మహానంది దేవస్థానంలో ఘర్షణ
విచారణ చేపట్టిన పోలీస్ అధికారులు
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
శివ క్షేత్రాలలో పుణ్యక్షేత్రమైన నంద్యాల జిల్లాలోని మహానంది దేవస్థానంలో ఘర్షణ చోటుచేసుకుంది.ధ్యాన మండలికి చెందిన సభ్యులు కొంతమంది మహానంది క్షేత్రంలోనికి ఉచిత దర్శన నిమిత్తం వెళ్లడానికిప్రయత్నించినట్లు తెలుస్తుంది.ఆసమయంలో మహానంది క్షేత్రంలో మహా మంగళ హారతులు కార్యక్రమం జరుగుతూ ఉన్నందున ప్రధాన ఆలయాల్లోకి ప్రవేశించడానికి ప్రవేశ రుసుము చెల్లించాల్సి ఉంటుందని,కొంత సమయం తర్వాత ఉచిత దర్శనానికి అనుమతిస్తామని ఆలయ సిబ్బంది వారికి తెలియపరిచిన ధ్యాన మండల సభ్యులు వినకుండా ఆలయం లోనికి వెళ్లాలని ఆలయ సిబ్బందిపై దాడికి పాల్పడి మహానంది ఆలయ ఈవో కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఆలయం వద్ద ఘర్షణ వాతావరణం ఏర్పడిందన్న సమాచారం తెలుసుకున్న మహానంది పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
మహానంది దేవస్థానంలో ఘర్షణ....
విచారణ చేపట్టిన పోలీస్ అధికారులు
Post A Comment:
0 comments: