హ్యాట్సాప్ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ సార్

ట్రాఫిక్ జామ్ కాకుండా గుంతలను పూడ్చి

వాహనదార్ల మనన్నలు పొందిన చంద్రాయణగుట్ట ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

ట్రాఫిక్ సజావుగా సాగేలా  చూడటం ట్రాఫిక్ పోలీసుల విధి....రోడ్ల మరమత్తులు అన్నది వారి డ్యూటీ కాదు. అయినా ట్రాఫిక్ జామ్  కు కారణమవుతున్న గుంతలను పూడ్చి చంద్రయాణగుట్ట ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ జె.శ్రీను నాయక్ పలువురి మనన్నలను  పొందారు. ట్రాఫిక్ జామ్ కాకుండా వాహనాలు సజావుగా ముందుకు సాగడానికి ఆన్నిచర్వయలు తీసుకుంటున్నామని ఈ సందర్బంగా చాంద్రాయణగుట్ట ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ జె.శ్రీను నాయక్ తెలిపారు. మిధాని నుంచి చాంద్రాయణ గుట్ట ప్రధాన రహదారిపై నిత్యం వేలాది వాహనాలను సాగిస్తుంటారు. పూల్బాగ్ సన్నీ గార్తెన్ వద్ద నాలా పనులు కొనసాగుతుండడంతో రోడ్డు కాస్తా ఇరుకుగా మారిపోయింది.


దీంతో వాహనాల రాక పోకలకు ఇబ్బందికరంగా మారింది. తరచూ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది పెద్ద పెద్ద గుంతలు ఉండడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. దీంతో చాంద్రాయణగుట్ట ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ జె.శ్రీను నాయక్ ఆధ్వర్యంలో ట్రాక్టర్లలో మట్టిని తెప్పించి గుంతలను పూడ్చివేశారు. దీంతో వాహనాలు సజావుగా ముందుకు సాగిపోతున్నాయి. ఎప్పటినుంచో వాహనదార్లను ఈ సమస్య వెంటాడుతోంది. ఈ సందర్భంగా చంద్రయాణగుట్ట ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ జె.శ్రీను నాయక్ ఈ గుంతలను పూడ్చే చర్యలు తీసుకోవడంతో వాహనదార్లతోపాటు స్థానికులు హ్యాట్సాప్ సార్ అంటూ  ప్రశంసిస్తున్నారు. 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: