ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలు దూదేకులకు 4 ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలి... ఏపీ నూర్ బాష మరియు దూదేకుల బిసి.ముస్లిం సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడ

 ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలు 

దూదేకులకు 4 ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలి

ఏపీ నూర్ బాష మరియు దూదేకుల బిసి.ముస్లిం సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పీర్ మహమ్మద్ డిమాండ్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దూదేకుల వారికి న్యాయం చేయని రాజకీయ పార్టీలకు తగిన గుణపాఠం చెబుతామని,ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలు దూదేకులకు 4 ఎమ్మెల్యే సీట్లు, ఒక ఎంపి సీటు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ నూర్ బాష మరియు దూదేకుల బిసి. ముస్లిం సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పీర్ మహమ్మద్, రాష్ట్ర సంక్షేమ సంఘం నాయకులు పి.బాబన్ లు డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లాలోని స్థానిక నేషనల్ పీజీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ నూర్ బాష మరియు దూదేకుల బిసి ముస్లిం సంక్షేమ సంఘం రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించరు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర గౌరవ సలహాదారులు పి.బాబన్, రాష్ట్ర అధ్యక్షులు పీర్ మొహమ్మద్, ప్రధాన కార్యదర్శి షేక్ సలీం,రాష్ట్ర కోశాధికారి డాక్టర్ దస్తగిరిపర్ల,మహిళా అధ్యక్షురాలు మస్తానమ్మ, యూత్ అధ్యక్షులు పెద్ద మస్తాన్, రాష్ట్ర ఉద్యోగ సంఘం అధ్యక్షులు సిద్దయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సుభాన్, ఖాదర్ బాషాలు పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ నూర్ బాష మరియు దూదేకుల వారికి బిసి కమీషన్ రేకమెండేషన్ ప్రకారం బిసి-ఇ రిజర్వేషన్ 4% నుండి 12%కు పెంచి దామాషా ప్రకారం 50% భాగస్వామ్యం కల్పించాలని, దూదేకుల కులం పేరు దూదేకుల ముస్లిం మరియు నూర్ బాష ముస్లింగా మార్చాలని,


కార్పొరేషన్ చైర్మన్లు రెండు, కార్పొరేషన్లలో డైరక్టర్ల కోటాలో దూదేకుల వారికి తగిన ప్రాతినిధ్యం కేటాయించాలని, అన్ని రాజకీయ పార్టీలు దూదేకుల వారికి గవర్నర్ మరియు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మల్సి సీట్లలో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని, మున్సిపల్, పంచాయితీ, జిల్లా పరిషత్ ఎన్నికలలో తగినన్ని సీట్లు కేటాయించి, కో- ఆప్షన్ సభ్యుల్లో మైనారిటీ కోటాలో జనాభా లెక్కల ప్రకారం తగిన ప్రాతినిధ్యం కల్పించాలని, వక్స్ బోర్డ్, హజ్ కమిటీ, ఉర్దూ అకాడెమీ, మైనారిటీ కమీషన్, ముస్లిం మైనారిటీ సంస్థల్లో దామాషా ప్రకారం భాగస్వామ్యం కల్పించాలని, చైర్మన్ పదవులతో పాటుగా డైరక్టర్ పోస్ట్,ముస్లిమేతర మిగతా కార్పొరేషన్లలో దూదేకుల వారికి తగిన ప్రాతినిధ్యంకల్పించాలని,రాజధానిలో రాష్ట్రకమిటీకి 5 ఎకరాల స్థలము,జిల్లా కేంద్రాలలో ఒకఎకరం స్థలము కేటాయించాలని, రాష్ట్రంలోని అన్ని ముఖ్య పట్టణాలలో బహుళ ప్రయోజనకర కమ్యూనిటి భవనాలు నిర్మించాలని, ప్రతి గ్రామములో స్మశాన వాటికలు ఏర్పాటు చేయాలని, మైనారిటీ విద్యా సంస్థలలో దామాషాప్రకారం సీట్లు కేటాయించాలని, కుల వృత్తికి ప్రోత్సాహం, కళాకారులకు పెన్షన్ ఇవ్వాలని, పోటీ పరీక్షలైన ఆల్ ఇండియా సర్వీసెస్, ఎంసెట్, ఐఐటి, జెఈఈ, రాష్ట్ర ఉద్యోగాల కొరకు ఉచిత ప్రత్యేక శిక్షణా కేంద్రాలు, మహిళల ఉపాది కొరకు తగిన శిక్షణ ఇచ్చి ప్రోత్సహించాలని,నిరుద్యోగుల కొరకు జాబ్ మేళాలు నిర్వహించాలని,విదేశాలలో విధ్యార్థుల చదువుల కొరకు ప్రత్యేక స్కాలర్ షిప్ లు మంజూరు చేయాలని,

మైనారిటీ బడ్జెట్ ను 10% కు పెంచి అందులో దామాషా ప్రకారం 50% దూదేకుల వారికి కేటాయించాలని, బడ్జెట్ కు సబ్ ప్లాన్ భద్రత కల్పించాలని, దూదేకుల మరియు నూర్ బాష కులానికి ముస్లిం మైనారిటీ స్టేటస్ వర్తించే జి.ఓ ను అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వ కార్యాలయాలకు అందజేయాలని, ఓబిసి లో 4.5% రిజర్వేషన్ విషయంలో సుప్రీంకోర్టులో ఉన్న కేసును త్వరగా పరిష్కరించే విదంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, కేంద్ర ప్రభుత్వ దృష్టిలో ఉన్న పాస్మాందా ముస్లిం కేటగిరి త్వరలో కార్యరూపం దాల్చాలని, ఖాజీల నియామకాలలో తగిన వాటా ఇవ్వాలని, ఇస్లాంబ్యాంక్ ఏర్పాటు చేసి వడ్డీరహితరుణాలివ్వాలని, ముస్లిం మైనారిటీ అట్రాసిటీ చట్టం తీసుకురావాలని, షరతులు లేకుండా షాదితోఫా, రంజాన్ తోఫా, పోస్ట్ మెట్రిక్స్ స్కాలర్ షిప్లు ఇవ్వాలని, ఎన్ఆర్సి, సిఎఎ, యుసిసి చట్టాలు అమలు చేయరాదని తెలిపిన అనంతరం ఆంధ్రప్రదేశ్ దూదేకుల జనగణనపై చర్చించి నంద్యాల నియోజకవర్గస్థాయి దూదేకుల జనగణన నివేదిక ఆవిష్కరణ చేసి, దూదేకుల డిమాండ్స్ కరపత్రాలను ఆవిష్కరణ చేసి, నంద్యాల జిల్లా నుండి నూతనంగా రాష్ట్ర కమిటికి ఎన్నికైన నాయకులకు సన్మానం చేసిన అనంతరం,రోడ్డుప్రమాదంలో ప్రమాదానికి గురైన అనిల్ కుటుంబానికి 30,000/-,అవుకులో ఇద్దరు కుమారులను కోల్పోయి ఇబ్బందులు పడుతున్న కుటుంబానికి 10,000/-,పెద్దకోటలలో ఇంటి పెద్దను కోల్పోయి ఇబ్బంది పడుతున్న కుటుంబానికి 10,000/-దూదేకుల కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో నంద్యాల దూదేకుల సంఘం పట్టణ కమిటీ వాసవి దస్తగిరి అధ్యక్షుడు, ఆదాంసాహెబ్ ప్రధాన కార్యదర్శి, సోమశేఖర్ కోశాధికారి,ఆర్గనైజింగ్ సెక్రెటరీలు హుసేనప్ప, బాలు మరియు నంద్యాల జిల్లాలోని నూర్ బాష,దూదేకుల కుటుంబ సోదరసోదరీమణులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: