TRENDING NOW

మాతృభాషను మరువద్దు 


ప్రపంచంలో ఎన్నో భాషలు చెలామణిలో ఉన్నాయి. ఎవరి మాతృభాష వారికి ప్రీతికరమైనది. కానీ ఆంగ్ల భాష ఆధిపత్యంతో మాతృభాషలు చిన్నబోతున్నాయి. ఆంగ్లంలో చదువుకుంటేనే భవిష్యత్తు అన్న చందంగా మారాయి పరిస్థితులు. ఇదంతా మనం కల్పించుకున్న, చేసుకున్న దాని ఫలితమే. ప్రపంచంలోనే అత్యంత ఆధునికతతో దూసుకెళుతున్న ఇజ్రాయీల్ వాళ్లెవరూ ఇంగ్లీషు మాట్లాడరు. జర్మనీలో వాళ్లయితే ఇంగ్లీషును ద్వేషిస్తారు. ఇక టర్కీలో అయితే కార్యకలాపాలన్నీ అక్కడి టర్కీ భాషలోనే జరుగుతాయి. టీచర్ మొదలు జడ్జి దాకా అంతా వాళ్ల మాతృభాషలోనే మాట్లాడతారు. చైనాలోనూ కింది స్థాయి నుంచి ఉన్నతస్థాయి అధికారుల దాకా ఎవ్వరూ ఇంగ్లీషులో మాట్లాడరు. ఈరాన్ లో అధికారిక కార్యక్రమాలన్నీ అక్కడి ఫార్శీ భాషలోనే సాగుతాయి. ఈరాన్ వాసులెంతోమందికి నోబెల్ బహుమతులు వరించాయి. ఇంగ్లీషులో తప్పా మనం అభివృద్ధి అసాధ్యమనే విషయాన్ని ఎవరో మనకు నూరిపోశారు. మనల్ని తప్పుదోవ పట్టించారు. పరభాషలు నేర్చుకోవడంలో తప్పు అని నేననట్లేదు. మన మాతృభాషను మాత్రం నిర్లక్ష్యం చేయడం తగదు. ఎక్కడో ఒకచోట తప్ప మాతృభాషలో విద్యను అందించే పాఠశాలలు ఇంచుమించు కనుమరుగవయ్యాయి. పేరెంట్స్ తమ పిల్లల్ని చదివిద్దామన్నా అలాంటి స్కూళ్లు లేవు ఇప్పుడు. 

రచయిత-ముహమ్మద్ ముజాహిద్,

 సెల్ నెం- 9640622076

హైదరాబాద్

 వెయ్యేళ్ల నుంచి ఏటా నగ్నంగా పురుషుల ఉత్సవం..

ఈ ఏడాదే చివరిది.. ఎందుకంటే

అక్కడ పురుషులు అంతా ఏటా నగ్నంగా ఉత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ ఉత్సవాలు ఇప్పటివి కాదు.. గత 1000 సంవత్సరాలుగా ఈ నగ్న ఉత్సవాలు జరుగుతూనే ఉన్నాయి. వేలాది మంది ప్రజలు ప్రతీ సంవత్సరం నిర్వహించే ఈ న్యూడ్ ఫెస్టివల్‌ను చూసేందుకు దేశ, విదేశాల నుంచి కూడా పర్యాటకలు వస్తారు. అయితే ఈ నగ్న ఉత్సవం అంతరించిపోయే దశలో ఉంది. వీటిని భవిష్యత్‌లో నిర్వహించకూడదని అక్కడి వారు నిర్ణయించారు. దానికి కూడా ఓ కారణం ఉంది. ఈ న్యూడ్ ఫెస్టివల్‌లో పాల్గొనేవారి సంఖ్య ఏడాదికి ఏడాది తగ్గిపోతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నగ్న ఉత్సవం జపాన్‌లో నిర్వహిస్తారు.

జపాన్‌లో గత 1000 ఏళ్లుగా హడకా మత్సూరి లేదా సోమిన్ సాయి అనే పేరుతో న్యూడ్ ఫెస్టివల్ నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఈ న్యూడ్ ఫెస్టివల్ అనేది వారి సంప్రదాయంగా శతాబ్దాల నుంచి వస్తోంది. జపాన్‌ ఉత్తర ప్రాంతంలోని ఇవాట్ ప్రి ఫెక్చర్‌లోని అడవిలో కొకుసేకి-జి ఆలయం వద్ద ఈ నగ్న ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ న్యూడ్ ఫెస్టివల్‌లో వందలాది మంది యువకులు నగ్నంగా పాల్గొంటారు. ఈ ఉత్సవంలో జస్సో జోయాసా ( చెడును అంతం చేయడం) అనే నినాదాలు చేస్తారు. అయితే ఈ న్యూడ్ ఫెస్టివల్‌ను చూసేందుకు ప్రతీ సంవత్సరం వేలాది మంది జపాన్ వాసులే కాకుండా విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు కూడా హాజరవుతారు. అయితే ఈ న్యూడ్ ఫెస్టివల్ ఈ ఏడాది ముగిసింది. గత కొన్నేళ్లుగా ఈ న్యూడ్ ఫెస్టివల్‌లో పాల్గొనే వారి సంఖ్య తగ్గిపోతుండటంతో దానికి ప్రాబల్యం కూడా క్రమంగా తగ్గుతోంది.

అయితే జపాన్‌లో ఈ నగ్న పండుగలో పాల్గొనడానికి ధైర్యం చేసే యువకుల సంఖ్య రోజు రోజుకూ తగ్గిపోతోందని స్థానికులు చెబుతున్నారు. శతాబ్దాల ఈ సంప్రదాయాన్ని సజీవంగా ఉంచిన గత తరం ప్రజలు ఇప్పుడు వృద్ధులు కావడంతో.. కొత్తగా యువత ఇలాంటి ఫెస్టివల్‌లో పాల్గొనడానికి అంతగా ఆసక్తి చూపడం లేదు. ఇక జపాన్‌లో ఈసారి నిర్వహించిన న్యూడ్ ఫెస్టివల్‌ చివరిది అని కొన్ని కథనాలు వెలువడుతున్నాయి.

సాధారణంగా ఈ న్యూడ్ ఫెస్టివల్‌లో యువకులు మాత్రమే పాల్గొంటారు. ఇందులో పాల్గొనే యువకులు కేవలం తెల్ల గుడ్డను మాత్రమే తమ ప్రైవేటు భాగాలపై కప్పుకుంటారు. చాంద్రమాన నూతన సంవత్సరం ఏడవ రోజు రాత్రి మొత్తం ఈ న్యూడ్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తారు. మొదట నగ్నంగా ఉన్న యువకులు కొకుసేకి-జీ ఆలయ సమీపంలోని యముచి నదిలో చలిలో స్నానం చేసి చెడును అంతం చేయండి అంటూ అరుస్తూ ఆలయంలోకి పరిగెత్తుతారు.

ఆ తర్వాత యువత మధ్య వివిధ రకాల పోటీలు నిర్వహిస్తారు. ఈ ఫెస్టివల్ రాత్రి ప్రారంభం అయి.. ఉదయం వరకు కొనసాగుతుంది. చివర్లో సోమిన్ అనే ఓ బ్యాగును తెచ్చుకునేందుకు యువకుల మధ్య పోటీ ఉంటుంది. అయితే ఈ పోటీనే ఈ నగ్న ఉత్సవంలో హైలెట్‌గా నిలుస్తుంది. వందలాది మంది పురుషులు చెక్కతో కూడిన గుడి లోపల కేకలు వేస్తూ నినాదాలు చేస్తూ దూకుడుగా ఆ బ్యాగ్‌పై దూకుతారు. అయితే వెయ్యేళ్ల క్రితం ప్లేగు వంటి అంటు వ్యాధులు రాకుండా ఉండేందుకు ఈ ఆచారాన్ని ప్రారంభించినట్లు స్థానికులు చెబుతారు. అయితే ఈ సీజన్‌లో అక్కడ విపరీతమైన చలి ఉన్నా.. యువకులు బట్టలు లేకుండా నదిలో చిందులు వేస్తూ పండుగ జరుపుకుంటారు.

 బార్బీ బొమ్మలాంటి అమ్మాయితో పుతిన్ ప్రేమాయణం..

71 ఏళ్ల వయసులో 39 ఏళ్ల మహిళతో ఎఫైర్

ఉక్రెయిన్‌పై దండయాత్ర చేపట్టినప్పటి నుంచి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన తీసుకునే నిర్ణయాలు, ప్రత్యర్థులను అంతమొందించడానికి ఎంత వరకైనా వెళ్లడం పుతిన్ నైజం. ఇక అత్యంత కఠినమైన వ్యక్తి అని కూడా ఆయనకు పేరు ఉంది. తాను అనుకున్నది చేసేవరకు వదిలిపెట్టకపోవడం పుతిన్‌ లక్షణమని.. ప్రస్తుతం 2 ఏళ్లుగా జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం చూస్తేనే అర్థం అవుతోంది. ఇలాంటి కఠినమైన వ్యక్తి కూడా ప్రేమకు దాసోహం అని తాజాగా నిరూపితం అయింది. అది కూడా 71 ఏళ్ల వయసులో. ప్రస్తుతం ఓ మహిళతో పుతిన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. తన కంటే వయసులో చాలా చిన్నదైన ఓ మహిళతో పుతిన్‌ ప్రేమాయణం కొనసాగిస్తున్నారంటూ కథనాలు వినిపిస్తున్నాయి.

39 ఏళ్ల ఎకాథరీనా మిజులినాతో వ్లాదిమిర్ పుతిన్ కొంతకాలంగా ప్రేమాయణం సాగిస్తున్నట్లు రష్యాలోని సోషల్‌ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే పుతిన్ అనుకూల వ్యక్తి అయిన మాజీ సెనెటర్‌ ఎలెనా మిజులినా కుమార్తెనే ఎకాథరీనా మిజులినా. ఎకాథరీనా మిజులినా ప్రస్తుతం క్రెమ్లిన్‌కు మద్దతుగా ఉండే సేఫ్ ఇంటర్నెట్ లీగ్‌కు చీఫ్‌గా ఉన్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యాతో పాటు పుతిన్‌పై వచ్చే విమర్శలను ఇంటర్నెట్ నుంచి తొలగించడమే ఈ సేఫ్ ఇంటర్నెట్ లీగ్ ప్రధాన కర్తవ్యం.

అయితే అచ్చం బార్బీ బొమ్మలా కనిపించే ఎకాథరీనా మిజులినాతో ఈ మధ్యకాలంలో పుతిన్‌ చాలా సన్నిహితంగా ఉంటున్నారని వార్తలు వస్తున్నాయి. పుతిన్‌ వయసు 71 ఏళ్లు కాగా.. ఎకాథరీనా వయసు 39 ఏళ్లు. పుతిన్ కంటే ఆమె 32 ఏళ్లు చిన్నది అని తెలుస్తోంది. గతంలో చైనాను సందర్శించే రష్యన్‌ ప్రతినిధులకు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన ఎకాథరీనా.. 2017లో సేఫ్ ఇంటర్నెట్ లీగ్‌లో చేరారు. అయితే ఇదే అదను అని భావిస్తున్న ఉక్రెయిన్ మీడియా.. ఎకాథరీనాతో పుతిన్‌ ప్రేమ వ్యవహారం నిజమేనంటూ కథనాలు వెల్లడిస్తోంది. టెలిగ్రామ్‌ ఛానళ్లలో కూడా ఇదే ప్రచారం జోరుగా సాగుతోంది.

ఇక గతంలో వివాహం అయిన పుతిన్ తన భార్యకు విడాకులు ఇచ్చారు. పెళ్లి అయిన 30 ఏళ్ల తర్వాత 2014 లో తన భార్య లియుడ్మిలాకు పుతిన్‌ విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత జిమ్నాస్ట్‌, ఒలిపింక్స్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ అయిన అలీనా కబయేవాతో పుతిన్ ప్రేమలో పడ్డారని వార్తలు వచ్చాయి. వీరిద్దరికీ ముగ్గురు సంతానం కూడా ఉన్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. అయితే అలీనా కబయేవా కోసం పుతిన్ భారీగా డబ్బు ఖర్చు చేశారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం నేపథ్యంలో అలీనాతోపాటు ముగ్గురు పిల్లలను స్విట్జర్లాండ్‌లోని ఓ లగ్జరీ విల్లాలో భారీ సెక్యూరిటీ మధ్య పుతిన్ ఉంచినట్లు కథనాలు వెలువడ్డాయి.

ప్రతీరోజూ ప్రేమికుల దినోత్సవమే..

వాలెంటైన్ డే వద్దు

నైతిక విలువలే హద్దు

అమ్మాయిలూ ప్రేమ ప్రేరుతో మోసపోవద్దు

సిగ్గు బిడియాలే మనకు హద్దు 

గులాబీ పూల మాటున ముళ్లున్నాయి తెలుసా

గుర్తిస్తేనే నీ లైఫ్ కు బరోసా 

అమ్మాయిలూ ప్రేమ ప్రేరుతో మోసపోవద్దు

సిగ్గు బిడియాలే మనకు హద్దు 

ఫిభ్రవరి 14 సమీపిస్తుందంటే చాలు షాపింగ్ మాళ్లన్నీ గులాబీ గుభాళింపులతో.. గుండె ఆకారాలతో నిండిపోతాయి. యువతరం గుండెల్లో ప్రేమచిగురిస్తుంది. ఏటా ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే పేరుతో ప్రేమికుల దినోత్సవాన్ని యువతరం ఎంతో ఉత్సాహంగా జరుపుకోవడం ఇక్కడి సంస్కృతిలో భాగమైపోయింది. ప్రేమను వ్యక్తం చేసుకోవడానికి ఈ రోజు జరిగే అసాంఘిక కార్యకలాపాల గురించి రాయాలంటేనే జుగుప్స కలుగుతుంది. మనయువతరాన్ని పెడమార్గం పట్టించేందుకు, మన యువతరాన్ని నిర్వీర్యం చేసేందుకు చాపకింద నీరులా వాలెంటైన్స్ డే ఎన్నో దశాబ్దాలక్రితం ఇక్కడ ప్రవేశించింది. ప్రేమికుల దినోత్సవం పేరుతో మొదలైన ఈ వాలెంటైన్స్ డే పెంచిపోషిస్తున్న అనర్థాలను, వాటి చేదుఫలాలను మనం ప్రస్తుతం అనుభవిస్తున్నాము. కళాశాలల్లో జరిగే ఉన్మాదాల గురించి ఏమని చెప్పను. నిన్నటికి నిన్న ఓ ప్రబుద్ధుడు ప్రేమించలేదని అమ్మాయి గొంతుకోసి చంపేశాడు. తనకు దక్కనిది మరెవ్వరికీ దక్కదన్న రాక్షసత్వం ఈ అనైతిక ప్రేమకు ఉంటుంది. ప్రేమ విష కౌగిలిలో ఎంతోమంది ఆడబిడ్డలు రక్తమోడుతున్నారు. 

ఇలాంటి హేయమైన దినోత్సవాల వల్ల సామాజిక జాడ్యాలు పేరుకుపోతున్నా మనం నిస్సహాయులమై ఉండిపోవడం మరింత విషాదకరం. పట్టుమని పదేళ్లు నిండని అమ్మాయిలు గర్భందాలుస్తున్నారని అధ్యయనాలు ప్రమాదఘంటికలు మోగిస్తున్నాయంటే ఇలాంటి పాశ్చాత్య సంస్కృతి పుణ్యమేకదా మరి. యువతీ, యువకులు బాధ్యతమరిచి అశ్లీలానికి, చెడుతిరుగుళ్లకు బానిసవడం వల్ల భవిష్యత్తును బుగ్గిపాలు చేసుకుంటున్నారు. దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న యవతరమున్న మనదేశం వైపు ఎన్నో దేశాలు చూస్తున్నాయి. అలాంటిది మనదేశ యువత అరువుతెచ్చుకున్న కుసంస్కృతిని అక్కున చేర్చుకోవడం అవివేకమే. సత్యనాదెళ్ల, సుందర్ పిచాయ్ లాంటి యువకులు విదేశాల్లో మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి సంస్థల్లో సీఈవోలుగా రాణిస్తున్నారంటే మనదేశ యువశక్తి సామర్థ్యాల గురించి మనం ఒకసారి గమనంలోకి తీసుకోవాలి. ఇలాంటి దినోత్సవాలను, యువతరాన్ని అపమార్గం పట్టిస్తున్న పాశ్చాత్య పెడధోరణులను అడ్డుకుంటే ఎందరో సత్యనాదెళ్లలను, సుందర్ పిచాయ్ లను సిద్ధం చేయవచ్చు. ప్రపంచానికి విశ్వగురువుగా మనదేశాన్ని నిలపవచ్చు. ఈ పనికి ధార్మిక సంస్థలే పూనుకోవాలి. మన యువశక్తి సామర్థ్యాలు నిర్వీర్యం కాకుండా పదునుపెట్టుకున్నప్పుడే మనదేశం అభివృద్ధిపథంలో దూసుకుపోతుంది. 


మనదేశంలో ఉన్న ఆధ్యాత్మిక సంపదతో మనదేశాన్ని, మన యువతరాన్ని సుసంపన్నం చేసుకోవచ్చు. పురోగతిలో నడిపించవచ్చు. వేదాలు, ఉపనిషత్తులు, బైబిల్, ఖుర్ఆన్ లాంటి భగవంతుని ప్రబోధనలకు నిలయం. ధార్మిక బోధనల్ని మనదేశ యువత ఆచరించేలా ప్రేరణ కల్పిస్తే చాలు నైతికతలో పురోగమించవచ్చు. అభివృద్ధిలో అంతరిక్షం ఎత్తుకు ఎదగవచ్చు. 

ఒక్కరోజు జరుపుకునే ప్రేమకు ఇస్లామ్ లో తావులేదు 

వివాహ బంధంతో ఒక్కటై నిండు నూరేండ్లు భార్యాభర్తలుగా జీవితం కొనసాగించాలి. సామాజికంగా అటువంటి ఆలూమగల ప్రేమే సర్వదా ఆమోదయోగ్యం, అభిలషణీయం. పెళ్లికాని ఇద్దరు యువతీయువకుల ప్రేమ వ్యక్తిత్వంపై మాయని మచ్చే అవుతుంది. గత ప్రేమికుల దినోత్సవం రోజు ఒకరితో మరి ఈ ప్రేమికుల దినోత్సవం నాడు ఒకరితో. వచ్చే లవర్స్ డే రోజు ఇంకెవరితోనో..? ఈ తరహా ప్రేమలు సమాజానికి చేటుచేస్తాయి. మన కుటుంబ వ్యవస్థను బీటలు వారుస్తాయి. ఇలాంటి ప్రేమలు యాసిడ్‌ దాడులకు, లైంగిక దాడులకు, హత్యలకు, ఆత్మహత్యలకు దారితీస్తాయన్నది మనం రోజూ పత్రికల్లో చూస్తున్నాము. ఇలాంటివే ప్రస్తుత సమాజంలో ప్రేమ పేరుతో జరుగుతున్న వైపరీత్యాలు. ఈ సందర్భంగా పాశ్చాత్య సంస్కృతులను గుడ్డిగా అనుసరించడం వల్ల మనదేశ సంస్కృతి సంప్రదాయాలు పతనమైపోతాయి. మహిళలపై దాడులు సహా పలు సమస్యలకు కారణం అవుతాయి. వాలెంటైన్ డే ఏ గడ్డపై పురుడుపోసుకుందో ఆయా దేశాలే వాలెంటైన్స్ డేను వ్యతిరేకిస్తున్నాయి. ‘లవ్ లాటరీ’ విద్వేషాలకు దారితీస్తుండడంతో ఫ్రాన్స్ లాంటి పాశ్చాత్య దేశం కూడా వాలెంటైన్స్ డే ను అక్కడి ప్రభుత్వం నిషేధించింది. ఏ దేశాలనుంచి ఈ సంస్కృతిని అరువుతెచ్చుకున్నాయో ఆయా దేశాల్లో ఈ వాలెంటైన్స్ డే ని అక్కడివారు తీవ్రంగా నిరసిస్తున్నా మన దేశంలో ఈ రోజును ఘనంగా స్వాగతించడమే కాదు వారం రోజులపాటు జరుపుకోవడం మహా విషాదమే అవుతుంది. 


ఇస్లామ్ ప్రేమకు పెద్దపీట వేసింది. భావోద్రేకాలను చాటుకోవడాన్ని ఇస్లామ్ ధర్మం ఎంతగానో గౌరవిస్తోంది. ప్రేమ సరైన పంధాలో ఉండాలి. పెళ్లికాని యువతీయువకులు విచ్చలవిడి కలయికోసం ప్రేమపేరుతో ఒక్కరోజును ప్రత్యేకించుకుని అనైతిక పనులకు పాల్పడటాన్ని ఇస్లామ్ ధర్మం తీవ్రంగా ఎండగడుతోంది. ఒక ఏడాది ఒక అమ్మాయి ఒక అబ్బాయితో; మరో ఏడాది మరో అబ్బాయితో. సంవత్సరాలు మారినట్లుగానే అబ్బాయిలు, అమ్మాయిలు తమ ప్రేమికులను మార్చేస్తున్నారు. ఇలాంటి ప్రేమికుల దినోత్సవాలతో మనదేశ సంప్రదాయాలను చేజేతులా వినాశనం పాలు చేసుకుంటున్నాము. మన దేశంలో వివాహ వ్యవస్థకు ఎనలేని విశిష్టత ఉంది. అన్నికులాలు, మతాల వారంతా వివాహానికి ఎంతో ప్రాముఖ్యతనిస్తారు. ఈ వాలెంటైన్ డే వివాహ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది. ప్రేమ పునాదులను కుళ్లబొడుస్తోంది. అశ్లీలాన్ని, అనైతికతను వ్యాపింపజేసే వాలెంటైన్ డే ప్రేమకు సంకేతంగా జరుపుకోవడం విషాదకరం. 

అన్యోన్య దంపతులకు రోజూ ప్రేమికుల దినోత్సవమే..

జీవితాంతం ప్రేమాప్యాతలతో ఒకరినొకరు తెలుసుకుని, ఎంతో అన్యోన్యంగా గడిపిన జంటకు చావనేదే ఉండదు. చనిపోయాక కూడా మరణమనేదేలేని పరలోక రాజ్యంలోనూ కలిసి జీవించే గొప్ప భావనను ఇస్లామ్ కల్పిస్తోంది. ప్రపంచంలో ఏ దంపతులైతే అన్యోన్యంగా ఒకరికొకరు ప్రాణానికి ప్రాణంగా దాంపత్య జీవితాన్ని గడిపారో అలాంటి వాళ్లు పరలోకంలోనూ దంపతులుగా ఉంటారని ముహమ్మద్ ప్రవక్త (స) గొప్ప శుభవార్తనిచ్చారు. మరణంతో ముగిసేది నిజమైన ప్రేమకాదని చనిపోయాక స్వర్గసీమలోనూ వారిద్దరూ దాంపత్య జీవితం గడుపుతారని చెప్పి ప్రవక్త (స) ప్రేమను అందలమెక్కించారు. అన్యోన్యంగా గడిపే భార్యాభర్తలకు రోజూ ప్రేమికుల దినోత్సవమే. 

ప్రేమపాత్రులెవరు?

భర్త తన వైపు చూసినప్పుడు చిరునవ్వు చిందించడం, భర్త బయటికి వెళ్లేటప్పుడు ప్రేమతో నవ్వుతూ సాగనంపడం ఉత్తమ భార్య లక్షణం. భార్య దృష్టిలో ఉత్తమంగా మెలిగేవాడే సమాజం దృష్టిలో ఉత్తముడు. భార్యాభర్తల అన్యోన్యతను పెంపొందించే ఇలాంటి ఎన్నో బోధనలు ఇస్లామ్ లో కోకొల్లలు. ఈ బోధనల్ని ఆచరణలో పెడితే రోజూ ప్రేమికుల దినోత్సవమే. ? ప్రతీ ఘడియలోనూ ప్రేమను పంచే ఆలూమగల హృదయంలో ఎనలేని ప్రశాంతత, సంతృప్తి రాజ్యమేలుతాయి.

తల్లిదండ్రుల వంక ప్రేమతో చూడటం కూడా సదాచరణేనన్నారు ప్రవక్త మహనీయులు. వారిలో ఒకరు కానీ ఇద్దరు కానీ ముసలివారై ఉంటే వారి ముందు విసుగ్గా ఉఫ్ అని కూడా అనకూడదని ఖుర్ఆన్ హెచ్చరిస్తోంది. కనీపెంచిన అమ్మానాన్నల్ని ప్రేమతో ఆదరించాలని ఖుర్ఆన్ పేర్కొంటోంది. అమ్మపాదాల కింద స్వర్గముందని, స్వర్గద్వారాలలో తండ్రి ముఖద్వారమని చెప్పి తల్లిదండ్రుల ప్రేమకు పెద్దపీట వేశారు ప్రవక్త మహనీయులు. తల్లిదండ్రుల్ని ప్రేమిస్తే రోజూ మనకు ప్రేమదినోత్సవమే. మనం ప్రేమను వ్యక్తపరచడానికి ఒకరోజును ప్రత్యేకించుకోవడమా? ప్రతీ ఘడియా ప్రేమను పంచే హృదయం మనది. 

మన ప్రేమకు ఈ ప్రపంచంలో మొదటి అర్హురాలు అమ్మ. ఈ లోకంలో అమ్మ తరువాతి స్థానం మన నాన్నది. ఆ తరువాత భార్యా, పిల్లలు, బంధుమిత్రులు, ఇరుగు పొరుగువారు. వీరందరికీ మనం ప్రేమను పంచుతున్నామా?

తల్లి నవమాసాలు మోసి ప్రసవవేదన భరించి కంటుంది. రెండేళ్లదాకా తన రక్తాన్ని పాలగా మార్చి పోషిస్తుంది. మాతృప్రేమకు సాటిఏదీ లేదు ఈ ప్రపంచంలో. 

ఒక నిరుపేద బక్కచిక్కిన కూలీవాడు వయస్సు మీదపడినా చెమటోడ్చి తన భార్యాపిల్లల్ని పోషిస్తాడు. పిల్లల పట్ల తండ్రి చూపే ప్రేమకు ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి. 

పిల్లల కళ్లల్లో సిగ్గు బిడియాల కాటుక రాయాలి

పిల్లల కళ్లల్లో సిగ్గు, బిడియాలనే కాటుకను రాయండి. సిగ్గుబిడియాలే విలువైన ఆభరణాలు. ఎందుకంటే సిగ్గూబిడియాలు లేనివారే అశ్లీలానికి, అనైతిక చేష్టలకు ఒడిగడతారు. చెడు చూపు అశ్లీలానికి మూలం. అశ్లీలపనులకు, వ్యభిచారానికి చెడుచూపే తొలిమెట్టు. పురుషులు పరస్త్రీలపై చెడుచూపుతో చూడటం, స్త్రీలు పరాయి పురుషులవంక కళ్లల్లో కళ్లుపెట్టి చూడటం చాలా ప్రమాదకరం. మన వ్యక్తిత్వాలను నిర్వీర్యం చేయడంలో ఈ చూపుల చౌర్యమే కీలకపాత్ర పోషిస్తుంది. మన హృదయాన్ని జ్యోతిర్మయం చేయాలంటే మన చూపులను క్రిందికి వాల్చి ఉంచాలి. ఎవరి చూపులైతే కిందకు వాలి ఉంటాయో అలాంటి వారిని ప్రపంచమంతా ఏకమైనా ఎలాంటి నష్టమూ చేకూర్చలేరు. ఎవరి చూపుల్లోనైతే స్సిగ్గు, సిగ్గు, బిడియాలుండవో అలాంటి వారిని ఎవరూ కాపాడలేరు. అలాంటి వారి మనస్సును ఎవ్వరూ మార్చలేరు. మన కళ్లతో తప్పుడు విషయాలను చూడటం వల్ల పాపాలకు బానిసవ్వాల్సి ఉంటుంది. చూపులను కిందికి వాల్చి ఉంచడం వల్ల ఎనలేని శక్తివంతమైన వ్యక్తిత్వం అలవడుతుంది. దేవుని సింహాసనాన్ని చేర్చే శక్తి సొంతమవుతుంది. దేవదూతలు కూడా అతని ముందు తలొగ్గుతాయి. సూర్యచంద్రుల వెలుగు కూడా ఇలాంటి వారి కంటి వెలుగు ముందు చిన్నబోతుంది. ఈ దివ్వతేజస్సును పొందాలంటే మన చూపులను కాపాడుకోవడమే శరణ్యం.

రచయిత-- ముహమ్మద్ ముజాహిద్ 

హైదరాబాద్, సెల్ నెం- 9640622076


 లగమాడలంటే ఈ మాత్రం ఇచ్చుకోవాల్సిందే

ఏపీలో సీట్ల కేటాయింపుపై అమిత్ షా చాణక్యం

పొత్తుకు ఆరాటపడుతున్న టీడీపీ ముందు బీజేపీ కొత్త ఫార్ములా!

జనసేనతోపాటు బీజేపీతో కలసి కూటమిగా వచ్చే ఎన్నికల బరిలోకి దిగాలని యోచిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి కమలం నేతలు చుక్కలు చూపిస్తున్నారు. తనకు కూడా ఏపీలో టీడీపీ, జనసేన పార్టీ అవసరమున్నా కూడా షరత్తులతో టీడీపీపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తోంది బీజేపీ అగ్రనాయకత్వం. దీంతో ఎటుతేల్చుకోలేని పరిస్థితిని టీడీపీ ఎదుర్కొంటోంది. ఇదిలావుంటే ఎన్డీయే కూటమిలోకి పాత మిత్రులు తిరిగొస్తారంటూ అమిత్ షా ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ తిరిగి ఎన్డీయే కూటమిలోకి వెళ్తుందనే ప్రచారం జరుగుతోంది. అయితే టీడీపీని ఎన్డీయేలోకి చేర్చుకునేందుకు ఒప్పుకుంటూనే అమిత్ షా తన రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించినట్లు సమాచారం. టీడీపీ ఎదుట ఓ కొత్త ప్రపోజల్ పెట్టగా.. ఈ విషయంలో ఏం చేయాలనే దానిపై చంద్రబాబు మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలిసింది.

దీంతో ఏపీ రాజకీయాలు ప్రస్తుతం అత్యంత ఆసక్తికరంగా మారాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన తర్వాత ఏపీ పాలిటిక్స్ కొత్త మలుపు తిరిగాయి. అప్పటి వరకూ టీడీపీ, జనసేన పార్టీలు మాత్రమే కూటమిగా వెళ్తాయని.. ఈసారి కమలం పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందనే ఊహాగానాలు వినిపించాయి. దీనికి తగినట్లుగానే ఏపీ బీజేపీ నేతలు సైతం కార్యాచరణ చేపట్టారు. అయితే ఊహించని విధంగా చంద్రబాబుకు ఢిల్లీ నుంచి పిలుపు రావటం ఏపీ రాజకీయాలను మరింత ఆసక్తికరంగా మార్చేసింది. కమలం పార్టీ పెద్దలే తమ అధినేతను ఢిల్లీకి పిలిచారని, ఎన్డీయే కూటమిలోకి టీడీపీ చేరికపై అమిత్ షా చర్చించారని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. అయితే చంద్రబాబు పర్యటన తర్వాత సీఎం జగన్ హస్తినకు వెళ్లటం మరో టర్న్ అని చెప్పొచ్చు.


ఢిల్లీకి వెళ్లిన సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాలను కలిశారు. అయితే పోలవరం, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించే సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లారని ప్రభుత్వ వర్గాలు, వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. కానీ చంద్రబాబు హస్తిన నుంచి తిరిగొచ్చిన వెంటనే, జగన్ ఢిల్లీకి వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. బీజేపీ నేతలు, జగన్ మధ్య రాజకీయంపైనా చర్చలు జరిగి ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో అమిత్ షా.. చంద్రబాబు ఎదుట ఓ ప్రపోజల్ పెట్టారనే వార్త సోషల్ మీడియాలో ప్రచారమవుతోంది. టీడీపీని ఎన్డీయేలోకి చేర్చుకునేందుకు అంగీకరిస్తూనే.. సీట్ల పంపకంలో చంద్రబాబు ముందు 4:2:1 ఫార్ములాను కమలం పార్టీ పెద్దలు పెట్టినట్లు సమాచారం. పొత్తుకు అంగీకరిస్తూనే ఏపీ వ్యాప్తంగా 4:2:1 నిష్పత్తిలోనే సీట్ల పంపకాలు జరగాలని బీజేపీ మెలిక పెట్టినట్లు తెలిసింది.

ఏంటీ ఈ 4:2:1 ఫార్ములా,,,,?

4:2:1 ఫార్ములా అంటే ఏపీలోని అసెంబ్లీ సీట్లను ఆ నిష్పత్తి లెక్కన పార్టీల మధ్య పంచుకోవాలని.  ఏపీలోని మొత్తం శాసనసభ స్థానాలు 175 కాగా.. ఈ ఫార్ములా ప్రకారం కూటమిలో పెద్దన్నలాంటి టీడీపీకి వంద సీట్లు, ఇక ఇప్పటికే ఎన్డీయేలో ఉన్న జనసేనకు 50 సీట్లు, బీజేపీకి 25 సీట్లు ఇవ్వాలనేది ప్రతిపాదన. అలాగే ఈ ఫార్ములాను ప్రతి పార్లమెంట్ పరిధిలో అనుసరించాలని, ఆ లెక్కన సీట్ల పంపకం ఉండాలని అమిత్ షా ప్రతిపాదించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రతిపాదన ప్రకారం టీడీపీ వంద ఎమ్మెల్యే స్థానాలు, 14 ఎంపీ స్థానాల్లో పోటీకి మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది.

చంద్రబాబు నెక్ట్స్ స్టెప్ ఏంటీ?

అయితే కమలం పార్టీ 4:2:1 ప్రతిపాదనపై టీడీపీ అధినేత చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. హస్తిన నుంచి రాగానే పవన్ కళ్యాణ్‌తో చంద్రబాబు భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ సైతం ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకుని ఆఖరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. వీరిద్దరి మధ్య మంగళవారం (ఫిబ్రవరి 13) మరో దఫా చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. 4:2:1 నిష్పత్తి ప్రకారం కాకపోయినా జనసేన, బీజేపీ రెండు పార్టీలకు కలిపి కనీసం 50 ఎమ్మెల్యే స్థానాలు ఇవ్వాలని బీజేపీ పెద్దలు గట్టిగా పట్టుబడుతున్నారట. ఇక బీజేపీ అయితే ఎమ్మెల్యే స్థానాల కంటే ఎంపీ స్థానాలకే ఎక్కు వ ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే జనసేనకు 28, బీజేపీకి 6 నుంచి 8 ఎమ్మెల్యే సీట్లు ఇస్తామని టీడీపీ ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్, చంద్రబాబు మధ్య జరిగే తదుపరి చర్చల్లో సీట్ల పంపకంపై ఓ క్లారిటీ రానుంది.


 పవన్ భుజాలపై బీజేపీ తుపాకి

అధిక సీట్లే టార్గెట్ గా టీడీపీపై గురి

ఎన్నికల సమీపంలో అస్త్రం పదునుపెడుతున్న కమలం

రాజకీయాలలో వ్యూహాలను పదును పెట్టడంలో తానకు తానే సాటి అనిపించుకొంటోంది బీజేపీ. ఉత్తరాధిన మెజార్టీ రాష్ట్రంలో సొంతంగా గెలిచి అధికారంలో పాగవేయడం కంటే వ్యూహాలతోనే అందలం ఎక్కిందని చెప్పవచ్చు. మొన్నటి వరకు ఏపీలో జనసేనతో పొత్తుకట్టి వైసీపీకి తానే ప్రత్యామ్నాయం కావాలని భావించిన కమలం నాయకత్వం తాజాగా మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీతో కూడా దోస్తీ కట్టేందుకు సిద్దమైంది. కేవలం జనసేనతో పొత్తకట్టి ఏపీలో మెజార్టీ సీట్లు సాధించాలని భావించిన కమలం పార్టీ ఆ మార్గం కనిపించకపోవడంతో ఇపుడు రూట్ మార్చి తన పంథాను నెరవేర్చుకొనే ప్రయత్నం మొదలెట్టింది. తనకు మెజార్టీ సీట్లు దక్కించుకొనేందుకు బీజేపీ నాయకత్వం పవన్ కళ్యాణ్ తో ఒత్తిడి చేయించి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. 

భారమంతా పవన్ కళ్యాణ్ పైనే..?

ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కు బీజేపీ బిగ్ టాస్క్ అప్పగించినట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే ఏపీ ఎన్నికల రాజకీయంలో కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటి వరకు అసలు పోటీలో లేదనుకొన్న కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా తెరపైకి వచ్చేసింది. దీంతో బీజేపీ ఏపీలో రూటు మార్చేసింది. ఈ నేపథ్యంలోనే టీడీపీ తిరిగి ఎన్డీఏలో చేరటం దాదాపు ఖాయమైంది. 2014 తరహా పొత్తులతోనే జగన్ ను ఓడించగలమని చంద్రబాబు, పవన్ భావిస్తున్నారు. బీజేపీ నుంచి సానుకూల సంకేతాలు వస్తున్నాయి. అయితే, సీట్ల ఖరారు పైనే తుది నిర్ణయం ఆధారపడి ఉందన్నది సమాచారం. ఈ సమయంలో తనకు మెజార్టీ సీట్లు దక్కేలా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు బీజేపీ బిగ్ టాస్క్ అప్పగించింది. 


ఈ కూటమిలో ఎవరికి ఎన్ని సీట్లు...?

సీట్ల విషయంలో టీడీపీ త్యాగం చేస్తుందా అన్న చర్చ ప్రస్తుత పరిస్థితుల్లో కనిపిస్తోంది. ఇదిలావుంటే ఏపీలో ఎన్నికల్లో పొత్తులు దాదాపు ఖాయం అయ్యాయి. ఈ సమయంలోనే సీట్ల పంపకాలు చంద్రబాబు పై ఒత్తిడి పెంచుతున్నాయి. అటు జనసేన శ్రేణుల నుంచి మెజార్టీ సీట్లు కేటాయించాలని పవన్ ను ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పటి వరకు పొత్తులో భాగంగా జనసేనకు 25-27 అసెంబ్లీ, మూడు ఎంపీ స్థానాలు ఖాయమైనట్లు తెలుస్తోంది. ఈ సంఖ్యతో జనసేన శ్రేణులు, పవన్ అభిమానులు సుముఖంగా లేరని తెలుస్తోంది. టీడీపీకి పూర్తిగా సహకరిస్తున్న తమకు కనీసం 40 స్థానాలు కావాలని పట్టు బడుతున్నాయి. టీడీపీ, జనసేన పార్టీ మధ్య సీట్లు సర్థుబాటు సమస్య ఇలావుంటే ఈ సమయంలోనే బీజేపీతో పొత్తు ఖాయం దిశగా చర్చలు సాగుతున్నాయి. ఈ సమయంలో బీజేపీ నుంచి 25 అసెంబ్లీ, 10 ఎంపీ స్థానాలంటూ ప్రతిపాదన వచ్చింది. చంద్రబాబు తన పార్టీ ముఖ్యులతో చర్చ తరువాత రెండు పార్టీలకు 40 అసెంబ్లీ - 9 ఎంపీ స్థానాలు ఇచ్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి బీజేపీకి తమ ప్రతిపాదనలను పంపినట్లు విశ్వస నీయ సమాచారం. అటు బీజేపీ నేతలు పవన్ కు టాస్క్ అప్పగించారు. మిత్రపక్షాలుగా రెండు పార్టీలకు 50 స్థానాలు ఇచ్చేలా చంద్రబాబుతో చర్చించాలని సూచించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఢిల్లీ పర్యటన వాయిదా వేసుకున్న పవన్ కల్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశం కానున్నారు. పొత్తులో సీట్ల ఖరారు వేళ చంద్రబాబు తన ముందు ఉన్న సమస్యలను ఇప్పటికే పవన్ తో చర్చించారు. 25 సీట్లకు మంచి పవన్ నుంచి ఆశించే అవకాశాలు లేవని తెలుస్తోంది. దీంతో, ఇప్పుడు బీజేపీకి సర్దుబాటు పైనే ఇద్దరి నేతల మధ్య చర్చ జరగనుంది. ఇదిలావుంటే సీఎం జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేందుకు జనసేనతో పొత్త ఖాయంచేసుకొని బీజేపీని సైతం కలుపుకొని వెళ్లాలని భావిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భారీ త్యాగానికి సిద్దమవుతారా లేక ఆ రెండు పార్టీలను సీట్ల విషయంలో ఒప్పించి దారిలోకి తీసుకురాగలుగుతారా అన్నది ఇపుడు ఆసక్తికరంగా మారింది.

 కేటాయింపులు భేష్...కానీ అమలుతో శభాష్ అని పించుకోండి

జానో జాగో సంఘం జాతీయ అధ్యక్షులు సయ్యద్ నిసార్ అహ్మద్

తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో మైనార్టీ సంక్షేమానికి రూ.2,262 కోట్లు కేటాయించడం శుభ పరిణామమని జానో జాగో (ముస్లింల అభివృద్ది వేదిక) సంఘం జాతీయ అధ్యక్షులు సయ్యద్ నిసార్ అహ్మద్ వెల్లడించారు. కేటాయింపులు ఘనంగానే కేటాయించినా వాటిని పూర్తి స్థాయిలో మైనార్టీల సంక్షేమానికి ఖర్చుచేసినప్పుడే రేవంత్ రెడ్డి సర్కార్ చిత్తశుద్ది ఏమిటో తెలుస్తుందని ఆయన వెల్లడించారు. గతంలోని బీఆర్ఎస్ సర్కార్ సైతం అంకెల్లో మాత్రం మైనార్టీ సంక్షేమానికి ఘనమైన కేటాయింపులు చేసిందని, కానీ ఆచరణలో వాటిని సగం కూడా ఖర్చుచేయలేదన్నారు. అందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సర్కార్ కు మైనార్టీలు గట్టిి గుణపాఠం చెప్పారని ఆయన గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి సర్కార్ కూడా  గత ప్రభుత్వంలా వ్యవహరించకూడదని ఆయన అన్నారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ సర్కార్ కు పట్టిిన గతే ఈ ప్రభుత్వానికి తప్పదని ఆయన హెచ్చరించారు. రానున్న కాలంలో ఈ బడ్జెట్ ను పెంచుకొంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన వెల్లడించారు. 

 తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ దే పై చెయ్యి

లోక్ సభ ఎన్నికల్లోనూ అదే దూకుడు

బీఆర్ఎస్ కు మళ్లీ నిరాశే...

కొత్తగా బీజేపీ ఏమీ సాధించకపోయినా ఉనికి మాత్రం చాటుతుంది

అసెంబ్లీ ఎన్నికల్లో ప్రదర్శించిన జోరునే కాంగ్రెస్ పార్టీ వచ్చే లోక్ సభ ఎన్నికల్లోనూ కొనసాగిస్తోందని తాజా సర్వేలో తేలింది. బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో మళ్లీ సత్తాచాటుందని ఆ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు బహుదూరంగా లోక్ సభ ఎన్నికల ఫలితాలు రానున్నట్లు తేలింది. ఈ వాస్తవాన్ని తెలియజేసింది ఓ జాతీయ సర్వే. దేశంలో మారుతున్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా రాజకీయ పరిస్ధితి ఎలా ఉంది. ఏ పార్టీ లీడ్ లో ఉంది, లోక్ సభ ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలవబోతోందన్న దానిపై జాతీయ మీడియా నెట్ వర్క్ ఇండియా టుడే .. సీ ఓటర్ తో కలిసి మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో సర్వే నిర్వహించింది. దాని ఫలితాలను ఇవాళ వెల్లడించింది. ఇందులో దేశంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికే మరోసారి అధికారం అని స్పష్టంచేసిన ఈ సర్వే తెలంంగాణలో మాత్రం లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతుందన్నది తేల్చి చెప్పింది. ఇక్కడ బీజేపీ కొత్తగా ఏమీ సాధించపోయినా గతంలో మాధిరిగా మూడు సీట్లు తిరిగి సాధిస్తుందని ఈ సర్వే తేల్చింది. 

ఈ సర్వే ఎపుడు...ఎలా కొనసాగింది....?

గత  ఏడాది డిసెంబర్ 15 నుంచి జనవరి 28 వరకూ తెలంగాణలో నిర్వహించిన ఇండియా టుడే-సీఓటర్ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే చేసింది. తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్ సభ స్థానాలున్నవిషయం తెలిసిందే. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలోని 17 ఎంపీ సీట్లలో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 10 సీట్లు గెలిచే అవకాశముందని, అటు విపక్ష బీఆర్ఎస్, బీజేపీలు తలో మూడు సీట్లు మాత్రమే గెల్చుకునే అవకాశం ఉందని స్పష్టంచేసింది. చివరిగా హైదరాబాద్ ఎంపీ సీటును మజ్లిస్ పార్టీ మరోసారి నిలబెట్టుకోబోతోందని కూడా వెల్లడించింది. ఓట్ల పరంగా చూస్తే   కాంగ్రెస్ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో 41.2 శాతం ఓట్లు దక్కించుకోబోతున్నట్లు ఇండియా టుడే-సీ ఓటర్ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో తేలింది. అలాగే బీఆర్ఎస్ 29.1 శాతం, బీజేపీ 21.1 శాతం ఓట్లు దక్కించుకోబోతున్నాయి. అసలే మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ఈసారి దేశంలో 400 సీట్ల మార్క్ తాకాలని ఉబలాటపడుతున్న వేళ తెలంగాణలో మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే ఫలితాలు ఆ పార్టీకి షాకిచ్చినట్లే భావిస్తున్నారు. ఇక ఓట్లశాతంలోనూ కాగ్రెస్ మంచి గ్రాఫ్ సాధించే అవకాశముందని ఈ సర్వే బట్టి తెలుస్తోంది.

 గుర్తుకొస్తున్నాయి.... నాటి అనుభూతులు

దూద్ బౌలిలో చిన్ననాటి మిత్రులతో త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనా రెడ్డి

 అశోక్ కుమార్ యాదవ్ నిర్వహించిన పౌర సన్మాన కార్యక్రమానికి త్రిపుర గవర్నర్ హాజరు

అశోక్ దాదాతో నాకున్నది మరపురాని బంధమన్న నల్లు ఇంద్ర సేనారెడ్డి

త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనా రెడ్డిని సన్మానించిన సి అశోక్ కుమార్ యాదవ్ కుటుంబ సభ్యులు ప్రకాష్ యాదవ్  రవి యాదవ్ మక్కర్ యాదవ్ శివానంద యాదవ్ కార్పొరేటర్లు మొహమ్మద్ గౌస్ సున్నం రాజమోహన్ బిజెపి నాయకులు నరేష్ బహ దూర్ పుర నియోజకవర్గ కన్వీనర్ ప్రశాంత్ కస్తూరిబా బాలికున్నత పాఠశాల సిబ్బంది తదితరులు 

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

ఢిల్లీకి రాజైనా  ఓ అమ్మకు కొడుకే కాదు నాటి చిన్న నాటి మిత్రులకు ఎప్పటికీ మిత్రుడేనన్నది స్పష్టంచేశారు త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి.  బీజేపీ లో అంచలంచలుగా ఎదిగి త్రిపుర గవర్నర్ అయిన నల్లు ఇంద్రసేనారెడ్డి మంగళవారంనాడు బీజేపీ రాష్ట్ర నాయకులు  సీ.అశోక్ కుమార్ యాదవ్ హైదరాబాద్ పాతబస్తీలోని దూద్ బౌలి లో ఏర్పాటు చేసిన పౌర  సన్మాన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డికి పాతబస్తీకి చెందిన ప్రముఖులు సన్మానించారు. ఆప్యాయంగా పలకరించారు. అందరీతో ముచ్చటిస్తూ ఆత్మీయతను చాటిన నల్లు ఇంద్రసేనారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ...


మా అన్న.... అశోక్ దాదా,  ఆయన్ని నేను అశోక్ దాదా అనే పిలుస్తాను అని పేర్కొన్నారు. తన చిన్ననాటి నుంచి ఇంటర్ చదవే రోజుల నుంచి దాదాపు 1968 నుంచి ఆశోక్ దాదాతో తనకు పరిచయముందన్నారు. తాను చేసిన ఏ ఉద్యమమైనా వాటిిలో అశోక్ దాదా ప్రమేయం, పాత్ర లేకుండా జరగలేదన్నారు. తాను ఏబీవీపీ, బీజేపీ యువమోర్చాలో అనేక ఉద్యమాలు చేసినప్పుడు తనతోపాటు పనిచేసి పోలీసుల లాఠీ ఛార్జ్ లను ఎదుర్కొన్ని, ఎమర్జెన్సీ సమయంలో  తనతోపాటు జైలు జీవితం కూడా గడిపారని త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనా రెడ్డి నాటి ఘటనలను స్మరించుకొన్నారు. అంతటి అనుబంధం తనకు అశోక్ దాదాతో అని ఆయన వెల్లడించారు. తాను త్రిపుర గవర్నర్ అయ్యాక అశోక్ దాదా ఇంటికి వస్తానని చెప్పగా ముందు ఎమర్జెన్సీ సందర్భంగా నాడు జైలుకెళ్లి కష్టాలు ఎదుర్కొన్న వారి శ్రేయస్సు  కోసం ఏర్పాటు చేసిన భారత్  సురక్షా సమితి తరఫున ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తొలుత రావాలని అశోక్ దాదా తనను కోరారని చెప్పారు. 

నాడు ఎమర్జెన్సీ కాలంలో పనిచేసి కష్టాలను ఎదుర్కోవారిని కలిపేందుకు కరీంనగర్, జగిత్యాలకు తీసుకెళ్లారని  పేర్కొన్నారు. తాను ఇక్కడికి గవర్నర్ గా రాలేదని, తన చిన్న వయస్సులో ఇక్కడి ప్రాంతంలో తిరిగిన వాడిగా వచ్చానని ఆయన పేర్కొన్నారు. ఈ దూద్ బౌలి లో అశోక్ దాదా తండ్రి పాలు అమ్మేవారని, వారి తమ్ముళ్లు  ఎంతో చిన్నగా ఉండేవారని, నాడు వారితో కలసి ఈ ప్రాంతంలో తిరిగానని ఆయన నాటి అనుభూతులను పంచుకొన్నారు. తనను సన్మానించిన ఈ బస్తీ వాసులకు, ప్రముఖులకు, కార్పోరేటర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  
సి అశోక్ కుమార్ యాదవ్ కుటుంబ సభ్యులు ప్రకాష్ యాదవ్,  రవి యాదవ్, మధుకర్ యాదవ్ యాదవ్ శివానంద యాదవ్ కార్పొరేటర్లు మొహమ్మద్ గౌస్, సున్నం రాజమోహన్, ఎంఐఎం నాయకులు రాజేశ్వరరావు వర్మ, బిజెపి నాయకులు నరేష్, బహ దూర్ పుర నియోజకవర్గ కన్వీనర్ ప్రశాంత్, కస్తూరిబా బాలికున్నత పాఠశాల సిబ్బంది తదితరులు


 ఏపీలో పొత్తుల పీట ముడి

బీజేపీ నిర్ణయంతో ముడిపడిన రాజకీయాలు

కమలంవైపు ఆశతో టీడీపీ, జనసేన

కలిసొస్తే సరి లేకపోతే సీపీఐతో సై

బీజేపీతో టీడీపీ, జనసేన జతకడితే కాంమ్రేడు ఎటు

అనివార్యంగా కాంగ్రెస్, కాంమ్రేడ్లు ఏకమవుతారా...?

మరి కొన్ని రోజుల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉండబోతోందన్న ఆసక్తికర చర్చ సాగుతోంది. వై నాట్ 175 అన్న నినాదంతో అధికార వైసీపీ ఒంటరిగానే ఎన్నికలకు సిద్దమవుతోంది. అధికార వైసీని గద్దె దించే లక్ష్యంతోనున్న రాష్ట్రంలోని ప్రతిపక్షాల అడుగులు ఎటు అన్న చర్చ సాగుతోంది. రాష్ట్రంలోని అన్ని పక్షాల లక్ష్యం వైసీపిని గద్దె దించడమే అయినా వాటి కోసం ప్రతిపక్షాలన్నీ ఏకం కాని పరిస్థితి. దీనికి కారణాలు లేకపోలేదు. రాష్ట్రంలోని ప్రతిపక్షాల మధ్య సిద్దాంతపర వైరుద్యాలుండటమే ఇందుకు కారణం. ఇదిలావుంటే అధికార వైసీపీని గద్దె దించాలన్న ఏకైక లక్ష్యంతో జతకట్టిన టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీ నిర్ణయంకోసం వేచిచూస్తున్నాయి. ఈ విషయంలో ఎంత త్వరగా క్లారిటీ వస్తే అంత త్వరగా ఎన్నికలకు సిద్దంకావచ్చన్నది టీడీపీ, జనసేన పార్టీల ఆలోచన. కానీ ఇప్పటికే జనసేనతో పొత్తులో ఉన్నామని చెబుతున్న బీజేపీ నాయకత్వం టీడీపీతో జతకట్టేందుకు ఆసక్తి చూపడం లేదు. అదే సందర్భంలో టీడీపీతో  కలిసి పనిచేసే ఆలోచనలోవున్న జనసేన తమ కూటమిలోకి బీజేపీని లాగేందుకు శతప్రయత్నాలు చేస్తోంది. 


మరోవైపు ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ తరుణంలో పొత్తు ఖాయం చేసుకొన్న టీడీపీ, జనసేన ప్రచారంలోకి దూసుకెళ్లలేకపోతున్నాయి. తమతో బీజేపీ కలిసి వస్తుందన్న భావనతోనే ఈ పరిస్థితిని టీడీపీ, జనసేన కూటమి ఎదుర్కోంటోంది. బీజేపీ తమతోనే కలసి వస్తుందన్న ధీమాతో టీడీపీ, జనసేన కూటమి ఉంది. కానీ బీజేపీ మాత్రం ఈ పొత్తు అంశాన్ని ఇంకా నాన్చుతూనే ఉంది. మరోవైపు వైసీసీని గద్దె దించే లక్ష్యంతోపనిచేస్తున్న కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీలు ఎవరితో కలుస్తాయన్నది ఇప్పటికీ తేలని పరిస్థితి. మరోవైపు ప్రతిపక్షాలలో నెలకొన్న ఈ అనిశ్చిత తమకే కలిసి వస్తుందన్న ధీమాను వైసీపీ వ్యక్తంచేస్తోంది. వై నాట్ 175 సాధ్యమేనని బాహాటంగా చెబుతోంది. 

ఈ తరుణంలో ఏపీ ఎన్నికలు రసోత్తంగా మారుతున్నాయి. గెలుపోటములపై ఎవరి లెక్కలతో వారు ఎన్నికలకు సిద్దమవుతున్నారు. ఏపీలో వైసీపీ సింగిల్ గానే పోటీ చేస్తుంది. టీడీపీ, జనసేన 2014 తరహాలో బీజేపీతో కూటమిగా పోటీ చేయాలని భావిస్తున్నాయి. బీజేపీ తమతో కలిసి రావాలని పలు సందర్బాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరారు. ఢిల్లీ కేంద్రంగానూ మంత్రాంగం నడిపారు. ఏపీలో ఎన్నికల సమయంలో జగన్ ను ఎదుర్కోవాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మద్దతు అవసరమని ఈ రెండు పార్టీలు భావిస్తున్నాయి. కానీ బీజేపీ నుంచి ఏ మాత్రం స్పష్టత రావటం లేదు. ఇదే సమయంలో ఏపీలో సొంతంగా పోటీకి అన్నట్లుగా బీజేపీ నేతలు రాష్ట్ర పార్టీ నాయకత్వాన్ని ఎన్నికలకు సంసిద్దులను చేస్తోంది. ఇప్పటి వరకు వేచి చూసిన చంద్రబాబు, పవన్ పొత్తు పైన తేల్చటానికి బీజేపీకి డెడ్ లైన్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.


పొత్తులో భాగంగా బీజేపీ, జనసేనకు 50 సీట్లు ఇస్తే తాము కలిసి వచ్చే అంశం ఆలోచన చేస్తామంటూ బీజేపీ నుంచి టీడీపీకి ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, జనసేనకు 25 సీట్ల వరకు ఇచ్చేందుకు సిద్దమైన చంద్రబాబు బీజేపీకి 10 సీట్ల వరకు ఇస్తామని ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ విషయంలో బీజేపీ నుంచి అడుగు ముందుకు పడలేదని సమాచారం. పొత్తుకు ముందుకు వస్తే చర్చల్లో సీట్ల అంశం తేలుతుందని టీడీపీ, జనసేన నేతలు భావిస్తున్నారు. ఆ దిశగా బీజేపీ నుంచి మాత్రం సానుకూల స్పందన రావటం లేదు. దీంతో, మరో రెండు రోజులు మాత్రమే వేచి చూడాలని ఈ ఇద్దరు భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నెల 4, 5 తేదీల్లో పవన్ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. అక్కడ బీజేపీ నేతలను కలిసి ఇక పొత్తుల పైన తేల్చాయాలనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది.

బీజేపీ మూడ్ అర్దం అయితే తమ రెండు పార్టీల అభ్యర్దులతో పాటుగా మేనిఫెస్టో ప్రకటన చేయాలనేది చంద్రబాబు, పవన్ భావనగా ఉన్నట్లు ఆ పార్టీల నేతలు  చెబుతున్నారు. ఒకవేళ పొత్తుకు బీజేపీనో చెబితే సీపీఐతో కలిసి ముందుకు వెళ్లాలని టీడీపీ, జనసేన కూటమి ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చని తెలుస్తోంది. బీజేపీ ఈ వారంలో పొత్తుల సంగతి తేల్చకుంటే మాత్రంఏపీలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశముంది. జనసేన ముఖ్య నేతలు బీజేపీ కలిసి వస్తుందనే సమాచారం తమకు ఉందని చెబుతున్నారు. బీజేపీతో పొత్తు పైన టీడీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో, ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైన వేళ మరింత జాప్యం లేకుండా బీజేపీ నిర్ణయం ఏంటనేది స్పష్టత తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. బీజేపీ కూటమిలో చేరుతుందా లేదా అనేది మరో రెండు రోజుల్లో తేలిపోయే అవకాశం కనిపిస్తోంది.
 గడ్డం కృష్ణమూర్తికి జీవన సాఫల్య పురస్కారం

అవార్డు అందజేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికార భాషా సంఘం

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

హైదరాబాద్ కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ గడ్డం కృష్ణమూర్తికి అరుదైన గుర్తింపు లభించింది. తెలుగు పత్రికా రంగంలో నాలుగు దశాబ్దాలుగా ఆయన అందించిన సేవలకు గాను అవార్డుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంఈ అవార్డును సోమవారంనాడు సీనియర్ జర్నలిస్ట్ గడ్డం కృష్ణమూర్తికి అందజేసింది. తెలుగు పత్రికా రంగంలో మీ సేవలు అనన్యం, అసామాన్యం, అద్భుతం, అమోఘమని ఆంధ్ర ప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు విజయబాబు ఈ సందర్బంగా కొనియాడారు. ఆంధ్రప్రభతో పాటు వివిధ దిన పత్రికల్లో సుదీర్ఘకాలం పని చేసిన కృష్ణమూర్తి ప్రస్తుతం అమ్మన్యూస్ నెటవర్లో బ్యూరో చీఫ్, డిజిటల్ ఇంచార్జ్ విధులు నిర్వర్తిస్తున్నారు. కృష్ణమూర్తికి జీవన సాఫల్య పురస్కారం లభించడం పట్ల అమ్మన్యూస్ నెట్వర్క్ సీఈఓ కంది రామ చంద్రారెడ్డి అభినందనలు తెలిపారు.
 

 కాంగ్రెస్ పార్టీ లో చేరిన బీఆర్ఎస్ నాయకులు

కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పులిపాటి రాజేష్ కుమార్

బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని పిలుపు

పులిపాటి రాజేష్ కుమార్ సమక్షంలో
కాగ్రెస్ పార్టీ కండువ కప్పుకొంటున్న బాలిశెట్టి  లెనిన్ బాబు

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

పాతబస్తీ ఫుల్బాఘ్ ప్రాంతానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు బాలిశెట్టి లెనిన్ బాబు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ బహదూర్ పురా ఇంచార్జి పులిపాటి రాజేష్ కుమార్ ( రాహుల్ ) సమక్షం లో లెనిన్ బాబు కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొన్నారు.  లెనిన్ బాబు ప్రస్తుతం రాష్ట్ర మునూరు కాపు సంఘం సెక్రటరీ గా, శ్రీ వెంకటేశ్వరా మహాదేవ దేవస్థానం, లాల్ దర్వాజా చెర్మైన్ గా ఉన్నారు. లెనిన్ బాబుతోపాటు స్థానిక యువత కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్నట్టు వెల్లడించారు.


ఈ సందర్భంగా పులిపాటి రాజేష్ కుమార్ కాంగ్రెస్ పార్టీ కండువను లెనిన్ బాబుతోపాటు పార్టీలో చేరిన వారికి కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా పులిపాటి రాజేష్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు  సమిష్టి కృషితో బూత్ స్థాయి నుండి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చెయ్యాలని కోరారు. రాహుల్ గాంధీ భారత జోడో న్యాయ యాత్ర స్ఫూర్తి తో యువకులు భారీ ఎత్తున పార్టీ లో చేరుతున్నారు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలను అర్హులైన ప్రతి లబ్ధిదారునికి  చేరే విధంగా కృషి చెయ్యాలని కోరారు.  ఈ సమేవేశానికి సీనియర్ కాంగ్రెస్ నాయకులూ జి. కన్నయ్య లాల్, వెంకటేష్ ముదిరాజ్, సయెద్ షా ముజాహిద్, మహమ్మద్ ఇక్బాల్, టి. చంద్రశేఖర్, అబేద్ అలీ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో నరేష్ రెడ్డి,  రవీందర్ రెడ్డి,  శివ,  యాదగిరి,  బంటీ, నరేందర్ తదితరులు ఉన్నారు. 

 బడ్జెట్ లో కనిపించని సబ్ కా సాథ్,,,సబ్ కా వికాస్

జానో జాగో సంఘం జాతీయ అధ్యక్షులు సయ్యద్ నిసార్ అహ్మద్


(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్ లో సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ మాత్రం కనిపించలేదంటూ జానో జాగో (ముస్లింల అభివృద్ధి వేదిక) సంఘం జాతీయ అధ్యక్షులు సయ్యద్ నిసార్ అహ్మద్ విమర్శించారు. సామాన్యుడితో ముడిపడిన ఆహారం, గ్యాస్‌, పెట్రోల్‌, యూరియా వంటి వాటికి కేటాయింపుల్లో అన్యాయం చేశారని ఆయన విమర్శించారు. అంగన్‌వాడీలు, పంట బీమాకు కోత, ఉపాధి హామీ, పీఎం కిసాన్‌కు వంటి వాటికి కేటాయింపులు ఆశించిన రీతిలో లేవన్నారు. ఇవన్నీ సామాన్యుడితో ముడిపడివున్న రంగాలేనని ఆయన గుర్తుచేశారు. సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అనే మోడీ సర్కార్ ఆచరణలో ఎన్నడూ ఆ దిశగా అడుగులేయలేదని, ప్రతి బడ్జెట్ కార్పోరేట్ వర్గాలకే అన్నట్లుగా కేటాయింపు చేస్తూ వస్తున్నారని ఆయన విమర్శించారు. ఎన్నికల సమయంలో సైతం సామాన్యుడు పట్టన్నట్లుగా కేంద్రంలోని మోడీ సర్కార్ ఈ మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిందని ఆయన విమర్శించారు. 

 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పలువురికి శిక్ష విధించిన కోర్టు

బహదూర్ పురా ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ ఎన్.కరుణా కుమార్ వెల్లడి

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పలువురికి కోర్టు శిక్ష విధించినట్లు బహదూర్ పురా ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ ఎన్.కరుణా కుమార్ వెల్లడించారు. నాంపల్లి మనోరంజన్ కాంప్లెక్స్ లోని IX ఎంఎం కోర్టు న్యాయమూర్తి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఎనిమిది మందికి శిక్ష విధించినట్లు ఆయన తెలిపారు. ఈ డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో ఒకరికి 8 రోజుల శిక్షతోపాటు జరిమానా, నలుగురికి 4 రోజుల శిక్షతోపాటు జరిమానా ముగ్గురికి రెండు రోజుల శిక్షతోపాటు జరిమానా విధించినట్లు ఇన్ స్పెక్టర్ ఎన్.కరుణా కుమార్ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, రోడ్డు ప్రమాదాలను నివారించాలని వాహనదార్లకు ఇన్ స్పెక్టర్ ఎన్.కరుణా కుమార్ సూచించారు.  

 రాజకీయ ఇస్తేమాలు నిర్వహిద్దాం

అప్పుడే ముస్లిం సమాజంలో పురోగతి

మన ఓట్లు ఏకమైతే తెలంగాణలోో 25 అసెంబ్లీ, 4 లోక్ సభ సీట్లు గ్యారెంటీ

జనంలో ఉండి ఉద్యమం చేద్దాం

జానో జాగో సంఘం జాతీయ అధ్యక్షుడు సయ్యద్ నిసార్ అహ్మద్ పిలుపు

(జానో జాగో వెబ్ న్యూస్-సిరిసిల్ల ప్రతినిధి)

అన్ని వర్గాలతో పాటు ముస్లిం సమాజంలో రాజకీయ చైతన్యం పెంపొందించేందుకు రాజకీయ ఇస్తేమాలు నిర్వహిద్దామని జానో జాగో (ముస్లింల అభివృద్ది వేదిక) సంఘం జాతీయ అధ్యక్షుడు సయ్యద్ నిసార్ అహ్మద్ పిలుపునిచ్చారు.  ఇంతవరకు దీన్(ఇస్లామిక్) ఇస్తేమాలు మాత్రమే ముస్లింలు నిర్వహిస్తూ వస్తోందని, నేటి సమాజంలో రాజకీయంగా బలంగా ఎదగాలంటే రాజకీయ(జమూరియత్) ఇస్తేమాలు కూడా నిర్వహించాల్సిన అవసరముందని తెలిపారు. ఇలాంటి నూతన రాజకీయ పంథాను జానో జాగో సంఘం అవలంభించబోతోందని, త్వరలోనే ఉత్తర తెలంగాణ జిల్లాల ముస్లింలతో రాజకీయ ఇస్తేమాలు నిర్వహిస్తామన్నారు. రాబోవు రోజుల్లో సౌత్ తెలంగాణతోపాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో కూడా ఈ రాజకీయ ఇస్తేమాలు నిర్వహిస్తామన్నారు. జానో జాగో (ముస్లింల అభివృద్ది వేదిక) సంఘం ఉత్తర తెలంగాణ  జిల్లాల అధ్యక్షుల సమావేశం కేంద్ర కమిటీ సభ్యులు మేరాజ్ హుస్సేన్ అధ్యక్షతన మంగళవారంనాడు సిరిసిల్ల పట్టణంలో జరిగింది. ఈ సమావేశంలో జానో జాగో సంఘం జాతీయ అధ్యక్షుడు సయ్యద్ నిసార్ అహ్మద్ మాట్లాడుతూ... ముస్లింలు తమ ఓటును ఆలోచించి వేయాలని,  అన్ని వర్గాల ప్రయోజనాలను కాపాడే పార్టీకే అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఏమి ఆశించకుండా ఓటు వేస్తున్న ఏకైక ఓటరు ముస్లిం మేనని ఆయన అన్నారు.


మనం వేసి ఓటుతో పార్టీల తల రాతలు మార్చవచ్చని, తన తలరాతను మార్చుకునేలా ముస్లింలు ఓటు హక్కు ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో 50 స్థానాలలో ముస్లిం ఓటర్లు కీలకంగా ఉన్నారని,  వీటిలో 25 అసెంబ్లీ నియోజకవర్గాలలో ముస్లింలు వన్ సైడ్ గా గెలుపును నిర్ణయించే శక్తిగా ఉన్నారని ఆయన వెల్లడించారు. కానీ పాతబస్తీలోని ఎంఐఎం తరఫున ఏడు అసెంబ్లీ సీట్లు తప్పా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా ముస్లింలు గెలిచిన దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తంచేశారు. ఇకపై ముస్లిం ఓట్లను ఏకం చేసి ముస్లిం కనీసంగా 30 అసెంబ్లీ సీట్లు, నాలుగు లోక్ సభ సీట్లు  గెలవాలన్నారు. ఇతర బడుగు, బలహీనవర్గాలు నిలబడిన చోట వారికి మద్దతు ఇచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీల ప్రాతినిధ్యం కూడా అసెంబ్లీలో, పార్లమెంటులో పెరిగేలా చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ముస్లింలను కేవలం ఓటర్లుగా చూస్తున్నారో తప్పా వీరికి మేలు చేద్దామన్న ఆలోచన ఏ ప్రభుత్వం వచ్చినా చేయడంలేదన్నారు. ఏకైక ఏదైనా సాధించాలన్న ధ్యేయంతోనే ముస్లింలు ఎవరకి ఓటు వేయాలన్న ఆలోచన చేయాలన్నారు. అప్పుడే ముస్లింల తలరాతలు మారుతాయని ఆయన వెల్లడించారు. జానో జాగో (ముస్లింల అభివృద్ది వేదిక) సంఘం కేంద్ర కమిటీ సభ్యులు  మేరాజ్ హుస్సేన్ మాట్లాడుతూ... రాజ్యాధికారంలో బడుగు బలహీన వర్గాల తో పాటు ముస్లింలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం ముస్లింల ఓట్లన్నీ ఏకం చేసే పనిలో జానో జాగో సంఘం నిమగ్నం అవుతుందని ఆయన పేర్కొన్నారు. ముస్లింలలోని అన్ని వర్గాలకు ప్రభుత్వ పథకాలు అందేలా చేయడంతోపాటు లెబర్ కార్డుల జారీ, ప్రభుత్వం నుంచి అందుతున్న కుట్టుమిషన్ల పంపిణీ వంటి ఫలాలు అర్హులకు అందేలా చేయడంతోపాటు ముస్లింల స్మశాన వాటికల కోసం కూడా ఉత్తర తెలంగాణ జిల్లాలలో జానో జాగో సంఘం పోరాటం చేస్తోందన్నారు.

ఇది ఆయా ప్రాంతాలలోని ముస్లింలకు తెలుసని, అందుకే రోజు రోజుకు ఉత్తర తెలంగాణ జిల్లాలలోని మారుమూల గ్రామాల్లోని ముస్లింలు సైతం జానో జాగో సంఘంలో చేరుతున్నారని, చేరేందుకు మరింత మంది ఉత్సాహం చూపుతున్నారని ఆయన వెల్లడించారు. ఈ సమావేశానికి సంఘీభావ అతిధిగా విచ్చేసిన జిల్లా సంక్షేమ పౌర సంక్షేమ సమితి అధ్యక్షులు బియంకర్ శీను మాట్లాడుతూ... ముస్లింల  న్యాయమైన డిమాండ్ల కోసం పనిచేస్తున్న జానో జాగో సంఘానికి తాము ఎల్లప్పుడూ మద్దతుగా నిలబడతామని పేర్కొన్నారు. ముస్లింల రాజకీయ సామాజిక చైతన్యం కోసం జానో జాగో సంఘం  చేసే కృషికి తమ వంతు సహకారం అందిస్తామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జానో జాగో సంఘం సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ఇంకె సారుద్దీన్, నాయకులు సయ్యద్ బాబా, అజీమ్, అబ్దుల్ రషీద్, బాబా తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీఏ కార్యాలయంలోని అవినీతిపై 

కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వమైన చర్యలు తీసుకోవాలి

లేకపోతే పెద్ద ఎత్తున్న ఆంధోళన చేపడుతాం

గత ప్రభుత్వం అవినీతిని విస్మరించడంవల్లే కుప్పకూలింది

సిటీ ఆటో రిక్ష మోటర్ క్యాబ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మహముద్ మక్కి

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

అవినీతి ని నిర్ములించడం లో విఫలంకావడంవల్లే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కార్ ఘోర ఓటమిని పొందిందని సిటీ ఆటో రిక్ష మోటర్ క్యాబ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మహముద్ మక్కి పేర్కొన్నారు. అయన మీడియా తో మాట్లాడుతూ రవాణా శాఖలో పెరిగిపోయిన అవినీతిని నిర్మలించడంలో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. హైదరాబాద్ ఈస్ట్, వెస్ట్ ఆర్టీఏ కార్యాలయంలో జరిగిన వంద కోట్ల కుంభకోణంపై  తాము సాక్ష్యాలతో సహా గత ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ, హోమ్ మంత్రి, రవాణా శాఖ మంత్రి కార్యదర్శి, హైదరాబాద్ కలెక్టర్ లకు ఫిర్యాదు చేశామని వెల్లడించారు. ఏడాది కిందటే ఈ కుంభకోణంపై ఫిర్యాదు చేసినా అవినీతికి కారకులైన ఈస్ట్, వెస్ట్ అధికారులపై నాటి ప్రభుత్వం కానీ, రవాణశాఖ ఉన్నతాధికారులు గానీ చర్యలు తీసుకోలేదన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఈ అవినీతిపై వెంటనే చర్యలు చేపట్టి రవాణా శాఖ ఈస్ట్, వెస్ట్ అధికారుల కుంభకోణం పై  సిబిఐ, సిబిసిఐడి, ఏసిబి అధికారులోతో విచారణ చేయించి అవినీతికి పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని మహమ్మద్ మక్కి డిమాండ్ చేశారు.


వాణా శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ, కమిషనర్ లు అవినీతికి పాల్పడిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని , గత సంవత్సరం నుంచి సంబంధిత అధికారులకు ఆధారాలతో సహా పది సార్లు ఫిర్యాదు చేసినా ఏలాంటి 
చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రవాణాశాఖలో జరుగుతున్న అవినీతిపై విచారణ చేసి బాధ్యులైన అధికారుల పై కఠిన చర్యలు తీసుకోవాలని లేనిచో సిటీ ఆటో రిక్ష మోటర్ క్యాబ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు.