టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా....
సామూహిక నిరహార దీక్షలు చేపట్టిన టిడిపి నాయకులు
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లాలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడి అక్రమంగా, అన్యాయంగా అరెస్ట్ చేయడం దుర్మార్గమని పాణ్యం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ గౌరు చరిత రెడ్డి,నందికొట్కూరు టిడిపి ఇన్చార్జ్ గౌరు వెంకటరెడ్డి ఆదేశాల మేరకు సామూహిక నిరాహార దీక్షలను పాణ్యం నియోజకవర్గంలోని కల్లూరు చెన్నమ్మ సర్కిల్ నందు పాణ్యం నియోజకవర్గంలోని టిడిపి నాయకులు,మండల కన్వీనర్లు సామూహిక నిరాహార దీక్షలను నిర్వహించారు.
ఈ సందర్భంగా గౌరు దంపతులు, టిడిపి నాయకులు మాట్లాడుతూ కక్ష సాధింపులో భాగంగా నారా చంద్రబాబు నాయుడు పేరు లేకుండానే అరెస్టు చేశానని,చంద్రబాబు నాయుడు ప్రారంభించిన "బాబు షూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ"కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు నుండి ప్రజలలో వస్తున్న ఆదరణను చూసి వైసిపి నేతకు నాయకులకు వెన్నులో వణుకు పుట్టిందని, రాబోయే ఎన్నికల్లో టిడిపి పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుపు పొందుతుందని భయంతో సిఐడి అధికారులచే కక్ష సాధింపులో భాగంగా అర్ధరాత్రి అక్రమంగా కేసులు ఇరికించి అరెస్టు చేశారని,రాష్ట్రాన్ని అగ్నిగుండంలా మార్చేందుకు వైసిపి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నారని, చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడంతో టిడిపిపార్టీ బలహీనపడుతుందని వైసిపి నాయకులు భ్రమిస్తున్నారని,
అది కేవలం వారి అపోహ మాత్రమేనని,రానున్న ఎన్నికల్లో టిడిపి గెలుపును అడ్డుకోవడం అసాధ్యమని తెలిపారు. సామూహిక నిరాహార దీక్షలో పాల్గొన్న నాయకులకు సాయంకాలం 5:00 పాణ్యంనియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ గౌరు చరిత రెడ్డి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు. ఈ సామూహిక నిరాహార దీక్ష కార్యక్రమంలో నియోజకవర్గంలోని కల్లూరు, ఓర్వకల్లు, గడివేముల, పాణ్యం మండలాల టిడిపి కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా.......
సామూహిక నిరహార దీక్షలు చేపట్టిన టిడిపి నాయకులు
Post A Comment:
0 comments: