ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని...
జరుగు పోరుబాటను జయప్రదం చేయండి.....
సిపిఐ నాయకులు పిలుపు
(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాలజిల్లా స్థానిక నంద్యాల పట్టణంలోని సాయిబాబానగర్ లో ఉన్న స్వామిరెడ్డి భవన్ సిపిఐ కార్యాలయంలో సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో గృహాలు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఐ ఆధ్వర్యంలో తిరుగు పొరుబాటకు సంబంధించిన కరపత్రాలను సిపిఐ నాయకులు విడుదల చేశారు.అనంతర సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో వేలాదిమంది సొంత ఇల్లు,స్థలాలు లేక బాడుగ ఇండ్లలో నివాసాలు ఉంటూ రోజు రోజుకు పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు పెరగడం వల్ల అద్దె ఇంట్లో ఉండేవారు అద్దె డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఇబ్బందులకు గురి అవుతున్నారని,ఒక కుటుంబంలో ఐదు మంది కొడుకులు ఉంటే వారిలో కొంతమందికి మాత్రమే ఒక సెంటుస్థలం పట్టా మాత్రమే ఇచ్చారని,ఆ కుటుంబంలో పెళ్లిళ్లు అయిన వారు బాడుగ ఇండ్లలో కాపురం ఉంటున్నారని,టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చిన పట్టాలను జగన్ ప్రభుత్వం రద్దు చేసి వారి పేర్లను ఆన్లైన్లో ఉంచడం వల్ల వారికి ఇండ్ల స్థలాలు ఉన్నాయని, పేర్లు రాకపోవడంతో వారికి తీవ్ర అన్యాయం జరుగుతుందని,
ఇల్లులేని నిరుపేదలు మాకు ఇల్లు లేవని అధికారులకు అర్జీ ఇచ్చిన వారికి ప్రభుత్వ జీవో ప్రకారం 90 రోజులలో నివాస స్థలాలు ఇవ్వాలని ఉంది కానీ అది అమలు కావడం లేదని,ప్రభుత్వం పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలనుకుంటే ప్రభుత్వ పోరంబోకు భూములు పట్టణంలో వందలాది ఎకరాలు ఉన్నాయని వాటిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే అవకాశం ఉంది కావున ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోవడానికి సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో 16-08-23 వ తేదీన స్థానిక టేక్కే మార్కెట్ యార్డ్ నుండి ఇల్లు లేని నిరుపేదలతో పెద్ద ఎత్తున పోరుబాట నిర్వహిస్తున్నామని, నంద్యాల పట్టణంలో ఇల్లు లేని నిరుపేదలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ నాయకులు ప్రసాద్, హబీబ్, బేగ్, షహీన్భాష, మద్దిలేటి, మద్దయ్య, రమణారెడ్డి, మురళి, హుసేని, సుభాష్ పాల్గొన్నారు.
Home
Unlabelled
ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని... జరుగు పోరుబాటను జయప్రదం చేయండి..... సిపిఐ నాయకులు పిలుపు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: