పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేయండి...మీ సమస్యను పరిష్కరించుకోండి
నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా లోని వివిధ ప్రాంతాల్లో తలెత్తే సమస్యలపై స్పందించి పోలీస్ వారికి సహకరించి తెలియజేయాలనుకున్న వారు నంద్యాల పోలీస్ కంట్రోల్ రూమ్ అధికారులకు చరవాణిల ద్వారా సమాచారం అందించాలని ఎస్పి రఘువీర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నంద్యాల జిల్లాలోని ప్రజలందరూ మీ సమస్యల గురించి,ఫిర్యాదు చేయదలచిన,మీ దృష్టికి వచ్చిన సమస్యలను పోలీసు అధికారులకు తెలియజేయవలనన్న మీరు నంద్యాల పోలీస్ కంట్రోల్ రూమ్ అధికారుల నెంబర్ 08514 225097 కు డయల్ చేసి తెలియజేసిన వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ అధికారులు మీరు ఇచ్చిన సమాచారంను సంబంధిత పోలీసు అధికారులకు తెలియజేసి, మీ సమస్యను పరిష్కరించుటకు సహాయపడగలరని తెలిపారు.. మీరు డయల్ చేయవలసిన నంద్యాల పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 08514 225097.
పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేయండి...మీ సమస్యను పరిష్కరించుకోండి....
నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి
Post A Comment:
0 comments: