కొత్తపల్లి దళితులకు ఇళ్ల స్థలాలు  చూపించకపోతే ఆందోళన ఉదృతంచేస్తాం

సిపిఐ నాయకుల హెచ్చరిక 

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

 నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం లోని కొత్తపల్లి మండల కేంద్రమైన కొత్తపల్లి గ్రామంలో దాదాపు 300 మంది ఇల్లులేని నిరుపేదలకు 2004 సంవత్సరంలో ఇంటి పట్టాలు ఇచ్చారని,పట్టాలు పొందిన లబ్ధిదారులకు ఇంతవరకు అధికారులు స్థలాలు చూపించలేదని, అధికార నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ కొత్తపల్లి మండల కార్యదర్శి వెంకట శివుడు అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. ధర్నా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాసులు మాట్లాడుతూ గ్రామంలోని రాజకీయ నాయకులు, దళితులను ఎన్నికల్లో ఇంటి స్థలాల పేరుతో ఓట్లు దండుకోవడం తప్ప,దళితులకు న్యాయం చేయలేదని విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు పట్టాలు ఉన్న ప్రతి లబ్ధిదారునికి ఇళ్ల స్థలాలు చూపించకపోతే జిల్లా స్థాయిలో ఆందోళన ఉదృతంచేస్తామని, కొత్తపల్లి మండల కేంద్రం కావడంతో వివిధ రాజకీయ నాయకులు ఇతరగ్రామాల్లోని వారికి కొత్తపల్లిలో స్థలాలు ఇప్పించడం జరుగుతుందని,స్థానిక దళితులకు మాత్రం స్థలాలు చూపించకుండా అధికారులు, రాజకీయ నాయకులు మోసం చేస్తున్నారని తెలిపారు.


అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ప్రతాప్ మాట్లాడుతూ దాదాపు 19 సంవత్సరాలక్రితం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కోటి వరాల పథకం కింద ఇచ్చిన పటాలకు ఇంతవరకు స్థలాలు చూపించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు.ఇప్పటికైనా రెవెన్యూ డివిజన్ అధికారి స్పందించి నిరుపేదలైన దళితులకు ఇంటి స్థలాలు చూపించే విధంగా చర్యలు తీసుకోకపోతే ప్రజా పోరాటాల ద్వారా పేద ప్రజలకు ఇంటి స్థలాలు, నిరుపేదలకు భూములు ఇచ్చే వరకు పోరాటాలు చేస్తామని అనంతరం ఆర్డీఓ, ఏవోలు అందుబాటులో అందుబాటులో లేకపోవడంతో డిప్యూటీ తాసిల్దార్ అరుణకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు స్వాతి,  మహిళాసమాఖ్య తాలూకా అధ్యక్షురాలు ప్రశాంతకుమారి, వ్యవసాయకార్మిక సంఘం జిల్లా నాయకురాలు మాణిక్యమ్మ, రాణమ్మ, మూర్తి జాబి, జయ, జయమ్మ, నాగమణి కమలమ్మ, సత్యరాజు, హుస్సేనయ్య, ఏఐటిసి నాయకులు లల్లుహసన్, పుల్లయ్య, మహమ్మద్భాష, చాంద్ బాషా తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: