మూడవ దశ రీసర్వే ప్రక్రియ వేగవంతం చేయడానికి ప్రణాళికరూపొందించండి .... జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి

 మూడవ  దశ రీసర్వే ప్రక్రియ వేగవంతం చేయడానికి ప్రణాళికరూపొందించండి 

జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లాలో చేపట్టిన మూడవ రీ-సర్వే కార్యక్రమాన్నిపకడ్బందీగా, వేగవంతంగా పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సర్వేయర్లను ఆదేశించారు. కలెక్టరేట్లోని వైయస్సార్ సెంటినరీ మూడవ విడత రీ సర్వే పక్రియపై మండల, సచివాలయ సర్వేయర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 150 గ్రామాలలో చేపట్టే మూడోవిడత రీసర్వే కార్యక్రమంలో భాగంగా తొలుత 56 గ్రామాలను ఎంపిక చేసుకొని పూర్తి చేసేందుకు పకడ్బందీ ప్రణాళికరూపొందించుకోవాలని,మండల,


సచివాలయ సర్వేయర్లను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీసర్వే కార్యక్రమంలో ఆలస్యం చేయకుండా నిర్దేశిత గడువులోగా త్వరితగతినగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని,పెండింగ్ లో ఉన్న భూహక్కు పత్రాల పంపిణీకి సంబంధించి ప్రత్యేక దృష్టి సారించి 30-09-23 వతేదీలోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని,సర్వే పూర్తయిన గ్రామాలలో పెండింగ్ ఉన్న స్టోన్ ప్లాంటేషన్ ప్రక్రియ నిర్దేశించిన గడువు లోపు  పూర్తి చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి హరికృష్ణ, డిపిఓ మంజుల భార్గవి తదితరులు పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: