దేశభక్తి అంటే ఏమిటో నేర్పిన మహనీయుడు నేతాజి సుభాష్ చంద్రబోస్

డోన్ డిఎస్పి శ్రీనివాసరెడ్డి, సామాజిక కార్యకర్త మహమ్మద్ రఫి

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి) 

నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం డోన్  పట్టణంలోని డిఎస్పి ఆఫీస్ నందు సామాజిక కార్యకర్త మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో డోన్ డిఎస్పీ  శ్రీనివాసరెడ్డి అద్యక్షతన దేశ స్వాతంత్య్ర సమరయోధులు నేతాజి సుభాష్ చంద్రబోస్ చిత్ర పటానికి పూలమాల వేసి ఘణనివాళులు అర్పించారు. ఈ సందర్బంగా డోన్ డిఎస్పీ శ్రీనివాస రెడ్డి, సామాజిక కార్యకర్త మహమ్మద్ రఫి లు మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్  23-01-1897  జన్మించారని, భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో సుభాష్ చంద్ర బోస్ స్థానము మరువలేనిదిని, ఒకవైపు అహింసావాదంతోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తుంటే, సుభాష్ చంద్రబోస్ ఆయుధ పోరాటంతోనే ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి ఆచరణలో పెట్టిన మహనీయుడని, బర్మాలో భారత జాతీయ సైన్యం పాల్గొని ర్యాలీలో ఆయన “మీ రక్తాన్ని ధారపోయండి .. మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను”



అని చెప్పిన మాట భారత ప్రజలను ఎంతో ఉత్తేజపరిచిందని, హిందీలో సాగిన ఈ ప్రసంగం ఆద్యంతం ఉత్తేజ భరితంగా ప్రసంగించి భారతదేశ ప్రజల్లో ధైర్యాన్ని నింపిన స్వాతంత్ర్య పోరాట యోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ని, అట్టి ముద్దుబిడ్డ మన దేశంలో జన్మించడం మన  భారతీయుల అదృష్టంమని, 18-08-1945 లో తాను ప్రయాణిస్తున్న విమానంతో సహఅదృశ్యం అయ్యారని, ఇలాంటి దేశ స్వాతంత్య్ర సమరయోధులను, శాస్త్రవేత్తలను, మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని  డోన్ డిఎస్పి శ్రీనివాసరెడ్డి,  సామాజిక కార్యకర్త  మహమ్మద్ రఫి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డోన్ డిఎస్పీ ఆఫీసు సిబ్బంది సాయికిరణ్, దస్తగిరి, లక్ష్మీరాజ్, రమేష్, సలీం, శివ తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: