ఆ 54 మంది సచివాలయ సిబ్బందికి షో కాజ్ నోటీస్ లు జారీ చేసిన...
నంద్యాలజిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాలజిల్లాలోని గ్రామ వార్డు సచివాలయాల్లో విధుల పట్ల అలసత్వం వహిస్తూ గతవారం గైహాజరైన 54 మంది సచివాలయ సిబ్బందికి షో కాజ్ నోటీస్ లు జారీ చేశామని జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ తెలిపారు. సచివాలయ సిబ్బంది తమ బయోమెట్రిక్ హాజరును ప్రతిరోజు ఉదయం 10:30 గంటల లోపు, తర్వాత మధ్యాహ్నం 2:30 నుండి 3.00 గంటల మధ్య స్పందన నిర్వహణ కోసం, సాయంత్రం 5.00 గంటల తర్వాత చివరిగా నమోదు చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలు పథకం ద్వారా ప్రజలకు సత్వరమే సేవలు అందించవలసిన కొంతమంది సచివాలయ సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తూ గైహాజరు కావడంజరుగుతోందని,ఈనెల 21 నుండి 26 వరకు (వారంరోజులు) GSWS వెబ్‌సైట్ నందు ఆన్‌లైన్‌లో నమోదైన హాజరును పరిశీలిస్తే వారంలో ఒక్కసారి కూడా వారి బయోమెట్రిక్ హాజరు వేయక గైహాజరైన 54 మంది సచివాలయ సిబ్బందికి సంజాయిషీ కోరుతూ షోకాజ్ నోటీస్ లుజారీచేశామని, ఆళ్లగడ్డ, బనగానపల్లి, చాగలమర్రి, డోన్, కోవెలకుంట్ల, పగిడ్యాల, ప్యాపిలి, రుద్రవరం, బండిఆత్మకూరు, గోస్పాడు, జూపాడుబంగ్లా, కొలిమిగుండ్ల, మిడుతూరు, పాణ్యం, సంజామల, సిరివెళ్ల మండలాల్లోని గ్రామ సచివాలయాల సిబ్బంది అయిన ఎనర్జీ అసిస్టెంట్లు, వీఆర్వోలు, వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీలు, పంచాయతీ సెక్రెటరీ, సర్వే అసిస్టెంట్లు, వెటర్నరీ ఫిషరీ అసిస్టెంట్లు, ఏఎన్ఎం, మహిళా పోలీస్, వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు, ఎంపీఈవో లకు సంబంధించిన 54 మంది సచివాలయ సిబ్బందికి షో కాజ్ నోటీసులు జారీ చేసినట్లు కలెక్టర్ డా. మనజీర్ జిలాని సమాన్ తెలిపారు.
ఆ 54 మంది సచివాలయ సిబ్బందికి షో కాజ్ నోటీస్ లు జారీ చేసిన...
నంద్యాలజిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్
Post A Comment:
0 comments: