కేంద్ర,రాష్ట్రప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ...
వినతి పత్రం అందజేసిన....సిపిఎం నాయకులు
(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం జూపాడు బంగ్లా మండలంలో సిపిఎం నాయకులు శ్రీనివాసులు, కర్ణల ఆధ్వర్యంలో జూపాడుబంగ్లా తాసిల్దార్ పుల్లయ్య యాదవ్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు శ్రీనివాసులు, కర్ణలు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను దోచి పెడుతుందని,ప్రభుత్వ రంగాలన్నీ ప్రైవేటీకరణ చేస్తూ యువతీ యువకులకు మొండిచేయి చూపిందని, సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన బిజెపి ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలను తొలగించేందుకు కుట్రలు చేస్తుందని, ప్రజలపై అధిక భారం మోపుతూ పెట్రోల్, డీజిల్,గ్యాస్ ధరలు పెంచుతూ, నిత్యవసర సరుకులు అదుపు లేకుండా పెరుగుతున్నాయని, ధరలను నియంత్రించడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని, కేంద్ర ప్రభుత్వ విధానాలను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించకుండా బిజెపి ప్రభుత్వానికి భజనచేస్తుందని, రైతుసోదరులు వేసిన పంటలు చేతికి రాక అతివృష్టి, అనావృష్టితో మొక్క జొన్న, పత్తి,మినుము,కొర్ర పంటలు దెబ్బతిన్నాయని, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు నష్టపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని, విద్యుత్తు కోతలు లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసి విద్యుత్ చార్జీలు తగ్గించాలని, అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని, కార్మిక చట్టాలను కాపాడాలని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, వ్యవసాయ కూలీలకు కనీసవేతనచట్టం అమలు చెయ్యాలని, ప్రజాపంపిణీ ద్వారా ప్రజలకు 16 రకాల నిత్యవసర సరుకులు అందించాలని,గ్రామాల్లో ఉన్న పేదలకు ఇళ్ల స్థలాలు, లేనివారికి ఇళ్ల స్థలాలతో పాటు పక్కాగృహాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలని లేని పక్షంలో ప్రజలను చైతన్యపరిచి మరో స్వసంత్ర పోరాటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం మండల ఉపాధ్యక్షులు రసూల్, దుబాయ్ బాబు, రాముడు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: