నంద్యాల జిల్లాలో టీడీపీ రాష్ట్ర బంద్ కు..
జనసేన, సిపిఐ, ఎమ్మార్పిస్, బీఎస్పీ, ఎంఎస్ఎఫ్, ఎంఎస్పిల సంపూర్ణ మద్దతు
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లాలో టిడిపి అధినేత,మాజీముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా టీడీపీ నాయకులు చేపట్టిన రాష్ట్రబంద్ కు జనసేన, సిపిఐ, ఎమ్మార్పీఎస్, ఎంఎస్ఎఫ్, ఎంఎస్పి, బీఎస్పీ శ్రేణులు సంపూర్ణ మద్దతు తెలిపి రాష్ట్ర బంద్ లో పాల్గొని విజయవంతం చేశారు. రాష్ట్ర బంద్ చేపట్టడానికి బయలుదేరిన టీడీపీ ముఖ్యనాయకులను, కార్యకర్తలను నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఆదేశాల మేరకు ఉదయం 6:00 నుండి నంద్యాల జిల్లాలోని పోలీసులు గృహనిర్బంధంలోకి తీసుకున్నప్పటికి,
ఎమ్మార్పిస్, జనసేన, సిపిఐ, బిఎస్పి శ్రేణులు వాహనాల పై పట్టణంలో నిరసనలు తెలియజేస్తూ నంద్యాల జిల్లాలో బంద్ కు సంపూర్ణముగా మద్దతు తిలిపి బంద్ ను విజయవంతం చేసి గృహ నిర్భందంలో ఉన్న నంద్యాల జిల్లాలోని నియోజకవర్గాల టిడిపి ముఖ్య నేతలను కలుసుకొని సంఘీభావం తెలిపారు. ఈ రాష్ట్రబంద్ కార్యక్రమంలోని జనసేన, సిపిఐ, ఎమ్మార్పిస్, బీఎస్పీ, ఎంఎస్పి, ఎంఎస్ఎఫ్ శ్రేణుల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నంద్యాల జిల్లాలో టీడీపీ రాష్ట్ర బంద్ కు.....
జనసేన,సిపిఐ,ఎమ్మార్పిస్, బీఎస్పీ,ఎంఎస్ఎఫ్,ఎంఎస్పి ల సంపూర్ణ మద్దతు
Post A Comment:
0 comments: