రెవెన్యూ అంశాలలో నిర్ధేశించిన లక్ష్యాన్ని చేధించండి
జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లాలో ప్రభుత్వం నిర్దేశించిన రెవిన్యూ అంశాలను కాల పరిమితి లోపు పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో, అంకితభావంతో పనిచేయాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి అన్ని మండలాల తాసిల్దారులను ఆదేశించారు.కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో భూసేకరణ, పిఓఎల్ఆర్ రీ సర్వే,చుక్కలభూములు, ఓటర్ల జాబితాసవరణ, కోర్టుకేసుల సత్వర పరిష్కారం,రెవిన్యూ అంశాలపై తాసిల్దార్ లతో జాయింట్ కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 340సి, 167 కె జాతీయ రహదారుల భూములకు సంబంధించి భూసేకరణ పూర్తయి పెండింగ్లో ఉన్న క్లైమ్ లను క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత నివేదికలను ఈనెల 24వ తేదీలోపు సమర్పించాలని సంబంధిత మండల తహసిల్దార్లను ఆదేశించారు. భూ వివాదాలను పరిష్కరించడమే సమగ్ర సర్వే ప్రధాన లక్ష్యమని,
రీసర్వే ప్రక్రియలో నాణ్యత ప్రమాణాలు పాటించి పక్కాగా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని, వివాదాలు లేని భూ రికార్డుల రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక పరిజ్ఞానంతో సర్వే పనులను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతోందని, అన్ని మండలాల్లో పెండింగులో వున్న ఫార్మ్ 6, 7, 8 లకు సంబంధించి పెండింగ్ లో ఉన్న దాదాపు 5170 దరఖాస్తులను వేగవంతంగా, పారదర్శకంగా విచారించి ఈ నెల 21వ తేదీలోగా ఓటర్ల జాబితాలో నమోదు చేయాలని తాసిల్దార్ లను ఆదేశించారు. పర్యాటక ప్రాంతాలు,ఇళ్ల పట్టాలకు అవసరమైన భూములు, సాగునీటి ప్రాజెక్టులు, జాతీయ రహదారులకు సంబంధించిన భూసేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని జేసీ ఆదేశించారు. అన్ని మండలాల్లో పెండింగ్ లో ఉన్న మ్యుటేషన్ దరఖాస్తులు బియాండ్ ఎస్ఎల్ఏ లోకి వెళ్లకుండా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో డిఆర్ఓ పుల్లయ్య, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కామేశ్వరరావు, వెంకటశివ సంబంధిత డివిజన్,మండలాల ఆర్డీవోలు, తాసీల్ధార్లు,సెక్షన్ సూపరింటెండెంట్ లు పాల్గొన్నారు.
రెవెన్యూ అంశాలలో నిర్ధేశించిన లక్ష్యాన్ని చేధించండి....
జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి
Post A Comment:
0 comments: