ఓటర్ల జాబితాలో పేర్ల సవరణ ప్రక్రియను వేగంవంతంచేయండి...... రాష్ట్రఎ న్నికల ప్రధానాధికారి ముఖేశ్‌కుమార్‌ మీనా

ఓటర్ల జాబితాలో పేర్ల సవరణ ప్రక్రియను వేగంవంతంచేయండి 

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌కుమార్‌ మీనా

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల జాబితాలో పేర్ల సవరణ ప్రక్రియను వేగవంతం చేసి 15-09-23 వ తేదీలోగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించారు. ఎలక్షన్ కమిషన్ కార్యాలయం నుండి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ "ప్రత్యేక ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ 2024" కు సంబంధించి ఓటర్ల జాబితా పునః పరిశీలన,6,7,8 ఫామ్ ల స్వీకరణ, ఇంటింటి సర్వే, డూప్లికేట్, షిఫ్టెడ్, డెత్ ఎలెక్టోరల్స్, జంక్ క్యారెక్టర్, 10 కంటే ఎక్కువ ఓట్లు ఉన్నహౌసెస్,రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్, మొదటి,రెండవ, మూడవ దశలో ఎపిక్ కార్డ్స్ జనరేషన్, ప్రిటింగ్, పంపిణీ తదితర అంశాలపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ ప్రత్యేక ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణకు సంబంధించి 75,259 ఓటర్లను పునః పరిశీలించి నివేదికలు సమర్పించామని, నంద్యాల, ఆళ్లగడ్డ, డోన్ బనగానపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల నుండి రాజకీయపార్టీల ప్రతినిధులు సూచించిన   27,194 బోగస్ ఓట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి తొలగించామని వివరించారు. 6,7,8 ఫామ్ లకు సంబంధించి స్వీకరించిన 42,843 దరఖాస్తులలో 18,433 ఓటర్ జాబితాలో పొందుపరిచామని


పెండింగ్లో ఉన్న 21,989 క్లెయిమ్స్ ను నాలుగు రోజుల్లో పూర్తి చేస్తామని, డూప్లికేట్, షిఫ్టెడ్, డెత్ ఓటర్లకుసంబంధించి  47,432 ఓట్లను జాబితాలో సవరించామని, తొలగించిన ఓట్లకు సంబంధించి పెండింగ్లో ఉన్న 26,587 ఓట్ల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నాలుగు రోజుల్లో పూర్తి చేస్తామని, ఇంటింటి సర్వేలో 10,936 ఓటర్లు కొత్తగా నమోదు చేసుకున్నారని, జంక్ క్యారెక్టర్ కు సంబంధించి పెండింగ్లో ఉన్న 105 ఓటర్లను,10 కంటే ఎక్కువ ఓట్లు వుండి పెండింగ్ లో ఉన్న 3908 గృహాలను క్షేత్రస్థాయిలో పునః పరిశీలించి జాబితాలో పొందుపరుస్తామని కలెక్టర్ వివరించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సమూన్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటర్ల జాబితాలోని సవరణలు,జంక్ క్యారెక్టర్స్, మార్పులు, చేర్పులకు సంబంధించి వివరాలను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి 15-09-23 తేదీలోగా స్వచ్ఛమైన, పారదర్శకమైన ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని ఈఆర్ఓ, ఏఈఆర్వోలను ఆదేశించారు. నంద్యాల కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హల్ నుండి నంద్యాల జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ పుల్లయ్య, అన్ని నియోజకవర్గాల ఈఆర్ఓలు, కలెక్టరేట్ ఎన్నికల విభాగం అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: