ఓపెన్ స్కూల్ ద్వారా చదువుకోవాలనుకునే పది,,,,ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.... మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ విమల వసుంధర దేవి

 ఓపెన్ స్కూల్ ద్వారా చదువుకోవాలనుకునే పది,,,,ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.... 

మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ శైలజ


(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం గడివేముల మండల పరిధిలోని మోడల్ స్కూల్ లో 10 వ తరగతి మరియు ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులకు అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభమైందని మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ శైలజ తెలిపారు. వివరాల్లోకి వెళితే 10 వ తరగతి మరియు ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థిని, విద్యార్థులు ప్రైవేటు కళాశాలలను ఆశ్రయించాల్సిన అవసరం లేదని. ప్రభుత్వమే ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు ప్రారంభించిందని, చదువుకోవాలని ఆసక్తి ఉన్న విద్యార్థిని విద్యార్థులు ప్రైవేటు కళాశాలలను ఆశ్రయించి వేలాది రూపాయలను ఫీజుల రూపంలో అధిక మొత్తంలో చెల్లించాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ ఆదేశాల మేరకు పదవ తరగతి విద్యార్థులు 1 లేదా 3 సబ్జెక్టులు ఫెయిల్ అయిన 110/- చెల్లించాలని మూడు అంతకన్నా ఎక్కువ సబ్జెక్టులు ఫెయిల్ అయిన వారు 125/- చెల్లించాలని పదవ తరగతి చదువుకునే విద్యార్థిని విద్యార్థుల చివరి తేదీ 15-09-23 వ తేదని, ఇంటర్ విద్యార్థిని విద్యార్థులకు అన్ని సబ్జెక్టుల్లో పరీక్షలు రాయడానికి 550/-, ప్రాక్టికల్స్ చేయడానికి 250/- ఫీజును చెల్లించి పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించవచ్చునని, ఇంటర్మీడియట్ చదువుపై ఆసక్తి కలిగిన విద్యార్థులకు 30-09-23వ తేదీ చివరి తేదీని తెలిపారు. విద్యార్థిని విద్యార్థులు పరీక్షలు రాసేందుకు విద్యార్థులకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని, చదువుకోవాలనుకునే విద్యార్థిని, విద్యార్థులకు మంచి శుభవార్త అని ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు పరీక్షల ఫీజు కూడా చెల్లించే అవకాశం ప్రభుత్వం కల్పించిందని, వయోజనుల్లో విద్య పట్ల ఆసక్తి పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని, ఓపెన్ స్కూల్ విధానంలో పదవ తరగతి ప్రక్రియ ప్రవేశాలకు పేర్ల నమోదుకు సెప్టెంబర్ 15-09-23 చివరి తేదని, ఇంటర్మీడియట్ ప్రవేశాల పేర్లు నమోదుకు 30-09-23 వరకు అడ్మిషన్లు జరుగుతాయని గడివేముల మండల మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ శైలజ  తెలిపారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: