ఓటరు జాబితా సవరణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు... నంద్యాలజిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సమాన్

 ఓటరు జాబితా సవరణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు

నంద్యాలజిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సమాన్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లాలో చేపట్టిన ఓటర్ల జాబితా ఇంటింటి పరిశీలన క్షుణ్ణంగా పరిశీలన చేయకుండా బిఎల్ఓ లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ హెచ్చరించారు. ఇంటింటి సర్వేలో భాగంగా నంద్యాల పట్టణంలో 10 మంది కన్నా ఎక్కువ మంది ఓటర్లు ఉన్న గొల్లపేటలోని ఇంటి నెంబర్ 27/282 లో వున్న ఓటర్ల వివరాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ గొల్లపేటలోని ఇంటి నెంబర్ కరెక్షన్ కోసం నిర్ణీత ఫార్మ్ లో వివరాలు ఎందుకు తీసుకోలేదని బిఎల్ఓ ను ప్రశ్నించి, ఓటర్ల జాబితా సవరణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని, ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు,తొలగింపులు, డెత్,రిపీటెడ్,డబుల్ ఓటర్లు, నూతన ఓటర్ల నమోదు తదితరాలను నిర్ణీత ఫార్మ్ లలో వివరాలు సేకరించి స్పష్టమైన జాబితాను రూపొందించాలని, ఒకే ఇంటిలో 10 మంది కన్నా ఎక్కువ మంది ఓటర్లు ఉంటే సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్వోలు ఖచ్చితంగా తనిఖీ చేయాలని కలెక్టర్ సూచించారు. ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాలు మేరకు ఇంటింటి పరిశీలనపై ఓటరు జాబితాలో మార్పులు,


చేర్పులపై నిర్దేశించిన ఫార్మేట్లో సంబంధిత వ్యక్తుల వివరాలు తీసుకుని సక్రమంగా రూపొందించాలని, ఓటరు జాబితాలో ఏలాంటి తప్పులకు అవకాశం ఇవ్వరాదని, బిఎల్ఓలు తమ పరిధిలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరి ఓటును క్షుణ్ణంగా పరిశీలించాలని, బిఎల్ఓల పనితీరును ప్రతిరోజు పర్యవేక్షణ చేయాలని ఏఈఆర్ఓను కలెక్టర్ ఆదేశించారు. నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సమన్ నిర్వహించిన ఆకస్మిక తనిఖీలో నంద్యాల ఈఆర్ఓ అనురాధ,  ఏఈఆర్ఓ శ్రీనివాసులు పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: