వికలాంగుల సమస్యలను పరిష్కరించాలి
డిసేబుల్డ్ రైట్స్ అసోసియేషన్ ఏపీ వ్యవస్థాపక అధ్యక్షులు మస్తాన్ వలి
(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాలజిల్లా లోని వికలాంగులందరికీ అంత్యో దయ కార్డులు అందించాలని,ఇంటి స్థలాలు కేటాయించి ఇల్లు నిర్మించి ఇవ్వాలని, వికలాంగుల హక్కుల చట్టం 2016 ను ప్రతిష్టంగా అమలు చేయాలని, నంద్యాల నూతన జిల్లాకు వికలాంగుల సంక్షేమ శాఖ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని,అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో వికలాంగులకు ర్యాంపులు ఏర్పాటు చేయాలని, డిసేబుల్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ సంస్థకు ఐదు సెంట్ల స్థలం, కమ్యూనిటీ హాలు కొరకు స్థలం కేటాయించాలని, పెండింగ్ లో ఉన్నలో ఉన్న 70 మోటరేజ్ బ్యాటరీ ట్రై సైకిల్ లను పంపిణీ చేయాలని మరియు వికలాంగులకు సంబంధించిన సమస్యల పైన డిసేబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ (డిఆర్డబ్ల్యుఏ/ఏపి) ఫౌండర్ మరియు ప్రెసిడెంట్ వికలాంగుల సంక్షేమశాఖ చైర్మన్ కుమారి పటాన్ ముంతాజ్ కు
మరియు వికలాంగుల సహాయ సంచారకులు ఫాతిమాకు వినతిపత్రం అందించారు. ఈకార్యక్రమంలో సంస్థ సభ్యులు కిరణ్ కుమార్, నబి రసూల్, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: