ప్రభుత్వ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ సేవలను విస్తృతంగా తీసుకెళ్లండి.... వైద్యాధికారులను ఆదేశించిన నంద్యాలజిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్

 ప్రభుత్వ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ సేవలను విస్తృతంగా తీసుకెళ్లండి

వైద్యాధికారులను ఆదేశించిన నంద్యాలజిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా స్థానిక కలెక్టరేట్లో నంద్యాల జిల్లా ప్రభుత్వ వైద్య అధికారులతో,సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామున్ కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నంద్యాల జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సామాన్ అన్ని ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ నిధులు18 శాతం నిధులు మాత్రమే వస్తున్న నేపథ్యంలో ప్రైవేట్ నెట్వర్క్ఆస్పత్రులకు దీటుగా వైద్యాధికారులు పనిచేసి కనీసం 50 శాతం ఆరోగ్య శ్రీ నిధులు ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేలా ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలని, రోగులకు సంబంధించిన రోగాలపై మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చేవ్యాధులన్నీ ఎన్రోల్ చేయాలన్నారు.రోగులకు ఆరోగ్యశ్రీ ఆర్థిక ప్రయోజనం కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ఆమేరకు లక్ష్యాలు సాధించేలా కృషి చేయాలని,పిహెచ్ పరిధిలో ప్రతిరోజు ప్రసవాల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రులకు ఎంతమంది వెళ్తున్నారు, ప్రైవేట్ ఆస్పత్రులకు ఎంతమంది వెళ్తున్నారనే అంశాలపై ఆరా తీసి రోజువారి నివేదికలు పంపించాలని,ఏ కారణం చేత ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చిందనే అంశాలపై అన్వేషించి నివేదికలు ఇవ్వాలని, ఏఎన్ఎం,ఆశ వర్కర్లను వివరాలు సేకరించేందుకు వినియోగించుకోవాలని డిఎంహెచ్ఓను ఆదేశించారు.


ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రసవాలకు ఇబ్బందులు ఎదురైతే సామాజిక ఆరోగ్య కేంద్రాలకు,ఏరియా ఆస్పత్రులకు తరలించాలని,నాడు నేడు కింద ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేయడంతో పాటు ఆరోగ్య సిబ్బంది కొరత లేకుండా అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుందని,రోగులకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కు ఆరోగ్య మిత్రలను అనుసంధానకర్తలుగా వ్యవహరించి ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ అయిన ప్రతి పేషంటును ఆరోగ్యశ్రీ కిందికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ ను కలెక్టర్ ఆదేశించారు.ఆరోగ్య మిత్రలు,డిఎంహెచ్వో, జిహెచ్ సూపర్డెంట్, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ సమన్వయం చేసుకొని ప్రభుత్వ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ సేవలను విస్తృతంగా తీసుకువెళ్లేందుకు కృషి చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డా. వెంకటరమణ, డిసిహెచ్ఎస్ కోఆర్డినేటర్ డా.జఫ్రూళ్ల,జిజిహెచ్ సూపరింటెండెంట్ వరప్రసాద్,ఆరోగ్యశ్రీ డిస్టిక్ కోఆర్డినేటర్ రూపేంద్రనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: