పార్టీ కోసం కష్టపడితే పదవులు తప్పకుండా వరిస్తాయి

నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షులు, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్     


(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)       

కర్నూలు జిల్లాలోని కాటసాని రాంభూపాల్ రెడ్డి కార్యాలయంలో నంద్యాల జిల్లా వైసీపీ కార్యవర్గంలో నందికొట్కూరు నియోజకవర్గం నుండి నూతనంగా ఎంపికైన వైసిపి సీనియర్ నాయకులను అభినందించిన నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షులు, పాణ్యంఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురూరు ఆర్థర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసిపి పార్టీలోని సీనియర్‌ నాయకులకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని,నంద్యాల జిల్లాలో వైసిపిపార్టీ అభివద్ధికి కృషి చేయాలని, నంద్యాల జిల్లా కార్యవర్గంలో నందికొట్కూరు నియోజకవర్గంలోని వైసీపీ సీనియర్‌ నాయకులకు పార్టీ నాయకత్వ బాధ్యతలను అప్పగించిందని, పార్టీలో కొత్త వారిని కలుపుకొని ముందుకు వెళ్లాలని,ఇది నిరంతర ప్రక్రియని,పార్టీలో ప్రతి ఒక్కరికి పదవులు రావని,పార్టీ కోసం నిరంతరం శ్రమించే వారికి,కష్టపడే తత్వం ఉన్నవారికి మాత్రమే పదవులు వరిస్తాయని,


వైసీపీ అధిష్టానం నియమించిన నంద్యాల జిల్లా కార్యవర్గంలో నిరంతరం శ్రమించిన నందికొట్కూర్ నియోజకవర్గానికి చెందిన వైసీపీ సీనియర్‌ నాయకులు డాక్టర్ డి. వనిజ (ప్రధాన కార్యదర్శి), నాగరాజు ప్రసాద్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్, షేక్. ఇనాయతుల్ల, ఎగ్జిక్యూటివ్ మెంబర్ మరియు కదిరి సుబ్బన్న లకు స్థానం లభించడంపై అభినందనలు తెలియజేశారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: