శ్రీ శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునులస్వామివార్లను దర్శించుకున్న ...
భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
ద్వాదశ జ్యోతిర్లింగాలలో అత్యంత పుణ్యప్రదమైన నంద్యాల జిల్లాలోని శ్రీశైలంలో కొలువుదీరిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని భారత సుప్రీంకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా కుటుంబ సమేతంగా శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీ శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయం వద్దకు చేరుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి వారికి దేవస్థానం కార్యనిర్వహణాధికారి లవన్న, అర్చకస్వాములు, వేదపండితులు ఆలయ సంప్రదాయాన్నిఅనుసరించి ఘనంగా స్వాగతం పలికారు. రత్నగర్భ గణపతిస్వామి వారిని దర్శించుకున్న అనంతరం శ్రీ మల్లికార్జునస్వామి వారిని దర్శించుకుని,
ప్రత్యేకపూజలు నిర్వహించి, మల్లికాగుండంలో ప్రతిబింబించే ఆలయ విమాన గోపురాన్ని దర్శించుకొని శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవార్లకు కుంకుమార్చన జరిపించిన అనంతరం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా కు ఆలయ అర్చకులు వేదాశీర్వచనంతో శేషవస్త్రాలను,ప్రసాదాలు మరియు శ్రీ శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి వారి జ్ఞాపికను అందజేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా వెంట ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎవి.శేషసాయి, ప్రిన్సిపల్ జిల్లా జడ్జి ఎన్.శ్రీనివాసరావు, జిల్లా రెవెన్యూ అధికారి బి.పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
శ్రీ శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునులస్వామివార్లను దర్శించుకున్న ......
భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా
Post A Comment:
0 comments: