పాఠశాల ఎదురుగా ఉన్న మైనింగ్ లీజును తక్షణమే రద్దు చేయాలి
బిజెపి, జనసేన నాయకుల డిమాండ్
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలోని పలుకూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదురుగా పనిచేస్తున్న మైనింగ్ లీజును రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీ, జనసేనల ఆధ్వర్యంలో మైనింగ్ ఏడికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు శివకృష్ణ యాదవ్ మాట్లాడుతూ పలుకూరు గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదురుగా అక్రమ మార్గంలో లీజు తెచ్చుకొని మైనింగ్ జరుపుతు విద్యార్థుల మరియు గ్రామస్తుల భవిష్యత్తును అంధకారంలో నెట్టెందుకు ప్రయత్నం చేస్తున్నారని, ఈ మైనింగ్ బ్లాస్టింగ్ వల్ల పాఠశాల భవనాలు మరియు గ్రామంలో ఉన్న ఇల్లు బీటలు వారి కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయని, రాష్ట్రంలో మైనింగ్ మాఫియా నానాటికి చెలరేగిపోతోందని, దాదాపు 400 మంది విద్యార్థులు పైగా ఉన్న పాఠశాల సమీపంలో మైనింగ్ జరుగుతుందంటే మైనింగ్ మాఫియా ఏరీతిలో చెలరేగిపోతుందో అర్థం చేసుకోవచ్చుని తక్షణమే మైనింగ్ లీజు ను రద్దు చేయాలని, లీజుపై ఎటువంటి చర్యలు చేపట్టని పక్షంలో భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. జనసేన పార్టీ నాయకులు భాస్కర్ మాట్లాడుతూ
రాష్ట్రంలో మైనింగ్ మాఫియా కు కొండలు, గుట్టలు, గ్రామ సమీపంలో ఉన్నభూములు, పాఠశాల సమీపంలో ఉన్నటువంటి భూములను కూడా వదలడం లేదని, మైనింగ్ మాఫియా రెవిన్యూ శాఖ అధికారుల మరియు ఇరిగేషన్ శాఖ అధికారుల చేతివాటంతో ఎటువంటి భూమినైనా లీజుల అనుమతి పొందుతున్నారని, ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమేనని, తక్షణమే లీజు రద్దు చేయకపోతే ఉమ్మడి కార్యచరణ తొ పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపిజిల్లా కార్యదర్శి యాదగిరి, పలుకూరు గ్రామ పెద్దలు వెంకటరమణ చంద్రశేఖరఆచారి, బిజెపి జిల్లా నాయకులు శివరామిరెడ్డి, నాగ మల్లారెడ్డి, శంకరయ్య, మల్లయ్య, జనసేన పార్టీ నాయకులు ఇద్రుస్ భాషా షేక్షావలి, సుబ్బారావు, నరసింహ, మహబూబ్ బాషా, బిజెపి, జనసేన నాయకులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: