కురిసిన వాన... తడిసిన నేల

నంద్యాల జిల్లాలో.... రైతుల కళ్ళల్లో ఆనందం

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

 నంద్యాల జిల్లాలో రైతు సోదరులు వేసుకున్న పంటలకు కరెంటు కోతలతో పంటచేలకు నీరందక రైతులు అల్లాడుతున్న వేళ ఉత్తర తమిళనాడు, దక్షిణ కర్ణాటక వరకు విస్తరించిన ఉపరితల ద్రోణుల ప్రభావంతో విదర్భ నుండి దక్షిణ కర్ణాటక వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణుల ప్రభావంతో వరుణ దేవుడు కనికరించి వర్షాలు కురిపించడంతో


తాము వేసుకున్న పంట పొలాలు ఎండిపోతాయనుకున్న పంటలు తిరిగి వరుణ దేవుడు కనికరించి వర్షాలు కురిపించడంతో తమ పంటలకు మళ్లీ జీవం పోసుకుంటాయని రైతు సోదరులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తొమ్మిది గంటల కరెంటును నిరంతరాయంగా సరఫరా చేయకపోవడంతో రైతు సోదరులు వేసుకున్న పంట పొలాలు క్షీణించే దిశకు మారిపోతున్న తరుణంలో ఉపరితల ద్రోణుల రాకతో వర్షాలు కురవడంతో చెరువులు, బావులు, కుంటలు నీటితో నిండిపోవడంతో రైతు సోదరుల కళ్ళలో ఆనందభాష్పాలు వెలుగు చూస్తున్నాయి.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: