ నుంచి 13 మంది మాత్రమే మళ్లీ ఎన్నికయ్యే అవకాశాలున్నాయి. ఇక కాంగ్రెస్‌ సభ్యులు 11 మంది రిటైర్‌ అవుతుండగా, తిరిగి 10 మందే ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలావుంటే బీజేపీకి నేరుగా ఇంకా బలం పెరగలేదు కాబట్టి కీలక బిల్లుల ఆమోదం విషయంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు కూడా మున్ముందు వివిధ డిమాండ్లతో ఇబ్బంది పెడితే ఎలా అన్న ఆలోచన బీజేపీ అగ్రనాయకత్వంలో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే బలం లేని చోట, సీటు రాని చోట కూడా ప్రాంతీయ పార్టీలను వివిధ రూపాల్లో దారిలోకి తెచ్చుకొని నేరుగా తమ రాజ్యసభ అభ్యర్థి ఆయా ప్రాంతీయ పార్టీల సహాయంతో ఎన్నికయ్యేలా చేసుకోవాలని వ్యూహ రచన సాగించినట్లు సమాచారం. ఇందులో భాగమే వైసీపీ నుంచి పరిమల్ నత్వాని ఎంపిక అని పేర్కొంటున్నారు. ఈ నత్వాని బీజేపీతో మంచి సంబంధాలున్నాయని చెబుతుంటే నేరుగా ఆ పార్టీ నేతనే అని మరికొందరు చెబుతున్నారు. ఇది బీజేపీ అసలు ఎత్తుగడ్డ. ఇలా మత అజెండా కలిగిన బీజేపీ ఒడిలో కూర్చొని ప్రాంతీయ పార్టీలు లౌకికవాద సన్నాయి నొక్కులు నొక్కితే ఎలా నమ్మగలం.


సీఏఏ...ఎన్నార్సీలపై....పోరాట పంథా మారాలి
ప్రతిపక్షాల తీరు మారాలి
ఇస్లాక్ గ్రామపంచాయితీ నిర్ణయంతోనైనా మేలుకోవాలి
సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీలపై పోరులో అన్ని వర్గాలను మమేకం చేయాలి
అపుడే ఈ ఉద్యమాలకు పరిపూర్ణత

ఏ పోరాటమైనా లక్ష్యాన్ని చేరుకొనే విధంగా ఉండాలి. అందుకు అనుగుణంగానే పోరాట పంథా ఉండాలి. అపుడే ఏ పోరాటమైనా ఆశించిన ఫలితం దక్కుతుంది. సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీ చట్టాల వల్ల ఈ దేశ పౌరులు తీవ్రంగా నష్టపోతారని అందుకు వ్యతిరేకంగా మొదలైనా షాహీన్ బాగ్ ఉద్యమం యావత్తు భారతదేశాన్ని తెలియజేయడమే కాకుండా యావత్తు ప్రపంచానికి తెలియజేసింది. అందుకే ఈ చట్టాల విషయంలో విదేశాల్లో సైతం బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కానీ సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాట పంథా మారాల్సిన అసవరముంది. ఈ చట్టాల వల్ల ఈ దేశంలోని ముస్లింలకే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కూడా నష్టమేనని మేధావి వర్గం పేర్కొంటోంది. మరి ఈ తరుణంలో ఈ చట్టాలకు వ్యతిరేకంగా సాగే ఉద్యమాలలో కేవలం ముస్లింలే కనిపిస్తే ఎంతవరకు ప్రయోజనం...? మన భారత దేశానికి ఏ నష్టమొచ్చిన ముందుండి పోరాడిన ఘన చరిత్ర ముస్లింలకు ఉంది. స్వాతంత్ర్య ఉద్యమం సమయంలో కూడా లక్షలాధి ఉలేమాలు బ్రిటీష్ వారి చేత ఊరితీయబడ్డారు. కానీ ఇపుడు సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీల అమలు వల్ల ఈ దేశంలోని వెనకబడిన వర్గాలందరికీ ప్రమాదమే అయినపుడు ముస్లింలతోపాటు ఇతర ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు ఈ ఉద్యమంలో మమేకం కావాల్సివుంది. ఇలా అన్ని వర్గాలను మమేకం చేయాల్సిన బాధ్యత ఈ దేశంలోని ప్రతిపక్షాలకు ఉంది. కానీ ఈ దేశంలోని ప్రతిపక్షాలు చేస్తున్నది ఏమిటీ...? అన్నది అర్థంచేసుకొంటే వారు పోషించాల్సిన పాత్ర స్పష్టమవుతుంది.
రోగి తలించిందే డాక్టర్ మందుగా ఇస్తే, ఇక కావాల్సింది ఏముంది. సరిగ్గా మన దేశంలో సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీ చట్టాలతో ఈ దేశంలోని బీజేపీ ఏం చేయదల్చిందో దానికి అనుగుణంగానే ఈ దేశంలోని ప్రతిపక్షాల చర్యలుంటే ఇక కమలం పార్టీ నేతలకు కావాల్సిందేమిటీ...? సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీ చట్టాల వల్ల ఈ దేశంలోని ముస్లింలకే కాదు ఎస్పీ, ఎస్టీ, బీసీ వర్గాలకు తీవ్రనష్టం అన్నది జగమెరిగిన సత్యం. కాకపోతే ఈ నష్టం అన్ని వర్గాలకు ఉందన్నా వాస్తవాన్ని ఈ దేశంలోని యావత్తు ప్రజానికం గ్రహించేలా చేయడంలో మన దేశంలోని ప్రతిపక్షాలు విఫలమవుతున్నాయి. ఈ చట్టాల వల్ల దేశంలోని హిందువులకు గానీ ఇతర మైనార్టీలకు గానీ ఎలాంటి నష్టంలేదని వారి(ముస్లిం)కి తప్పా అని కేంద్ర హోంమంత్రి అమీత్ షా ప్రకటించారు. వారికి అన్న అమీత్ షా వాడిన పదజాలం యోక్క భావన ముస్లింలకే నష్టమన్నది స్పష్టమైన సంకేతం. ఇదే నిజం అని బలపర్చేలా ఈ దేశంలోని ప్రతిపక్షాలు తమకు తెలియకుండానే రుజువు చేసే పనిలో పడ్డాయి. వాస్తవానికి ఈ దేశంలోని ప్రతిపక్షాలు ఓటు బ్యాంకు రాజకీయాలను చేపట్టడమే ఇందుకు కారణం. కానీ ఈ చట్టాల వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర మైనార్టీ వర్గాలకు ఉందన్నది వాస్తవం. కేవలం ముస్లింలకేనని అమీత్ షా వ్యాఖ్యల ఉద్దేశం వెనక చాలా కారణాలున్నాయి. దేశంలోని అందర్ని ఒకేసారి టార్గెట్ చేస్తే బీజేపీ ప్రభుత్వం నిలవడం కష్టం. అందుకే విడతల వారీగా ఒక్కోవర్గాన్ని టార్గెట్ చేయడమే లక్ష్యంగా సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీ చట్టాల ఉద్దేశంగా కనిపిస్తోంది. అందుకే ఈ చట్టాన్ని కేవలం ముస్లింలకే బుచిగా ఈ చట్టాన్ని చూపే ప్రయత్నం సాగుతోంది. అంతమాత్రానా ముస్లింలతోనే ఈ చట్టం పరిమితమై ఇతర ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర మైనార్టీ వర్గాలకు టార్గెట్ కాదు అని అనుకొంటే పోరపాటే. ఎందుకంటే గత కొన్ని శతాబ్దాలుగా నిరక్షరాస్యులుగా ఉండి ఇపుడిపుడే అక్షరం నేర్చుకొంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీలు తమ పూర్వీకుల డాక్యుమెంట్లు ఎలా చూపగలరు. అందుకే సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమం ఈ దేశంలోని మెజార్టీగా ఉన్నవెనకబడిన వర్గాల ఉద్యమంగా రూపాంతరం చేదాలి. ఇది జరగాలంటే ఇపుడు ఈ చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాట పంథా మారాలి. అంటే ఈ చట్టాలకు వ్యతిరేకంగా సాగే ఉద్యమంలో ముస్లింలతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర మైనార్టీ వర్గాలను భాగస్వామ్యం చేసి ఐక్య ఉద్యమంగా మారేలా పోరాట పంథా మారాలి. ఈ గురుతర బాధ్యతను నిర్వహించాల్సింది. మన దేశంలోని ప్రతిపక్షాలు. కానీ ఈ దేశంలోని ప్రతిపక్షాలు చేస్తున్నదేమిటీ...? ముస్లింలు, ముస్లిం జేఏసీలు ఏర్పాటు చేసిన నిరసన శిభిరాలకు వచ్చి ఉపన్యాసాలు దంచిపోవడంతో ఈ చట్టాలు కేవలం ముస్లింలకే నష్టమన్న భావన కలిగేందుకు ప్రతిపక్షాలు దోహదపడుతున్నాయి. ఈ పరిణామాలు చాలా ప్రమాదకరం.  ఈ చట్టాలతో ముస్లింలకే నష్టం అన్న భావన బలపడితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర మైనార్టీలకు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది. ఈ వర్గాలకు కూడా మనందరం ద్రోహం చేసినట్లు అవుతుంది. ఇదేలాగో మున్మందు మనం అర్థంచేసుకొందాం..?
ఇస్లాక్ గ్రామపంచాయితీ నిర్ణయంతోనైనా మనం మేలుకొందాం...?
మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ పట్టణ సమీపంలోని ఇస్లాక్ గ్రామపంచాయితీ ఈ దేశంలోని సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీ చట్టాలపై పోరాడుతున్న వారికి ఓ మార్గ నిర్దేశం చేసిందని చెప్పాలి. ఈ దేశంలోని ప్రతిపక్షాలు ఈ గ్రామ పంచాయతీ తీసుకొన్న నిర్ణయం నుంచి గుణపాఠం నేర్చుకోవాల్సివుంది.  సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ పట్టణ సమీపంలోని ఇస్లాక్ గ్రామపంచాయితీ తీసుకొన్న నిర్ణయం మాత్రం యావత్దు దేశం ఆలోచించేలా వుంది.  పౌరసత్వ సవరణ చట్టం, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్నార్సీ)కు వ్యతిరేకంగా మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ పట్టణ సమీపంలోని ఇస్లాక్ గ్రామపంచాయితీ  తీర్మానం చేసిన ఉదంతం వెలుగుచూసింది. దేశంలోనే అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంటు తీర్మానం చేసిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ పట్టణ సమీపంలోని ఇస్లాక్ గ్రామపంచాయితీ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం సంచలనం రేపింది. 2వేల మంది జనాభా నివాసముంటున్న ఇస్లాక్ గ్రామంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానాన్ని గ్రామస్థుడు మహదేవ్ గావ్లీ ప్రతిపాదించగా, పంచాయితీ తీర్మానం చేసింది. తమ గ్రామ పంచాయితీ తీర్మానాన్ని కాదని కేంద్రం ఈ చట్టాలను అమలు చేస్తే తాము సహాయ నిరాకరణ చేస్తామని పంచాయితీ పెద్దలు హెచ్చరించారు. 2వేల మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో 45 శాతం మంది ఎస్సీ, ఎస్టీ జనాభా ఉన్నారు. తమ గ్రామంలో ఉన్న ఎస్టీలకు వారి పౌరసత్వాన్ని నిరూపించుకునే డాక్యుమెంట్లు లేవని, వారికి ఎలాంటి ప్రభుత్వ పథకాలు అందటం లేదని గ్రామపంచాయితీ సభ్యుడు యోగేష్ చెప్పారు. సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీ చట్టాలవల్ల ముస్లింలకే కాదు తమకు నష్టంవాటిల్లుతుందని ఎస్సీ, ఎస్టీలు 45శాతంగా ఉన్న ఈ గ్రామ పంచాయతీయే గ్రహించినపుడు మేధావి వర్గాలు ఎందుకు వాస్తవాన్ని విస్మరిస్తున్నాయి. అన్నీ తెలిసిన ఈ దేశంలోని ప్రతిపక్షాలు వాటిని ఎందుకు విస్మరిస్తున్నాయి. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలతో ప్రతిపక్షాలు కాలంవెలదీయడం వల్లే కేంద్రంలో అధికారంలో కూర్చున్న బీజేపీ ప్రభుత్వం ఇష్టమొచ్చిన చట్టాలను ప్రజల మనోభావాలతో నిమిత్తం లేకుండా చేస్తోంది. ఈ దేశంలోని ప్రతిపక్షాలు ముమ్మాటికి ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని చెప్పవచ్చు. లేకపోతే ఈ చట్టం వల్ల అన్ని వర్గాలకు నష్టం అని అందరికీ తెలుసు. అలాంటపుడు ఇతర వర్గాలను కూడా సమీకరించి సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా ముస్లింలు చేస్తున్న పరాటంలో వారిని ప్రతిపక్షాలు భాగస్వామ్యం చేసేవి. వాస్తవానికి పార్లమెంట్‌లో సీఏఏ గురించి చర్చ జరిగినపుడు ప్రతిపక్ష పార్టీలు దానికి వ్యతిరేకంగా గట్టిగా అభ్యంతరం చెబితే తమను ఎక్కడ దేశవ్యతిరేకులు అంటారోనని మెతకవైఖరిని ప్రదర్శించాయి. అందుకే బీజేపీ ఈ చట్టాలపై ఇంతటి ప్రజా వ్యతిరేకతవ్యక్తమవుతున్నా మేం ముందుకేనని మెండిగా చెబుతోంది. ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర  ఓటమి పొందినా బీజేపీ వైఖరిలో మార్పు రాకపోవడమే. దీనికి కారణం ఈ దేశంలని ప్రతిపక్షా ఓటు బ్యాంకు రాజకీయాలే.
ప్రతిపక్షాల్లో....షాహీన్ బాగ్ ఉద్యమ స్పూర్తి ఏదీ...?
న్యూఢిల్లీలోని షాహీన్‌బాగ్‌ గత ఏడాది డిసెంబరు 15న ఓ మహోత్తర ఉద్యమానికి వేదికగా మారింది. పౌరసత్వ సవరణ చట్టానికి(సిఎఎ) వ్యతిరేకంగా జామియా మిలియా ఇస్లామియా విద్యార్ధుల ప్రదర్శనను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రదర్శించిన క్రూరత్వానికి నిరసనగా ముస్లిం మహిళలు షాహీన్ బాగ్ అనే ఒక ముఖ్యమైన రోడ్డు మీద ధర్నా ప్రారంభించారు. తాము కూడా రాజ్యాంగానికి బద్దులమైన దేశభక్తులమే, ఈ దేశ మూల వాసులం అని ముస్లింల ఉద్రేకపూరితమైన దేశవ్యాపిత ఆందోళనకు మొగ్గ తొడిగింది. షాహీన్‌బాగ్‌ను సందర్శించిన వారు ఐదువందల మంది మహిళలు ఎంతో కాలం నిలవలేరు లేదా పెద్ద ప్రభావం చూపలేరు తొలుత అధికారంలోనున్న వారు అనుకోన్నారు. వాస్తవానికి షాహీన్‌బాగ్‌ భారత్‌ను మార్చింది. ఒకనాడు నరేంద్రమోడీని ఎవరు ఎదుర్కొలేరు అన్న పరిస్థితి నుంచి ఆయన్ని నిలువరించే సమయం ఆసన్నందన్న దాక పరిస్థితి వచ్చింది. ఈ ఉద్యమంతో అనేక నగరాలలో విద్యార్ధుల నిరసనలు చెలరేగాయి. తొలుత షాహీన్‌బాగ్‌లో ముస్లిం మహిళల ప్రదర్శన తరువాత బీజేపీ పాలిత రాష్ట్రాలన్నింటా ప్రారంభమయ్యాయి. సీఏఏ రాజ్యాంగవ్యతిరేకమని తిరస్కరిస్తూ గళం విప్పేందుకు ప్రతిపక్షాలను ఇది ఉద్యుక్తులను గావించింది. బీజేపీయేతర పాలిత రాష్ట్రాలలో జాతీయ పౌర చిట్టా(ఎన్‌ఆర్‌సి)ను అమలు జరిపేందుకు తిరస్కరించేట్లు చేసింది. దీన్ని అమలు జరపబోమనే దాని అర్ధం సీఏఏ అమలు సాధ్యం కానిదని చెప్పటమే. ఇది షాహీన్‌బాగ్‌లోని ఉద్యమంలోనున్న మహిళలకు ఒక అపూర్వ విజయమే అని చెప్పవచ్చు.

కాబట్టి మన దేశంలోని ప్రతిపక్షాలు సీఏఏ, ఎన్నార్సీ చట్టాలకు వ్యతిరేకంగా అన్ని వర్గాలను కూడగట్టాలి. ఈ చట్టం వల్ల జరిగే నష్టాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇతర మైనార్టీ వర్గాలకు వివరించాలి. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ వారు దేశ ద్రోహులు అని బీజేపీ చేసిన ఆరోపణలను భయపడాల్సిన అవసరంలేదు. దేశంలోని పౌరులకు నష్టంచేకూర్చే చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడటం ఎలా దేశ ద్రోహం అవుతుందని ప్రతిపక్షాలు ప్రశ్నించాలి. దేశంలోని మెజార్టీ ఓటర్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, ఇతర మైనార్టీ వర్గాలే. వారికి నష్టంచేకూర్చే చట్టాలను కచ్చితంగా ఈ దేశంలోని ప్రతిపక్షాలు వ్యతిరేకించాల్సిందే. ఈ దేశంలోఎవరు అధికారంలోనున్న ఇతర వ్యతిరేకత జరగాల్సిందే. లేకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, ఇతర మైనార్టీ వర్గాలకు ఈ దేశంలోని ప్రతిపక్షాలు ద్రోహం చేసినట్లు అవుతుంది. తద్వారా ఈ దేశ విద్రోహులుగా మారాల్సి వస్తుంది. దేశ భక్తులుగా నిలవాలంటే దేశంలోని ఏ పౌరుడికి నష్టం చేకూర్చే చట్టం వచ్చిన వాటిని వ్యతిరేకించి తీరాలి. కాబట్టి సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీ చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమంలో ముస్లిలంతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇతర మైనార్టీవర్గాలను భాగస్వామ్యం చేసే బాధ్యత దేశంలోని ప్రతిపక్ష పార్టీలు చేపట్టాలి. అంతేకాని ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఇప్పటికే ఏకమైన ముస్లింల పోరాటానికి ప్రతిపక్ష నేతలు ఒంటరిగా వచ్చి నాయకత్వం వహించాల్సిన అవసరంలేదు. అన్ని వర్గాలను ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేసినపుడే ప్రతిపక్షాలు తమ చిత్తశుద్దిని నిరూపించుకొన్నట్లు. అంతేకాకుండా తమ ఓటు బ్యాంకు రాజకీయాలు వీడినట్లు అవుతుంది.
..............................................

ఏటా కోటి ఉద్యోగాలన్నారు...ఉన్నవే పోగొడుతున్నారు
ఉపాధి కల్పనపై విస్తుగొల్పుతున్న సర్వే నివేదికలు

అనునిత్యం దేశ పౌరులు చైతన్య స్పూర్తితో ముందుకెళ్లినపుడే ఆ దేశంలోని ప్రజాస్వామ్యం విజయం సాధిస్తుంది. దేశంలోని పార్టీలు ఎన్నికలకు ముందు చేసే హామీలను అధికారంలోకి వచ్చాక ఎంతవరకు అమలు చేశాయి అన్న ఆలోచన వచ్చిన నాడే మన దేశంలోని ప్రజాస్వామ్యం కూడా పూర్తి స్థాయిలో విజయం సాధిస్తుంది. మన దేశం ఎంతో ప్రగతి సాధించాలనే కొరుకొనే భారతీయులుగా ప్రస్తుతం 2014 ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ చేసిన హామీలు ఏమిటీ...ఆయన అధికారంలోకి వచ్చాక చేసిందేమిటీ అన్నది ప్రతి ఒక్కరూ చర్చించాలి. ఆ సమయం ఇపుడు ఆసన్నమైంది. కానీ దేశంలో అందుకు విరుద్దమైన పరిస్థితి చోటు చేసుకొంది.
ప్రజలను నిత్యం ఏదో ఒక వివాదంలో పడేసి వారిని అందులోనే బీజీ చేసేస్తే ఇక తామకు తిరుగు ఉండదు. ఇది పాలకుల ఆలోచన. తాము అనుకొన్నది ఏదైనా చేసేయోచ్చ, తాను చేసిన హామీలకు జావాబు ఇవ్వనక్కర్లేదు. పైగా మళ్లీ ఎలాంటి జంకు లేకుండా మరో కొత్త నినాదంతో ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడగొచ్చు. ఇది నేడు మన దేశంలోని పాలకుల విధానం. మరీ ముఖ్యంగా నరేంద్రమోడీ సర్కార్ అనురిస్తున్న వ్యూహం ఇదే. 2003 నాటి నుంచి నేటి వరకు కొనసాగిన రాజకీయ పరిణామాలను చూస్తుంటే ప్రజలు ప్రశ్నించే స్థాయి నుంచి తాము ఎవరం అన్నది డాక్యూమెంట్లతో సహా నిరూపించే పరిస్థికి నెట్టేయబడాడు. ఇది నేడు మన దేశంలోని వింత పరిస్థితి. ఎన్నికలకు ముందు మీరు చెప్పిందేమిటీ...ఆచరణలో చేస్తున్నదేమిటీ అన్నది ఈ దేశంలోని ప్రతి భారతీయుడు ప్రశ్నించకపోవటం వల్లే నేడు ఈ పరిస్థితి. దీనికి కారణం లేకపోలేదు. బీజేపీ ప్రభుత్వంలోని పెద్దలు చేస్తున్న మతపరమైన వ్యాఖ్యలలో చిక్కుకోవడంవల్లే నేడు మన భారతీయులు ఈ దుస్థితిని ఎదుర్కొంటున్నారు. కానీ ఓ భారతీయుడిగా మాత్రం మనం మన బాధ్యతలను నెరవేర్చాలి. అపుడే ఈ దేశంలోని ప్రజాస్వామ్యం విజయం సాధిస్తుంది. ఇందుకోసం ఎన్నికలకు ముందు 2013లో నరేంద్ర మోడీ చేసిన హామీలు ఏమిటీ, వాటిని ఇపుడు ఎంతవరకు అమలు పరిచారు అన్నది ఓ భారతీయుడిగా నిలదీయడం మన అందరి ధర్మం. ఈ ఆలోచనలు రాకూడదన్న ఉద్దేశంతోనే మోడీ సర్కార్ కేంద్రంలో వచ్చాక గోరక్ష పేరుతో ముస్లిం, దళితులపై దాడులు, ట్రిబుల్ తలాక్ బిల్లు రద్దు, సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీ వంటి బిల్లుల రూపకల్పన. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీ చట్టాలపై చర్చ సాగుతోంది. వాస్తవానికి ఈ చట్టాలపై విస్త్రతమైన చర్చ అవసరమే. అదే సందర్భంలో గత ఐదేళ్లలో, తిరిగి మరో ఐదేళ్లకు ఎన్నికయ్యాక మోడీ ప్రభుత్వం ఏం చేసిందన్నది ప్రశ్నించే దిశగా యావత్తు దేశ ప్రజలు సన్నద్దం కావాలి. అపుడే మన దేశంలోని ప్రజాస్వామ్యం విజయం సాధిస్తుంది.
మోడీ సారథ్యంలో దేశం ముందుకా...వెనక్కా....?

అవినీతి రహిత భారత్, వారసత్వ రాజకీయాలకు చెక్, ఏటా కోటి ఉద్యోగాలు, విదేశాల్లోని నల్లధనం భారత్ కు రప్పిస్తాం, పేదోడి ఖాతాలో రూ.15లక్షలు జమా చేస్తాం ఇది నరేంద్రమోడీ కాళ్లకు బలపంకట్టుకొని దేశవ్యాప్తంగా తిరిగితిరిగి చేసిన బాసలు. వాస్తవానికి అది ఆచరణ రూపం దాల్పిందా...? నల్లధన వెలికతీత సాగిందా..? అంటే కాదనే అందరూ చెప్పే వాస్తవం. అయితే కనీసంగా ఏటా కోటి ఉద్యోగాలు నిరుద్యోగులకు కల్పించారా అంటే దిగ్భ్రాంతి కలిగే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. మన దేశంలో ఐఎల్‌వో(అంతర్జాతీయ కార్మిక సంస్థ) అంచనాలకు మించి నిరుద్యోగం ఎందుకుంది. నిరుద్యోగాన్ని పారద్రోలి ఉఫాది అవకాశాలు పెంచేందుకు మన ప్రధాని నరేంద్రమోడీ మైండ్ నుంచి పుట్టుకొచ్చిన  మేకిన్‌ ఇండియా ఏమైంది, స్కిల్‌ ఇండియా ఎక్కడుంది, 2015 నుంచి మార్పు లేకపోవడానికి కారణం ఏమిటీ...? ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య తగ్గుతున్నా మన దగ్గర ఎందుకు పెరుగుతోంది, ఉపాధి కల్పనపై ప్రభుత్వాల ప్రకటనలు సత్య దూరమా, నిరుద్యోగం పెరగడానికి కారణం ఏంటి అన్నది ఓ సారి ఆలోచించాల్సిన అంశం. అదే సందర్బంలో వీటికి సమాధానాలను కూడా మోడీ ప్రభుత్వమే జవాబు ఇవ్వాలి. ఎన్నికల ప్రచారంలో భాగంగా 2013లో 'మేం అధికారంలోకి వస్తే కోటి ఉద్యోగాలను కల్పిస్తాం' అని నరేంద్ర మోడీ ప్రకటించారు. సంవత్సరం తిరక్కుండానే భారీ మెజారిటీతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. కానీ తాజా సర్వే ప్రకారం ఉపాధి కల్పన నత్తనడకన సాగుతోంది. 2013-14లో కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ-2 ప్రభుత్వం అధికారంలోనున్నపుడు నిరుద్యోగం 4.9% ఉంది. కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చాక నిరుద్యోగం 5 శాతానికి పెరిగింది. కార్మికశాఖ తాజా గణాంకాల ఆధారంగా ఆర్థికవేత్త వినోజ్ అబ్రహమ్ ఓ అధ్యయనం చేశారు. అందులో భారతదేశంలో 2012-16 మధ్య ఉద్యోగాల కల్పన వృద్ధిశాతం భారీగా పడిపోయిందని తేలింది. వినోజ్ అబ్రహమ్ అధ్యయనంలో దిగ్భ్రాంతికి గురిచేసే మరో అంశం వెలుగుచూసింది. ఉపాధి క్షీణించిపోవడంతో పాటు 2014-15, 2015-16 మధ్య కాలంలో అంతవరకూ ఉన్న ఉద్యోగాలు కూడా ఆవిరైపోయాయి. స్వతంత్ర్య భారతంలో ఇలా జరగటం బహుశా ఇదే తొలిసారి కావచ్చు. ఉద్యోగాలు ఆవిరైపోవడం తాత్కాలికం కావచ్చు. కానీ సగంమంది భారతీయులు ఆధారపడ్డ వ్యవసాయం రంగంలో కూడా ఉపాధి మాయమవుతోంది.
గిట్టుబాటు ధరలు లేకపోవడం, వరుస కరవులూ రైతుల్ని వ్యవసాయ రంగానికి దూరం చేస్తున్నాయి. నిరుద్యోగ రైతులూ, రైతు కూలీలూ గృహనిర్మాణం ఇతర రంగాలపై ఆధారపడుతున్నారు.
దేశంలో నిరుద్యోగ వాస్తవ పరిస్థితి ఇలావుంది. మేకిన్‌ ఇండియా, స్కిల్‌ ఇండియా, ముద్రా యోజన తదితర పథకాలు నిరుద్యోగులకు అక్కరకు రావడం లేదా అంటే అవుననే చెప్పవచ్చు.  దేశంలోని తాజా పరిస్థితులు. ఉపాధి కల్పనలో కేంద్రం చెబుతున్న మాటలకు, చేస్తున్న ప్రకటనలకు క్షేత్రస్థాయిలో భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయా అంటే అవుననే అంటున్నాయి ఘనాంకాలు. భారతదేశంలో నిరుద్యోగ సమస్య అంతకంతకూ పెరుగుతోందా అంటే అవుననే అంటున్నాయి  దేశంలో నెలకొన్న పరిస్థితులు. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌వో) లెక్కలు సైతం ఈ విషయాన్ని స్పష్టంచేస్తున్నాయి. ‘ప్రపంచంలో ఉపాధి అవకాశాలు, సామాజిక కోణం-2018 సరళి’ అనే పేరుతో ఐఎల్‌వో రూపొందించిన తాజా నివేదిక భారత్‌దేశంలో నిరుద్యోగ సమస్య ఏ స్థాయిలో ఉందో కళ్లకు కట్టింది. 2017లో మన దేశంలో ఒక కోటీ 83 లక్షల మంది నిరుద్యోగులు ఉండగా 2018లో అది 1.86 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. 2019నాటికి ఇది ఇంకా పెరిగి 1.89 కోట్లకు చేరుకుంటుందనే అంచనాకు వచ్చింది ఐఎల్‌వో. 2018లో ఈ పెరుగుదల శాతం 3.4గా ఉండొచ్చని తొలుత అంచనా వేసినా అది 3.5 శాతం దగ్గరే కొనసాగవచ్చని అభిప్రాయపడింది. వాస్తవానికి మన దేశంలో 2012లో 3.6 శాతంగా ఉన్న నిరుద్యోగ సమస్య 2014 నాటికి 3.4 శాతానికి తగ్గింది. కానీ 2015లో 3.5కి చేరుకుంది. అప్పటి నుంచీ అది అలాగే కొనసాగుతుండటం గమనార్హం. అంచనాలకు మించి మన దేశంలో నిరుద్యోగత పెరిగిందని తాజా అధ్యయనాలు తేల్చిచెప్పాయి.
ప్రధాని ఇలా.. ఐఎల్‌వో అలా! 
2017కి ముందు కూడా ఐఎల్‌వో ఈ అంశంపై ఒక నివేదిక విడుదల చేసింది. అందులో 2017 నాటికి 1.78 కోట్లు, 2018లో 1.80 కోట్లగా నిరుద్యోగుల సంఖ్య ఉంటుందని అంచనా వేసినా 2017లో అంచనాలకు మించి 5 లక్షలు ఎక్కువగానే నిరుద్యోగుల సంఖ్య ఉన్నట్లు గుర్తించింది. విచిత్రం ఏమంటే ప్రధాని చెప్పిన లెక్కలకు, ఐఎల్‌వో నివేదించిన అంశాలకు ఎక్కడా పొంతన లేదు. దేశంలోని నిరుద్యోగతను పారద్రోలుతున్నామని మన ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికీ ఢంకాకొట్టి చెబుతున్నారు.
ప్రపంచం నిరుద్యోగతను అధిగమనించినా భారత్ లో మాత్రం...?
ప్రపంచవ్యాప్తంగా చూస్తే మాత్రం, నిరుద్యోగ సమస్య మూడేళ్లలో తొలిసారిగా కొంత తగ్గుముఖం పట్టడం సంతోషకరమైన విషయంగా ఐఎల్‌వో పేర్కొంది. 2017లో 19.27 కోట్లగా ఉన్న నిరుద్యోగుల సంఖ్య 2018లో 19.23 కోట్లుగా ఉండొచ్చని అంచనా వేసింది. అయితే ఉపాధి కోసం ఎదురు చూసే వారి సంఖ్య 19 కోట్ల దగ్గర స్థిరంగా ఉండటం ఆందోళన కలిగించే అంశంగా పేర్కొంది. కానీ ఈ రకంగా నిరుద్యోగ సమస్య ప్రపంచ వ్యాప్తంగా తగ్గినా భారత్ లో మాత్రం నిరుద్యోగ సమస్య ఏడాదికి ఏడాది పెరుగుతున్నట్లు అధికార ఘనంకాలు స్పష్టంచేస్తున్నాయి.
ఏ నిర్ణయంలో బీజేపీ విజయం...?

స్వప్రయోజన నిర్ణయాలు ఎప్పటికీ ప్రజలకు మేలు చేయవు వాస్తవం ఇటీవల బీజేపీ ప్రభుత్వం తీసుకొన్న పలు నిర్ణయాలతో తేటతేలమైంది. ఏదీ చేసిన దోశం కోసం, దేశ ప్రజల కోసమని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఢంకా కొట్టి చెబుతోంది. ఆచరణలో మాత్రం మోడీ ప్రభుత్వం ఇంతవరకు చేసిన నిర్ణయాలు తీసుకొచ్చిన చట్టాలు అంతా బీజేపీ, సంఘ్ పరివార్ కు ఉపయోగపడిందే తప్పా సామాన్య ప్రజలకు మేలు చేయలేదని పలు అంశాలు స్పష్టంచేశాయి. ఇందులో బాగమే పెద్ద నోట్ల రద్దు. వెయ్యి రూపాలయ వంటి పెద్ద నోట్ల వల్ల నల్లధనం దేశంలో ములుగుతోందిని, వాటిని వెలికితీయడమే లక్ష్యంగా నాడు నోట్ల రద్దు సాగింది. కానీ ఆచరణలో ఏం జరిగింది. వెయ్యి నోటి కంటే ఇంకా పెద్దదైనా రూ.2వేల నోటును కేంద్రం తీసుకొచ్చింది. ఏ పెద్ద నోటును వ్యతిరేకించిదో అంతకంటే పెద్ద నోటును బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. అంటే ఇక్కడ ప్రజా ప్రయోజనం ఉన్నట్లు , సొంత ప్రయోజనాలుండొచ్చా...? అంటే తమ సొంత వారి ప్రయోజనాలకేనని ఇట్టే అర్థమవుతోంది. 2019 ఎన్నికల్లో తన ప్రత్యర్థి పార్టీలను ఆర్థికంగా నష్టంచేసి కొత్త నోట్లను అమాంతంగా బీజేపీ నేతల వద్ద చేర్చి ఎన్నికల్లో సునాయాసంగా గెలవడమే ఈ నోట్ల రద్దు వెనక రహస్యమన్న విమర్శలు ఇప్పటికీ ఉన్నాయి. నోట్ల రద్దు నిర్ణయం తీసుకొన్న మరుక్షణమే ఎలాంటి అధికారిక ప్రకటన లేకముందు బీజేపీ నేతల చేతుల్లో రూ.2వేల కొత్త కరెన్సీ కట్టలు దర్శనమిచ్చాయి. అంటే బీజేపీ నోట్ల రద్దు ఉద్దేశం మనకు ఇట్టే అర్థమవుతుంది. ఇలా బీజేపీ ప్రభుత్వం తీసుకొన్న కొత్త నిర్ణయాలు దేశ ఆర్థిక ప్రగతిని ఎలా దెబ్బతీశాయో మనం ఓ సారి పరిశీలిద్దాం. వివాదాస్పదమైన నోట్ల రద్దు, జీఎస్టీ చట్టం వ్యవసాయ, గృహనిర్మాణ, చిరు వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపాయి. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పరిశీలన ప్రకారం రిటైల్, విద్యుత్, నిర్మాణ, నిత్యావసర విభాగం, ఇతర రంగాల్లోని 120 కంపెనీల్లో ఉద్యోగ నియామకాలు గణనీయంగా పడిపోయాయి. విస్తరణ ప్రణాళికలు, స్వల్పకాల వృద్ధిపై కూడా ఈ ప్రభావం పడింది. 'ఉపాధి కల్పన' ప్రస్తుతం భారతదేశం ముందున్న అతి పెద్ద సవాలు. ప్రతి సంవత్సరమూ ఒక కోటీ ఇరవై లక్షల మంది కార్మికులు ఉపాధి కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సమస్య దాదాపు 2030 వరకూ కొనసాగుతుంది. మరోవైపు.. ఆస్ట్రేలియా దేశ జనాభాతో దాదాపు సమానమైన 2 కోట్ల 60 లక్షల మంది భారతీయులు ఇప్పటికే ఉపాధి కోసం ఎదురుచూస్తున్నారు.
జీఎస్టీ, నోట్ల రద్దుతో చిరు వ్యాపారులు చతికిలపడ్డారు
''భవిష్యత్తులో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉండబోతోంది. కార్మిక శక్తి విపరీతంగా పెరుగుతోంది. రానున్న ముఫ్ఫై సంవత్సరాల్లో నెలకు దాదాపు పదిలక్షల మంది ప్రజలు కార్మికవర్గంలో భాగమవుతారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియా రెండంచెల ఆర్థిక వ్యవస్థను శాశ్వతపరుచుకునే క్రమంలో ఉంది'' అని ఇండియాస్ లాంగ్ రోడ్ పుస్తక రచయిత డాక్టర్ జోషి చెబుతున్నారు. ఇదిలావుంటే ఉపాధిని సృష్టించడం కోసం కార్మికులు ఎక్కువగా అవసరమయ్యే గార్మెంట్స్, లెదర్ మొదలైన పరిశ్రమలపై దృష్టి పెట్టాలి. లైసెన్స్‌లేని కారణాలను చూపి కబేళాలను మూసివేయడం, గోవధను నియంత్రించడం వంటి నిర్ణయాల కారణంగా 
ఇండియాలో లెదర్ ఎగుమతులు తగ్గిపోయాయి.

.

సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీ టార్గెట్ ముస్లింలేనా
అస్సాం పరిస్థితులు చూసైనా మేలుకోకపోతే ఎలా
ఈ చట్టాలను యావత్తు దేశం ప్రతిఘట్టించాల్సిందే

మతం అనే నషాతో ప్రజలను ఏమరపాటుకు గురిచేసి మనువాద అజెండా అమలుకు బీజాలు వేస్తున్నారు. అందుకే మనువాద అజెండా అమలుకు మార్గాలైన సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీ చట్టం ముస్లింలకే పరిమితం అన్న తపుడు సంకేతాలిచ్చి తమ భవిష్యత్ వ్యూహాన్ని అంతర్గతంగా అమలు చేస్తున్నారు. దీంతో ఈ చట్టంతో తమకు ఎలాంటి ముపు లేదని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు ఎమరపాటుతోవుంటే ప్రమాదమే. ఈ దేశంలోని విపక్షాలు కూడా ఈ చట్టాలతో కేవలం ముస్లింలకే నష్టం అన్నట్లుగా మాట్లాడుతూ బీజేపీ వ్యూహాం ఫలించేందుకు సహకరిస్తుయి. వాస్తవానికి ఈ చట్టాలు ముస్లింలతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ప్రమాదమే. వాటిని విడమర్చి చెప్పేందుకు విపక్షాలు, ఈ దేశంలోని లౌకిక, ప్రజా స్వామ్య వాదులు సిద్దంకావాలి. ఈ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ముస్లింలు సైతం తమ సోదరులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రజలకు ఈ చట్టాలతో ఉన్న ప్రమాదాన్ని వివరించి వారిని కలుపుకొని ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలి.
తాను అనుకొన్నది ప్రజలకు నచ్చిన రీతిలో అమలు చేయడం పాలకుల వ్యూహం. సరిగ్గా అదే చేస్తోంది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. అందుకే పాలక వర్గాలు ఓ ప్రమాదకర అజెండా అమలుకు ముందే అందుకు అనువైన మార్గాలను వేసుకొంటుంది. బీజేపీ ప్రభుత్వం కూడా ఇన్నాళ్లు చేసింది అదేనని రాజకీయ ఉద్దండుల మాట. నాకు ఓటేసి గెలిపించినందుకు గాను నిన్ను బానిసగా చేసి పాలిస్తా అంటే అలాంటి వారికి ఎవరైనా సరే ఓటేస్తారా, వేయరు. తమకు ఓటేస్తే ఒకప్పటి తన మనువాద అజెండా తరహా పాలన తెస్తా అంటే బీజేపీకి ఎవరూ ఓటేయరు. అందుకే 2014 ఎన్నికలకు ముందు అవినీతి రహిత పాలన, అభివృద్ధికర పాలన అని చెబితేనే నాడు బీజేపీకి ఓటేసి నరేంద్ర మోడీని ప్రధానిగా చేశారు ఈ దేశ ప్రజలు.
ఆయన చేసిన బాసల ప్రకారం నేడు దేశంలో అవినీతి రహిత పాలన సాగాలి, విదేశాల్లోని నల్లధనం వెలికితీత జరిగి ప్రతి పేదోడి బ్యాంకు ఖాతాలో రూ.15లక్షలు జమా చేయాలి. ఇక ఏడాదికి దేశ వ్యాప్తంగా కోట్ల మందికి ఉద్యోగాలు రావాలి. ఇదే వచ్చివుంటే నేడు మోడీ చెప్పిన అచ్చేదిన్ గురించి చర్చ జరిగివుండేది. కానీ 2014లో కేంద్రంలో నరేంద్రమోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఇవన్ని జరగకపోగా గో రక్షణ పేరుతో ముస్లింలు, దళితులు, బీసీలపై దాడులు పెట్రేగాయి. మతం, కులం పేరుతో ముస్లిం, మైనార్టీ, బడుగు బలహీన వర్గాల మహిళలపై ఆత్యాచారాలు పెరిగాయి. దీంతో ఒక్కసారిగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ముస్లిం, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ఇది గమనించిన బీజేపీ ప్రభుత్వం తన మనువాద అజెండా అమలుకు ఇది సరైన సమయం కాదని తన పంథాను మార్చింది. తన మనువాద అజెండాను బలంగా అమలు చేయాలంటే దేశంలోని ప్రజలను మతం ఆధారంగా విభజించాలన్న వ్యూహానికి వచ్చింది. అందుకే 2019 ఎన్నికలకు రెండేళ్ల ముందునుంచి తెరపైకి మంత అజెండాను తీసుకొచ్చింది. రామ మందరి నిర్మాణం, హిందువులే దేశ భక్తులు అన్న రీతితో బీజేపీ తీసుకొన్న నిర్ణయాలు చాలా వరకు ఫలిస్తూ వచ్చాయి. అందుకే తన మనువాద అజెండాను అమలు చేసేందుకు ఇదే సరైన సమయమని బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీ వంటి చట్టాలను తీసుకొచ్చింది. దేశ ప్రజలు మతాల వారీగా విడిపోతున్నారని భావించిన బీజేపీ ప్రభుత్వం సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీ చట్టాల వల్ల హిందువులకు ఎలాంటి నష్టంలేదని, ముస్లింలే టార్గెట్ అని నేరుగా సంకేతాలిచ్చింది. ఇక్కడే ఈ దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు బీజేపీ ఉచ్చులో పడుతున్నాయని చెప్పవచ్చు. అయితే ఈ చట్టాల వల్ల ముస్లింలకే కాదు తమకు ప్రమాదమని భావిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలలోని మేధావులు ముస్లింలతో కలసి పోరాడేందుకు సిద్దమవుతున్నారు. కానీ ఈ ఐక్యత ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలలోని అట్టడుగు ప్రజల నుంచి సైతం రావాలి. అపుడే మనువాద అజెండాను అడ్డుకోగలుగుతాం.
అస్సాం ఘటనలతోనైనా మేలుకోకపోతే ఎలా....?

పైన పేర్కొన్న చట్టాలలోని ప్రశ్నలు చూస్తే ముస్లింలకే కాదు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు పెద్ద ప్రమాదం అన్న వాస్తవం బోధపడుతుంది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అస్సాం రాష్ట్రంలోని వాస్తవాలు. ఈ ఘటనలను చూసైనా సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీ చట్టాలకు వ్యతిరేకంగా ముస్లింలతో కలిసి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు పోరాడక పోతే మనువాద సమాజంలో మరోమారు బంధీకాకతప్పదు. ఓ సారి అస్సాంలో ఈ చట్టాల వల్ల కేవలం ముస్లింలే బాధితులయ్యారు. ఇతర మతాల వారు కాలేదా, హిందువులు కాలేదా అన్నది ఓ సారి పరిశీలిద్దాం. ఇప్పటివరకు అస్సాంలో 19 లక్షలు అనుమానిత పౌరుల్లో 14 లక్షల ముస్లిమేతరులు ఉన్నారు. వారిలో మతంతో సంబంధం లేకుండా అనేకమంది ప్రభుత్వ ఉద్యోగాలు కోల్పోయారు. ఓటు, ఆధార్ హక్కులను కోల్పోయారు. వారెవరికీ పౌరసత్వాన్ని ఇవ్వలేదు. అందులో హిందువులు డిటెన్షన్ సెంటర్లో (నిర్బంధ కేంద్రాలు) బిక్కుబిక్కుమని జీవిస్తున్నారని రైట్స్ ఫర్ సిటిజన్స్ అనే ఎన్జీవో సంస్థ తెలిపింది. ఎన్నార్సీ దేశ వ్యాప్తంగా నిర్వహిస్తామని ప్రకటన చేసిన దగ్గర్నుంచి ఇప్పటివరకు పశ్చిమబెంగాల్లో 24 మంది  ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో హిందువులు అధిక శాతం ఉన్నారు.
ముస్లింలకే కాకుండా బడుగు, బలహీన వర్గాలకు ప్రమాదం అన్నవాస్తవాన్ని తెలియజేద్దాం...
ఈ రోజు ఏంటి అనే ఆలోచనల్లో బంధిఅవుతున్న నేటి తరం నేడు తానున్న పరిస్థితికి కారణం ఎవరు అన్నది ఆలోచించలేకపోతున్నాడు. అందుకే తనకు తెలియకుండానే తాను ప్రమాదాన్ని కోరితెచ్చుకొంటున్నాడు. ప్రస్తుతం సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన దేశంలోని 70శాతంగానున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు ముస్లింలతో కలసి పోరాడాల్సిన వాస్తవాన్ని విస్మరిస్తున్నాయి. ఎన్పీఆర్, ఎన్నార్సీ, సీఏఏ చట్టాలు అందరికీ ప్రమాదమే. ఈ చట్టాల పై పూర్తి అవగాహన లేని వారే 'కేవలం ఇది ముస్లిములకు సంబంధించింది' అనే అపోహలో ఉన్నారు. నిజానికి ఇది కులం, మతం, ప్రాంతం అనే భేదం లేకుండా అందరికీ ప్రమాదమే. అది ఎంత ప్రమాదమో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ముందుగా ప్రభుత్వం ఎన్పీఆర్ నిర్వహించనుంది. ఇంతకుముందు జరిగే జనగణన(జనాభా లెక్కల) కార్యక్రమానికి ఇప్పుడు జరగబోయే ఎన్పీఆర్ (జాతీయ జనాభా పట్టిక) చాలా తేడా ఉంది. 2020 ఎన్పీఆర్ లో భాగంగా సదరు ప్రభుత్వ అధికారి ఇంటింటికి వచ్చి జనాభా లెక్కలను తీసుకునేటప్పుడు మీ వద్ద నుండి సూక్ష్మ స్థాయి సమాచారాన్ని సేకరిస్తాడు. అందులో మీ పుట్టిన తేదీ, స్థలం, మీ తండ్రి పుట్టిన తేదీ, స్థలం, మీ గత నివాసపు సమాచారం, మరో ఆరు నెలలు ఎక్కడ ఉంటారు, మీ ఆస్తుల, బ్యాంకు ఖాతా వివరాలు, సొంతింటి గలవారైతే ఏ మెటీరియల్ తో ఇల్లు కట్టారు‌, గదులెన్ని, బాత్రూంలెన్ని తదితర సమస్త సమాచారాన్ని మనం చెప్పాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి సదరు అధికారి ఎటువంటి ధ్రువపత్రాలు అడగడు. ఒకవేళ మీరు ఇచ్చిన సమాచారం అబద్ధమని తేలితే ( మీ తల్లిదండ్రుల సమాచారం వారు సేకరిస్తారు ,అక్కడ ఆరోగ్యశాఖలో వారి పేర్లు పుట్టిన తేదీ లేకపోతే) మిమ్మల్ని అనుమానిత పౌరులుగా నిర్ణయిస్తారు. మీకు ఒక నోటీసు వెలువడుతూ మీరిచ్చిన సమాచారం మా వద్ద ఉన్న సమాచారంతో రుజువు కాలేదని, ఫలానా తారీకు లోపు మీరు నిరూపించుకోవాలని సంబంధిత అధికారి హెచ్చరిస్తాడు. ఒకవేళ ఆ తారీకు లోపు సదరు వ్యక్తి ఇచ్చిన సమాచారాన్ని రుజువు చేసుకోలేని పక్షంలో అతని పౌరసత్వం రద్దు చేయబడుతుంది.
జనాభా లెక్కల సేకరణకు వచ్చే సదరు ప్రభుత్వ అధికారికి మీ పౌరసత్వం మీద అనుమానించే హక్కు ఉంది. ఈ విధంగా మీ పౌరసత్వంపై అధికారికి అనుమానం వస్తే మీ పేరు అనుమానిత పౌరుల జాబితాలో చేర్చబడుతుంది. అనుమానిత పౌరులు ఎన్నార్సీ లో తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఎన్నార్సీ లో ఆధార్ కార్డు, ఓటర్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, విద్య సంబంధిత ధ్రువపత్రాలు పనిచేయవు.
బర్త్ సర్టిఫికెట్లు, భూ ధ్రువ పత్రాలు, పన్ను రసీదులు తదితర ప్రభుత్వ అధికారిక పత్రాలు పొందుపరచాలి. ఇవి దొరకాలంటే ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరగాలి. ఒకవేళ పత్రాలు పొందినా, సదరు అనుమానిత పౌరుని పేర్లలో చిన్న అక్షరదోషాలున్నా పౌరసత్వం చెల్లదు. అస్సాం ఎన్నార్సీలో పేర్లలో చిన్న చిన్న తప్పులతో పౌరసత్వాన్ని కోల్పోయిన వారు లక్షల్లో ఉన్నారు. ఈ విధంగా అనుమానిత పౌరుల్లో వెనుకబడిన కులాల వారు, అన్ని మతాలవారు రాగలరు. అయితే ఎన్నార్సీలో  పేరు రాణి హిందువులు భయపడవలసిన అవసరం లేదని  'కా'(సీఏఏ- పౌరసత్వ సవరణ చట్టం) ప్రకారంగా ఎటువంటి ధ్రువపత్రాలు లేకుండానే ముస్లిములకు తప్ప మిగతా వారికి పౌరసత్వాన్ని ప్రసాదిస్తాము అని ప్రభుత్వం అంటోంది. ఇది పచ్చి అబద్ధం.
అస్సాం ఘటనలతోనైనా మేలుకోకపోతే ఎలా....?
పైన పేర్కొన్న చట్టాలలోని ప్రశ్నలు చూస్తే ముస్లింలకే కాదు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు పెద్ద ప్రమాదం అన్న వాస్తవం బోధపడుతుంది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అస్సాం రాష్ట్రంలోని వాస్తవాలు. ఈ ఘటనలను చూసైనా సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీ చట్టాలకు వ్యతిరేకంగా ముస్లింలతో కలిసి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు పోరాడక పోతే మనువాద సమాజంలో మరోమారు బంధీకాకతప్పదు. ఓ సారి అస్సాంలో ఈ చట్టాల వల్ల కేవలం ముస్లింలే బాధితులయ్యారు. ఇతర మతాల వారు కాలేదా, హిందువులు కాలేదా అన్నది ఓ సారి పరిశీలిద్దాం. ఇప్పటివరకు అస్సాంలో 19 లక్షలు అనుమానిత పౌరుల్లో 14 లక్షల ముస్లిమేతరులు ఉన్నారు. వారిలో మతంతో సంబంధం లేకుండా అనేకమంది ప్రభుత్వ ఉద్యోగాలు కోల్పోయారు. ఓటు, ఆధార్ హక్కులను కోల్పోయారు. వారెవరికీ పౌరసత్వాన్ని ఇవ్వలేదు. అందులో హిందువులు డిటెన్షన్ సెంటర్లో (నిర్బంధ కేంద్రాలు) బిక్కుబిక్కుమని జీవిస్తున్నారని రైట్స్ ఫర్ సిటిజన్స్ అనే ఎన్జీవో సంస్థ తెలిపింది. ఎన్నార్సీ దేశ వ్యాప్తంగా నిర్వహిస్తామని ప్రకటన చేసిన దగ్గర్నుంచి ఇప్పటివరకు పశ్చిమబెంగాల్లో 24 మంది  ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో హిందువులు అధిక శాతం ఉన్నారు.
అసలు లక్ష్యం వారే..

       ముస్లిములను లక్ష్యంగా చేసుకుని 75 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను బానిసలుగా మారుస్తామని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన ప్రకటన వైరల్ అవ్వడం ఆందోళన చెందాల్సిన విషయం. రిజర్వేషన్లతో వెనుకబడిన వర్గాలు ఉన్నత స్థాయి హోదాల్లో ఉన్నారు కాబట్టి మనువాదులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎలాగైనా సరే రిజర్వేషన్లు రద్దు చేసి వారి హక్కులను కాలరాయడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే ఈ సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీ లను తెచ్చారు. 15 శాతం ఉన్న ముస్లిములు ఏనాడూ తమకు రిజర్వేషన్లు, భూములు, ఉద్యోగాలు కావాలని ఉద్యమాలు చేయలేదు. 75 శాతం ఉన్న వెనుకబడిన వర్గాలు తమ హక్కుల కోసం పోరాటం చేశారు. ఎందుకంటే ఒకప్పుడు మనువాదులు వారిని బానిసలుగా, పశువుల కంటే హీనులుగా గుర్తించారు. 'అన్ని వర్గాల వారికి సమాన హక్కులు కల్పించబడాలి' అనే ఉద్దేశంతోనే వెనుకబడిన వర్గాల గళం వినిపించబడాలని అంబేద్కర్ గారిని గెలిపించి ముస్లిములు పార్లమెంట్ కు పంపారు. ఏ అంబేద్కరిస్టును అడిగినా ఈ విషయాన్ని సత్యమని ఒప్పుకుంటాడు. ఎన్నార్సీలో పేర్లు నిరూపించుకోలేని హిందూ మతానికి చెందిన   కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న సైనికుల ను   పౌరసత్వాన్ని కల్పిస్తామని చెప్పిన అమిత్ షా నెలలు గడిచినా ఇప్పటి వరకు వారికి పౌరసత్వాన్ని ప్రసాదించలేదు. పైగా నిర్బంధ కేంద్రాల్లో(డిటెన్షన్ సెంటర్స్)లో చలి తీవ్రతవల్ల 117 మంది అనధికారికంగా మృత్యువాత పడ్డారు. ఇందులో అనేక  మంది హిందువులు ఉన్నారు. హిందూ పక్షపాతులమని చెప్పే మనువాదులు వారి రక్షణ కోసం చర్యలు తీసుకోకపోవడంతోనే అర్థమవుతుంది వారి లక్ష్యం ఏమిటో.
ఎన్పీఆర్ తో వెనుకబడిన వర్గాల రిజర్వేషన్ల గల్లంతు...
ఎన్పీఆర్ లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ మతాన్ని పొందుపరచాలి. ఈ విధంగా ఎవరైతే హిందూ మతం నుండి ఇతర మతాలకు మారారో వారు మైనారిటీలుగా గుర్తించబడతారు. ఇక వారు ఎస్సీ, ఎస్టీ, బీసీలుగా పరిగణించబడరు. ప్రభుత్వ అధికారి మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు హిందువులే అని అబద్ధం చెప్పినా, మీ ఇంటి పరిస్థితిని గమనించి అనుమానిత జాబితాలో మీ పేరును రాసే అధికారం అతనికి ఉంది. దీనివల్ల మొత్తానికి పౌరసత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. పౌరసత్వాన్ని కోల్పోతే ఓటు, ఆధార్, లైసెన్స్, సొంత ఇంటి కలిగే హక్కు, తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కోల్పోతారు. పైగా నిర్బంధ కేంద్రాలకు తరలించబడతారు.
మనుస్మృతి స్థాపన దిశగా...

సీఏఏ అనగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల నుండి 2014 కి ముందు వచ్చిన  వలసదారుల్లో, అక్రమ చొరబాటుదారుల్లో  ముస్లిమేతరులకు తప్ప అందరికీ పౌరసత్వాన్ని కల్పించే చట్టం ఇది. ఇక్కడే అసలు చిక్కు ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్పీఆర్ నిర్వహిస్తే 75 శాతం మంది తమ పౌరసత్వాన్ని నిరూపించుకోలేరని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1971 ముందు బర్త్ సర్టిఫికెట్ లు, ల్యాండ్ కాగితాలు, పన్ను రసీదులు, పాస్పోర్ట్ తదితర ప్రభుత్వ అధికారిక ధ్రువపత్రాలు పొందుపరిచాలి. ఈ పత్రాలు సంపాదించాలంటే అత్యంత కష్టపూరిత కార్యం. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ వర్గాల్లో నిరక్షరాస్యత ఉందని, సొంత ఆస్తి లేనివారు 50 శాతానికి పైగా ఉన్నారని ఫలితంగా వారు పౌరసత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని సుప్రీంకోర్టు న్యాయవాదులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ పౌరసత్వాన్ని కోల్పోతే ముస్లిములు తప్ప మిగతా వారందరూ తాము విదేశాల నుంచి అక్రమంగా ఇక్కడ నివసిస్తున్నామని చెప్పుకోవాలి. అయితే వీరికి 'కా'(సీఏఏ) చట్టం ప్రకారంగా ఆరు సంవత్సరాల అనంతరం పౌరసత్వాన్ని ప్రసాదిస్తామని ప్రభుత్వం చెబుతోంది. అప్పటివరకు సమస్త పౌరసత్వ అధికారాలు( ఓటు,ఆధార్,రేషన్ తదితర పథకాలు) తొలగించబడతాయి. ఒకసారి పౌరసత్వాన్ని సవరించినవారు మరొకసారి సవరణ చేయరని గ్యారెంటీ ఏమిటి, ఎందుకంటే మనువాదులు చెప్పేది అమలు పరచరు. ఇస్తామన్న రెండు కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా, ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు పడ్డాయా, విదేశాల్లో ఉన్న నల్లధనం వచ్చిందా, దేశ ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లకు చేరిందా, వీటికి బదులుగా ఉన్న ఉద్యోగాలు పోయి, లక్ష పరిశ్రమలు మూతబడి, నాలుగు శాతానికి జిడిపి పడిపోయి, నల్లధనానికి బదులు బ్యాంకుల్లో మనం దాచుకున్న తెల్లధనం విదేశాలకు దోచుకెళ్లిన ఘటనలు మనం విన్నాం. మరల ఈ మనువాదులు  మరొకసారి పౌరసత్వాన్ని సవరిస్తూ క్రైస్తవులను, అనంతరం బౌద్ధులను, ఎస్సీ, ఎస్టీ, బీసీలను కా(సీఏఏ) చట్టం  చట్టం నుండి కచ్చితంగా మినహాయిస్తారు. ఆ విధంగా వెనుకబడిన వర్గాలందరీ పౌరసత్వాన్ని లాగేసుకుంటారు. ఇక చివరగా వారు తమ మన స్మృతిని స్థాపించి ఆధిపత్యాన్ని చలాయిస్తారు. అందుకే తమ మేనిఫెస్టోలో ఉన్న ప్రజా సంక్షేమ పథకాలు అమలు పరచకుండా రామ్ మందిరం, 370 ఆర్టికల్, త్రిపుల్ తలాక్, సర్జికల్ స్ట్రైక్, పి ఓ కే ఆధీనం, వందేమాతరం, జై శ్రీరామ్, యూపీఏ చట్టం, జాతీయ చిహ్నాల పేర్ల మార్పు,  తదితర అవసరం లేని అసంబద్ధ నిర్ణయాలు తీసుకుంటూ తామే దేశభక్తి కలవారమని చెప్పుకుంటూ ప్రజల మధ్య విభేదాలు, విద్వేషాలు రెచ్చగొడుతూ మనుస్మృతి స్థాపన దిశగా బీజేపీ ప్రభుత్వ పెద్దలు అడుగులు వేస్తున్నారు,. రండి సమిష్టిగా అందరూ ఉద్యమించి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుదాం.