ఎర్రమఠం గ్రామంలో......... డెంగ్యూ లక్షణాలతో బాలిక మృతి

 ఎర్రమఠం గ్రామంలో.. డెంగ్యూ లక్షణాలతో బాలిక మృతి

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి) 

డెంగ్యూ లక్షణాలతో బాలిక మృతి చెందిన సంఘటన నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం కొత్తపల్లి మండల పరిధిలోని ఎర్రమఠం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది.వివరాలలోకి వెళితే ఎర్రమఠం గ్రామానికి చెందిన వడ్డె వెంకటేశ్వర్లు రెండవ కూతురు అవంతి (11) పది రోజులుగా జ్వరంతో బాధపడుతుండటంతో గ్రామంలోని స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో మరియు గ్రామంలోని ప్రధమ చికిత్స   వైద్యుల వద్ద చికిత్సలు చేయించినా జ్వరం తగ్గకపోవడంతో గురువారం రాత్రి ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు తీసుకుని రాగా వైద్యలు పరీక్షలు చేస్తుండగా బాలిక మృతి చెందడంతో ప్రభుత్వ వైద్యశాలలో తల్లిదండ్రుల ఆర్తనాదాలతో విలపించిన తీరును చూసి వైద్యశాలలో పనిచేసే సిబ్బంది మరియు పేషెంట్లను కలచివేసింది. అవంతి డెంగ్యూవ్యాధి లక్షణాలతో చనిపోయిందన్న విషయం తెలుసుకున్న ఎర్రమఠం గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు,సిబ్బంది హుటాహుటినా గ్రామంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. గ్రామంలో పారిశుధ్య లోపం కారణంగానే దోమలు విపరీతంగా పెరిగి ప్రజలకు రోగాలు పెరిగిపోతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: