బేతంచర్లలో అన్ని రైళ్లను ఆపాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) నాయకుల డిమాండ్

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా బేతంచెర్ల పట్టణం మీదుగా వచ్చి పోయే అన్ని రైళ్లను ఆపాలని సిపిఐ మండల కార్యదర్శి భార్గవ్ ఆధ్వర్యంలో పట్టణ కార్యదర్శి నాగరాజు అధ్యక్షతన బేతంచెర్ల పట్టణంలోని సత్రం నుండి పాతబస్టాండ్ మీదుగా రైల్వేస్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించి రైల్వే సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం రాక ముందు బ్రిటిష్ వారు రైల్వేస్టేషన్ ప్రారంభించారని, నాటి నుండి నేటి వరకు ఈ ప్రాంతంలో ప్రయాణికులకు, వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులు, దినసరి వేతన కూలీలు, విద్యార్థులు ప్రయాణాలు చేసేందుకు అన్ని రకాలుగా ఉపయోగంగా ఉందని, కరోనా వైరస్ కారణం చేత అన్ని రైళ్ళను రద్దుచేసి నేటికి రెండు సంవత్సరాలు గడుస్తున్నా కేవలం ఒకటి రెండు రైలు మాత్రమే పునరుద్ధరించి, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు బేతంచెర్ల మీదుగా తిరుగుతున్నప్పటికీ కనీసం ఒక నిమిషం ఆపకుండా అందరిని ఇబ్బందులకు గురి చేయడం ఏంతవరకు సమంజసమని ప్రశ్నించారు.స్థానిక ప్రజా ప్రతినిధులైన ఆర్థిక శాఖ మంత్రి ఢిల్లీలో 15 రోజులు, రాష్ట్రంలో 15 రోజులు ఉన్నప్పటికీ సొంత మండలమైన బేతంచర్లలో రైలును ఆపలేకపోవడంతో బేతంచెర్ల ప్రాంత ప్రజలపై ఆయనకు ఏ మాత్రం ప్రేమ ఉందో అర్థం అవుతుందని, నంద్యాల ఎంపి విత్తనాల వ్యాపారం మీద ఉన్న దృష్టి కనీసం పార్లమెంటు నియోజకవర్గ సమస్యలపై లేదని,ధనార్జన ధ్యేయంగా పాలకులు వ్యాపారస్తులై ప్రజలను బిక్షగాళ్ళుగా మార్చి ప్రజలకు అన్ని సౌకర్యాలను దూరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.గుంటూరు నుండి బేతంచర్లకు వచ్చే ప్రయాణికులు బేతంచర్ల కు రావాలంటే అర్థరాత్రి 2 గంటల సమయంలో నంద్యాల లేదా డోన్ బస్టాండ్ లలో దిగి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రజా ప్రతినిధులు మాత్రం ఏసీ కార్లలో తిరుగుతూ ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తున్నారని వాపోయారు.


ఇప్పటికైనా రైల్వే అధికారులు ఆర్థికశాఖ మంత్రి, నంద్యాల ఎంపీ తక్షణమే స్పందించి బేతంచెర్ల మీదుగా ప్రయాణించే ప్రయాణికులకు సౌకర్యంగా అన్ని రైళ్ళను ఆపాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) జిల్లా నాయకత్వంలో పెద్ద ఎత్తున నిరసన నిర్వహించి బేతంచెర్ల మీదుగా వెళ్లే అన్ని రైళ్ళను దిగ్బందిస్తామని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు, ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ మండల సహాయకార్యదర్శి దస్తగిరి, తిరుమల, ఏఐటీయూసీ జిల్లా నాయకులు సూర్య చంద్రుడు, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఉదయ్, సిపిఐనాయకులు సోమన్న, బాలస్వామి, కాశీమ్, లక్ష్మణ్, మారుతి, పుల్లారెడ్డి, దిలీప్, మధు, ప్రదీప్, మందకృష్ణ, ప్రసాద్, విజయ్ భవన్, వెంకటరమణ, రాజ, వంశీ రమేష్, శివ, రాజేష్, శ్రీను మనోహర్ పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: